rachamallu siva prasad reddy
-
YSRCP ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు
-
చంద్రబాబుకు రాచమల్లు శివప్రసాద రెడ్డి కౌంటర్
-
బాబు దగా.. ఇది ముంచిన బడ్జెట్: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర ప్రజలను చంద్రబాబు సర్కార్ దగా చేసిందంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు కూటమిగా ఏర్పడి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి రాగానే వెంటనే వాటిని అమలు చేస్తామని ఓటు అడిగారు. మహిళకు 15 వేలు, ఉచిత బస్సు, నిరుద్యోగులకు 3వేల భృతి ఇస్తామన్నారు. 20 వేలు రైతుకు, 25 లక్షల ఉద్యోగాలు ఇలా అనేకం సూపర్ సిక్స్, మేనిఫెస్టో ఉన్నాయి. గెలిచిన వెంటనే అమలు చేస్తామని వాగ్దానం చేశారు. 6 నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో కాలయాపన చేశారు. నిన్న పూర్తి బడ్జెట్ పెట్టారు.. దాంట్లో మీరిచ్చిన ఈ ఒక్క హామీ కనిపించలేదు’’ అంటూ రామమల్లు నిలదీశారు.నువ్వు మోసగాడివని తెలిసినా నీకు ఓటేయడానికి కారణం ప్రజల్లో చిన్న ఆశ. పేదరికం చెడ్డది.. ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ పడతాడు. ప్రజలు కూడా ఆశ పడ్డారు.. కానీ హామీలన్నీ తుంగలో తొక్కారు. పేదరికం వల్ల జగన్‌ను ఓడించడం ఇష్టం లేకున్నా నీకు ఓటేశారు. 58.5 లక్షల మంది రైతులు ఉన్నారు.. మీ లెక్క ప్రకారం 20 వేలా చొప్పున 14వేల కొట్లు బడ్జెట్ లో పెట్టారు. వీళ్లలో 30 లక్షల మందికి మాత్రమే నువ్వు బడ్జెట్ పెట్టావ్. తల్లికి వందనం రేపటి ఏడాది ఇంటర్ వాళ్లకి తీసేస్తారు. ఈ ఏడాదికి 14 వేల కోట్లు పింఛన కోత విధించావు. 30 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేసావు.. ఇంకా ఎంత కాలం మోసం చేస్తావు’’ అని చంద్రబాబును రాచమల్లు దుయ్యబట్టారు.ఆశతో నీకు పేదవాడు ఓటు వేస్తే నట్టేట ముంచావు. ఇది ముంచిన బడ్జెట్ మాత్రమే. ఈయన సంపద సృష్టించే వాడు కాదు.. సంపద లాక్కునే వాడు. విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచావ్. రేపటి నెల నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోతున్నారు. 4 కోట్ల మందిని మోసం చేయగల ఘనాపాటి చంద్రబాబు. రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తాం. సోషల్ మీడియా వారిని నువ్వు హింసిస్తున్నట్లు నీపై ప్రజాస్వామ్య యుతంగా దాడి చేస్తాం. రూ. 15 వేలు ప్రతి ఆడబిడ్డకు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి. రైతుకు 20 వేలు, నిరుద్యోగ భృతి 3 వేలు ఎప్పుడిస్తావో చెప్పండి. కక్ష సాధింపు చర్యలు మాని. ప్రజలకు సాయపడే పనులు చేయండి’’ అని రాచమల్లు హితవు పలికారు.‘‘ఇసుక ఉచితం అన్నారు.. ఉచితం మాత్రం అటకెక్కింది. ఈ రోజు ఎన్నికలు పెడితే.. మీకు కనీసం ఒక్క సీటు కూడా రాదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చనప్పుడు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే విధానం రావాలి. అలాంటి మోసపు పార్టీలను పోటీ చేయకుండా చేయాలి.. ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీకి మైకు ఇవ్వనప్పుడు వెళ్లి ఏం చేయాలి?. ప్రజలు సమస్యల గురించి కాదు.. అవమానం చేయడానికి పిలుస్తున్నారు. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు.. టీడీపీ సోషల్ మీడియా పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై ఏం చర్యలు తీసుకున్నారు..?. వర్రాను అవినాష్ రెడ్డి పేరు చెప్పమని ఒత్తిడి చేసి కొట్టారు. ఆయన జడ్జి ముందు వాస్తవాలు చెప్పడంతో కంగు తిన్నారు’’ అని రాచమల్లు పేర్కొన్నారు. -
వర్రా రవీంద్రారెడ్డికి టీడీపీ నుండే ప్రాణహాని...?
-
పక్కా ప్లానేనా?.. అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజా సమస్యలు వదిలేసి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు ప్రభుత్వానికి ప్రజల సమస్యలు కనిపించడం లేదా? అని నిలదీశారు.‘‘వైఎస్సార్సీపీ కార్యకర్తలను బద్నాం చేయడానికి పథకం రచించారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దుర్మార్గమైన పాలన నడుస్తోంది. ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’’ అని రాచమల్లు హితవు పలికారు.‘‘వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టా..? అంతర్జాతీయ తీవ్రవాదా?. అతనిపై పచ్చ పత్రికలు ఇష్టారీతిన చిలువలు పలువలు చేసి రాస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించాడు. ఎక్కడైనా హద్దులు దాటి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఒక్క రవీంద్రారెడ్డిపైనే కాదు.. టీడీపీ వారు చేసిన వాటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటోంది...91 మంది ఆడపిల్లలపై లైంగిక దాడి చేసి, 7 మందిని హత్య చేస్తే శవాలు కూడా దొరకలేదు. వారి కుటుంబ సభ్యుల కన్నీళ్లు కూడా పట్టించుకోలేదు. కానీ వారి ఇంట్లో ఆడపిల్లలు బాధ పడ్డారని తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా కేసుల్లో ప్రభుత్వం స్పందించినట్లు ఆడపిల్లలపై అత్యాచారాలపై 10 శాతమైనా స్పందించాల్సింది. ఇతని కోసం డీజీపీ, కర్నూలు డీఐజీ నాలుగు బృందాలతో గాలింపు చేపట్టామని చెప్తున్నారు. ఇతని కోసం ఒక ఎస్పీని బదిలీ చేశారు.. ఓ సీఐని సస్పెండ్ చేశారు...ఒక చిన్న సోషల్ మీడియా వర్కర్ కోసం ఇంతగా బదిలీలు, సస్పెండ్లా..?. సోషల్ మీడియా కేసంటే 41ఏ నోటీసులివ్వాల్సిన కేసు. ఏడేళ్ల లోపు శిక్షపడే ఏ కేసుకైనా స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి. అన్నీ తెలిసినా.. అతని కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వర్కర్లను ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసే పరిస్థితి. నిన్న వర్రా అరెస్ట్ అంటూ ఏబీఎన్ వార్తలు వేసింది.. తెల్లారే సరికి ఆంధ్రజ్యోతి పత్రికలో వర్రా ఎక్కడ అంటూ రాస్తారు. దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడంటూ ఈ రోజు తాటికాయంత అక్షరాలతో రాశారు. ఆ తర్వాత బీటెక్ రవి వర్రాను వైఎస్సార్సీపీ వాళ్లే హత్య చేసే అవకాశం ఉందంటూ వీడియో విడుదల చేస్తాడు. ఆ తర్వాత ఏం జరగబోతోందో..? దీని మర్మమేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది.. ఈ సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. వీరి ప్రకటనలు, రాతల వెనుక మర్మమేంటి అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉంటుందేమో అనే అనుమానం కలుగుతోంది. రవీంద్రారెడ్డిని వీళ్లే హతమార్చి దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీపై వేసే ఎత్తుగడలో ఉన్నట్లున్నారు...కేవలం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు. అలా జరిగితే అతని కుటుంబం ఎంత బాధపడుతుందో చెప్పనవసరం లేదు. మీరు అతన్ని హత్య చేసే వ్యూహ రచన చేసి ఉంటే దయచేసి వెనక్కు తీసుకోండి. ఈ రోజు అధికారం ఉందని ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తే భగవంతుడు, చట్టం, ప్రజల వద్ద దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఎంతటి పోలీసు అధికారులైనా, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్న వారైనా సరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర అత్యంత ప్రమాదకర స్థితిలోకి వెళ్తోంది...ఈ కేసులు తప్ప రాష్ట్రంలో సమస్యలే లేవా? చర్చించాల్సి అంశాలే లేవా?. ఈ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.. ఎవరికీ స్వేచ్ఛలేదు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే భయం.. సోషల్ మీడియాలో ప్రశ్నించాలంటే భయం. మీరిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చండి అంటే మానవ హక్కులకు ఉల్లంఘన చేస్తున్నారు. న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా.. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడండి. నిన్న కూడా హైకోర్టు ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టంగా చెప్పింది. కోర్టు వారికి పోలీసులపై నమ్మకం లేదనేది స్పష్టంగా వారి మాటల్లో తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టులను వ్యక్తిగతంగా తీసుకుని ప్రాణాలకే ఇబ్బంది కలిగించవద్దు. వర్రా రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీడియా ముందు ప్రవేశపెట్టి.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టండి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కోరారు. -
చంద్రబాబూ.. మరి అవన్నీ కుట్రలేనా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాక, వైఎస్ జగన్ కుటుంబం మీద, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నిత్యం ఏదో రకమైన అబద్ధపు ప్రచారం చేసి పబ్బం గడుపుకొంటున్న సీఎం చంద్రబాబు, ఇకనైనా విషప్రచారం ఆపకపోతే తాము కూడా ఘాటుగానే బదులివ్వాల్సి ఉంటుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.బాబు కుటిల రాజకీయాలు.. ఎన్నికలకు రెండేళ్ల ముందు విజయమ్మ కారు టైరు పగిలిపోతే, ఆమె హత్యకు వైఎస్ జగన్ కుట్ర చేశాడంటూ టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాల్లో చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేయిస్తున్నారని, దీన్ని పట్టుకుని ఎల్లో మీడియాలు కథనాలు రాయడం, వాటిపై టీవీల్లో డిబేట్లు పెట్టించడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. ఇంకా దిగజారి తల్లిని ఎలా చూసుకోవాలో టీడీపీ నాయకులను చూసి నేర్చుకోవాలంటూ వారితో చిలకపలుకులు పలికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ తరహాలో చంద్రబాబు కుటిల రాజకీయాలు దశాబ్దాలుగా చూస్తున్నామని చెప్పారు.చంద్రబాబుకు వార్నింగ్..ప్రజలను కుటుంబ సభ్యుల్లా, మహిళలను తోబుట్టువుల్లా చూసుకున్న మాజీ సీఎం జగన్, తల్లి హత్యకు కుట్ర చేశాడంటూ వస్తున్న అసత్య కథనాలపై రాచమల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్ మరణం, ఆయన బావమరిది హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కూడా కుట్రలేనా? అని సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే.. వాటన్నింటికీ తామూ లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు.తన బాబాయ్ పవన్‌కళ్యాణ్ నుంచి ప్రాణహాని ఉందని గతంలో చిరంజీవి కూతురు మీడియాతో మాట్లాడిన విషయాన్ని కూడా లింక్ పెట్టేలా చేసుకోవద్దని ఆయనకు సూచించారు. అందుకే వ్యక్తిగత, కుటుంబ వివాదాల విషయాలను రాజకీయాల్లోకి లాగకుండా సంయమనం పాటించాలని హితవు చెప్పారు. వైఎస్ కుటుంబ ఆస్తులకు సంబంధించి వివాదానికి ముగింపు పలకాలని కోరుతూ.. తన బిడ్డలిద్దరూ పరిష్కరించుకుంటారని, కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోవద్దని విజయమ్మ బహిరంగ లేఖ రాయడంతో తాము కూడా పార్టీ ఆదేశాలతో మౌనంగా ఉన్నామని రాచమల్లు వివరించారు. షర్మిలకు మీ రక్షణ అవసరమా?షర్మిలమ్మకు రక్షణ కల్పిస్తామని పవన్‌కళ్యాణ్ హామీ ఇవ్వడంపై రాచమల్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. షర్మిలమ్మకు భద్రత కల్పిస్తామంటూ ఎందుకు కొత్త డ్రామా? అన్న ఆయన, రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే కదా? అని ప్రశ్నించారు. 5 నెలల కూటమి పాలనలో 78 మంది అమాయక ఆడబిడ్డలు, మహిళలు అత్యాచారాలకు గురై చనిపోతే వారికెందుకు రక్షణ కల్పించలేదని నిలదీశారు. అత్యంత కిరాతకంగా నాలుగేళ్ల చిన్నారులను కూడా వదలకుండా అత్యాచారాలు చేసి చంపేస్తుంటే ఒక్క నిందితుడినీ పట్టుకోలేదని ఆరోపించారు. పిఠాపురంలో 16 ఏళ్ల యువతికి మత్తుమందిచి టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే ఎందుకు కాపాడలేదని ప్రశ్నించిన రాచమల్లు, తిరుపతి సమీపంలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన సమాజానికి మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తోబుట్టువులకు చంద్రబాబు ఇచ్చిన ఆస్తులెన్ని?:వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై మాట్లాడుతున్న చంద్రబాబు, తన సోదరి హైమవతి, తమ్ముడు రామ్మూర్తినాయుడుకు ఎన్ని కోట్ల ఆస్తులు పంచాడు? హెరిటేజ్‌లో ఎన్ని వేల షేర్లు రాసిచ్చాడో? చెప్పాలని రాచమల్లు డిమాండ్ చేశారు. చివరకు కన్నతండ్రికి కూడా చంద్రబాబు అంత్యక్రియలు నిర్వహించలేదని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే, అందుకు చంద్రబాబు సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రాష్ట్రావతరణ వేడుకలకు బాబు మంగళం -
చంద్రబాబుతో చేతులు కలిపి..
-
వైఎస్ జగన్ పట్ల షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు
-
షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు. చంద్రబాబుతో కలిసి కుట్రలు చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు.‘‘షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా ఆస్తిలో వాటా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే బదాలాయింపు నిలిపేస్తామన్నారు. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిల. వైఎస్ జగన్‌ను పతనం చేయాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.’’ అని రాచమల్లు దుయ్యబట్టారు. ‘‘ఇంటింటికీ ఒక రామాయణం ఉండనే ఉంటుంది. మా ఇంటి రామాయణం షర్మిల పుణ్యమాని బజార్లోకి వచ్చింది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను షర్మిల బజారుకీడ్చిన తర్వాత వాస్తవాలేంటో చెప్పాల్సిన బాధ్యత మాకుంది. చంద్రబాబును ఆసరాగా చేసుకుని ఆమె చేస్తున్నది సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. షర్మిలమ్మ ప్రేమలు, అప్యాయతల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నిజంగా అలా ప్రేమలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే అన్నను జజారు కీడుస్తుందా? జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందా?. చంద్రబాబుతో చేతులు కలిపి కుట్రకు తెరలేపుతుందా?జగన్ ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లాడనడం పచ్చి అబద్ధం. ఎవరి ఆస్తులు ఎవరికిస్తున్నారో తెలియజెప్పాల్సిన అవసరం మాకుంది. షర్మిలకు పెళ్లై 30 ఏళ్లు కావొస్తుంది.. నీ తండ్రి మరణించిన 14 ఏళ్ల తర్వాత అమ్మగారి ఇంటి నుంచి ఏం ఆస్తి వస్తుంది?. వైఎస్సార్ బతికుండగానే ఇద్దరికీ సమానంగా ఆస్తులను పంచారు. వైఎస్సార్ ఆడపిల్లను వేరుగా చూడకుండా ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచారు. తన స్వార్జితం సంపాదించుకున్న ఆస్తిలో చెల్లెలుపై ప్రేమతో ఆయన వ్యాపారాల్లో రూ.200 కోట్లు వైఎస్ జగన్ ఇచ్చారు. డబ్బే కాదు.. ఆస్తులు కూడా ఇస్తానని పిలిచి ముందుకు వచ్చాడు. షర్మిలకు హక్కు లేకపోయినా.. రక్త సంబంధంతో ఎంవోయూ చేశారు.జగన్ ఇవ్వడం గొప్పైతే.. దానికి ఒప్పుకోవడం జగన్ సతీమణి భారతి చాలా గొప్పతనం. ఏ ఆడబిడ్డకు ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. ఆమెను ప్రశంసించాలి. ఆ ఎంవోయూలో ఈడీ చేతిలో ఆస్తులు అటాచ్ అయ్యాయి. వెంటనే బదలాయింపు చేయలేనని చెప్తూ అగ్రిమెంట్ చేశారు. ఆమెకు దానిలో హక్కు లేదు. తండ్రి గారి సొమ్ము కూడా కాదు. కేసులు పరిష్కారం అయిన తర్వాత నీకు బదలాయింపు జరుగుతుందని కూడా ఎంవోయూలో ఉంది. ఏదో నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో హక్కు అడిగినట్లు షర్మిలమ్మ మాట్లాడుతోంది. జగన్ నీకిచ్చిన ఆస్తి కోసం ట్రిబ్యునల్‌కు వెళ్లలేదు.. ఆయన కోర్టుకు వెళ్లలేదు.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి వెళ్లారు.నాకు తెలియకుండా మోసం చేసి, నా తల్లికి అబద్ధాలు చెప్పి బదలాయింపు చేసుకునేందుకు ప్రయత్నించారని, దాన్ని ఆపాలని జగన్ కోరారు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా, ప్రమాదం జరగకుండా ఆయన తీసుకున్న జాగ్రత్త ఇది. నీది కాని ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపావు తల్లీ. ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లీ..?. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, సునీతమ్మ, మీరు నలుగురు కలిసి కుట్ర చేసి జగన్‌ను చిక్కుల్లోకి పంపాలని కుట్ర చేశారు. మరోక రెండేళ్లు జగన్‌ను జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తావా..?చంద్రబాబు, రేవంత్ చేశారంటే ఒక అర్ధం ఉంది.. తోడబుట్టిన, రక్తం పంచుకుని పుట్టిన దానివి.. ఎందుకింత నీచానికి ఒడికడుతున్నావు. తల జగన్ గారిదైతే.. కత్తి షర్మిలమ్మది.. చేయి చంద్రబాబుది. ఇంత చేస్తూ అనుబంధాలు, ప్రేమలు, అప్యాయతలంటూ మాట్లాడతావా.. షర్మిల మాట్లాడే మాటలన్నీ పచ్చి అబద్దం. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌లో భూములపైనే ఎటాచ్మెంట్ ఉంది. కంపెనీ అటాచ్ కాలేదు అంటూ అబద్దాలు మాట్లాడుతోంది.2019లో సరస్వతి ఇండస్ట్రీస్‌లో పూర్తిగా వంద శాతం ఆమెకే ఇచ్చాడు. ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి కోట్లు ఖర్చు అవుతుందని కాలయాపన చేసింది. 2019 డిసెంబర్లో ఆ ఆస్తి కూడా అటాచ్మెంట్లోకి పోయింది. ఆమె ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మాట్లాడుతుంది తప్ప...హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో గురించి మాట్లాడటం లేదు. హైకోర్టు తీర్పులో ఎటువంటి క్రయవిక్రయాలు చేయకూడదని స్పష్టంగా ఉంది. అహంకారం+అత్యాశ= షర్మిల. చంద్రబాబు, సోనియాతో కలిసి ఎప్పటికైనా ఏలాలనే పదవులపై అత్యాశ. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు తెలంగాణాలో పార్టీని మూసేసి ఇక్కడకు వచ్చి అన్నను బజారుకీడుస్తున్నావు.మీ అన్నపై రాయితో దాడి చేస్తే ఆనాడు నువ్వేం మాట్లాడావు..?. జగన్ అంతమే నీ లక్ష్యంగా కనిపిస్తోంది. అప్పుడే నీకు సంతోషంగా ఉండేట్లుంది. జగన్ సంపాదించిన ఆస్తిని తన చెల్లెలుపై ప్రేమతో ఉచితంగా ఇస్తున్న ఆస్తి ఇది. అమ్మకు అబద్ధం చెప్పి.. ఆమెకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను లాగేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు.. ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావు...? విజయమ్మ గారిని కూడా ఒక మాట అడుగుతున్నా.. నా బిడ్డ జగన్‌ను రాష్ట్రానికి ఇస్తున్నాను.. నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అన్నారు.. ఇప్పుడు జగన్ మా బిడ్డ, మా అన్న అయినప్పుడు ఆయనకు ప్రమాదం వస్తే మా అందరితో ముడిపడి ఉంది. ఆయన ప్రమాదం, ఆయన ప్రాణం, గౌరవం మా అందరి కోటిమంది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంది. మా అందరి జీవితాలతో ముడిపడి ఉన్న పెద్దన్న లాంటి జగన్ గారిని మీరందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు?. శతాబ్ది జోక్ కాదు.. వందేళ్లు వెనక్కి పోయినా నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లోనూ ఉండదు.ఆ అన్న నీ ఒక్కడికే అన్న కాదు.. మా అందరికీ అన్న.. నీది రక్త బంధమైతే.. మాది హృదయానికి సంబంధించిన బంధం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేం జగన్‌తో ఉండే వాళ్లం..నువ్వు ఆయన్ని జైళ్లోకి పంపిస్తే మా జీవితాలు ఏం కావాలి..?. చెల్లెల్లు రక్షాబందన్ కట్టి అన్న చల్లాగా ఉండాలనుకుంటారు..నువ్వు అన్నను జైలుకు పంపాలనుకుంటున్నావు. భర్త సంపాదించిన ఆస్తిలో చెల్లెలకు వాటా ఇస్తున్నా సహకరించి సంతకం పెట్టిన భారతమ్మను గౌరవించాలి. జగన్ తల్లి, చెల్లిపై కోర్టులో కేసు వేశాడా..? ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా.. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆస్తుల కోసం తల్లి,చెల్లిపై కేసు వేశాడని రాస్తారా?. కుట్రపూరితంగా మీరు ఆయన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే..కళ్లు తెరిచి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ ఆస్తి మీది కాదు..జగన్మోహన్రెడ్డి కష్టార్జితం. ఈ కుటుంబ సమస్యను బజారుకీడ్చింది మీరు.. చంద్రబాబుతో చేతులు కలిపింది షర్మిల.మీ ఇంట్లో రామాయణం లేదా చంద్రబాబు..? మీ తమ్ముడు రామ్మూర్తిని గొలుసులేసి కట్టేశారు..రూపాయి అస్తులు ఇవ్వలేదు. మీ అమ్మ కు హైదరాబాద్‌లో ఉన్న వందల కోట్ల భూమిని మీ చెల్లెల్లకు ఇచ్చినావా?. లక్ష్మీ పార్వతికి చెందాల్సిన ఆస్తులు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వంశానికి సమస్యలు లేవా?. పవన్ కల్యాణ్ పెళ్లాలకు ఉండే సమస్యలు సంగతేంటి?. మీ రామాయణాలు ఏ రోజూ మేం ప్రస్తావించలేదు.. ఇళ్లన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పేజీ పేజీ వండి వార్చలేదు. కుటుంబ వ్యవస్థలో ఉండాల్సిన అనుబంధాలు చంద్రబాబుకు లేవు.. అది ఒక్క వైఎస్సార్ కుటుంబంలోనే ఉన్నాయి. మా దరిద్రానికి ఇప్పుడు ఈ షర్మిల మాకు తోడైంది.. లేదంటే ఇంతవరకూ మచ్చలేని కుటుంబం వైఎస్సార్‌ది. విజయమ్మకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా..మీ బిడ్డ మీ బిడ్డ కాదు..మా ఆస్తి... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల ఆస్తి..మీ ఇష్టానుసారం ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండటానికి సిద్ధంగా లేము. ఇంత దూరం వచ్చిన తర్వాత దాచిపెట్టుకుని మెల్లిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది..?’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీపై రాచమల్లు ఫైర్
-
తుల గుండెల్లో రైతు బిడ్డగా YSR..
-
శత్రువులు కూడా అభినందించే గొప్ప నాయకుడు వైఎస్సార్
-
మోసం చేయడం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. రాచమల్లు ఫైర్
-
ఓటమిపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన కామెంట్స్
-
నీ శకం ముగిసింది బాబు..
-
రాత్రి మారేలోపు జెండా మార్చేసావ్ ఆ మాట అనడానికి నోరెలావచ్చింది నీకు..?
-
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి హాట్ కామెంట్స్
-
ప్రొద్దుటూరులో సీఎం జగన్ బస్సు యాత్రకు భారీ ఏర్పాట్లు
-
చంద్రబాబు బీజేపీ పొత్తుపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సెటైర్లు
-
పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కౌంటర్
-
టీడీపీ డబ్బు రాజకీయాలు మొదలుపెట్టింది: రాచమల్లు
-
షర్మిల వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
-
బాబు శేషజీవితం ఇక సెంట్రల్ జైల్లోనే..!
-
6 రోజుల పాటు కాలినడకన తిరుమలకు పాదయాత్ర
-
మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన నిరుపేద విద్యార్థిని వాచ్చల్య శ్రీ ఉన్నత చదువు చదుకోవాలనే కోరికను ఎమ్మెల్యే తీర్చారు. రష్యాలో ఎంబీబీఎస్ సీటు వాచ్చల్య శ్రీ సాధించగా, రష్యాలో ఆమె చదువుకయ్యే సుమారు రూ.50 లక్షల ఖర్చును ఎమ్మెల్యే భరించి చదివించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. ఇదీ చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు