rajasingh
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఆయన్ను అదుపులో తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రాజాసింగ్.. మియాపూర్ ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. -
రాజాసింగ్‌పై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసు
నిర్మల్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై జిల్లాలో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ రాజాసింగ్‌తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పైనా కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ తరఫున రాజాసింగ్, పాయల్ శంకర్లు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సమయం ముగిసినా కూడా ప్రచారం చేశారనే వీళ్లపై ఖానాపూర్ పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. -
బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని బీజేఎల్పీనేత, గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ తెలిపారు. ఈ ఫోన్లు 15 డిజిట్ నంబర్ నుంచి వస్తున్నాయని, తనను చంపుతామని, నరుకుతామని భయపెట్టిస్తున్నారని బుధవారం మీడియాతో వెల్లడించారు. తనకు ఫోన్ చేసి తన గురించి, తాను ఎక్కడెక్కడికి వెళుతోంది ప్రతీ కదలిక గురించి తెలియజేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ వస్తుండటంతో, తమ ఇద్దరినీ కలిపి చంపుతామని హెచ్చరించినట్లు రాజాసింగ్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 1.59 గంటలకు +61 9664800063233 నుంచి తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు రాజాసింగ్ వెల్లడించారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్‌పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు చదవండి: మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు -
ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడదల చేసింది. ఈ జాబితాలోనే గోషామహల్ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రకటించింది. చదవండి: దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. సీపీఐకి ఎదురుదెబ్బ! -
యువతకు సందేశం
‘‘నేటి యువతకు సందేశం ఇవ్వడానికే ‘రజాకార్’ సినిమా తీశారు. ఇలాంటి చిత్రం తీసే ధైర్యం చేసిన మా డైరెక్టర్ సత్యనారాయణకి థ్యాంక్స్’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుశ్రేయ త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. సమర్ వీర్ క్రియేషన్స్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రాజాసింగ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తోంది.. ఇక సినిమా చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి’’ అన్నారు. ‘‘తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17 మా సినిమాకి కథా వస్తువుగా మారింది. ఆ రోజు జరిగిన విముక్తి పోరాటంతో ఈ సినిమా తీశాను’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘ఈ చిత్రం మన చరిత్ర గురించి అందరికీ తెలియజేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
రవీందర్‌కు సీరియస్.. విధుల బహిష్కరణకు హోంగార్డ్ జాక్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: జీతాల ఆలసత్వంపై ఆవేదనతో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న హోంగార్డు జేఏసీ ఆస్పత్రికి చేరుకోగా.. బుధవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీందర్‌కు మద్దతుగా.. ఉస్మానియా హాస్పిటల్‌కు భారీగా తరలి రావాలని హోం గార్డ్ JAC పిలుపు ఇచ్చింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. అదే సమయంలో.. హోంగార్డులు ఎవరు అఘాయిత్యాలకు ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేసింది. జేఏసీ పిలుపు మేరకు హోంగార్డులు ఉస్మానియాకు తరలి వస్తున్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. సకాలంలో జీతం రావట్లేదనే ఆవేదనతో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. 55 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడరు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మరోవైపు హోంగార్డులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై అధికార కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది హోంగార్డుల జేఏసీ. ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ.. హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి అని డిమాండ్ చేశారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న 22వేల హోంగార్డులను పర్మినెంట్ చేయాలన్నారు. మరొక హోంగార్డు రవీందర్ మాదిరి ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. -
అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
బండి సంజయ్ పై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: రాజా సింగ్
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసిన చీకోటి ప్రవీణ్ కుమార్
-
పొలిటికల్ కారిడార్ : పీడీ యాక్ట్ ఎత్తేయాలని హిందూ సంఘాల డిమాండ్
-
బీజేపీ సభలో రాజాసింగ్ కు అనుకూలంగా స్లొగన్స్
-
GHMC సమావేశంలో బీజేపీ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ్టి(మంగళవారం) సమావేశంలో.. బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. సుమారు 43 మంది బీజేపీ కార్పొరేటర్లు నల్లబ్యాడ్జీలతో సమావేశానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను విడుదల చేయాలంటూ.. ప్లకార్డులతో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు వాళ్లంతా. ఇదిలా ఉంటే.. కాంట్రాక్టర్ల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. రూ. 800 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వాళ్లంతా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. పోలీసులకు, కాంట్రాక్టర్లకు మధ్య తీవ్రవాగ్వాదం నెలకొనగా, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు కాంట్రాక్టర్లకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు అంబేడ్కర్‌తో పోలికా? -
రాజాసింగ్ సస్పెన్షన్ ఓ డ్రామా.. టీఆర్ఎస్తోనే అది సాధ్యమైంది
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఒక నాటకమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ నాటకమాడుతోందని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజాసింగ్‌కు బీజేపీ మద్దతు కొనసాగుతోందన్నారు. జైలులో ఉన్న ఆయనను విడిపించేందు కు బీజేపీ తీవ్రంగా ప్రయ త్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందునే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ ను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించిందని, ఢిల్లీలో శాంతిభద్రతల అంశం కేంద్రం చేతుల్లో ఉండటంతో నుపుర్శర్మని అరెస్ట్ చేయలేదన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మాంసాహారంపై నిషేధమా?: కర్ణాటకలో గణేశ్ చతుర్థి సందర్భంగా మాంసాహారంపై నిషేధం విధించడమేమిటని ఒవైసీ మండిపడ్డారు. బెంగళూరులో మాంసాహారాన్ని నిషేధించడం ద్వారా ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని బీజేపీ యత్నిస్తోందని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో 80 శాతంమంది ప్రజలు నాన్‌వెజ్ తింటున్నారని పేర్కొన్నారు. హోటళ్లలో యథేచ్ఛగా నాన్‌వెజ్ దొరుకుతుండగా, పేదల కోసం నాన్‌వెజ్ షాపులు తెరిస్తే మాత్రం అభ్యంతరం చెబుతున్నారని అన్నారు. మాంసం విక్రయించేవాళ్లలో అత్యధికులు ముస్లిం వర్గానికి చెందినవారేనన్న అక్కసుతోనే మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో హక్కులు అణచివేతకు గురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. మొరాదాబాద్‌లో ముస్లింలను నమాజ్ చేయకుండా నిలిపివేయడంపై ఒౖవైసీ మండిపడ్డారు. నమాజ్ చేయడానికి అనుమతి తీసుకోవాలా, ఇది ముస్లింలపట్ల ద్వేషాన్ని స్పష్టం చేస్తోందన్నారు. బీజేపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని, ముస్లింలను అణిచివేసేందుకు అన్నిచోట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్ జయేశ్ షాకు సంబంధించిన ఓ ప్రశ్నపై ఒవైసీ స్పందిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం భారత్‌పై ఉన్న ప్రేమను రుజువు చేయదని అన్నారు. -
మరో వీడియో విడుదల చేసిన రాజాసింగ్.. సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తనను నగర బహిష్కరణ చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రెండోసారి అరెస్ట్‌కు ముందు ఆయన స్పందిస్తూ.. వీడియో విడుదల చేశారు. తాను తుపాకీ గుళ్లకు, ఉరిశిక్షకు భయపడేవాడిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: రాజాసింగ్‌కు ఊహించని షాక్.. ఇలా జరిగిందేంటి? ‘‘నేను మహ్మద్ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు. పాతబస్తీలో ఒవైసీ మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నా తల నరుకుతామని నినాదాలు చేస్తున్నారు’’ అని రాజాసింగ్ అన్నారు. రెచ్చగొట్టే నినాదాలు చేసినవారిపై ఎన్ని కేసులు పెట్టారు అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. నన్ను ఇవాళ రాత్రి, లేదా తెల్లవారుజామున అరెస్ట్ చేస్తారనే సమాచారం అందింది. పాత కేసుల్లో అరెస్ట్ చేయాలని కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. -
..మాదేం లేదు! పార్టీలో ఉండేది, లేనిది మీ నోటి దూలను బట్టి ఉంటుంది!
..మాదేం లేదు! పార్టీలో ఉండేది, లేనిది.. మీ నోటి దూలను బట్టి ఉంటుంది! -
అసెంబ్లీ నుంచి బహిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఇక రాజాసింగ్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మండిపడగా.. రాష్ట్రాన్ని తగలబెట్టి శ్మశానాలు ఏలుతారా అంటూ టీఆర్ఎస్, బీజేపీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మతఘర్షణలు చేయించడానికి సీఎం కుట్ర పన్నుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ నుంచి బహిష్కరించండి శాసనసభ విలువలను దిగజా రుస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవా రం లేఖ రాశారు. ఎమ్మెల్యేగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి సభ ప్రతిష్టకు భంగం కలిగించిన రాజాసింగ్‌పై రాజ్యాంగంలోని 194వ ఆర్టికల్ నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అధికారం అసెంబ్లీకి ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 22న మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నా యన్నారు. ఈ ఏడాది అసెంబ్లీలోనూ అసంబద్ద వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని ఖాద్రి గుర్తు చేశారు. రాజాసింగ్‌ను బహిష్కరించాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మతకల్లోలాలకు దారి తీసేలా, మత ఘర్షణలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సమాజ బహిష్కరణ చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై బీజేపీ మిడతల దండులా దాడి చేస్తోందని, మత అలజడులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం భట్టి విలేక రులతో మాట్లాడారు. బీజేపీ నేతల తీరు దేశ సమైక్యత, సమగ్రత, లౌకికవా దానికి పెనుముప్పుగా మారుతోందన్నారు. రాజాసింగ్ తన స్థాయి మరిచి జుగుప్సకర వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సమాజహితం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రాజాసింగ్‌ను కట్టడి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇతర మతా లను గౌరవించాలని, కానీ రాజాసింగ్ అందుకు భిన్నంగా మాట్లాడినందున భారత రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిని జైలుకు పంపండి: రేవంత్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘మత విద్వేషాలు రెచ్చగొట్టి, తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ ఎంతకైనా బరితెగిస్తుందని రాజాసింగ్ మాటలు ధ్రువీకరి స్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోని వాస్తవాలను మరుగున పరచడా నికి టీఆర్ఎస్ కృత్రిమంగా సృష్టిస్తోన్న గందరగోళాన్ని కూడా ప్రజలు గమ నిస్తున్నారు’ అని రేవంత్ ఆ ట్వీట్లో వ్యాఖ్యానించారు. రాజాసింగ్‌ను జైలుకు పంపాలి: అసదుద్దీన్ ఒవైసీ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను జైలుకు పంపాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన దారు స్సలాంలో మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ కు బెయిల్ రావడంపై మండిపడ్డారు. పోలీసుల పొరపాటుతో ఆయనకు జైలు తప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దీనిని సరిదిద్దుతారని ఆశిస్తు న్నానని పేర్కొన్నారు. రాజాసింగ్‌పై తీవ్ర ఆరో పణలు ఉన్నాయని, సహించరాని వివాదాస్పద వాఖ్యలతో ఆయన వీడియోను విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా రాజాసింగ్ వైఖరి అసభ్యకరంగా ఉందని ఒవైసీ నిప్పులు చెరిగారు. వివాదాస్పద వాఖ్యలు చేసిన రాజాసింగ్ వాయిస్ శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. వాయిస్ శాంపిల్ నిర్ధారణ ద్వారా బలమైన కేసు పెట్టాలని ప్రభు త్వానికి సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఇలాంటి వాఖ్యలు చేయడం ఇదే చివరిసారి కావాలని పేర్కొన్నారు. నుపుర్‌శర్మ వ్యవహారం నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదని ఆయన దుయ్యబట్టారు. ఎక్కడ కనిపించినా దాడి చేయండి: ఫిరోజ్‌ఖాన్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే హైదరాబాద్ లోని ముస్లింలు రాజాసింగ్ ఎక్కడ కనిపించినా దాడి చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మతాన్ని కించప రిచేలా మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్య మాల్లో బుధవారం ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫిరోజ్‌ఖాన్ మాట్లాడుతూ.. శాంతి, సమానతలతో ఉన్న హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకుని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. -
శాంతిభద్రతలే ముఖ్యం.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగడానికి వీల్లేదని.. చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారిని ఉపేక్షించాల్సిన ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకునే వారిపై, మతాల మధ్య చిచ్చుపెట్టే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియో, తదనంతర పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లో ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేకుండా ప్రజలు హాయిగా, ప్రశాంతంగా జీవిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండు రోజుల కిందట విడుదల చేసిన వీడియోలో ఓ వర్గం మతగురువును కించపరిచారనే ఆరోపణలు, దానిపై మజ్లిస్ శ్రేణులు నిరసనలకు దిగడం, రాజాసింగ్ అరెస్టు, బెయిల్‌పై విడుదల తదితర ఘటనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కుమార్తె కవిత ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించడం.. బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల ఘర్షణ, బీజేపీ కార్యకర్తలపై కేసులను నిరసిస్తూ బీజేపీ నిరసన కార్యక్రమాలకు దిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో పలుచోట్ల ఉద్రిక్తత, యాత్ర ఆపేయాలని వరంగల్ పోలీసుల నోటీసులతోనూ బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇక రాజాసింగ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్ ఓ వర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం అత్యవసర సమీక్ష నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తున్న విషయాన్ని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా మత ఘర్షణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కొందరు మతాల మధ్య చిచ్చుపెట్టడానికి, విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడినట్టు తెలిసింది. ఎవరి మతాలు, ఆచారాలను వారు ఆచరించుకోవచ్చని.. కానీ ఇతరులను కించపర్చేలా వ్యవహరించడం సహించరానిదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే అవకాశం ఉంటుందని.. అందువల్ల ఆదిలోనే దీనిని తుంచివేయాలని ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసు యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పక్షంలో మరిన్ని బలగాలను రప్పించి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిసింది. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగున్నందునే దేశవిదేశాల పెట్టుబడులు వస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఏర్పాటవుతున్నాయని సీఎం కేసీఆర్ గుర్తుచేసినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఘటనలపై జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోందని.. ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి దెబ్బతింటుందని హెచ్చరించినట్టు సమాచారం. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వారిని ఓ కంట కనిపెట్టి ఉండాలని.. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా సున్నిత ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు: మహమూద్ అలీ శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంబిస్తోందని.. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడి అశాంతి సృష్టించాలనుకునే వారిని రాష్ట్ర ప్రభుత్వం సహించబోదని బుధవారం రాత్రి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయని.. వీటిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. ఇతర మతాలను ఎవరూ కించపర్చరాదని, మనోభావాలను దెబ్బతీయరాదని స్పష్టం చేశారు. ప్రజలంతా సంయమనంతో, సోదరభావంతో ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. -
17న రాజ్యాంగ పరిరక్షణ దీక్ష
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నుంచి తమ సస్పెన్షన్, సభలోకి అనుమతించే అంశాలపై పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడా న్ని నిరసిస్తూ ఈనెల 17న ఇందిరాపార్క్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. స్పీకర్ హోదాకు విలువనిస్తూ కోర్టు గౌరవ సూచన చేసినా, ఆ స్ఫూర్తిని తుంగలోతొక్కి దురదృష్టకర సంప్రదాయాన్ని లేవనెత్తారని ఈటల విమర్శించారు. స్పీకర్ తన గౌర వాన్ని నిలుపుకోలేకపోవ డం దురదృష్టకరమన్నారు. ఆస్ట్రియా బృందం ఈ రోజు అసెంబ్లీ వ్యవహారాలు పరిశీలి స్తున్న సందర్భం లో తమ సస్పెన్షన్ ఒక దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. ఈ విధానాలు చూస్తుంటే ఉత్తర కొరి యా గుర్తు వస్తుందని, అక్కడ రాజు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చప్పట్లు కొట్టలేదు అని ఒక సభ్యున్ని కాల్చి చంపారని ఈటల పేర్కొన్నారు. ఇకపై ఇక్కడా చప్పట్లు కొట్టలేదని కూడా సస్పెండ్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా ఒక ఉద్యమ నాయకుడినేనని గతంలో ఉద్యమాన్ని తూలనాడిన వారితోనే తమను సస్పెండ్ చేయించడం అవమానకరమన్నారు. ‘హైకోర్టు ఉత్తర్వులు, మీ పిటిషన్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీ అభ్యర్థన తిరస్కరిస్తున్నా’అని స్పీకర్ చెప్పారని రఘునందన్ రావు తెలిపారు. తమ అభ్యర్థనను సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరినా స్పీకర్ వినలేదన్నారు. ‘ప్రజాస్వామ్య చరిత్రలో ఇది బ్లాక్‌డే. స్పీకర్ తనకు వచ్చిన డైరెక్షన్ మేరకే పని చేస్తున్నారు’అని రఘునందన్ విమర్శించారు. -
బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థన తిరస్కృతి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు బీజేపీ శాసనసభ్యులు తమపై విధించిన బహిష్కరణను ఎత్తివేయాలంటూ మంగళవారం శాసన సభాపతి చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. అయితే సస్పెన్షన్ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని పోచారం స్పష్టం చేయడంతో అసెంబ్లీ నుంచి వెనుదిరిగారు. ఈ నెల 9న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ సభ తీర్మానించడం తెలిసిందే. దీన్ని సవాల్‌చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వారిని సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకే బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సుమారు 45 నిమిషాలపాటు స్పీకర్‌ను కలిసేందుకు వేచిచూశారు. చివరకు స్పీకర్ చాంబర్లో కలిసేందుకు వారికి పిలుపు రావడంతో పోచారాన్ని కలిసి కోర్టు ఉత్తర్వులతోపాటు సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించారు. సభ జరుగుతున్న సమయంలో తమ స్థానం నుంచి కదలలేదని, సభను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని రఘునం దన్‌రావు, ఈటల రాజేందర్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. తమను బహిష్కరించడం అన్యాయమని, పార్టీలను పక్కనపెట్టి పక్షపాతరహితంగా నిర్ణయం తీసుకోవాలని బీజేపీ సభ్యులు కోరారు. పోడియంలోకి వచ్చినట్లు భావిస్తే తాను సస్పెన్షన్‌కు అర్హుడనని, మిగ తా ఇద్దరు సభ్యులను సభకు అనుమతించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీకర్‌కు విన్నవించారు. ‘సస్పెన్షన్ నిర్ణయం శాసనసభ ఏకగ్రీవంగా తీసుకుందని’స్పీకర్ వ్యాఖ్యానించగా తమ వినతిని సభతోపాటు సభానాయకుడి ముందు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది. ఈలోగా శాసనసభ సమావేశం ప్రారంభమైనట్లు గంట మోగడంతో స్పీకర్ సభలోకి వెళ్లగా బీజేపీ ఎమ్మెల్యేలు తిరుగుముఖం పట్టారు. ‘మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నా’అని స్పీకర్ ప్రకటించారని సభ నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో ప్రకటించారు. -
పోలీసుల తీరుపై రాజాసింగ్ ఫైర్
-
24 నుంచి బండి సంజయ్ పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్/దూద్‌బౌలి: ఈనెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’గా పేరును ఖరారు చేశారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ సీనియర్ నేతలతో కలసి ఎమ్మెల్యే రాజాసింగ్, పాదయాత్ర పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను చేపడుతున్నారని తెలిపారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, జనం సిద్ధంగా ఉన్నారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై హుజూరాబాద్ వరకు సాగుతుందని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్ధిపొందడానికే సీఎం కేసీఆర్ దళితబంధు పేరిట వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల సంక్షేమాన్ని కోరుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాతబస్తీని ఎంఐఎం నేతలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటిని మళ్లించుకుపోతున్నప్పటికీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ ఏడారిగా మారుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు చంద్రశేఖర్, స్వామిగౌడ్, బాబు మోహన్, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వం పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
-
రాజాసింగ్ వర్సెస్ సజ్జనార్!
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మె ల్యే రాజాసింగ్ లోధా, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జ నార్ మధ్య మంగళవారం మాటల యుద్ధం జరిగింది. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన అంశం దీనికి కారణమైంది. ఈ వ్యవహారంలో శంషాబాద్ వెళ్లిన రాజాసింగ్ పోలీసులపై ఆరోపణలు చేస్తూ తన వాహనం నుంచి సెల్ఫీ వీడియో విడుద ల చేశారు. లోన్ యాప్స్ నిందితుల అరెస్టుపై నిర్వహించిన మీడియా సమావేశంలో దీనిపై సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. దీంతో తన ‘స్వరం మార్చిన’రాజాసింగ్ రాత్రికి మరో వీడియో విడుదల చేశారు. వీరి మధ్య పేలిన మాటల తూటాలిలా.. పోలీసులు బ్రోకర్లుగా పని చేస్తున్నారు.. ‘మహారాష్ట్ర నుంచి ఒక బండిలో 45 ఆవులు, దూడలు బహదూర్‌పురలోని స్లాటర్ హౌస్‌కు తీసుకొస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలసి బహదూర్‌పురలో అక్రమ పశువధపై ప్రశ్నించినా సమాధానం లేదు. మీకు దొరకని బండి మాకు ఎందుకు దొరుకుతోందని సీపీ, డీజీపీలను ప్రశ్నిస్తున్నా.. మా కార్యకర్తలు ఇలాంటి బండ్లు ఆపితే లాఠీచార్జ్ చేసి కేసులు బుక్ చేస్తున్నారు. నువ్వు ఎవరు? ఏ అధికారముందని ప్రశ్నిస్తున్నారు. నేరాలు ఆపే అధికారం ప్రజలకు కూడా ఉంటుంది. కొత్తూర్ ఎస్సై శ్రీధర్ ఒక బండిని డబ్బు తీసుకుని పంపిస్తున్నారు. తన లిమిట్స్ దాటడానికి డబ్బు తీసుకుని బ్రోకర్‌గా తయారవుతున్నారు. శాలరీ చాలట్లేదంటే మేము భిక్షం ఎత్తుకుని పోలీసులకు డబ్బులిస్తాం. ఇలాంటి పాపం మాత్రం చేయకండి.. – ఉదయం సెల్ఫీ వీడియోలో రాజాసింగ్ పోలీసులపై నిందలు ఫ్యాషనైపోయింది.. ఎవరు పడితే వారు మీడియాలో పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులపై నిందలు వేయడం ఫ్యాషనైపోయింది. దేశంలోనే తెలంగాణ పోలీసు నంబర్ వన్.. పోలీసులు ఎవరైనా డబ్బులు తీసుకున్నారంటే సాక్ష్యాలు చూపండి. ఫిర్యాదులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. డబ్బు తీసుకున్నారనే ఆధారాలుంటే బయటపెట్టండి. అయినా కూడా చర్యలు తీసుకోకుంటే అప్పుడు మాట్లాడండి.. అంతేకానీ బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా పోలీసులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఆ వ్యాఖ్యలపై న్యాయపర చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసు నమోదు చేస్తాం – వీసీ సజ్జనార్ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్టండి.. సైబరాబాద్ కమిషనర్‌కు చాలెంజ్ చేస్తున్నా. మీ పరిధిలో పోలీస్ స్టేషన్ల ముందు నుంచి అక్రమంగా ఆవుల్ని వధించడానికి తీసుకెళ్తున్నారా? లేదా? ఈ నివేదిక మీరు తెచ్చుకోండి. అందులో తేలిన నిజానిజాలను బట్టి నాపైనా లేదా పోలీసులపై చర్యలు తీసుకోండి. గోవుల్ని తరలిస్తున్న వాహనాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. గతంలో మీ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు కార్యకర్తలు ఓ బండిని పట్టుకుని తీసుకుని వెళ్తే దూషించారా? లేదా? వారిపై రౌడీషీట్ తెరుస్తామని వార్నింగ్ ఇవ్వడం నిజమా? కాదా? మీరు మంచి కమిషనర్.. మీ పరిధిలోని సరిహద్దు ఠాణాల్లో చెక్‌పోస్టులు పెడితే ఒక్క వాహనం నగరం లోపలకు రాదు. మేము కూడా రోడ్డు మీదకి రాము.. – రాత్రి విడుదల చేసిన వీడియోలో రాజాసింగ్ -
టీఆర్ఎస్ నేతల ఇళ్లకే రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్ : వరద వచ్చిన ప్రాంతాలలోని చాలా మందికి ఆర్థిక సహాయం అందించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని గోశామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వరద బాధితుల ఇళ్లు కూలితే ఒక లక్ష, ధ్వంసం అయితే 50 వేలు, నీటిలో మునిగితే 10 వేల రూపాయలు అని గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ జీఓ ప్రకారం ఇస్తున్నారో చెప్పాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటికీ నీటిలో ఉన్న ప్రాంతాలను, కూలిపోయిన ఇళ్లను బాగుచేయటంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. 10 వేల రూపాయలు టీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల ఇళ్లకే వెళ్తున్నాయి. రానున్న జీఎచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కరు కూడా టీఆర్ఎస్కు ఓట్లు వేయొద్దు. కొందరు కావాలనే నాపై బురద జల్లడానికి దుష్ప్రచారం చేస్తున్నారు. పూసల్ బస్తీకి చెందిన వాళ్లు తమకు 10 వేల రూపాయలు రావడం లేదని నాకు పిర్యాదు పత్రం ఇచ్చారు’’ అని అన్నారు