Rang De
-
హోలీగా..జాలీగా..నితిన్ బర్త్‌డే వేడుక
ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు హోలీ పండుగ సంబరాలను వినూత్నంగా నిర్వహిస్తోంది. హ్యాపీ మూడ్‌లో ఉండే వీక్షకుల ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోంది. దీనిలో భాగంగా రంగ్ దే ప్రేమ పేరుతో సాయంత్రం 6గంటలకు ప్రసారం చేసే హోలీ ఈవెంట్లో హీరో నితిన్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. అదే సమయంలో ఆయన తన పుట్టినరోజు వేడుకలు కాస్త ముందస్తుగా (మార్చి 30) నిర్వహిస్తుండడం విశేషం. అంతేకాకుండా హోలీ సందడికి ఊపునిస్తూ ‘తెల్లవారితే గురువారం’ సినిమా నటీ నటులు కూడా ఇందులో పాల్గొననున్నారు. ఇక జీ కుటుంబంలో హిట్ పెయిర్‌గా పేరొందిన జంటలు... అషికా–చందు, అనుష–ప్రతాప్, కల్కి–పూజ, సిద్ధార్ధ–మేఘన, ఆకర్ష్–భూమి...లు తమదైన నత్యాలతో అలరించనున్నారు. కుటుంబ విలువలను వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ రూపొందిన కొత్త ఫిక్షన్ షో కూడా హోలీ రోజునే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2.30గంటలకు మిఠాయి కొట్టు చిట్టమ్మ పేరుతో పిక్షన్ షో లాంచ్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయ పురంకు చెందిన చిట్టెమ్మ అనే మహిళ జీవిత కధ చుట్టూ ఈ షో తిరుగుతుంది. చదవండి : హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్ ‘రంగ్‌దే’ మూవీ రివ్యూ -
'రంగ్‌దే' మూవీ ట్రైలర్ లాంచ్ ఫోటోలు
-
ఆమె వల్లే పెద్ద వెధవనయ్యానంటున్న నితిన్
హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘రంగ్‌దే’. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా జరపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘రంగ్‌దే’ ట్రైలర్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్లను ప్రేక్షకుల అంచనాలు పెంచుతున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీకి మరింత హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఇందులో ‘మనం ప్రేమించిన వాళ్ల విలువ మనం వద్దనుకున్నప్పుడు కాదు.. వారు మనల్ని అక్కర్లేదు అనుకున్నపుడు తెలుస్తుంది’ అంటూ నితిన్ ఎమోషనల్‌గా చెప్పె డైలాగ్ ప్రేమికులను టచ్ చేస్తోంది. ‘తొలిప్రేమ’,‘మజ్ను’ వంటి వైవిధ్యమైన ప్రేమ కథాచిత్రాలను ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ‘నేను అర్జున్. నాకొక గర్ల్ ఫ్రెండ్‌ని ప్రసాదించమని దేవుణ్ని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకండ్కే ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసింది.. నా జీవితాన్ని’ అంటూ నితిన్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ‘మీకు చేసిన దానికి వాడిపై కోపం రావడం లేదా’ అని కీర్తిని ప్రశ్నిస్తాడు. దీనికి కీర్తి ‘చంపేస్తే ఒక్కసారే పోతాడు.. అందుకే పెళ్లి చేసుకున్నా’ అంటూ చెప్పె డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. మొత్తానికి ఈ టైలర్ చూస్తుంటే మూవీలో నితిన్, కీర్తి సురేశ్‌లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటారని అర్థం అవుతోంది. ఇక నితిన్ కీర్తికి భయపడుతూ చెప్పె కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. -
సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడొద్దు
‘‘ఒకే ఆల్బమ్‌లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం అరుదు. దేవిశ్రీ ప్రసాద్ తన ఆల్బమ్‌లోని పాటలన్నీ డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ‘రంగ్ దే’ ఆల్బమ్ అలాంటిదే’’ అని పాటల రచయిత శ్రీమణి అన్నారు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలు రాసిన శ్రీమణి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘100% లవ్’ సినిమాతో దేవిశ్రీతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఏప్రిల్‌తో మా ప్రయాణానికి పదేళ్లు పూర్తవుతాయి. ‘తొలిప్రేమ’ చిత్రం నుంచే వెంకీ అట్లూరితో కలిసి పనిచేస్తున్నాను. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్‌కే మేం లిరిక్స్ రాస్తుంటాం. ఒక్కోసారి కాన్సెప్ట్‌కు తగ్గ లిరిక్స్ రాసుకొని, ఆ తర్వాత ట్యూన్స్ కట్టడం జరుగుతుంది. ప్రతి పాటనూ ఓ ఛాలెంజ్‌గానే తీసుకుంటాను. నేను రాసే పాటని మొదట నా భార్యకు లేదంటే నా ఫ్రెండ్ మురళికి, రైటర్ తోట శ్రీనివాస్‌కు వినిపిస్తుంటాను. ఫిలాసఫికల్ సాంగ్స్‌ని మాత్రం సీతారామశాస్త్రిగారికి వినిపించి, సలహాలు తీసుకుంటుంటాను. ‘జులాయి’ నుంచే సితార ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలకు పాటలు రాస్తున్నాను. సినిమా విడుదలకు ముందే పాటలు హిట్టయితే, సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడకూడదు. లవ్ స్టోరీకి పాటలు పాపులర్ అయితే కమర్షియల్‌గా అది సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
హీరో ఊరించాడు.. కంట్రోల్ చేసుకోలేకపోయిన నటి
మనముందు ఎన్నో టేస్టీ వెరైటీలు ఊరిస్తున్నా డైట్ పేరుతో నోరు కట్టేసుకుంటాం. అయితే మన కళ్లముందే కావాలని మనల్ని ఊరిస్తూ తింటే అస్సలు ఆగలేం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే నటి కీర్తి సురేష్‌కు సైతం ఎదురైంది. పాపం డైట్లో ఉన్న కీర్తి..తన మానాన ఫ్రూట్స్ తింటుండగా, హీరో నితిన్ మాత్రం పిజ్జాతో ఊరిస్తుంటాడు. మొదట నో పిజ్జా అని భీష్మించుకున్నా...కాసేపటికే నోట్లో నీళ్లు ఊరిపోయాయి. దీంతో డైట్‌ని పక్కన పెట్టేసి చీటింగ్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోగా, ఇది నెటిజన్లను ఆకట్టుకుంటుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) ప్రస్తుతం నితిన్- కీర్తి సురేష్ జంటగా ‘రంగ్‌దే’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవలె విడుదలైన ‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. చదవండి : (రంగ్‌దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!) ('ఆ నటుడితో డేటింగ్లో ఉన్నా.. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో') -
రంగ్‌దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న మూవీ ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘రంగ్‌దే’ను విదేశీ హక్కుల కింద ఫార్స్ ఫిల్మ్స్ 1.5 కోట్ల రూపాయలకు స్వాధీనం చేసుకోగా.. ప్రీ రిలీజ్ వ్యాపారం మొత్తం రూ. 37.5 కోట్లుగా ఉన్నట్లు తాజాగా బిజినెస్ రిపోర్టు విడుదలైంది. కాగా గతంలో నితిన్-రష్మిక మండన్నా జంటగా వచ్చిన ‘భీష్మ’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్లో వచ్చిన ‘చెక్’ మూవీ ఇటీవల విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బొల్తా పడింది. దీంతో నితిన్ ‘రంగ్‌దే’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మరోసారి హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా నితిన్‌కు ఇది హిట్‌ను ఇస్తుందా లేదా అనేది మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసిందిగా... అక్కినేని అభిమానులకు ఆర్జీవీ సర్ప్రైజ్ నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్ -
‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసిందిగా...
సాక్షి, హైదరాబాద్: నితిన్ లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ ప్రమోషన్లో భాగంగా ప్రిన్స్ మహేహ్‌బాబు అందమైన మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు.‘‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట లిరికల్ వీడియోను అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సింగర్ సిధ్ శ్రీరాంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాక్ స్టార్, అమేజింగ్ అంటూ ఇద్దరినీ పొగడ్తల్లో ముంచెత్తారు సూపర్ స్టార్. అటు డీఎస్పీ, సిద్ శ్రీరాం డెడ్లీ కాంబినేషన్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చస్తున్నారు.విడుదలైన కొన్ని క్షణాల్లోనే లక్షకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుండటం విశేషం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్‌దే' మూవీలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు చెక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ ఈ సినిమా కూడా బంపర్‌హిట్ అనే అంచనాలతో ఉన్నారు. -
బస్టాండే.. బస్టాండే...
బస్టాండే... బస్టాండే.. సింపుల్గుండే లైఫు.. టెంపుల్ రన్‌లా మారే.. ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే లవ్లీగుండే కళలే.. లైఫే లేనిదాయే స్మైలీ లాంటి ఫేసే.... స్మైలే లేనిదాయే’ హీరోయిన్‌కి తాళి కట్టే ముందు హీరో పాడే పాట ఇది. ఈ బాధ ఎందుకు? అనేది ‘రంగ్ దే’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నితిన్, కీర్తీ సురేష్ హీరో హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ఇది. పీడీవీ ప్రసాద్ సమర్పకులు. నితిన్, కీర్తిపై చిత్రీకరించిన ఈ చిత్రంలోని రెండో పాట ‘సింపుల్గుండే లైఫు..’ని శనివారం విడుదల చేశారు. ‘‘ఫస్ట్ పాటకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. రెండో పాట కూడా వీనులవిందుగా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుంటాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
మార్చిలో రంగ్‌దే
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్‌దే’. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 26 ‘రంగ్‌దే’ థియేటర్లలో విడుదలకానుందని వీడియో ద్వారా విడుదల చేశారు. నితిన్, కీర్తీల డ్యాన్స్‌తో ఈ వీడియో ఉంది. ‘‘కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమకథే ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు నాగవంశి. నరేశ్, వినీత్, రోహిణి,‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.సి శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
‘రంగ్ దే’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి సరికొత్త అప్డేట్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రంగ్ దే చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలతో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దర్శకుడు వెంకీ అట్లూరి ట్విటర్లో షేర్ చేశారు. చదవండి: నితిన్ 30వ సినిమా షూటింగ్ షురూ Love, Romance & Lot's of Entertainment coming to theatres near you from 26th March. 💖 #RangDeOn26thMarch ▶️ https://t.co/TvzL1VV9r3#RangDe @actor_nithiin @KeerthyOfficial @pcsreeram @thisisdsp @vamsi84 @sitharaents @adityamusic @SVR4446 @ShreeLyricist @navinnooli pic.twitter.com/B961KC8FBx — Atluri Venky (@dirvenky_atluri) January 1, 2021 ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పాటలు, సన్నివేశాలు అన్ని కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నరేష్, వినీత్, రోహిణి, వెన్నెల కిషోర్, గాయత్రి రఘురామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ మ్యాజికల్ మెలోడీ సాంగ్‌ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. `ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది…` అంటూ సాగే పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం అందించారు. హరిప్రియ, కపిలన్ లు ఆలపించారు. హీరో నితిన్, కీర్తి సురేష్‌లపై రొమాంటిక్ మెలోడీగా వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా ఈ పాటని దర్శకుడు వెంకీ అట్లూరి చిత్రీకరించారు. -
భాష లేని ఊసులాట!
‘‘ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసులాట సాగుతున్నది.. అందుకే ఈ మౌనమే ఓ భాష అయినది.. కోరుకోని కోరికేదో తీరుతున్నది...’’ అంటూ ప్రేయసికి తన ప్రేమను తెలియజేస్తున్నారు నితిన్. ఈ ప్రేమ పాట ‘రంగ్ దే’ చిత్రం కోసమే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘ఏమిటో ఇది వివరించలేనిది..’ అంటూ సాగే ఈ చిత్రంలోని తొలి పాట వీడియోను విడుదల చేశారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ కపిలన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. ‘‘ఈ రొమాంటిక్ మెలోడీని వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు వెంకీ అట్లూరి. ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. దుబాయ్‌లో పాటల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ.ప్రసాద్, కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్). -
ఏమిటో ఇది వివరించలేనిది.. మాయ చేసిన దేవిశ్రీ
యంగ్ హీరో నితిన్, ‘మహానటి’ కిర్తి సురేష్ జంటగానటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ వెడ్డింగ్ సందర్భంగా ‘రంగ్ దే` నుంచి విడుదల చేసిన చిన్న వీడియోకి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా తొలి పాటను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. `ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసూలాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష ఐనది’ అంటూ సాగే ఈ మెలోడీ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. హరిప్రియ, కపిల్ కపిలన్ ఆలపించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చాలా నెమ్మదిగా సాగే ఈ మెలోడీ సాంగ్‌ని వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా చిత్రీకరించనట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో డీఎస్పీ నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. (చదండి : ఫ్రెండ్స్‌తో స్టెప్పులేసిన స్టార్ హీరో కూతురు) -
పూర్తి చేశాం
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే కోవిడ్ బ్రేక్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించారు. ఆ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశాం అని తెలిపారు నితిన్. ‘‘రంగ్ దే’ తాజా షెడ్యూల్‌ను అన్ని జాగ్రత్తలతో సురక్షితంగా పూర్తి చేశాం’’ అని చిత్రబృందంతో దిగిన సెల్ఫీని ట్విట్టర్లో షేర్ చేశారు నితిన్. నెక్ట్స్ పాటల చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లనున్నారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. -
ఛలో ఇటలీ
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ సినిమాలో కొన్ని పాటలు, కీలక సన్నివేశాలను ఫారిన్లో చిత్రీకరించాలనుకున్నారు. కరోనా వల్ల ఆ షెడ్యూల్‌ను ఇండియాలో చేయాలనుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు ఫారిన్లోనే చిత్రీకరణ జరపడానికి చిత్రబృందం రెడీ అయింది. ఇటలీలో మూడువారాల పాటు పాటల్ని, సన్నివేశాలను షూట్ చేయనున్నారు. త్వరలోనే ‘రంగ్ దే’ టీమ్ ఇటలీ ప్రయాణించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
అన్ని జాగ్రత్తలతో...
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ మధ్యే హీరో నితిన్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అలాగే లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. బుధవారం మళ్లీ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ప్రభుత్వం విధించిన జాగ్రత్తలు పాటిస్తూ, ఈ షూటింగ్‌ను జరుపుతున్నారు. కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ తో ఈ సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు నిర్మాతలు. నరేశ్, వినీత్, రోహిణి, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
స్కిప్పింగ్‌తో ఔరా అనిపించిన నితిన్
ఇటీవలే ఓ ఇండివాడైన యంగ్ హీరో నితిన్ మళ్లీ సినిమా షూటింగులకు సమాయాత్తం అవుతున్నాడు. దానిలో భాగంగా ముందుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. తన ఫిట్నెస్ ట్రైనర్ వంశీ సమక్షంలో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను అతను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. కేవలం మూడున్నర నిమిషాల్లో 500 జంప్ రోప్స్ చేసి నితిన్ ఔరా అనిపించాడు. స్కిప్పింగ్ వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుందని నితిన్ ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు. వ్యాయామం, పౌష్టికాహారం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న చిత్రం రంగ్ దే. కీర్తిసురేశ్ హీరోయిన్. దీంతోపాటు మేర్లపాక గాంధీ దర్శకత్వం ఒక సినిమా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ‘రంగ్ దే’ హీరో వర్కవుట్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (చదవండి: బాలీవుడ్ భీష్మ) View this post on Instagram 500 jumpropes at a strech in 3.25 min Back to grind 💪 with @vamshicoach_boxfitt11 Getting better at lung capacity and immunity with proper fitness and nutrition #boxfitt11 #jumprope A post shared by N I T H I I N (@actor_nithiin) on Aug 25, 2020 at 5:56am PDT -
యంగ్ పొంగల్
పండగంటే ఎవరింటికి వాళ్లు చేరుకోవాలి. థియేటర్లోకి సినిమా రావాలి. కుటుంబమంతా కలసి ఆ సినిమాకు వెళ్లాలి. సినిమాకు సంక్రాంతి ముఖ్యం. సంక్రాంతికి సినిమా ముఖ్యం. సంక్రాంతి బరిలో దిగడానికి భారీ సినిమాలు పోటీపడుతుంటాయి. స్టార్ హీరోలు ఇద్దరు ముగ్గురు పండగ పోటికీ సిద్ధమైతే, యంగ్ హీరోలకు ఛాన్స్ మిస్. కానీ వచ్చే సంక్రాంతి పూర్తిగా యంగ్ కాబోతోంది. ఈ పొంగల్ (సంక్రాంతి)కి వినోదం వడ్డించడానికి యంగ్ హీరోలు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. రంగ్ దే 25 సినిమాలు చేసిన నితిన్‌కు ఇప్పటివరకు ఒక్క సంక్రాంతి రిలీజ్ లేకపోవడం విశేషం. ‘రంగ్ దే’తో తొలిసారి పొంగల్‌కి తన సినిమాను విడుదల చేయబోతున్నారు నితిన్. అలాగే పెళ్లి తర్వాత నితిన్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శర్వాతో శ్రీకారం శర్వానంద్‌కి సంక్రాంతి కలిసొస్తుంది. గతంలో ‘ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి’ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. శర్వానంద్ కెరీర్లో మంచి హిట్స్‌గా ఈ సినిమాలు నిలబడ్డాయి. ఇప్పుడు ‘శ్రీకారం’తో మరోసారి సంక్రాంతికి థియేటర్స్‌లోకి రాబోతున్నారు. కొత్త దర్శకుడు కిశోర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో శర్వానంద్ రైతుగా కనిపించనున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిక. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కావాల్సింది. కరోనా వల్ల సంక్రాంతికి వాయిదా వేశారని సమాచారం. బ్యాచిలర్ వస్తున్నాడు అఖిల్‌కి ఇది తొలి సంక్రాంతి. హీరోగా అఖిల్ థియేటర్లో సందడి చేయబోతున్న తొలి సంక్రాంతి. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా సమ్మర్లో విడుదల కావాల్సింది. కరోనా వల్ల పొంగల్‌కి పోస్ట్‌పోన్ అయింది. ఇందులో అఖిల్ పాత్ర పేరు నాగార్జున అని టాక్. ఇదో రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని సమాచారం. కరోనాతో సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. షూటింగులు ఆగిపోయాయి. సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. సినిమా సందడి లేకపోవడం సినీ ప్రేమికులకు పెద్ద లోటు. త్వరలో థియేటర్లు ఆరంభం అయి, సందడి మొదలవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
‘నాన్నా నవ్వుతోంది.. నేను కట్టలేను’
హీరో నితిన్ మరి కొద్ది గంటల్లో తన ప్రేయసి షాలిని కందుకూరి మెడలో మూడు మూళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నితిన్ తాజా చిత్రం రంగ్‌దే టీమ్ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర బృందం.. ఆదివారం సాయంత్రం రంగ్‌దే టీజర్‌ను విడుదల చేసింది. నితిన్‌కు వివాహ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ టీజర్‌పై స్పందించిన.. ఈరోజు మరింత స్పెషల్‌గా చేసినందుకు రంగ్‌దే టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.(మెహందీలో మెరిసిన షాలిని-నితిన్) ఈ టీజర్లో నితిన్ తన తండ్రి నిర్ణయం మేరకు కీర్తి సురేష్‌ను పెళ్లి చేసుకున్నట్టు, పెళ్లి తర్వాత ఇంటి పనులు చేయడంతో బిజీ అయినట్టు చూపించారు. ఇందులో ‘అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు’, ‘చేయి తీయ్ జస్టిస్ చౌదరి’, ‘నాన్న నవ్వుతుంది.. నేను కట్టలేను’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. (పెళ్లి సందడి షురూ) మరోవైపు నితిన్-షాలిని పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు వీరిద్దరు వివాహ బంధంతో ఒకటి కానున్నారు. నగరంలోని తాజ్ ఫలక్‌నుమాలో ఈ వేడుక జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాలతో పాటుగా, అతికొద్ది మంది సన్నితులు, అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. -
నితిన్ పెళ్లి: ఫ్యాన్స్‌కు 'రంగ్‌దే' గిఫ్ట్
కొత్త పెళ్లికొడుకు నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం "రంగ్‌దే". 'మహానటి' కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా నితిన్ ఐదు రోజుల పెళ్లిలో ఇప్పటికే నిశ్చితార్థం, మెహందీ కార్యక్రమం జరిగాయి. నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వేద మంత్రాల సాక్షిగా షాలిని మెడలో ఆయన మూడు ముళ్లు వేయనున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు 'రంగ్‌దే' టీమ్ గుర్తుండిపోయే బహుమతిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. (పెళ్లి సందడి షురూ) "నితిన్ అభిమానులకు, సినీ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నేడు సాయంత్రం 4.05 నిమిషాలకు పెళ్లి గిఫ్ట్‌ను రివీల్ చేయనున్నాం" అని ప్రకటించారు. దీంతో పండగ చేసుకుంటున్న నితిన్ అభిమానులు సాయంత్రం ఎప్పుడవుతుందా అని క్షణానికొకసారి గడియారం వంక చూస్తున్నారు. మరోవైపు ఈ గిఫ్ట్ ఏమయ్యుంటుందా అని కొందరు లెక్కలు వేస్తుంటే, పక్కాగా ట్రైలర్ అయ్యుంటుందని ఆయన అభిమాన గణం అంచనా వేస్తోంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అర్జున్.. అను వచ్చేశారు
‘భీష్మ’ వంటి హిట్ చిత్రం తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రంగ్ దే’. కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్ పాత్రలో నితిన్, అను పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ పాత్రలను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కెమెరా: పి.సి. శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). పుట్టినరోజు వేడుకల్లేవ్.. పెళ్లి వాయిదా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నేడు తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం లేదని, ఏప్రిల్ 16న దుబాయ్‌లో జరగాల్సిన పెళ్లిని కూడా వాయిదా వేశానని నితిన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులున్నాయో మీకు తెలుసు. లాక్డౌన్ కొనసాగుతుండటంతో నేడు నా పుట్టినరోజుని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడా కూడా నా జన్మదిన వేడుకలు జరపవద్దు. నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో మనం ఇళ్లల్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు’’ అన్నారు. ∙కీర్తీ సురేశ్, నితిన్ -
అను, అర్జున్‌ల పరిచయం అదిరింది
యంగ్ హీరో నితిన్, ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్ దే!’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంది. అయితే కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షెడ్యూల్ వాయిదా పడింది. అయితే రేపు(మార్చి 30) హీరో నితిన్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు చిత్ర బృందం చిన్న ట్రీట్ ఇచ్చింది. నితిన్ బర్త్‌డే కానుకగా ‘రంగ్ దే’ చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమాలోని ప్రధాన పాత్రలైన అను, అర్జున్‌లను పరిచయం చేస్తూ ముస్తాబుచేసిన మోషన్ పోస్టర్ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్లో ఉంది. దీంతో ప్రస్తుతం ‘రంగ్ దే’మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య,గాయత్రి రఘురామ్,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, మాస్టర్ రోనిత్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: కరోనా ఎఫెక్ట్: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్ తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం -
ప్రేమతో రంగ్ దే
నితిన్ హీరోగా, ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేశ్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ‘తొలిప్రేమ, మజ్ను’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త పరుచూరి మహేంద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ‘రంగ్ దే’ స్క్రిప్ట్‌ను నిర్మాతలు ‘దిల్’ రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరికి అందించారు. ‘‘ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. సుప్రసిద్ధ కెమెరామేన్ పి.సి.శ్రీరామ్‌గారు మా సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ’’ అని వెంకీ అట్లూరి అన్నారు. ‘‘మా సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచే మొదలుపెట్టాం. 2020 వేసవికి ఈ చిత్రం విడుదలవుతుంది’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. నిర్మాతలు కిరణ్, సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిషోర్, ‘సత్యం’ రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్). -
నితిన్ 'రంగ్ దే' చిత్రం ప్రారంభం
-
నితిన్.. కీర్తి.. రంగ్ దే
దాదాపు ఏడాది పాటు కెమెరాకు దూరంగా ఉన్నారు నితిన్. ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత స్క్రీన్‌పై కనిపించలేదు. ఇప్పుడు వరుస సినిమాలు అనౌన్స్ చేసి తీసుకున్న విరామాన్ని వడ్డీతో సహా తీర్చేస్తున్నారు. ఆల్రెడీ ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుములతో ‘భీష్మ’ సినిమా మొదలుపెట్టారు. మొన్నే చంద్రశేఖర్ యేలేటి సినిమాకు ముహూర్తం పెట్టారు. తాజాగా వెంకీ అట్లూరితో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘రంగ్ దే!’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కీర్తీ సురేశ్ కథానాయిక. నితిన్, కీర్తీ కలసి యాక్ట్ చేయడం ఇది తొలిసారి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ కెమెరామేన్. 2020 సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. -
జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న నితిన్
ఓ వైపు భీష్మ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.. నిన్ననే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశాడు.. నేడు మరో చిత్రాన్ని అనౌన్స్ చేసేశాడు హీరో నితిన్. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం కీర్తి సురేష్‌తో జోడి కట్టనున్నాడు. తాజాగా ఈ కొత్త చిత్ర విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించగా.. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో మరో సినిమాను ఆదివారం ప్రారంభించాడు నితిన్. తాజాగా వెంకీ అట్లూరితో కలిసి చేయబోయే కొత్త సినిమా కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుందని, ఈ సినిమాకు రంగ్‌దే అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిపాడు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ నిర్మించగా.. సినిమాటోగ్రఫర్‌గా పీసీ శ్రీరామ్ పనిచేయనున్నారు. #Nithiin29 is titled as RANG DE! Working with the Young n talented dir Venky atluri, costarring @KeerthyOfficial n produced by @vamsi84 @SitharaEnts AND cinematography by my ALL TIME FAV D.o.P @pcsreeram sir 😍😍😍😍😍😍😍 #RangDe #gimmesomelove pic.twitter.com/NeaO2rllRB — nithiin (@actor_nithiin) June 24, 2019