real estate bill
-
ఒవైసీ వ్యాఖ్యలపై దాడి
న్యూఢిల్లీ: తన గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతా కీ జై అని అనబోనని ఎంఐఎంనేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం రేగింది. ‘భారత్ నా మాతృభూమి. భారత్ మాతా కీ జై అని ఎన్నిసార్లయినా పలకడానికి ఇష్టపడతాను. అయితే కొంతమందికి ఇది పలకడం కూడా అభ్యంతరంగా ఉంది’ అంటూ మంత్రి వెంకయ్యపరోక్షంగా ఒవైసీపై మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ బిల్లుపై చర్చకు బదులిస్తూ ఆయన మాట్లాడారు. రాజ్యసభలో ఎంపీ జావెద్ అక్తర్ మాట్లాడుతూ, ‘నాకు రాజ్యాంగం చెప్పలేదు కాబట్టి భారత్ మాతా కీ జై అనను అని ఒక నాయకుడు అన్నారు. ఆయన జాతీయ నేత కాదు. హైదరాబాద్‌లోని ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు. మరి షేర్వానీ, టోపీ ధరించాలని రాజ్యాంగం చెప్పలేదు కదా ఎందుకు ధరిస్తున్నారు’ అని మండిపడ్డారు. భారత్ మాతా కీ జై అని పలకడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్‌కు వెళ్లాలని శివసేన నేత రామ్‌దాస్ కదం అన్నారు. -
‘రియల్’ బిల్లుకు ఆమోదం
రాజ్యసభలో గట్టెక్కిన బిల్లు ♦ పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యం ♦ మోసానికి పాల్పడితే జైలు శిక్ష ♦ ట్రిబ్యునళ్ల ద్వారా 60 రోజుల్లో ఫిర్యాదుల పరిష్కారం న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రియల్ ఎస్టేట్ బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు, 2015’ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సభలో ప్రవేశపెట్టారు. విపక్ష కాంగ్రెస్ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందింది. స్థిరాస్తిరంగ నియంత్రణ, పారదర్శకత, జవాబుదారీతనానికి ఉద్దేశించిన ఈ బిల్లులో వినియోగదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేసినట్లు వెంకయ్య తెలిపారు. బిల్లుపై ఆయన తెలిపిన మరిన్ని వివరాలు.. ♦ వినియోగదారుల డబ్బులో 70% చెక్కుల ద్వారా ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి కాబట్టి రియల్రంగంలోకి నల్లధనాన్ని ఈ బిల్లు నిరోధిస్తుంది. ♦ అన్ని అనుమతుల కోసం సింగిల్ విండో విధానం ఉంటుంది. ♦ రాష్ట్రాల స్థాయిలో నియంత్రణ సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. తద్వారా గృహ, వాణిజ్య రంగ ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడొచ్చు. ♦ డెవలపర్లు తమ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలను నియంత్రణ సంస్థలకు అందించాలి. ప్రమోటర్ల వివరాలు, భూ వివరాలు, ప్రాజెక్ట్ లేఔట్, అనుమతులు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, ఏజెంట్ల వివరాలు.. అందులో ఉండాలి. ♦ అప్పీలేట్ ట్రిబ్యునళ్లు ఫిర్యాదు అందిన 60 రోజుల్లోగా కేసులను పరిష్కరించాలి. ♦ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రమోటర్లకు మూడేళ్లు, ‘రియల్’ఏజెంట్లు, కొనుగోలుదార్లకు ఏడాది జైలు శిక్ష ఉంటుంది. ♦ ఈ బిల్లు ఎవరినీ ఇబ్బందిపెట్టేందుకు ఉద్దేశించినది కాదు. బిల్డర్లపై వేధింపులు ఉండవు. ‘రియల్’ రంగాన్ని నియంత్రించేం దుకే దీన్ని రూపొందించాం. కొనుగోలుదారులను మోసంచేయడం నేరం. హెచ్చరికలు, జరిమానాల తరువాతే.. జైలుశిక్ష ఉంటుంది. ♦ పెట్టుబడిదారుల విశ్వాసం పొందడం ద్వారా ప్రభుత్వ పథకమైన ‘అందరికీ గృహ వసతి’ని విజయవంతం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ♦ వ్యవసాయ రంగం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది స్థిరాస్తి రంగమే. బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ.. అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఈ బిల్లు పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ సభ్యురాలు కుమారి షెల్జా కోరారు. ఈ బిల్లు ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి వినియోగదారుడికి ప్రయోజనం లభిస్తుందని బిల్లు ను అధ్యయనం చేసిన స్థాయీసంఘానికి నేతృత్వం వహించిన అనిల్ మాధవ్ దవే(బీజేపీ) తెలిపారు. సామాజిక పథకాలకు కోత: కాంగ్రెస్ కేంద్ర బడ్జెట్లో సామాజిక పథకాలకు నిధులు తగ్గించారని, ఆహార, ఎరువుల రాయితీలకు కోతపెట్టారంటూ సర్కారుపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించి దేశంలో ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న మోదీ హామీ ఎప్పుడు నెరవేరుతుందంటూ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని తప్పుబట్టారు. 2011 నుంచి 2016 వరకు.. జూలై 2011: రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణకు ఒక కేంద్ర చట్టం అవసరమని న్యాయశాఖ ప్రతిపాదన. 2013: జూన్‌లో రియల్ ఎస్టేట్ బిల్లు, 2013కు నాటి కేంద్ర కేబినెట్ ఆమోదం, ఆగస్ట్‌లో రాజ్యసభలో బిల్లు, సెప్టెంబర్‌లో స్థాయీ సంఘానికి నివేదన. 2015: ఫిబ్రవరిలో రాజ్యసభ, లోక్‌సభల్లో స్థాయీసంఘం నివేదిక, ఏప్రిల్‌లో స్థాయీసంఘం సిఫారసుల ఆధారంగా రూపొందించిన అధికారిక సవరణలకు కేబినెట్ ఆమోదం. మేలో రాజ్యసభ స్థాయీసంఘం ముందుకు ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2013’, అధికారిక సవరణలు. జూలైలో ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2015’తో పాటు తన నివేదికను సభకు సమర్పించిన స్థాయీసంఘం. డిసెంబర్లో ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2015’కు కేబినెట్ ఆమోదం. రాజ్యసభలో బిల్లు. 2016: మార్చి 10న రాజ్యసభ ఆమోదం. -
పార్లమెంటు సమాచారం...
శత్రువుల ఆస్తుల బిల్లుకు ఓకే: దేశ శత్రువుల (పాక్, చైనా జాతీయుల పేరిట ఉన్న) ఆస్తులను కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో కొనసాగించేందుకు ఉద్దేశించిన శత్రువుల ఆస్తి చట్ట సవరణ బిల్లు-2016ను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఫిర్యాదులకు ఆధార్ స్వచ్ఛందం: ప్రభుత్వ సంబంధ విషయాలపై ఆన్లైన్లో చేసే ఫిర్యాదులకు ఆధార్ నంబర్‌ను కచ్చితంగా కాకుండా స్వచ్ఛందంగా తెలిపే విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఏ ప్రభుత్వ విభాగంపైనైనా www.pgportal.gov.inకు ఫిర్యాదు చేయొచ్చు. చిన్న సంస్థలకూ ఈపీఎఫ్: 10 మంది కంటే ఎక్కువగా ఉన్న చిన్న ప్రైవేట్ సంస్థలనూ ఉద్యోగ భవిష్యనిధి(ఈపీఎఫ్) పరిధిలోకి తేవాలని భావిస్తున్నట్లు కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఎంపీలాడ్స్ నిధుల పెంపు యోచన: ఎంపీల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకుఇచ్చే ఎంపీలాడ్స్ నిధులను పెంచే ప్రతిపాదన ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని ప్రభుత్వం లోక్‌సభకు చెప్పింది. నేడు ఇషత్ ్రకేసుపై చర్చ: ఇష్రాత్జహాన్ ఎన్కౌంటర్ కేసు అఫిడవిట్ల వివాదంపై గురువారం లోక్‌సభ చర్చించే అవకాశముంది. సావధాన తీర్మానంపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బదులిస్తారు. నేడే రియల్ ఎస్టేట్ బిల్లు: రియల్ ఎస్టేట్ బిల్లును గురువారం రాజ్యసభ ఎజెండాలో చేర్చారు. నోటీసులిస్తున్నా బిల్లు ఎజెండాలోకి ఎందుకు రావడం లేదని మంత్రి వెంకయ్య ప్రశ్నించగా, గురువారం చర్చకు అనుమతిస్తామని డిప్యూటీ చైర్మన్ కురియన్చెప్పారు. -
రియల్ ఎస్టేట్ బిల్లును గట్టెక్కిస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లోనే రియల్ ఎస్టేట్ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య వ్యక్తం చేశారు. ఈ బిల్లును పార్లమెంటరీ స్ధాయీ సంఘం, సెలెక్ట్ కమిటీలు పరిశీలించి నివేదిక లు అందజేశాయని విలేకరులతో చెప్పారు. జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా కేంద్ర సాయాన్ని అందుకోవడంలో రాష్ట్రాల జాప్యంపై ఆవేదనచెందారు. ప్రణాళిక, వాటి అమలు సామర్థ్యాలను రాష్ట్రాలు పెంపొందించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అటల్ మిషన్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ కింద కేంద్రం హామీ ఇచ్చిన విధంగా నిధులను అందిస్తామని, రాష్ట్రాలు కేంద్రం అందించిన నిధులను త్వరగా ఖర్చుచేసి, మరిన్ని నిధుల కోసం కోరాలని సూచించారు. -
ఆ బిల్లు ‘రియాలిటీ’ ఏమిటి?
- స్థిరాస్తి బిల్లుపై రాహుల్ ఆందోళన.. కేవలం రాజకీయమేనా? - యూపీఏ తెచ్చిన బిల్లుకు ఎన్డీఏ సర్కారు సవరణలు సరైనవేనా? న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు తీసుకువచ్చిన స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) బిల్లు కొనుగోలుదారుడి కన్నా నిర్మాణదారుడికే (బిల్డర్‌కే) ప్రయోజనం కలిగిస్తుందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. మధ్య తరగతి పట్టణ గృహ కొనుగోలుదారు కష్టాలకు సంబంధించిన అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచుకున్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో పారదర్శకత నిబంధనలను తొలగించిందని.. మధ్యతరగతి ప్రజలు దోపిడీకి గురయ్యేందుకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ నెల 5వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించగా.. బిల్లును రాజ్యసభ ఎంపిక కమిటీ పరిశీలనకు పంపించాలని విపక్షాలు పట్టుపట్టటం.. ప్రభుత్వం అందుకు అంగీకరించి ఆ కమిటీకి పంపించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థిరాస్తి బిల్లులోని అంశాలు, బీజేపీ చేసిన సవరణలు, వాటిపై ఆందోళనలు, రాజకీయాల వివరాలివీ... బిల్లు ఏమిటి..? ఏం చేస్తుంది..? ప్రతి రాష్ట్రంలో నియంత్రణ సంస్థలను నెలకొల్పటం ద్వారా స్థిరాస్తి ప్రాజెక్టులను పర్యవేక్షించటం లక్ష్యంగా స్థిరాస్తి (నియంత్రణ, అభివృద్ధి) బిల్లును యూపీఏ ప్రభుత్వం 2013 ఆగస్టు 14న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బిల్డర్లు వినియోగదారులతో లావాదేవీలు జరిపేటపుడు నిర్దిష్ట ప్రమాణీకృత నిబంధనలను పాటించేలా చూడటం ఈ సంస్థల లక్ష్యం. తొలి బిల్లు లోని కొన్ని ముఖ్య నిబంధనలివీ... - స్థిరాస్తి ప్రాజెక్టులను నియంత్రణ సంస్థ వద్ద రిజిస్టరు చేయాలి. లేదంటే బిల్డర్లు స్థిరాస్తులను విక్రయించజాలరు. - బిల్డర్లు ప్రాజెక్టు లేఔట్ ప్రణాళిక, షెడ్యూలు, విస్తీర్ణం వివరాలను నియంత్రణ సంస్థకు వెల్లడించాలి. - కొనుగోలుదార్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత శాతాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఉంచి.. దానిని కేవలం నిర్మాణానికి మాత్రమే వినియోగించాలి. యూపీఏ ప్రభుత్వం దీనిని 70 శాతంగా నిర్ణయించింది. ఇది.. బిల్డర్లు ఒక ప్రాజెక్టు పేరుతో డబ్బు తీసుకుని, ఆ మొత్తాన్ని వేరొక ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టటాన్ని నిరోధిస్తుంది. రాష్ట్రాలు కావాలనుకుంటే దీనిని తగ్గించుకోవచ్చని పేర్కొంది. ఈ బిల్లు ఎందుకు అవసరమైంది..? జనం తమ డబ్బును పెట్టుబడులుగా పెడుతున్న ప్రధాన రంగం స్థిరాస్తి రంగం. నిజానికి దేశంలో నల్లధనం వినియోగించటానికి ఈ రంగం తేలికైనది, అతి పెద్దది కూడా. అయినా స్థిరాస్తి రంగంపై నియంత్రణ లేదు. అధిక విలువ గల ఆస్తుల కన్నా.. అతి చిన్న పెట్టుబడి రంగాలైన కంపెనీల్లో షేర్లు, బీమా వంటి రంగాలపై ప్రభుత్వ నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. దేశంలో కోట్ల రూపాయల విలువ గల స్థిరాస్తిని కొనుగోలు చేయటం కన్నా.. బ్యాంకులో పొదుపు ఖాతా ప్రారంభించటానికి ఎక్కువ పత్రాలు, వివరాల నమోదు అవసరమవుతాయని నిపుణులు చెప్తున్నారు. స్థిరాస్తి కొనుగోలుకు నేరుగా డబ్బు చెల్లించేటపుడు పర్యవేక్షణా ఉండదు. నల్లధనం ఉన్నవారికి ఈ పెట్టుబడులు ప్రయోజనం. కానీ.. మధ్యతరగతి వేతన జీవిని.. నియంత్రణ లేని రంగంతో వ్యవహరించటం దెబ్బతీస్తోంది. ఎన్డీఏ చేసిన సవరణలు ఏమిటి? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం ఈ స్థిరాస్తి బిల్లుకు ఏకంగా 118 సవరణలు చేసింది. ఈ సవరణల్లో సమస్యాత్మకమైనవి... - ప్రబ్యాంకు ఖాతాలో ఉంచి, నిర్మాణ ఖర్చుకు మాత్రమే వినియోగించటానికి పక్కన పెట్టాల్సిన కొనుగోలుదారుడి సొమ్ము శాతాన్ని 70 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు. - తొలి బిల్లులో ‘కార్పెట్ ఏరియా’కు స్పష్టమైన నిర్వచనం ఉంది. బీజేపీ తెచ్చిన బిల్లులో ‘కార్పెట్ ఏరియా’ నిర్వచనాన్ని.. జాతీయ నిర్మాణ నియమావళి (నేషనల్ బిల్డింగ్ కోడ్)లో ఉపయోగించిన విధంగా ‘రెంటబుల్ ఏరియా’ నిర్వచనంగా చూపారు. ఈ నియమావళిని ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే సవరించవచ్చు. దీనివల్ల.. ఆ తర్వాత కొనుగోలుదారుడికి వ్యతిరేకంగా ఉండేలా త్వరగా మార్పులు చేయటానికి అవకాశం ఉంటుంది. - తొలి బిల్లులోని నిబంధనల ప్రకారం.. బిల్డరు ప్రాజెక్టు ప్రణాళికకు నియంత్రణ సంస్థ నుంచి అనుమతి పొందిన తర్వాత దానిని మార్చటానికి అవకాశం లేదు. కొత్త బిల్లు.. బిల్డరు ప్రాజెక్టు ప్లాన్‌కు ‘స్వల్ప మార్పులు’ చేసుకోవటానికి అవకాశం అందిస్తోంది. - ఆలస్యమైన ప్రాజెక్టులు.. ‘పూర్తయినట్లు ధృవీకరణ పత్రం, అనుమతులు’ తదితర కారణాల వల్ల ఆలస్యమైనట్లయితే శిక్ష నుంచి తప్పించుకునేందుకు కొత్త బిల్లు అవకాశమిస్తోంది.