శత్రువుల ఆస్తుల బిల్లుకు ఓకే: దేశ శత్రువుల (పాక్, చైనా జాతీయుల పేరిట ఉన్న) ఆస్తులను కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో కొనసాగించేందుకు ఉద్దేశించిన శత్రువుల ఆస్తి చట్ట సవరణ బిల్లు-2016ను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
ఫిర్యాదులకు ఆధార్ స్వచ్ఛందం: ప్రభుత్వ సంబంధ విషయాలపై ఆన్‌లైన్‌లో చేసే ఫిర్యాదులకు ఆధార్ నంబర్‌ను కచ్చితంగా కాకుండా స్వచ్ఛందంగా తెలిపే విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఏ ప్రభుత్వ విభాగంపైనైనా www.pgportal.gov.inకు ఫిర్యాదు చేయొచ్చు.
చిన్న సంస్థలకూ ఈపీఎఫ్: 10 మంది కంటే ఎక్కువగా ఉన్న చిన్న ప్రైవేట్ సంస్థలనూ ఉద్యోగ భవిష్యనిధి(ఈపీఎఫ్) పరిధిలోకి తేవాలని భావిస్తున్నట్లు కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.
ఎంపీలాడ్స్ నిధుల పెంపు యోచన: ఎంపీల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకుఇచ్చే ఎంపీలాడ్స్ నిధులను పెంచే ప్రతిపాదన ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని ప్రభుత్వం లోక్‌సభకు చెప్పింది.
నేడు ఇషత్ ్రకేసుపై చర్చ: ఇష్రాత్‌జహాన్ ఎన్‌కౌంటర్ కేసు అఫిడవిట్ల వివాదంపై గురువారం లోక్‌సభ చర్చించే అవకాశముంది. సావధాన తీర్మానంపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బదులిస్తారు.
నేడే రియల్ ఎస్టేట్ బిల్లు: రియల్ ఎస్టేట్ బిల్లును గురువారం రాజ్యసభ ఎజెండాలో చేర్చారు. నోటీసులిస్తున్నా బిల్లు ఎజెండాలోకి ఎందుకు రావడం లేదని మంత్రి వెంకయ్య ప్రశ్నించగా, గురువారం చర్చకు అనుమతిస్తామని డిప్యూటీ చైర్మన్ కురియన్‌చెప్పారు.
పార్లమెంటు సమాచారం...
Published Thu, Mar 10 2016 1:00 AM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM
Advertisement
Advertisement