న్యూఢిల్లీ: తన గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతా కీ జై అని అనబోనని ఎంఐఎంనేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం రేగింది. ‘భారత్ నా మాతృభూమి. భారత్ మాతా కీ జై అని ఎన్నిసార్లయినా పలకడానికి ఇష్టపడతాను. అయితే కొంతమందికి ఇది పలకడం కూడా అభ్యంతరంగా ఉంది’ అంటూ మంత్రి వెంకయ్యపరోక్షంగా ఒవైసీపై మండిపడ్డారు.
రియల్ ఎస్టేట్ బిల్లుపై చర్చకు బదులిస్తూ ఆయన మాట్లాడారు. రాజ్యసభలో ఎంపీ జావెద్ అక్తర్ మాట్లాడుతూ, ‘నాకు రాజ్యాంగం చెప్పలేదు కాబట్టి భారత్ మాతా కీ జై అనను అని ఒక నాయకుడు అన్నారు. ఆయన జాతీయ నేత కాదు. హైదరాబాద్‌లోని ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు. మరి షేర్వానీ, టోపీ ధరించాలని రాజ్యాంగం చెప్పలేదు కదా ఎందుకు ధరిస్తున్నారు’ అని మండిపడ్డారు. భారత్ మాతా కీ జై అని పలకడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్‌కు వెళ్లాలని శివసేన నేత రామ్‌దాస్ కదం అన్నారు.
ఒవైసీ వ్యాఖ్యలపై దాడి
Published Wed, Mar 16 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement
Advertisement