Sakshi Telugu News
-
‘సాక్షి’ కలిపింది ఈ ఇద్దరినీ...
రామచంద్రాపురం(పటాన్చెరు): తన చిన్న నాటి స్నేహితుడిని చూడాలని ఉందంటూ ఓ పోలీస్ అధికారి వెల్లడించిన మనోగతాన్ని గతేడాది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రచురించింది. ఆ కథనమే వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయి మిత్రుడి ఆచూకీ తెలిసేలా చేసింది. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆ ఇద్దరు మిత్రులు ప్రత్యక్షంగా కలుసుకుని చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్న నూకల వేణుగోపాల్‌రెడ్డి ఆగస్టు నెలలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’దిన పత్రికతో 39ఏళ్లుగా తన బాల్యమిత్రుడి కోసం చేస్తున్న అన్వేషణ గురించి వివరించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకున్న సమయంలో తన బాల్యమిత్రుడైన ఎం.ఆనంద్ గురించి తెలిపారు. అతడిని ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ఆ కథనం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైంది. ఆ కథనాన్ని స్నేహితులకు, ఇతర వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దానిని చూసిన ఆయన స్వగ్రామానికి చెందిన స్నేహితులు సైతం అన్వేషణ మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఎం.ఆనంద్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు గుర్తించి అతడిని చిరునామా తెలుసుకున్నారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి సంక్రాంతి పండుగ రోజున తన బాల్యమిత్రుడు ఆనంద్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘సాక్షి’లో వచ్చిన కథనం తన బాల్యమిత్రుడిని కలిసేలా చేసిందని, పత్రికతో పాటు అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత తన బాల్యమిత్రుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు -
Sakshi Whatsapp Channel: ఫాలో సాక్షి @ వాట్సాప్
వాట్సాప్ వాడుతున్నారు కదా.. ఓ అడుగు ముందుకేయండి. ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే మీకు నచ్చిన కంటెంట్‌ను, మీకు అనుకూలమైన సమయంలో, మీకు నచ్చినట్టుగా చూడొచ్చన్నమాట. దీనికోసం మీరు లోతుగా సెర్చ్ చేయాల్సిన పనే లేదు. మీ ఛాయిస్ .. వాట్సాప్ ఛానల్ వాట్సాప్ అంటే మెసెజ్‌లు, ఫోటోలు, వీడియోలే కాదు. గ్రూప్‌లు వచ్చినా.. చాలా లిమిటేషన్స్. కొత్తగా వచ్చిన ఫీచరే వాట్సాప్ ఛానెల్. దీని ద్వారా మీకు నచ్చిన మీడియాను ఎంచుకుని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాలో ఎలాగైతే ఎంపిక చేసుకుంటున్నామో.. అలాగే ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ కనిపించవు. సాక్షి వాట్సాప్ ఛానల్ ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం, సమకాలీన రాజకీయాలు, విశ్లేషణలు, పిక్టోగ్రాఫ్స్ వివరణలు, లేటేస్ట్ అప్డేట్స్ ఒకటేంటీ.. కావాల్సిన ముఖ్యమైన సమాచారన్నంతా.. వేగంగా మీ ముందుంచుతోంది సాక్షి. తెలుగు ప్రజలు కోరుకునే న్యూస్‌ను అత్యుత్తమ స్థాయిలో ఎంపిక చేసి సాక్షి వాట్సాప్ ఛానల్ మీకందిస్తోంది. ఫాలో అవ్వండిలా.. వాట్సప్‌లో మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి... Chats, Updates, Calls. వీటిలో Updates క్లిక్ చేయండి. స్టేటస్లు దాని దిగువన ఛానెల్స్ కనిపిస్తాయి. మీకు Find Channel ఫైండ్ ఛానెల్ ఆప్షన్ కనిపిస్తుంది. సెర్చ్ చేస్తే Sakshi Telugu News మీకు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ప్లస్ (+) సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఛానెల్‌ను ఫాలో కావొచ్చు. లేదా కింద కనిపిస్తోన్న QR కోడ్ స్కాన్ చేస్తే నేరుగా చేరొచ్చు. ప్రయోజనాలేంటీ? ఒక సారి ఫాలో అయితే అప్డేట్స్ వాటంతటే అవి కనిపిస్తాయి నోటిఫికేషన్స్ తరహాలో మిమ్మల్ని ఎక్కడా చికాకు పెట్టవు మీకు నచ్చిన సమయంలోనే లింకు క్లిక్ చేసి చూడొచ్చు లేటేస్ట్ అప్డేట్స్ క్షణాల్లో అందుకోవచ్చు వార్తలపై ఎమోజీ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు మీ వ్యక్తిగత సమాచారం ఎవరికీ కనిపించదు మీ ఫోటో, నెంబర్ కూడా కనిపించవు -
టాప్ 25 న్యూస్@4PM
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా సమీక్షలో పలు కీలక చర్యల్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ నిర్ణయాన్ని ఆమె అభినందించారు. మరోవైపు నిబంధనలకు విరుద్దంగా ఏపీ సరిహద్దు వద్దకు వస్తున్నవారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గురువారం చోటు చేసుకున్న మరిన్ని ఘటనలు తెలుసుకోవడం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
దేశంలో వేగంగా కరోనా వైరస్ మహమ్మారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నరు రఘు రామ్ రాజన్ స్పందించారు. ఈ సంక్షోభ సమయంలో ఆర్బీఐ పోషించాల్సిన పాత్రపై కొన్ని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మణిపూర్ రాష్ట్రంలో కరోనా తొలి కేసు నమోదైంది. దీంతో ఈశాన్య భారతానికి కూడా ఈ ప్రాణాంతక వైరస్ పాకినట్టైంది. మరోవైపు విశాఖపట్నం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఇక తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం చోటు చేసుకున్న వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇక, విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్లో ఉన్న వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. మరోవైపు, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో మీడియా ప్రతినిధులు, కెమెరా పర్సన్స్, సాంకేతిక నిపుణులు దేశానికి గొప్ప సేవ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇకపోతే, కరోనా దెబ్బకు నేడు స్టాక్‌మార్కెట్లు మరో బ్లాక్ మండేను చూడాల్సి వచ్చింది. సోమవారం చోటు చేసుకున్న మరిన్నివార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వైద్యులు, అధికార యంత్రాంగానికి యావత్ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది. కరోనా వైరస్ పాజిటివ్ కోసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణాలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 22కు చేరింది. ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణలో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించారు.ఆదివారం చోటు చేసుకున్న మరిన్నివార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కోరారు. ఇక, కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని శనివారం తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఇదిలాఉండగా, భారత్‌లో కరోనా వైరస్ (కోవిడ్-19) చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. శుక్రవారం నాటికి 230గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు.. శనివారం మధ్యాహ్నం ఆ సంఖ్య 271కి చేరింది. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ప్రాణాంతక కరోనా వైరస్‌పై ప్రాథమిక సమాచారం అందించకుండా చైనా గోప్యత పాటించడం వల్లే ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటోందని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనావైరస్ (కోవిడ్-19)నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరీంనగర్‌ను వణికిస్తోంది. ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన పది మంది బృందంలో కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి, వైద్యపరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరోనాను నివారించే చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ గురువారం కీలక ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని, ఉల్లంఘిస్తే చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. గురువారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ ప్రభావం దేశంలో క్రమంగా పెరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలంగాణలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇక, ప్రపంచం మొత్తం కరోనా కోరలకు చిక్కి విలవిల్లాడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఇదిలా ఉండగా, శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే, చెన్నై నగరంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మరోసారి నిరసనలు వ్యక్తమయ్యాయి. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్టును రూ. 10 నుంచి రూ. 50కి పెంచుతూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మరోవైపు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకై కీలక ముందడుగు పడింది. ఇదిలా ఉండగా, ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇక, పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేలా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉండగా, యెస్బ్యాంక్ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం చోటుచేసుకకున్న మరిన్ని వార్తలకోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. యితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు లేకుండా ఏకపక్షంగా ఈ ఎన్నికలను వాయిదా వేయడమంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక మేరకు కరోనా వైరస్ 135 దేశాల్లో విస్తరించింది. ఆదివారం ఉదయం నాటికి లక్షా యాభై రెండు వేలకుపైగా కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాప్తి చెందకుండా అనేక దేశాలు అత్యవసర పరిస్థితులను ప్రకటించి చర్యలు చేపట్టాయి. ఆదివారం చోటు చేసుకున్నమరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, దేశంలో చాపకిందనీరులా కోవిడ్-19 విస్తరిస్తున్న వేళ దాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఇదిలా ఉండగా, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని విశేషాల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ వాయిదా ఇక లాంఛనమే. మరోవైపు, భారత్‌లో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతన్న నేపథ్యంలో టీటీడీ ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, త్వరలోనే విద్యుత్ చార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇకపోతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పాతబస్తీ మొగల్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని విశేషాల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కరోనా వైరస్ విజృంభణతో స్టాక్మార్కెట్లో గురువారం మహాపతనం నమోదైంది. బ్లాక్‌మండే షాక్ నుంచి తేరుకోని మార్కెట్లపై మరోసారి బేర్ పట్టుబిగించింది. అంతర్జాతీయ మహమ్మారిగా కరోనా వైరస్‌ను అధికారికంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయాల్లోకి రావటం లేదని, కేవలం మార్పుకోసం వస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. . విశాఖలో నిర్వహించిన వేడుకల్లో వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. గురువారం చోటు చేసుకున్న మరిన్నివార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్ రాజవంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ధియా పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోదీ ముడిచమురు ధరల భారీ పతనాన్ని గమనించలేదని ఎద్దేవా చేశారు. మరోవైపువిద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది.బుధవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్‌పై క్యాంపు కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉండగా, పులివెందులలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మంగళవారం వుహాన్‌లో పర్యటించారు. ఇక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఇదిలాఉండగా, సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 15 నెలల కమల్‌నాథ్ సర్కార్‌కు బీటలు వారి కుప్పకూలే స్థితికి దిగజారింది. మంగళవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
హోలి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతిసౌఖ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా తండ్రిని కడసారి చూసేందుకు పోలీసు భద్రత నడుమ స్మశానవాటిక వద్దకు వెళ్లిన అమృతాప్రణయ్‌కు నిరాశే మిగిలింది. మారుతీరావు బంధువులు, స్థానికులు ‘అమృత గో బ్యాక్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగాచాంపియన్ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సభలో కీలక ప్రసంగం చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. ఇదిలా ఉండగా, సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మరోవైపు, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రూ.కోటి విరాళం ప్రకటించారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హౌజింగ్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఇదిలా ఉండగా, యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ సర్కార్ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో పటియాలా హౌస్ కోర్టు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించి ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా మహిళను నియమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు సృష్టించారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గాయకుడు, బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దాడి జరిగింది. బీరు సీసాలతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
భారత్‌లో ఇప్పటివరకు 28 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హోలీ సంబరాలపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక ఉగాది నాడు ఇళ్లు లేని 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. మరోవైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి.. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం జరిగింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై సీఎం జగన్‌తో ముకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చార్మినార్ వద్ద శనివారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో ప్లాగ్‌మార్చ్‌ను నిర్వహించింది. పాకిస్తాన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సింద్ ప్రావిన్స్‌లో రైలు, బస్సు ఢీకొట్ట ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. సుక్కూర్ నగరంలోని రోహ్రి ప్రాంతంలో రైల్వే గేటు వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. శనివారం చోటు చేసుకున్న మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
పోలవరం ప్రాజెక్ట్ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మరోవైపు జలమండలి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం సందర్శించారు. విద్యార్థులు, ప్రజల్లో వాటర్ హార్వెస్టింగ్‌పై చైతన్యం కలిగించేలా థీమ్ పార్క్‌ను జలమండలి రూపొందించింది. ఇక, నిర్భయ హత్యాచార ఘటనలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా (25) సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇదిలా ఉండగా, ‘కరోనా’ దెబ్బకు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అత్యంత భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం చోటు చేసుకున్న మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన పర్యటనను నిరసిస్తూ ఉత్తరాంధ్ర వాసులు ఆందోళనకు దిగారు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవడం మంచి పరిణామమని, అందులో తప్పేమీ లేదని తెలంగాణ పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య దేశ రాజధానిలో జరిగిన హింసాకాండలో మృతిచెందిన వారి సంఖ్య గురువారం నాటికి మరింత పెరిగింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఏడుగురు నేడు మరణించటంతో మృతుల సంఖ్య 27 నుంచి 35కు చేరింది. గురువారం చోటు చేసుకున్న మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించామని, శాంతి..సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక, దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. మరోవైపు, విద్యుత్ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామన్నారు. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా, భారత అమెరికా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర, డొనాల్డ్ ట్రంప్ మధ్య చారిత్రక హైదరాబాద్ హౌజ్ వేదికగా మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కిన చిటెట్సు వటనాబె కన్నుమూశారు. ఇకపోతే పౌరసత్వ సవరణ చట్టం పై ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. మరోవైపు, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేదు అనుభవం ఎదురైంది. ఇదిలా ఉండగా, రానున్న డిజిటల్ యుగంలో దూసుకుపోయేందుకు దేశంలోని వ్యాపారవేత్తలు తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల అన్నారు. సోమవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
మంత్రిగా ఉన్న సమయంలో పరిటాల సునీత అనేక అక్రమాలకు పాల్పడ్డారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె అవినీతిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మరోవైపు ఓ మహిళపై నాటు తుపాకీతో కాల్పులు జరిపి పరారైన ఆర్మీ మాజీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు బాలాజీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఏఆర్ అంతూలేపై పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం మన్ కీ బాత్‌పై వ్యంగ్యోక్తులు విసిరారు. ఆదివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
సంచలనం సృష్టిస్తున్న ఈఎస్ఐ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులకు ప్రమేయం ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇకపోతే, నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. విద్యార్థినుల హ్టాస్టల్లోకి ఓ యువకుడు చొరబడిన ఘటన వెలుగుచూసింది. మరోవైపు రెండు రోజల పాటు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక, తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత ఆరేళ్లుగా ఈఎస్ఐలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఇకపోతే, రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తే వారికి జోలికి వెళ్లం.. కానీ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోమని తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మరోవైపు అగ్రరాజ్యంలో మరో ఇండో- అమెరికన్ మహిళకు కీలక పదవి దక్కనుంది. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
శివరాత్రి సందర్భంగా వేములవాడకు వెళ్లే భక్తులకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల తొలి జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. జర్మనీలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో శనివారం భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా, బ్రదర్ అనిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది. ఇకపోతే, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ కన్నుమూశారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై పడిన రూ. 3 లక్షల కోట్ల అప్పుల భారంలో అధిక సొమ్ము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్లిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇదిలా ఉండగా, పుల్వామా ఉగ్రదాడి ఘటనలో సైనికుల బలిదానాన్ని భారత్ ఎప్పటికీ మరచిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్ముకశ్మీర్‌లోని లెత్‌పొరా శిబిరంలో స్మారకస్తూపాన్ని ఆవిష్కరించారు. మరోవైపు టెలికాం కంపెనీలకు సర్వోన్నత న్యాయస్ధానం నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్ధూల రాబడి (ఏజీఆర్)పై బకాయిల చెల్లింపుల కోసం నూతన షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరుతూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపోతే దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే అని.. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలంటూ ఏవి లేవని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇదిలాఉండగా, రాజకీయ పార్టీలు తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల గురించి పూర్తిసమాచారాన్ని పార్టీ వెబ్సైట్లు, ప్రింట్ మీడియా ద్వారా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. మరోవైపు, చైనాలో కొవిడ్-19 వైరస్ బుధవారం భారీగా విజృంభించింది. హుబెయ్ ప్రావిన్సులో నిన్న ఒక్కరోజే 242 మందిని కబలించింది. మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, పెండింగ్ బిల్లులు, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు జరపని విషయాన్ని ప్రధానితో చర్చించారు. ఇదిలాఉండగా, ప్రజలు ఓడించి మూలనపడేసినా చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టడం హాస్యాస్పదమని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా భారత్‌లో సాదర స్వాగతం పలుకుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఢిల్లీ ప్రజల విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక, చైనాలో కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 1016కు చేరింది. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు భారత్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని మోదీ రాసిన లేఖకు చైనా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు అమలు కానున్నాయి. ఆటో మ్యుటేషన్ సేవల పోస్టర్‌ను మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విడుదల చేశారు. మరోవైపు టీమిండియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన న్యూజిలాండ్.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పిడి, శిక్షణ, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో పలు జాతీయ సంస్థలతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందాలను చేసుకుంది. మరోవైపు ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి సర్వోన్నత న్యాయస్ధానం మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. సోమవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
తిరుమల శ్రీవారిని జాను చిత్ర యూనిట్ దర్శించుకుంది. చిత్ర యునిట్ సభ్యులు హీరో శర్వానంద్, సమంత, దిల్ రాజు ఆదివారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.ఇదిలా ఉండగా ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మరోవైపు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొన్ని పార్టీలు మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. సీఏఏ తో దేశ పౌరులకు జరుగుతున్న అన్యాయం ఏంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన ప్రశంసలు గుప్పించారు. ఆదివారం చోటు చేసుకున్న మరిన్ని సంఘటనల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలీంగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ తొలి పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కరోనా రేపిన వైరస్ ప్రకంపనలు రోజుకు రోజుకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి చైనాలో 764 మంది చనిపోయారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మనబడి, నాడు-నేడు కార్యక్రమాల పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక, హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా నిలిచిన మెట్రో ప్రాజెక్టు చివరి కారిడార్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తిగాంచిన మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ కాలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మరోవైపు ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని తొలుత గుర్తించిన చైనా వైద్యుడు లీ వెన్లియాంగ్ మృతిచెందారు. శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
హాజీపూర్ హత్యల కేసులో పోక్సో స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. లక్షలాది మంది భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్ పై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్ పై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ కుంభమేళా మేడారం జాతర రెండో రోజు ఘనంగా కొనసాగింది. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద మహిళల ఉసురు పోసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ములుగు జిల్లా మేడారంలో జన జాతర మొదలైంది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో వనాలన్నీ జనమయమయ్యాయి. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి.. ట్రస్టును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని తరలింపుపై మంగళవారం కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్‌సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, హెల్త్‌కార్డుల జారీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనర్హులను మాత్రమే తొలగించామని, సమగ్ర విచారణ అనంతరం ఇంకా అనర్హులుంటే తొలగిస్తామని స్పష్టం చేశారు.ఇక స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
తనపై జరిగిన దాడి వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ హస్తం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కృష్ణలంకలో రిటైనింగ్‌వాల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.125 కోట్లు కేటాయించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. కృష్ణపురం ఉల్లి సమస్యను మంత్రికి వివరించామని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా, గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధరణ పరీక్షలను ఇవాళ్టి నుంచి ప్రారంభించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇకపోతే, వివిధ రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
తెలంగాణ ఉద్యమం తొలితరం నాయకుడు, నిజామాబాద్ మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి కన్నుమూశారు. గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉండగా అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదివారం పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆర్అండ్ ఆర్, పోలవరం ప్రాజెక్ట్ అధికారులతో అనిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక భారత్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనీయులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆన్లైన్ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఇండియా ప్రకటించింది. ఆదివారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనదైన శైలిలో ప్రసంగించారు. మధ్యమధ్యలో తమిళ కవితలు, దానికి అర్థాలు చెబుతూ ఆసక్తికరంగా బడ్జెట్‌ను వినిపించారు. ఇదిలా ఉండగా 2020-21 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం ,విద్య,ఆరోగ్యం, గ్రామీణ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. శనివారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమత కేసులో ఆదిలాబాద్ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. అనేక పరిణామాల మధ్య దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. మరోవైపు సొంత నియోజకవర్గంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్‌ను ప్రజాసంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ పలు దేశాలకు విస్తరించినట్టు వార్తలు వెలువడుతుండగా, భారత్‌లో తొలి కేసు నమోదైంది. కేరళకు చెందిన ఒక విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
విశాఖపట్నంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మండలి రద్దుకు ప్రభుత్వం చట్ట ప్రకారం తీర్మానం చేసిందని తెలిపారు. మరోవైపు నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. బుధవారం చోటుచేసుకున్న ఇలాంంటి మరిన్ని వార్తలకోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
కొత్త పెన్షన్లను ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఫిబ్రవరి 15 కల్లా ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇక శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. ఇదిలా ఉండగా ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులు మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చైర్మన్‌తో చర్చించారు. మరోవైపు తనపై లైంగిక దాడి జరిగిందని నిర్భయ అత్యాచార, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ముఖేష్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. మంగళవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ శానసమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభకు హాజరైన 133 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇదిలా ఉండగా శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గతంలో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు ఈనాడులో ఆ నిర్ణయాన్ని కీర్తిస్తూ ఎడిటోరియల్స్ రాశారని చెప్పారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేశాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్నే గెలిపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక కర్ణాటకలో పలువురు ప్రముఖులను చంపుతామంటూ ఓ ఆశ్రమానికి వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఈ నెల 29 బుధవారం రోజున హతమారుస్తామంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. సోమవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
పురపాలిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల్లో..టీఆర్ఎస్ పార్టీ...109 మున్సిపాలిటీలు, 8 కార్పోరేషన్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్షాలు అందుకోలేని స్పీడ్‌లో కారు దూసుకుపోయింది. మూడు రాజధానులపై టీడీపీ వైఖరికి నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఆదివారం జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని వీక్షించండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న సీఎం వైఎస్ జగన్.. వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష జరిపారు. ఇక జనవరి 26ను పురస్కరించుకొని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం పరిశీలించారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు ప్రతీసారి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు శాసనమండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం అని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇక, ఏపీ రాజధాని భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇకపోతే, జమ్ము కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తోందని భారత్ మండిపడింది. భారత్‌పై పాక్ విద్వేష విషం చిమ్ముతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత డిప్యూటీ ప్రతినిధి నాగరాజ్ నాయుడు దుయ్యబట్టారు. గురువారం చోటుచేసుకున్న మరిన్ని సంఘటనల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
అసెంబ్లీలో టీడీపీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభలో వీధిరౌడీలు మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పాలనా వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గత ప్రభుత్వ హయంలో రాజధాని పేరుతో టీడీపీ నేతలు భూములు కొట్టేశారని ఆరోపించారు. ఇక, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 120 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు ముగిశాయి. ఇదిలా ఉండగా, అన్ని మతాలూ సమానమని భారతీయ విలువలు ప్రభోదిస్తాయని, అందుకే భారత్ లౌకిక దేశంలా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భారత్ ఎన్నడూ పాకిస్తాన్ వంటి మత రాజ్యం కాబోదని స్పష్టం చేశారు. ఇకపోతే, చంద్రయాన్ 3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఇస్రో చీఫ్ కే శివన్ బుధవారం వెల్లడించారు. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని సంఘటనల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. మరోవైపు రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని.. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇకపోతే, పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిరసనల కారులపై విమర్శలు గుప్పించారు. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని సంఘటనల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమైన మంత్రిమండలి.. పలు కీలక అంశాలపై చర్చించింది. మరోవైపు భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా..సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని నాగులబండలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు చుక్కల మందు వేశారు. మరోవైపు సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ మూల సిద్ధాంతానికే ఈ చట్టం వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించిన కేజ్రీవాల్.. విద్యార్థులకు కూడా ఆ పథకాన్ని వర్తించే విధంగా రూపకల్పన చేశారు. ఆదివారం చోటుచేసుకున్న మరిన్ని సంఘటనల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక అధ్యయనానికి ఏర్పాటైన హై పవర్ కమిటీ నివేదికపై శనివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మరోవైపు కేవలం టీడీపీ కోసమే జనసేన పార్టీని పవన్‌కల్యాణ్ నడిపిస్తున్నారని.. ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక తమ హైకమాండ్ తెలంగాణ గల్లీలో ఉందని మిగతా పార్టీలకు మాత్రం హైకమాండ్ ఢిల్లీలో ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇకపోతే భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల జోక్యం తగదని హంగేరీ విదేశాంగ మంత్రి పీటర్ సిజార్టో హితవు పలికారు. భారత ప్రభుత్వం అవలంబించే విధానాలను అనుసరించి ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో భారతీయులదే తుది నిర్ణయం అని వ్యాఖ్యానించారు.శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం నెలకొంది. ఈ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 22న వారి ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు గురువారం నిలిపివేసింది. ఇక మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్... ఇప్పుడు బీజేపీ పంచన చేరి కామ్రేడ్లకు గట్టి ఝలక్ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
శబరిమలలో బుధవారం మకరజ్యోతి దర్శమిచ్చింది. జ్యోతిని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి ఎంతో మంచి పథకమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశంసించారు. ఇదిలా ఉండగా, తమిళనాడులోని అవనియపురంలో సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైన కొద్ది గంటలకే 32 మందికి గాయాలయ్యాయి. ఇక, ఐసీసీ అవార్డుల్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టీమిండియా వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ అవార్డుల్లో దుమ్ము దులిపారు. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 9..30 గంటలకు సమాశమయ్యే మంత్రివర్గం హైపవర్ కమిటీ నివేదికపై చర్చించనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇకపోతే, మున్సిపల్ ఎన్నికల విషయంలో కేటీఆర్ అభద్రతా భావంలో ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నిర్భయ కేసు దోషులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ప్రగతిభవన్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు హై పవర్ కమిటీ భేటీ అయింది. ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నందున దీనిపై పున సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సోమవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
తాను పవన్‌పై చేసిన వ్యాఖ్యలకు జనసేనకు చెందిన కొందరు నేతలు పని గట్టుకొని కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటిపై రాళ్లదాడి చేయటంతో పరిస్థితులు అదుపు తప్పింది. సంక్షేమ పథకాలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందన్న అక్కసుతోనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు రాజధానిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. దేశం విడిచిపోతానంటూ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ విమానాన్ని పొరబాటుగా కూల్చివేయడంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ వల్ల జరిగిన క్షమించరాని తప్పిదం కారణంగా 176 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికపై అధ్యయనానికి ఏర్పాటైన హై పవర్ కమిటీ రెండో భేటీ ముగిసింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ చర్చించింది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కార్యరూపం దాల్చాలంటూ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధ్వర్యంలో మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ హింసపై కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కీలక అంశాలను ఢిల్లీ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఇకపోతే, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బృహత్తర ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువు తీరనున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ శరవేగంగా పావులు కదుపుతోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బి- ఫారాలను మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ అందజేశారు. ఇక, కృష్ణా నీటి కేటాయింపుల అంశంపై జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ భేటీ అయింది. వరద సమయంలో వినియోగించుకున్న నీటి విషయంపై బోర్డు చర్చించింది. మే 31వ తేదీ వరకు రెండు రాష్ర్టాలకు నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని జేఎన్‌యూ యునివర్సిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థులపై జరిగిన దాడికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గురువారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో మోదీ పాట.. రాష్ట్రంలో ఓవైసీ పాట పాడుతూ ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఇక మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాక్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం భారత పౌరులు ఆ దేశానికి వెళ్లకుండా ఉంటే మంచిదని హెచ్చరించింది. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు గుండాగిరీకి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనను ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికపంద చర్యగా అభివర్ణించారు. పాకిస్తాన్ చెర నుంచి విడిపించిన ఏపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆంధ్రా జాలర్లు తెలిపారు. తమ విడుదలకు చొరవ చూపిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు శిక్ష అమలు తేదీని ఖరారు చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలలోపు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాల హౌస్‌కోర్టు ఆదేశించింది. వరంగల్‌లో మడికొండలోని ఐటీ పార్క్‌లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంగళవారం నాడు చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇక, జేఎన్‌యూ ఘటనపై ఫిర్యాదును నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ముసుగు ధరించిన కొందరు దుండగులను గుర్తించారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో పసిడి పరుగులు పెడుతోంది. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న ఆంధ్రా జాలర్లను విడిపించడానికి కృషి చేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఇకపోతే, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం నాడు చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు తాను మద్దతునిస్తున్నట్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. రాజధానిగా విశాఖ అన్ని విధాల అనువైన నగరమన్నారు. ఇది ఇలా ఉండగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపె విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులె పోటెత్తుతున్నారు. కాగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం టీటీడీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక మహారాష్ట్రను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చి ఆదాయం పెంపునకు అన్ని మార్గాల్లో ప్రయత్నించనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, రాష్ట్ర పర్యావరణం, పర్యాటక శాఖ మంత్రిగా నియమితుడైన ఆదిత్య ఠాక్రే తెలిపారు. ఆదివారం నాడు చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్లో శనివారం జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు రాష్ట్రంలో పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తైంది. రిజర్వేషన్ల వివరాలను శనివారం తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపించింది. ఇక, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శనివారం అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఇదిలా ఉండగా, గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సాధ్యంకాదన్న శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఇకపోతే, మూడు రాజధానుల ప్రకటనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సమర్థించారు. శనివారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక సమర్పించింది. ఇక పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే సంకల్పంతో ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.. తనకు ఎంతో సంతృప్తికరమైన పథకం ఆరోగ్యశ్రీ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే శకటాల తుదిజాబితాను కేంద్ర రక్షణశాఖ విడుదలచేసింది. రెండు తెలుగురాష్ట్రాలతోపాటు మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇందులో చోటుదక్కింది. మరోవైపు హైదరాబాద్‌లో ఎస్బీఐ బ్యాంక్‌కు చెందిన ఆరుగురు అధికారుల ఇళ్లలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించింది.శుక్రవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం గవర్నర్ బిశ్వమోహన్ హరిచందన్‌ను మర్వాదపూర్వకంగా కలిశారు. మరోవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. జనవరి 8న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్ చేపడుతున్నామని వెల్లడించారు. ఇక తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు సంబంధించిన లోగోను, వెబ్‌సైట్‌ను గురువారం ప్రారంభించారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సేవలను మరింత సులభతరం చేస్తున్నట్టు వెల్లడించారు. గురువారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రికి వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందచేశారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏపీఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసింది. ఇక చైనాతో సరిహద్దు సమస్యలకు త్వరలోనే శాశ్వత సానుకూల పరిష్కారం లభిస్తుందని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ ముకుంద్ నరవనే ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు నూతన సంవత్సర వేడుకలు ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కూలిన ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త పునీత్ అగర్వాల్, ఆయన కుమార్తెతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. బుధవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
జనవరి 1నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. జనవరి 1వ తేదిని ఆర్టీసీ ఉద్యోగుల నియామక డేగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇక ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదేవిధంగా భారత 28వ నూతన సైనికాధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్ నర్వణే మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఉగాది రోజు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. మరోవైపు అడవుల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర అటవీ పర్యవరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఇదిలా ఉండగా, సామాన్యులకు సకాలంలో ఇసుకను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకపోతే, ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన నెల అనంతరం మహారాష్ట్రలో పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం నెలకొంది. మరోమైపు అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్ వద్ద భారీ పేలుడు సంభవించింది. బైక్‌పై తీసుకువెళుతున్న పేలుడు పదార్థాలు పేలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు ఇతర నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. 10మంది మంత్రులు సహా మొత్తం 16మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్న 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయష్)కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. . -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో రూ.1,290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం విశాఖ ఉత్సవ్‌ను సీఎం ప్రారంభించారు. ఇదిలా ఉండగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ట దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు సంగారెడ్డిలో మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా పర్యటించారు. కందిలోని జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బందిపై మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపోతే, సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 76 మంది మృతి చెందారు. శనివారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు భూగర్భ జలాలను పెంచేందుకు కేంద్రం కొత్త పథకాన్ని మొదలుపెట్టింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీద అటల్ భూజల్ పథకాన్ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బుధవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
కృష్ణా, గోదావరి జలాలతో వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మరోవైపు జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీ ప్రకంపనల తీవ్రత కొనసాగుతుండగానే కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నవీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఇకపోతే, మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ నాగిరెడ్డి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో కడప ఉక్కు కర్మాగారానికి సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరోవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసులోని నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం తంతు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలైందని జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ తెలిపారు. సోమవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.