sashi tharoor
-
సెఫాలజిస్ట్ యోగేంద్ర ప్రెడిక్షన్... శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మ్యాజిక్‌ఫిగర్ దాటదని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్రయాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. మ్యాజిక్ ఫిగర్‌కు కావల్సిన 272 సీట్లు బీజేపీకి ఈసారి సొంతగా రావని యోగేంద్ర ఇటీవల చెప్పారు.ఎన్డీఏ కూటమి మొత్తం కలిసి మాత్రం మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మెరుగైన సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. దీనిపై శశిథరూర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.ప్రభుత్వ వ్యతిరేకత ఫ్యాక్టర్ వల్ల బీజేపీ 230 సీట్లకు కూడా పడిపోవచ్చన్నారు. ముందు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకేనే అవకాశం ఉందని థరూర్ పేర్కొన్నారు. -
మళ్ళీ ఆయనే గెలుస్తారు: నటుడు ప్రకాష్ రాజ్
తిరువనంతపురం: దేశంలో ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో సీనియర్ నేతలు సైతం నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ సమయంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్ళీ 'శశిథరూర్' విజయం సాధిస్తారని అన్నారు. జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికలో శశిథరూర్ మళ్ళీ విజయం సాధిస్తారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తిరువనంతపురం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ నుంచి చాలా అందుకుంది. కాబట్టి మళ్ళీ ఆయనే గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. శశి థరూర్ నా స్నేహితుడు, గొప్ప నాయకుడు. అందుకే అతని అండగా నిలబడటానికి నేను వచ్చానని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రస్తుతం ఈయన (శశి థరూర్) కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు పన్నియన్ రవీంద్రన్‌లను ఎదుర్కొని పోటీకి నిలబడుతున్నారని అన్నారు. 2009 నుంచి గెలుస్తున్న శశి థరూర్‌కు వ్యతిరేకంగా బీజేపీ బలమైన నాయకున్ని బరిలోకి దింపింది. కాబట్టి ఈ సారి జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. 20 ఎంపీ స్థానాలకు కేరళ రాష్ట్రంలో 2019లో 19 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా.. ఒక స్థానంలో సీపీఎం గెలుపొందింది. బీజేపీ విఫలమైంది. 2016లో ఒక్కసారి మాత్రమే బీజేపీ నెమోమ్ అసెంబ్లీ స్థానంలో గెలిచింది. అయితే ఇప్పటివరకు బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేదు. కాగా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. #WATCH | Thiruvananthapuram, Kerala: Actor Prakash Raj says, " I find this (Thiruvananthapuram) constituency has received a lot from Shashi Tharoor. It is going to be his term again, I am here to just stand by him not because he is a great friend of mine, but because he has given… pic.twitter.com/J34XOJUQ7Y — ANI (@ANI) April 22, 2024 -
తిరువనంతపురం ఫైట్.. కేంద్ర ఐటీ మంత్రిపై ‘ఈసీ’కి ఫిర్యాదు
తిరువనంతపురం: కేరళలోని కీలక సీటు తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తులు దాచారని ఎన్నికల కమిషన్(ఈసీ)కి వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఫిర్యాదు చేసింది. నామినేషనన్ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్లో గత ఏడాది ఆదాయాన్ని ఆయన చాలా తక్కువగా చూపించారని ఫిర్యాదులో ఎల్డీఎఫ్ నేతలు పేర్కొన్నారు. జూపిటర్ క్యాపిటల్ అనే కంపెనీలో ఆయనకు ఉన్న సింహభాగం వాటాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించలేదని ఆరోపించారు. ఇంతకముందు ఇదే విషయమై రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్‌చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి ప్రధానంగా యూడీఎఫ్ అభ్యర్థి శశిథరూర్‌తో పోటీపడుతున్నారు. ఇదీ చదవండి.. ప్రచార హోరు..తృణమూల్‌పై ప్రధాని మోదీ ఫైర్ -
ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా మప్పన్న మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు 7వేలకు పైగా ఓట్లు(7,897 ఓట్లు) పోల్ కాగా.. శశిథరూర్‌కు పది శాతం ఓట్లు(1072 దాకా) పోలయ్యాయి. చెల్లని ఓట్లు 416. దీంతో 6,822 ఓట్ల భారీ మెజార్టీతో ఖర్గే గెలుపొందినట్లు సమాచారం. సుమారు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు, అదీ గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కావడం విశేషం. 80 ఏళ్ల వయసున్న మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక ఖర్గే విజయంపై మరో అభ్యర్థి శశిథరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో దేశంలోని వివిధ పోలింగ్ బూత్‌ల నుంచి చేరిన పోస్టల్ బాలెట్ల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లో ఎవరు గెలుస్తారన్నది కాసేపట్లో తేలనుంది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. గాంధీయేతర కుటుంబం నుంచి అభ్యర్థి ఎన్నిక కాబోతుండడం, కాంగ్ సీనియర్లపై అభ్యర్థి శశిథరూర్ అసహనం వ్యక్తం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఓటింగ్‌పై శశిథరూర్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ఓటింగ్ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు జరిగాయంటూ కౌంటింగ్ వేళ ఆరోపణలకు దిగారాయన. ఉత్తర ప్రదేశ్ ఓట్లను రద్దు చేయాలని కోరారు ఆయన. ఇక ఓటింగ్ అవకతవకలతో పాటు కొన్ని అంశాలపై ఎన్నికల అధికారి మధుసుధన్ మిస్త్రీని కలిసినట్లు, తమ వర్గం తరపున లేఖ అందించినట్లు థరూర్ ఎలక్షన్ ఏజెంట్ సల్మాన్ సోజ్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని, మల్లికార్జున ఖర్గేకు తెలియకుండా అది జరిగి ఉంటుందని, ఒకవేళ తెలిస్తే ఆయన సైతం ఆ అక్రమాలను సహించబోరని థరూర్ టీం లేఖలో పేర్కొంది. పోలింగ్‌తో సంబంధం లేని వాళ్ల సమక్షంలో బాలెట్ బాక్సులు ఉండడంపై అనుమానాలు ఉన్నట్లు తెలిపింది థరూర్ బృందం. ► అయితే ఓటింగ్ ప్రశాంతంగానే జరిగిందని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించామని మధుసుదన్ మిస్త్రీ చెప్తున్నారు. మరో సీనియర్ సభ్యుడు జైరామ్ రమేశ్ సైతం ఎన్నికలు పారదర్శకంగానే జరిగినట్లు చెప్తున్నారు. ► మొత్తం పోలైన 9,915 ఓట్లలో అధికంగా.. సగానికి(50 శాతం) పైగా ఓట్లు ఎవరికి పోలైతే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో మెజార్టీ తేలగానే కౌంటింగ్‌ను ఇక ఆపేస్తుంది కూడా. ► మునుపెన్నడూ లేని విధంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ ‘అధ్యక్ష ఎన్నిక’.. పార్టీలో అంతర్గత పోరును బయటపెట్టింది. పంజాబ్, కేరళ, యూపీ, మహారాష్ట్ర.. ఇలా చాలా చోట్ల కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చును రాజేసింది. సీనియర్లు సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం గమనార్హం. ► అయితే ఎవరు గెలిచినా.. రిమోట్ కంట్రోల్ సోనియాగాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంటుందన్న విమర్శలను పార్టీ ఖండిస్తోంది. సమర్థులైన ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారని కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ► ఇక శశిథరూర్ అసహనం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. సీనియర్లు, పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న వాళ్లతో సహా పీసీసీ చీఫ్‌లు సైతం మల్లికార్జున ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. ► థరూర్ నామినేషన్‌ను ప్రతిపాదించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సైతం థరూర్ నినాదం ‘గుణాత్మక మార్పు’ ప్రచారం గురించి తప్పుడు సమాచారం కార్యకర్తల్లోకి వెళ్లిందని, అయినా ఆశాజనక ఓట్లు దక్కవచ్చని పేర్కొన్నారు. ► 2014తో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. 2019 ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక అధినేత్రిగా సోనియా గాంధీ కొనసాగుతూ వస్తున్నారు. ► పోటీలో శశిథరూర్ ప్రథమంగా బరిలో నిలవగా.. ఆయనకు ప్రత్యర్థిగా పలువురు అభ్యర్థులు పేర్లు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బరిలో నిలవొచ్చని అంతా అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయంలో చిచ్చు పెట్టగా.. అధిష్టాన జోక్యంతో చల్లారింది. చివరికి.. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో నిలిచారు. ► స్వాతంత్రం అనంతరం నుంచి ఇప్పటిదాకా దాదాపుగా గాంధీ కుటుంబం నుంచే ఎవరో ఒకరు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆరుసార్లు మాత్రమే ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థి నిలబడడంతో ఎన్నిక నిర్వహించారు. ఆ సమయాల్లోనూ అధిష్టాన మద్దతుతోనే అధ్యక్ష ఎన్నిక సజావుగా పూర్తైంది. ఇప్పుడు సుమారు 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక.. అందునా గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కాబోతుండడం, తటస్థంగా ఉన్నట్లు అధిష్టానం ప్రకటించుకోవడం గమనార్హం. -
కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పార్టీలో గాంధీ కుటుంబం ఉనికిని ఏ మాత్రం ప్రభావితం చేయవని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిందరం అభిప్రాయపడ్డారు. కొత్త సారథిగా ఎవరు బాధ్యతలు చేపట్టిన గాంధీల సలహాలు, సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా రిమోట్ కంట్రోల్ మాత్రం గాంధీల చేతిలోనే ఉంటుందనే ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు. జిల్లా స్థాయిలో ఓటింగ్ జరిగి అధ్యక్షుడ్ని ఎన్నుకున్న తర్వాత కూడా ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారం ఓటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల మంది పార్టీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఖర్గే గాంధీల విధేయుడని, ఆయన గెలిచినా నడిపించేది గాంధీలేనని విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో చిదంబరం స్పందించారు. 2024 ఎన్నికల్లో విజయం కోసం పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కోరిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టేవారు సంస్థాగత ఎన్నికలు నిర్వహించి కొత్త నాయకులను ఎన్నుకునేలా చేయాలని, పార్టీలో మార్పులు తీసుకురావాలని తాజాగా సూచించారు. మరోవైపు తాను గెలిస్తే పార్టీలో సమూల మార్పులు తీసుకొస్తానని పోటీకి ముందే శశిథరూర్. ఖర్గే కూడా పార్టీలో యువతకే ఎక్కువ అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. గాంధీల నుంచి విలువైన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఖర్గే, థరూర్‌లో ఎవరు గెలుస్తారో బుధవారం తెలిపోనుంది. ఆరోజే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. 96% ఓటింగ్ నమోదు -
ఖర్గేని గెలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది మేడం!
ఎలాగయినా మనం మల్లిఖార్డున్ ఖర్గేని గెలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది మేడం! -
కాంగ్రెస్ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో జీ–23 అనే గ్రూప్ లేదని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి, ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్నవారంతా ఒకే సిద్ధాంతంపై పనిచేస్తారని, గతంలో జరిగిన పరిణామాలను బట్టి పార్టీకి రాసిన లేఖపై కొందరు నేతలు సంతకాలు చేశారే తప్ప.. ప్రత్యేకమైన గ్రూప్ లేదని స్పష్టంచేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మేమంతా ఒక్కటే. మాకు సిద్ధాంత వైరుధ్యాలు లేవు. మా చర్చంతా బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనే. అధ్యక్ష ఎన్నిక అనేది మా పార్టీ అంతర్గత విషయం’అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే తాను ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తిమంతులు అన్నదే ఇక్కడ చర్చ అని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లిఖార్జున ఖర్గే గొప్ప నాయకుడని, ఆయనతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. ఇటీవల తాను ఖర్గేతో మాట్లాడానని, పార్టీ విషయంలో ఖర్గేది తనది ఒకటే స్టాండ్ అని చెప్పారు. అయితే, పార్టీని నడిపించే విషయంలో తన విజన్ తనకుంటే, ఖర్గే విజన్ ఖర్గేకు ఉంటుందని, తాను పార్టీ అధ్యక్షుడినయితే ఏం చేస్తాననే విషయంలో మేనిఫెస్టో కూడా తయారు చేశానని తెలిపారు. తెలంగాణ నేతలతో కూడా తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా కాఫీ తాగేందుకు తనను ఇంటికి పిలిచారని, అయితే తాను వెళ్లలేకపోయానని చెప్పారు. రేవంత్‌రెడ్డి పిలిస్తే గాంధీభవన్‌కు వచ్చి ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రచారం చేస్తానని శశిథరూర్ తెలిపారు. ఆసక్తి రేకెత్తించిన ట్వీట్.. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతానని చెప్పిన శశిథరూర్ సోమవారం చేసిన ట్వీట్ కాంగ్రెస్‌వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ‘రేవంత్ దగ్గరి బంధువు చనిపోయారని, ఆయనకు తన సంతాపాన్ని తెలియజేస్తున్నానని, రేవంత్ అండ్ టీం బెస్టాఫ్ లక్..’అని శశిథరూర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదే విషయంపై గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ను ప్రశ్నించగా, శశిథరూర్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారని, తనకు ఫోన్ చేస్తే కాఫీకి ఇంటికి ఆహా్వనించానని, అయితే తన బంధువు చనిపోవడంతో పరామర్శకు వెళ్లాల్సి వచ్చిందని, అందుకే కలవడం కుదరలేదని తెలిపారు. అంతే తప్ప శశిథరూర్‌ను కలవకూడదన్న ఉద్దేశం తనకు లేదని చెప్పడం గమనార్హం. ‘రైడ్స్’ భయంతోనే ప్రశ్నించరు అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ధైర్యం వ్యాపారవేత్తల్లో ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు శశిథరూర్ అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోయినా, ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్నా.. రైడ్స్ చేయించడం, ట్యాక్స్‌లు విధించడం లాంటి జరుగుతుంటాయని అందుకే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలను ప్రశ్నించరని తెలిపారు. ఈ వైఖరి పాశ్చాత్య దేశాల్లోనూ ఉంటుందన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని పార్క్ హోటల్లో శశిథరూర్‌తో సోమవారం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీనియర్ పాత్రికేయులు కర్రి శ్రీరామ్ అనుసంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో.. ఫిక్కీ ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ శుభ్రమహేశ్వరి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎంతో రాణిస్తున్నారని, పురుషులకన్నా నిబద్ధతతో ఆలోచిస్తున్నారని ప్రశంసించారు. మహిళల్లో ఎంతో ప్రతిభ, నైపుణ్యం ఉన్నా, సమాజం, సంస్కృతి, సంప్రదాయాల వల్ల ఎక్కువగా రాలేకపోతున్నారన్నారు. ప్రతి ప్రభుత్వరంగ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఉండాలని, కానీలేరని, ఇదే ప్రశ్న తాను పార్లమెంట్లో లేవనెత్తితే సరైన సమాధానం రాలేదని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో మహిళలకు గౌరవం ఉందని, మొట్టమొదటి ఎన్నికల్లోనే మహిళలకు ఓటు హక్కు మన దేశంలోనే కలి్పంచారని గుర్తు చేశారు. చదవండి: దుర్గా మండపంలో విగ్రహం వివాదం.. మహిశాసురుడిలా గాంధీ! -
పోటీ అక్కర్లేదన్నా పట్టుబట్టాడు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అందరి ఆమోదంతో ఒకే అభ్యర్థి ఉంటే బాగుంటుందని, ఎన్నిక ఏకగ్రీవం కావాలని అభిలషించానని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో తన నివాసంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఖర్గే పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. ‘సర్వామోదంతో, పోటీ లేకుండా ఒక్కరినే పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని నా ప్రతిపాదన. అదే విషయాన్ని శశిథరూర్‌కు చెప్పా. నాతో ఆయన విబేధించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నిక మంచిది అని థరూర్ వాదించారు. తానూ బరిలో దిగుతానని చెప్పారు’ అని ఖర్గే మీడియాకు వెల్లడించారు. ‘ఒక వేళ పార్టీ చీఫ్‌గా ఎన్నికైతే గాంధీల కుటుంబం ఇచ్చే అమూల్యమైన సలహాలను పరిగణనలోకి తీసుకుంటా. నేనేమీ గాంధీలు బలపరిచిన అధికారిక అభ్యర్థిని కాదు. ఇప్పుడు పార్టీలో జీ–23 అంటూ ఎలాంటి అసంతృప్త నేతల కూటమి లేదు. అందరం కాంగ్రెస్ నాయకులమే. ఆర్ఎస్ఎస్–బీజేపీని సమష్టిగా ఎదుర్కొంటాం ’అని ఖర్గే స్పష్టంచేశారు. ‘నేను పార్టీలో ఎవరిపైనో పోటీకి దిగలేదు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగమే ఈ పోటీ. పార్టీలో సమూల మార్పులు ఉన్నపళాన జరగవు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. పార్టీపై గాంధీలు గుత్తాధిపత్యం చేస్తారనే బీజేపీ ఆరోపణను ఖర్గే తిప్పికొట్టారు. ‘కాంగ్రెస్‌లో ఎన్నికల ప్రాధికార వ్యవస్థ ఉంది. ఓటింగ్ హక్కులున్నాయి. బీజేపీలో అలాంటిదేమీ లేదు. బీజేపీలో ఎన్నికలు జరిగాయా? జేపీ నడ్డాను ఎన్నుకున్నదెవరు? ఆ పార్టీలో డెలిగేట్స్ ఎంతమంది?’ అని ఖర్గే ప్రశ్నించారు. థరూర్ బహిరంగ చర్చ ప్రతిపాదనను తిరస్కరించారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
బహిరంగ చర్చకు సిద్ధం.. అప్పుడే ఎవరేంటో తెలుస్తుంది
న్యూఢిల్లీ: ఘన చరిత గల కాంగ్రెస్ పార్టీకి తదుపరి అధ్యక్షులు ఎవరనే అంశంలో ఇరు అభ్యర్థుల మధ్య ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చాసమరానికి తాను సిద్ధమని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్ తన మనసులో మాట బయటపెట్టారు. ఇటీవల తీవ్ర ఉత్కంఠ రేపిన బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సారథి, దేశ ప్రధాని రేసులో రిషి సునాక్, లిజ్ ట్రస్ నేరుగా పలుమార్లు చర్చావేదికలపై బలాబలాలు ప్రదర్శించిన నేపథ్యంలో అదే మాదిరి పోటీని థరూర్ కోరుకోవడం విశేషం. ఆదివారం థరూర్ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖాముఖిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ సమర్థవంతమైన నాయకుడిగా నన్ను నేను ఎప్పుడో రుజువు చేసుకున్నా. దాదాపు మూడు దశాబ్దాలు ఐక్యరాజ్యసమితిలో కీలకమైన పలు పదవుల్లో బాధ్యతలు నెరవేర్చా. భారత్‌లో రాజకీయ ప్రస్థానానికొస్తే.. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిని. మొదలుపెట్టిన ఐదేళ్లలోనే 20 రాష్ట్రాల్లో పదివేల మందికిపైగా ఇందులో క్రియాశీలక సభ్యులయ్యారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండున్నర వారాల వ్యవధి ఉంది. ఇంత తక్కువ టైమ్‌లో అందరు 9,000 మంది ప్రతినిధులను కలవడం కష్టం. అదే అభ్యర్థుల బహిరంగ చర్చలు జరిగితే ఎవరి సత్తా ఏమిటో ఇట్టే తెలుస్తుంది’ అని అన్నారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే ఆదివారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. తాను ఎవరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి పోటీ చేయట్లేదని, పార్టీ సీనియర్ నేతలు, యువనేతలు కోరడం వల్లే బరిలోకి దిగినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడే తన లక్ష్యమన్నారు. అలాగే తన వెనుక గాంధీ కుటుంబం ఉందని వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. గాంధీలు ఎవరికీ మద్దతు ప్రకటించలేదని చెప్పారు. ఎన్నికలు చాలా పారదర్శకంగా జరుగుతాయని పేర్కొన్నారు. జీ-23నేతలు మాత్రం తనకే మద్దతు తెలిపారని వివరించారు. ఒక్కరికి ఒకే పదవి ఉండాలనే పార్టీ నిబంధనను గౌరవిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ సమర్పించిన రోజే రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి తాను రాజీనామా చేసినట్లు ఖర్గే వెల్లడించారు. ఒకేవేళ ఈయన అధ్యక్షుడిగా గెలిస్తే 136ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తొలి దళిత నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. ఖర్గే గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు రాదని, తాను గెలిస్తేనే సంస్కరణలు తీసుకొస్తానని శశిథరూర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఖర్గే స్పందించారు. ఎవరు గెలిచినా పార్టీలో సంస్కరణల కోసం సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే బీజేపీపై విమర్శలు గుప్పించారు ఖర్గే. కమలం పార్టీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. మరోవైపు ఖర్గేకు మద్దతుగా ఆయన కోసం ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవులకు గౌరవ్ వల్లభ్, దీపిందర్ హుడా, నజీర్ హుస్సేన్ రాజీనామా చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖర్గే విజయం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. చదవండి: శుక్రవారం నామినేషన్.. శనివారం రాజీనామా -
ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయాల్లోకి.. శశి థరూర్ ప్రస్థానమిదే..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన మాటల మాంత్రికుడు శశి థరూర్ (66) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాను ఎవరో ఆడించినట్లు ఆడే తోలుబొమ్మను కాదని చెబుతున్నారు. విభిన్న రాజకీయవేత్తగా థరూర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చుట్టూ వివాదాలకు లెక్కలేదు. శశి థరూర్ 1956 మార్చి 9న లండన్‌లో జన్మించారు. ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీలో ఆనర్స్ పూర్తిచేశారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికాలోని మెడ్‌ఫోర్డ్‌లో ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అభ్యసించారు. అక్కడే 1978లో పీహెచ్డీ పూర్తిచేశారు. అనంతరం ఐక్యరాజ్యసమితిలో చేరారు. రష్యా–పశ్చిమ దేశాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక శాంతి స్థాపన కోసం కృషి చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శికి సీనియర్ సలహాదారుగా సేవలందించారు. ఐరాసలో కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండర్ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు. 2006లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా భారత్ తరఫున అధికారిక అభ్యర్థిగా పోటీపడ్డారు. రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో సెక్రెటరీ జనరల్‌గా దక్షిణ కొరియా రాజకీయ నాయకుడు బాన్ కీ మూన్ విజయం సాధించారు. 2009లో అంతర్జాతీయ సివిల్ సర్వెంట్‌గా థరూర్ పదవీ విరమణ పొందారు. ఇండియాలో అడుగుపెట్టారు. అదే ఏడాది రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో తొలిసారిగా కాంగ్రెస్ టికెట్‌పై కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. యూపీఏ సర్కారు హయాంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2010 ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. 2014 జనవరిలో ఆయన భార్య సునంద పుష్కర్ ఓ హోటల్లో శమమై కనిపించడం దేశంలో సంచలనం సృష్టించింది. ఆయనపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ కోర్టు గత ఏడాది థరూర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 2014, 2019 ఎన్నికల్లోనూ తిరువనంతపురం నుంచి ఆయన విజయం సాధించారు. రచయితగా థరూర్‌కు అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు ఉన్నాయి. 23 పుస్తకాలు రాశారు. పులు పురస్కారాలు అందుకున్నారు. ఇందులో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఉండడం విశేషం. థరూర్ ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం తీరుపై నిప్పులు చెరిగారు. జి–23 గ్రూప్ నేతల్లో ఒకరిగా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో థరూర్ దిట్ట. 2013 దాకా ట్విట్టర్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న ఇండియన్ లీడర్ థరూరే కావడం గమనార్హం. ఆ తర్వాత ఆ స్థానాన్ని నరేంద్ర మోదీ ఆక్రమించారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో గాంధీల వీరవిధేయుడు -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్తపేరు వచ్చింది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖేర్గే రేసులో ఉండనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లకు చివరి రోజున అనూహ్యంగా ఖర్గే బరిలోకి రావడం ఆసక్తికరంగా మారింది. హస్తం పార్టీ అధ్యక్ష పదవికోసం సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్‌లో ఊహించని పరిణామాల కారణంగా సీఎం అశోక్ గహ్లోత్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో గాంధీ కుటుంబం విధేయుల్లో ఒకరైన ఖర్గేను బరిలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆమె ఆమోదం తెలిపితే ఖర్గే వెంటనే నామినేషన్ దాఖలు చేస్తారని పేర్కొన్నాయి. ఈయన పోటీతో అధ్యక్షపదవికి త్రిముఖ పోరు ఉండనుంది. దిగ్విజయ్ డౌట్! మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్విజయ్ సింగ్.. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఖర్గే నివాసానికి వెళ్లారు. పోటీలో ఉండాలంటే బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వీరు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అయితే గాంధీల విధేయుడైన ఖర్గే బరిలో ఉండటంతో దిగ్వజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. దళిత వర్గానికి చెందిన ఖర్గే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. 8 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు లోక్ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. హోంమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. జీ-23నేతల ఆయోమయం మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని జీ-23 నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు సీనియర్ నేతలు పృథ్విరాజ్ చవాన్, భూపిందర్ హుడా, మనీశ్ తివారీలు ఆనంద్ శర్మ నివాసంలో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై వీరు సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు పార్టీ సన్నిహత వర్గాలు పేర్కొన్నాయి. చాలా ఏళ్ల తర్వాత దక్షిణాది నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు శుక్రవారం(సెప్టెంబర్ 30) చివరి తేది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ సారి గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 1994లో పీవీ నరసింహారావు చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు శశిథరూర్, ఖర్గే ఎవరు గెలిచినా మరోసారి ఆ పదవి చేపట్టిన దక్షిణాది నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. వీవీ నరసింహారావు తర్వాత 1996-98 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 2017వరకు సోనియా గాంధీనే ఆ పదవిలో కొనసాగారు. చదవండి: ‘గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యం’ -
యస్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా
సాక్షి, ఢిల్లీ: గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ వీడింది. రేసులో ఎవరు తుది వరకు నిలుస్తారనే అనుమానాల నడుమ.. ద్విముఖ పోటీ ఖరారు అయ్యింది ఇవాళ. అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిచినట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న్టట్లు అధికారికంగా ప్రకటించారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. తొలుత పోటీ విషయంలో ఊగిసలాట ప్రదర్శించిన ఆయన.. ఇవాళ(గురువారం) నామినేషన్ ఫామ్‌లు తీసుకున్నారు. అనంతరం మీడియాకు ఆ విషయాన్ని తెలియజేశారు. అవును.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. అందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలివే అని ఆయన చూపించారు. అనంతరం ఆయన సోనియా గాంధీ నివాసానికి వెళ్లి.. కాసేపు చర్చించారు. ఇక మరో సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఇదివరకే నామినేషన్ పత్రాలను తీసుకున్న విషయం తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు చివరి రోజైన రేపు(సెప్టెంబర్ 30న).. ఈ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి, అశోక్ గెహ్లాట్.. పోటీ నుంచి తప్పుకున్నారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన వివరాలను వెల్లడించారు. జరిగిన పరిణామాలపై అధిష్టానానికి క్షమాపణ చెప్పినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్-దిగ్విజయ్‌సింగ్ మధ్యే పోటీ ఉంటుందని గెహ్లాట్ ప్రకటించారు. అశోక్ గెహ్లాట్.. అధిష్టానానికి ఇష్టుడిగా బరిలో దిగుతారని అంతా భావించారు. దీంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కావొచ్చనే చర్చ నడిచింది. అయితే ఒక్క వ్యక్తి.. ఒక్క పదవి కారణంతో ఆయన తనకు నచ్చిన వ్యక్తిని రాజస్థాన్ సీఎం చేయాలని భావించగా.. సచిన్ పైలట్ పేరు తెర మీదకు రావడంతో ఎమ్మెల్యేల తిరుగుబాటు అక్కడి రాజకీయం కలకలం రేపింది. ఈ క్రమంలో.. పరిణామాలపై వివరణ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వివరణ కోరగా.. ఇవాళ ఆయన ఆమె నివాసంలో భేటీ అయ్యారు. -
ఇదేం ట్విస్ట్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో అధిష్టానం చాయిస్‌గా తానే నిలవాలని ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ భావించారు. పార్టీ పగ్గాలతో పాటు సీఎంగానూ కొనసాగాలని ఆశపడ్డారు. అయితే ఒక వ్యక్తి.. ఒకే పదవి సవరణ ఆయన దూకుడుకు బ్రేకులు వేయించింది. ఈ క్రమంలో తన వారసుడిని తన ఇష్ట ప్రకారం ఎంచుకోవాలనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టి.. రాజకీయ సంక్షోభానికి దారి తీసింది కూడా. అయితే అధ్యక్ష ఎన్నికల బరి నుంచి గెహ్లాట్ వైదొలిగారన్న ప్రచారానికి తెర పడేలా మరో ప్రచారం ఇప్పుడు మొదలైంది. పార్టీ అధిష్టానం ఆయన్ని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోమని ఆదేశాలు ఇవ్వలేదట. అలాగే.. తనంతట తాను తప్పుకుంటానని నిన్న(సోమవారం) సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వద్ద గెహ్లాట్ ప్రస్తావించినట్లు వస్తున్న వార్తల్లోనూ వాస్తవం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు రాజస్థాన్ పరిణామాలపై సీనియర్ నేత అజయ్ మాకెన్- సమర్పించిన నివేదిక.. ఇప్పుడు కీలకంగా మారనున్నట్లు సమాచారం. మరో 48 గంటల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుందని, ఈ లెక్కన ప్రస్తుతానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో గెహ్లాట్ ఉన్నట్లేనని పార్టీ సీనియర్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తనకు సంబంధం లేదని గెహ్లాట్ చెప్పడంతో.. పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియాగాంధీని కలుసుకుని వివరణ ఇచ్చే అవకాశం ఆయనకు ఇచ్చినట్లు సమాచారం. అయితే.. గెహ్లాట్ సంగతి పక్కనపెడితే ‘రెబల్’ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే యోచనలో అధిష్టానం ఉంది. ఇదిలా ఉంటే.. ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం సీనియర్ నేత శశిథరూర్ నామినేషన్ పేపర్లను తీసుకున్నారు. ఈ నెల 30న ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్ సంక్షోభానికి కారణమైన ఎమ్మెల్యే సచిన్ పైలట్.. ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో మంతనాలకు సిద్ధమయ్యాడు. ఇంకోవైపు అధిష్టానం సీరియస్ అయిన నేపథ్యంలో చల్లబడ్డ ఎమ్మెల్యేలు తామంతా ఒకేతాటిపై ఉన్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ తర్వాత ఇప్పుడు పంజాబ్‌లోనూ సేమ్ సీన్ -
అందరూ కోరితే అధ్యక్ష పదవికి రెడీ...!
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అధినేత్రి సోనియాగాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్‌లో చాలామంది నేతలకు నాపై ఎంతో నమ్మకముంది. వారంతా కోరితే అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధం’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. సీఎంగా కొనసాగమన్నా, అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయమన్నా తోసిపుచ్చలేనన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో సోనియాతో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికపై చాలాసేపు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ‘‘50 ఏళ్లుగా పార్టీ నాకెన్నో పదవులిచ్చింది. నాకు పదవులు ముఖ్యం కాదు. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా’’ అని చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుతం రాజస్తాన్ సీఎంగా నాకప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నా. ఇకముందు కూడా నెరవేరుస్తూనే ఉంటా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. తద్వారా అధ్యక్షునిగా ఎన్నికైనా సీఎంగా కొనసాగుతానంటూ సంకేతమిచ్చారు. జోడు పదవులు కాంగ్రెస్ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు విరుద్ధం కాదా అని ప్రశ్నించగా, ‘‘ఆ నిబంధన నామినేటెడ్ పదవులకే వర్తిస్తుంది. అధ్యక్ష పదవికి బహిరంగ ఎన్నిక జరుగుతుంది గనుక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల్లో ఎవరైనా పోటీ పడవచ్చు’’ అని బదులిచ్చారు. ‘‘నేనెక్కడుండాలో కాలమే నిర్ణయిస్తుంది. పార్టీకి సేవ చేయడమే నా లక్ష్యం. పార్టీకి ఉపయోగపడే చోటే ఉండాలన్నది నా అభిమతం’’ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా బరిలో దిగుతుండటాన్ని ప్రస్తావించగా అలాంటి పోటీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి చాలా మంచిదన్నారు. పోటీకి రాహుల్‌గాంధీని ఒప్పించేందుకు చివరగా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇందుకోసం ఆయన గురువారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు గెహ్లాట్ అభిప్రాయంతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ విభేదించారు. ‘‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదు. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు. తాను కూడా బరిలో దిగే అవకాశముందని దిగ్విజయ్ అన్నారు! ‘‘ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయొద్దా?’’ అని జాతీయ మీడియాతో ప్రశ్నించారు. రాహులే సారథి కావాలి: పైలట్ మరోవైపు, రాహులే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాజస్తాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ కోరారు. సగటు కాంగ్రెస్ కార్యకర్తలంతా అదే కోరుతున్నారన్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి గెహ్లాట్ గనక పార్టీ అధ్యక్షుడైతే రాజస్తాన్ సీఎం ఎవరవుతారన్న ప్రశ్నకు బదులిచ్చేందుకు నిరాకరించారు. రాహుల్‌ను ఒప్పించేందుకు పార్టీ నేతలందరం ప్రయత్నిస్తున్నామని సల్మాన్ ఖుర్షీద్ కూడా అన్నారు. మిస్త్రీతో థరూర్ భేటీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీని శశి థరూర్ కలిశారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. థరూర్‌కు అన్ని విషయాలూ వివరించినట్టు అనంతరం మిస్త్రీ చెప్పారు. 24న నామినేషన్ పత్రం తీసుకుంటానని చెప్పారన్నారు. ఇదీ చదవండి: ఇద్దరే పోటీ చేయాలా? అధ్యక్ష రేసులో నేనూ ఉన్నా.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు -
ఇద్దరు కాదు ముగ్గురు.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు కేరళ ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ మధ్యే పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా.. రేసులో నేనూ ఉన్నా అని కీలక వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయకూడదా? అని ఓ జాతీయ ఛానల్‌తో ఇంటర్వ్యూలో అన్నారు. నన్నెందుకు పోటీ నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు. నామినేషన్లకు చివరి తేదీ ఆయిన సెప్టెంబర్ 30న పోటీలో ఎవరెవరు ఉండేది తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అశోక్ గహ్లేత్ కచ్చితంగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఒక్కరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్‌లో పార్టీ డిక్లరేషన్‌ను గుర్తు చేశారు. తాను ఒక్కటే కాదు.. మూడు పదవులనూ కూడా సమర్థంగా నిర్వహించగలనని అశోక్ గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. దిగ్విజయ్ దీనిపైనే స్పందిస్తూ ఒక్కరికి ఒకే పదవి అని తేల్చి చెప్పారు. అంతేకాదు అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా బరిలో ఉండవచ్చన్నారు. పోటీ చేయొద్దనుకునే వారిని బలవంతం చేయవద్దని సూచించారు. అధ్యక్షుడు కాకపోతే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా రాహుల్ నిర్వర్తిస్తారని దిగ్విజయ్ స్పష్టం చేశారు. గాంధీలు పదవుల్లో లేనప్పుడు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీని నడిపించిన విషయాన్ని గుర్తు చేసారు. పీవీ నరసింహా రావు, సీతారం కేసరి పేర్లను ప్రస్తావించారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రాహుల్ గాంధీ విముఖత!
సాక్షి,న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన.. మధ్యలో విరామం తీసుకుని ఢిల్లీకి వచ్చే సూచనలు కన్పించడం లేదని పేర్కొన్నాయి. దీంతో గాంధీ కుటుంబేతరులే పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు సెప్టెంబర్ 30 చివరి తేదీ. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేసేది, లేనిది ఆయన మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని, ఎవరైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు శశిథరూర్, రాజస్థాన్ సీఎం ఆశోక్ గహ్లోత్ మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది. శశిథరూర్ ఇప్పటికే సోనియాను కలిసి పోటీ చేస్తానని చెప్పారని, ఆమె కూడా అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గాంధీల విధేయుడిగా ఉన్న గహ్లోత్‌కే సోనియా, రాహుల్‌ల మద్దతు ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3,700 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం కేరళలో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. చదవండి: గుజరాత్లో కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన మోదీ అభిమానులు -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనియా గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్.. సోనియా గాంధీతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కొందరు యువ కార్యకర్తలు రూపొందించిన ఆన్లైన్ పిటిషన్‌కు ఆయన అంగీకారం తెలిపిన అనంతరం ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని శశి థరూర్ సోనియా గాంధీకి ఈ భేటీలో చెప్పారని, అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. దీంతో ఆయన అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కొద్దినెలల క్రితం ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చేసిన తీర్మానాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పార్టీకి చెందిన కొందరు యువ నాయకులు ట్విట్టర్లో ఓ పిటిషన్‌ను రూపొందించారు. దీనికి మద్దతుగా 650మంది పార్టీ నాయకులు సంతకాలు చేశారు. దీన్నే ట్విట్టర్లో షేర్ చేసి తాను స్వాగతిస్తున్నట్లు శశిథరూర్ తెలిపారు. దీనిపై ప్రచారం చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. I welcome this petition that is being circulated by a group of young @INCIndia members, seeking constructive reforms in the Party. It has gathered over 650 signatures so far. I am happy to endorse it & to go beyond it. https://t.co/2yPViCDv0v pic.twitter.com/waGb2kdbTu — Shashi Tharoor (@ShashiTharoor) September 19, 2022 తీర్మానాలివే.. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే గాక కుటుంబం నుంచి ఒక్కరికి ఒకే పదవి ఇవ్వాలనే తీర్మానాలను ఉదయ్‌పూర్ సమావేశాల్లో కాంగ్రెస్ ఆమోదించింది. అయితే ఐదేళ్లకుపైగా పార్టీలో పనిచేసే కుటుంబాలకు దీని నుంచి మినాహాయింపు ఇచ్చింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 17న అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల అక్టోబర్‌కు వాయిదావేశారు. అయితే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తుండగా.. కొన్ని రాష్ట్రాల అధ్యక్షులు రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వదిలేయాలని మూడు రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. దీంతో ఎన్నికలు లేకుండా మళ్లీ గాంధీ కుటుంబసభ్యులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలనే పిటిషన్‌కు శశిథరూర్ బహిరంగంగా మద్దతు తెలిపారు. పార్టీలో సంస్కరణల కోసం డిమాండ్ చేసిన జీ-23 నేతల్లో ఈయన కూడా ఒకరు. ఈ విషయంపై 2020లోనే సోనియా గాంధీకి లేఖ రాశారు. కచ్చితంగా పోటీ.. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని థరూర్ కొద్దిరోజుల క్రితమే చెప్పారు. తాను పోటీ చేసేది లేనిది త్వరలో తెలుస్తుందన్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో నాయకుడు కాంగ్రెస్ పగ్గాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేకపోతే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌ను బరిలోకి దింపాలని సోనియా భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే శశిథరూర్ తప్పకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. చదవండి: వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే వీటిపై ఆయన స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. మూడు వారాల్లో దీనిపై స్పష్టత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు. తాను పోటీ చేసేది లేనిదీ చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలనని థరూర్ అన్నారు. ప్రజాస్వామ్య పార్టీలో ఎన్నికలు నిర్వహించడం ఎప్పుడైనా శుభపరిణామమే అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గాంధీ కుటుంబం ఇప్పటికే స్పష్టం చేసిందని థరూర్ పేర్కొన్నారు. గాంధీయేతరులు కాంగ్రెస్ అధ్యక్షులైతే మంచిదన్నారు. అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుంటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా, వాళ్ల తరఫున రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లేత్ నిలబడినా శశి థరూర్ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఇటీవల ఓ వార్తా పత్రికకు రాసిన సంపాదకీయంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలని థరూర్ పేర్కొనడం వీటికి బలం చేకూర్చింది. అంతేకాదు నామినేషన్లు కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు కూడా ఎన్నికలు జరగాలని థరూర్ సూచించారు. ఎవరైనా పోటీ చేయొచ్చు.. భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న ఏఐసీసీ నేత జైరాం రమేశ్ థరూర్ వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించామని, ఎవరైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోతుందని చెప్పారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల -
ప్రణయ సందేశాలను చూసి కోపం తట్టుకోలేక!
అందగాడైన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అంతరంగపు వికృతరూపం త్వరలో ప్రత్యక్షమవబోతోందా! ఆయన భార్య సునందా పుష్కర్ హఠాన్మరణానికి సంబంధించి అతడిని వేలెత్తి చూపించే సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం నాడు వాదనల సమయంలో మళ్లొకసారి కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్న పర్యవసానమే సునంద మరణం అనే అనుమానం బలపడుతోంది. తోపులాట కారణంగా సునంద శరీరంపై మొత్తం పదిహేను చోట్ల బలమైన గాయాలు అయినట్లు పోలీసులు గతంలోనే చార్జిషీటు దాఖలు చేశారు. పాకిస్తానీ మహిళా జర్నలిస్టుకు భర్త పంపిన ప్రణయ సందేశాలను చూశాక సునంద కోపం తట్టుకోలేకపోయారని, ఆ గొడవలో శశి థరూర్‌తో జరిగిన పెనుగులాటలో ఆమె గాయపడి, మరణించారని పోలీసులు గట్టిగా విశ్వసిస్తున్నారు. -
‘షేక్’ చేస్తోన్న శశి థరూర్
ఫేస్‌యాప్‌లు వచ్చాక సెలబ్రెటీల ఫోటోలు మార్ఫింగ్ చేయడం ఫ్యాషన్ అయింది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫోటోను ప్రసిద్ధ ఇంగ్లీష్ నాటక రచయిత షేక్స్పియర్లా గుర్తుతెలియని వ్యక్తి మార్ఫింగ్ చేశారు. ఇది వాట్సాప్‌లో చక్కర్లు కొడుతూ శశిథరూర్‌కు చేరింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శశిథరూర్ ఆ ఫోటోను తాజాగా ట్విటర్లో షేర్ చేసి దానిపై ఓ ఫన్నీ కామెంట్ పెట్టారు. ‘ఈ రోజు వాట్సాప్‌లో చాలా ప్రశంసనీయమైన చిత్రం చూశాను. నన్ను షేక్స్పియర్లా మార్చాలని చూడటంపై ఆశ్చర్యపోయాను. అయితే అలా మార్చడానికి కాస్త ఇబ్బంది పడినట్లున్నారు. నేను ఆ గౌరవానికి అర్హుడిని కానప్పటికీ.. ఎవరైతే మార్ఫింగ్ చేశారో వారికి ధన్యవాదాలు..’ అని ట్వీట్ చేశారు. శశిథరూర్ ట్వీట్‌తో ఈ ఫోటో మరింత వైరల్ అయి నెటిజన్ల కామెంట్లకు వేదిక అయింది. శశిథరూర్ అంటేనే చెలరేగే కొందరు ఈ ఫోటోపై ఓ రేంజ్లో విజృంభిస్తున్నారు. మరికొందరు శశిథరూర్‌ను సమర్థిస్తూ ఆ ఫోటోకు పూర్తి అర్హత ఉందంటున్నారు. ఓ నెటిజన్ ‘మీసాలు లేని షేక్స్పియర్ అనుకుంటున్నావా? అంతలేదు నువ్వు షేక్‌స్పియరుద్దీన్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. మరో వ్యక్తి ‘మీరు షేక్స్పియర్ కన్నా విలువైన వారు, గొప్ప రచయిత, రాజకీయవేత్త, మంచి మార్గ నిర్దేశకులు, మీ ఇంగ్లీష్ అద్భుతంగా ఉంటుంది, మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటూ కామెంట్లతో శశి థరూర్‌ని ఆకాశానికి ఎత్తేశాడు. -
‘శబరిమల’ ఓటు బీజేపీకి ఎందుకు పడలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఏకంగా 303 సీట్లతో అఖండ విజయం సాధించినప్పటికీ కేరళ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎందుకు ప్రవేశం దొరకలేదు ? కనీసం మూడు సీట్లు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఎందుకు దక్కలేదు ? శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ వర్గాలు ఆందోళన చేపట్టిన విషయం తెల్సిందే. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుకూలంగా యువతులు శబరిమలలోని అయ్యప్ప గుడిలోకి ప్రవేశించిన వారిపైనా వారు దాడులు చేశారు. యుక్త వయసు మహిళలెవరూ గుళ్లోకి ప్రవేశించకుండా ఆలయ పరిసరాల్లో ఆరెస్సెస్ తన సేనలను మోహరించింది. ముందుగా సుప్రీం కోర్టు తీర్పను గౌరవిస్తామని చెప్పిన బీజేపీ, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందచ్చని భావించి మాట మార్చింది. తీర్పుకు వ్యతిరేకంగా ఆరెస్సెస్‌తో కలసి ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగిన ఏప్రిల్–మే కాలం వరకు ఆందోళనను సాగదీశాయి. శబరిమల అంశం బీజేపీకి ఓ సువర్ణావకాశాన్ని ఇచ్చిందని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యానించారు. కానీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన బీజేపీకి కాకుండా బీజేపీ లాగానే సుప్రీం కోర్టు తీర్పును ముందుగా సమర్థించి, తర్వాత వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు పడ్డాయి. మొత్తం 20 సీట్లలో 15 సీట్లు కాంగ్రెస్‌కు రాగా, మిగతా నాలుగు సీట్లు దాని మిత్రపక్షాలకు వచ్చాయి. పాలకపక్ష సీపీఏం పార్టీ ఒకే ఒక్క సీటు దక్కింది. అలప్పూజ నుంచి పోటీ చేసిన సీపీఎం నాయకుడు ఏఎం. ఆరిఫ్ ఒక్కరే విజయం సాధించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఫ్రంట్ నుంచి ఏకంగా 9 మంది అభ్యర్థులు లక్షకుపైగా మెజారిటీతోని విజయం సాధించారు. యూడీఏ ఫ్రంట్‌కు 47. 2 శాతం ఓట్లు రాగా, ఎల్డీయే ఫ్రంVŠ కు 35. 1 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు కేవలం 15.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 14.9 శాతం ఓట్లతో పోలిస్తే కొద్దిగా ఓట్ల శాతం పెరిగింది. అదే 2014 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన 10.8 శాతం ఓట్లతో పోలిస్తే ఎక్కువ పెరిగింది. బీజేపీ తరఫున గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న కుమ్మనం రాజశేఖరన్ మినహా మిగతా మూడవ స్థానంలో నిలిచారు. తిరువనంతపురం నుంచి పోటీ చేసిన రాజశేఖరన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ ఏకంగా 99, 989 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజశేఖరన్‌కు 31.1 శాతం ఓట్లు వచ్చాయి. శబరిమల ఆలయం ఉన్న పట్టణం తిట్టలో బీజేపీ అభ్యర్థి కే. సురేంద్రన్ 29 శాతం ఓట్లతో రెండో స్థానంలో వచ్చారు. ఎందుకిలా జరిగిందని వామపక్షాలను, కాంగ్రెస్, బీజేపీ వర్గాలను మీడియా విచారించగా, వామపక్ష సానుభూతిపరులు బీజేపీకి ఓటు వేయడం ఇష్టంలేక కాంగ్రెస్‌కు ఓటు వేశారని, తద్వారా ఆ పార్టీ లబ్ధి పొందిందని వామపక్ష నాయకులు వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలు మొదటి నుంచి లౌకిక వాదులని మతతత్వ బీజేపీకి ఓటు వేయడం ఇష్టం లేక తమకే ఓటు వేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శబరిమల ఆలయ వివాదం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లబ్ధి పొందిందని, అయితే తాము గెలవక పోయినా తమ పార్టీ కూడా బలపడిందని బీజేపీ నాయకులు చెప్పారు. భవిష్యత్తులో తాము మరింత బలపడేందుకు ఇప్పుడు సమకూర్చుకున్న బలం ఉపయోగపడుతుందని అన్నారు. -
‘23 వరకూ ఎదురుచూద్దాం’
సాక్షి, న్యూఢిల్లీ : నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్ని తప్పని, తాను వాటిని విశ్వసించబోనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. మే 23న వచ్చే ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని జరిగిన విధంగా ఇండియాలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. ‘ ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మడం లేదు. ఆస్ట్రేలియాలో గతవారం 56 ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి. భారత్‌లో చాలామంది ప్రజలు తామెవరికి ఓటేశామో బహిరంగంగా చెప్పరు. అసలు ఫలితాల కోసం మే 23 వరకూఎదురుచూస్తాం’ అని శశిథరూర్ పేర్కొన్నారు. (చదవండి : బీజేపీకే ప్రజామోదం) కాగా, నిన్న(ఆదివారం) సాయంత్రం తుది విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే వివిధ చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. దాదాపు అన్నీ ఎన్డీయే మరోమారు అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పాయి. ఎన్డీయేకు 300కు పైగా స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి. -
ఈవీఎంలో పామును మోదీ పెట్టారా?
పెరంబూరు: ప్రధాని నరేంద్రమోదీ రాజ్యాం గంలో ఏమైనా జరగవచ్చునని నటి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కుష్భూ పేర్కొన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పలుప్రాంతాల్లో ఈవీఎంల మొరాయిం పు సమస్య తలెత్తుతున్న విషయం తెలిసిందే. మంగళవారం కేరళలో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో కన్నూరు ప్రాతంలో ఈవీఎం యంత్రం లో నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజలు భయపడి పారిపోయారు. పాము బయటకు పోయిన తరువాత ఓటింగ్ యాథావిధిగా జరిగింది. దీనిపై కాంగ్రెస్ మాజీ మంత్రి శశిధరుర్ స్పందిస్తూ ఇలా జరగడం ఇదే ప్రప్రథమం అని పేర్కొన్నారు.నటి కుష్బూ తన ట్విట్టర్లో పేర్కొం టూ.. నరేంద్రమోదీ రాజ్యాంగంలో ఏమైనా జరగవచ్చన్నారు. ఆమె ట్వీట్‌కు నెటిజన్లు కొందరు స్వాగతించినా, మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈవీఎంలను మోదీ తీసుకోచ్చారా, పామును ఆయన ఈవీఎంలలో పెట్టారా? అని రీట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెటిజన్లకు బదులిచ్చే విధంగా నటి కుష్బూ తను డాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.