Sex Ratio
-
అలాంటి పదాలు వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు: సుస్మితా సేన్
బాలీవుడ్ నటి సుష్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాజీ విశ్వసుందరి సినిమాల కంటే ఎక్కువగా ఎఫైర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. పలువురితో ప్రేమాయణం కొనసాగించిన ముద్దుగుమ్మ చివరిసారిగా ఆర్య మూడవ సీజన్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన భామ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ వెల్లడించింది. తాను 18 ఏళ్ల వయసులో ఉండగా తల్లిదండ్రులు ఇచ్చిన సలహాను గుర్తు చేసుకుంది. రియా చక్రవర్తి ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌కు మొదటి అతిథిగా సుస్మితా సేన్ హాజరయ్యారు.సుస్మిత మాట్లాడుతూ...' ఆ రోజుల్లో సమాజం ఇప్పటిలా ఓపెన్‌గా లేదు. ఏదైనా చెప్పాలంటే సంకోచించే వాళ్లు. నాకు 18 ఏళ్ల వయసులో శోభా దేతో ఇంటర్వ్యూ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే సెక్స్ అనే పదాన్ని తీసుకొచ్చా. ఎందుకంటే నేను ఒక మనిషిగా, నిజంగా స్వేచ్ఛ ఉండాలని కోరుకున్నా. కాబట్టి ఆ ప్రయత్నంలో నేను భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్ అయ్యా. కానీ సెక్స్ అనే పదం వాడినందుకు అమ్మ, నాన్న నన్ను హెచ్చరించారు. నీ భూజాలపై పెద్ద బాధ్యత ఉంది. ఆ పదాన్ని ఇంటర్వ్యూలో ఎందుకు ఉపయోగించావ్? శోభా దే మీ గురించి చెడుగా రాస్తున్నారు.' అని చెప్పారని వెల్లడించింది.కాగా.. సుస్మితా సేన్ 1975లో బెంగాల్లో జన్మించింది. ఆమె 2000వ సంవత్సరంలో రెనీని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. -
దేశంలో ప్రస్తుతం లింగ నిష్పత్తి ఎంతంటే..
భారత్‌లో ప్రతి ఏడాది జనవరి24నజాతీయ బాలికా దినోత్సవాన్ని(National Girl Child Day) జరుపుకుంటారు. ఈ ఏడాది 16వ బాలికా దినోత్సవాన్ని దేశంలో జరుపుకుంటున్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం దేశంలోని బాలికలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించి, వారికున్న హక్కులు, సమస్యలతో ఎలా పోరాడాలి తదితరాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అలాగే మహిళ సాధికారతకు పెద్దపీట వేసేలా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజునే భారత తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాందీ ఈ రోజునే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల మహిళ సాధికారతకు ఇదే అతిపెద్ద నిదర్శనం అని చాటి చెప్పేలా ఈ రోజునే జాతీయా బాలికా దినోత్సవంగా ఎంచుకున్నారు. తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జనవరి 24, 2008న జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేషన్ ఫ్యామిలీ హల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5)ఏం చెబుతోంది? ప్రస్తుతం బాలికల స్థితి ఎలా ఉంది తదితరాల గురించి తెలుసుకుందాం! ఎన్హెచ్ఎస్ గత నాలుగేళ్ల సర్వేలో..2015-16లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 991 మంది మహిళలు ఉండగా, 2019-21లో 1,020 మంది మహిళు మెరుగుదల కనిపించింది. ఈ కాలంలో స్త్రీల ఆయుర్దాయం కూడా గణనీయంగా మెరుగుపడింది కూడా. చెప్పాలంటే ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్న ఇన్నే ఏళ్లలో నెమ్మది నెమ్మదిగా చాలా మార్పులు సంతరించుకున్నాయి కూడా. కానీ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు మాత్రం తగ్గలేదు. చాలా చోట్ల కొంతమంది బాలికలకు విద్యా అవకాశాలు అందని ద్రాక్షలానే ఉండటం బాధకరం. నిజానికి భారతదేశంలో ఇందుకు సంబంధించిన కట్టుదిట్టమైన మంచి చట్టాలు ఉన్నాయి. కానీ వాటి అమల ఒక సవాలుగా ఉంది. ఆయా తాలుకా కేసుల్లో బాధిత బాలికలకు సత్వర న్యాయం కూడా అందడం లేదు. ఇక్కడ గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ న్యాయవ్యవస్థను రూపొందించడంపై దృష్టి సారించి ఆ దిశగా వారికి న్యాయం సత్వరం అందే యత్నం చేయాల్సి ఉంది. అలాగే క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తిని (సీఎస్ఆర్) సమస్యను పరిష్కరించే దిశగా 2015న హర్యానాలోని పానిపట్‌లో ప్రధానమంత్రి బేటి బచావో బేటీ పఢావో(బీబీబీపీ)ని ప్రారంభించారు. ఇది ఇది మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య -కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే జాతీయ కార్యక్రమం. దీనితో భ్రూణ హత్యలకు అడ్డుకట్టవేసి, వారికి విద్యా అవకాశాలు అందేలా చేయమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఒక రకంగా బాలికల మనుగడకు, అభివృద్ధికి తోడ్పాటునిచ్చే అద్భుతమైన కేంద్ర పథకం ఇది. అలానే ఇలాంటి ఎన్నో బాలికల సంక్షేమానికి పెద్ద పీట వేసేలా ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో.. మహిళలు, చిన్న పిల్లల అభివృద్ధికి సంబంధించిన పథకాలు, స్త్రీ సంక్షేమ పథకాలు, కౌమర బాలికలు పథకం వంటివి తీసుకొచ్చింది. మహిళ సాధికారతకు, లింగ సమానత్వానికి పెద్ద పీట వేసింది. అంతేగాదు ఈ దినోత్సవం పేరుతో ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకోస్తున్నారు కూడా. అయితే లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. మహిళలు, బాలికలు జీవితాంత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. అది సమూలంగా తొలిగి దేశంలో ఆడపిల్లలు వారి హక్కులు, గౌరవం, విలువను పొందేలా చేయగలిగేతే దేశం మరింత అభివృద్ధిని సాధించనట్లే. (చదవండి: జాతీయ బాలికా దినోత్సవం 2024: ఎదగాలి.. చదవాలి!) -
'ఏడాదిగా శృంగారానికి దూరంగా ఉన్నాడు'.. భర్తపై భార్య ఫిర్యాదు
బెంగళూరు: సంవత్సరం నుంచి భర్త తనతో శృంగారం చేయడంలేదని ఓ భార్య పోలీసులను ఆశ్రయించింది. చిన్న విషయాలకు కోపగించుకుంటున్నాడని, విడాకులపై కూడా సంతకం చేయడంలేదని కేసు నమోదు చేసింది. కర్ణాటకాలోని మాండ్యా జిల్లాకు చెందిన యువతి(21)తో హస్సాన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పెద్దల సమక్షంలో గత ఏడాది వివాహం జరిగింది. భర్త బెంగళూరులోని ఓ సెక్యూరిటీ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తుంటారు. ఆమె గృహిణిగా ఉంటోంది. అయితే..పెళ్లి చేసుకుని అన్యోన్యంగా బతకాలనే తన కలను భర్త నెరవేర్చడం లేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది. చాలా ప్రేమగా మాట్లాడినా.. చిరాకు పడుతున్నాడని పేర్కొంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంలేదని, శృంగార జీవితం పేలవంగా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. హాయ్.. హోటల్లో కలుద్దాం.. డేటింగ్ యాప్‌లో యువకులే ఆమె టార్గెట్.. -
‘వధువు కావలెను’.. పెళ్లి బట్టలతో రోడ్డెక్కి నిరసనలు
ముంబై: లింగ నిష్పత్తి బేధాలు.. చాలా దేశాల్లో ఆందోళన కలిగించే అంశంగా మారింది. పురుషులకు సరిపడా మహిళలు లేకపోవడంతో ఏకంగా జనాభా తగ్గిపోతున్న దేశాలనూ చూస్తున్నాం. కడుపులో ఉండగానే.. ఆడ బిడ్డగా నిర్ధారించుకుని చిదిమేయడం, ఇతర కారణాలతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది, ఈ క్రమంలో.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ కొందరు యువకులు రోడ్డెక్కిన ఘటన మన దేశంలోనే చోటు చేసుకుంది. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో పెళ్లీడుకొచ్చిన యువకులు.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ వాపోతున్నారు. వయసు మీద పడుతుండడంతో తమకు పెళ్లి కూతుళ్లు దొరికేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఏకంగా నిరసనకు దిగారు. పెళ్లికాని ప్రసాదులంతా రోడ్ల మీద పరేడ్ నిర్వహించారు. అదీ వినూత్నంగా.. పెళ్లి దుస్తుల్లో గుర్రాల మీద కొందరు, బ్యాండ్ మేళంతో మరికొందరు.. తమకు వధువులు కావాలంటూ డిమాండ్ వినిపిస్తూ ముందుకు సాగారు. చేతుల్లో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఆపై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలో మగ-ఆడ నిష్పత్తిని పెంపొందించడానికి ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) చట్టం అమలయ్యేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్(జిల్లా మెజిస్ట్రేట్) వినతి పత్రం సమర్పించారు. వీళ్లంతా బ్రైడ్‌గ్రూమ్(వరుడి) మోర్చా పేరిట ఏర్పాటు చేసిన ఓ సంఘంలోని సభ్యులు. ‘‘మమ్మల్ని చూసి నవ్వుకున్నా ఫర్వాలేదు. కానీ, పెళ్లీడు వచ్చినా.. చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదు. వయసు మీద పడుతోంది. ఇదంతా రాష్ట్రంలో పురుష-స్త్రీ లింగ నిష్పత్తి రేటు పడిపోవడం వల్లే’’ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమేశ్ బరాస్కర్ తెలిపారు. మహారాష్ట్రలో పురుష-స్త్రీ నిష్పత్తి రేటు 1000 మందికి 889 మందిగా ఉంది. భ్రూణ హత్యలు.. అసమానతల వల్లే ఈ సమస్య తలెత్తిందని, ప్రభుత్వాలే ఇందుకు బాధ్యత వహించాలని పలువురు యువకులు కోరుతున్నారు. ये बारात नहीं प्रदर्शन है...जी हां, महाराष्ट्र के सोलापुर में शादी के लिए लड़की नहीं मिली तो डीएम ऑफिस के बाहर युवाओं ने किया प्रदर्शन, दूल्हे की तरह सज निकाली बारात#Maharashtra #ViralVideo #Protest pic.twitter.com/bDIPucE4Cw — Zee News (@ZeeNews) December 22, 2022 ఆడపిల్లల భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ నిషేధ చట్టాలను పటిష్టం చేయాలని యువకులు కోరారు. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే షోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలుకా అక్లుజ్‌లో ఒక యువకుడు.. కవలలైన అక్కాచెల్లెలను వివాహం చేసుకున్న ఘటన ఈమధ్యే ప్రముఖంగా వార్తల్లో నిలిచింది కూడా. Twin sisters From Mumbai,got married to the same man in Akluj in Malshiras taluka of Solapur district in #maharashtra#maharashtranews#twinsisters #Mumbai #Viral #ViralVideos #India #Maharashtra pic.twitter.com/d52kPVdd5t — Siraj Noorani (@sirajnoorani) December 4, 2022 -
ప్రతి ఏటా 4.6 లక్షల మరణాలు
న్యూఢిల్లీ: సృష్టికి మూలం స్త్రీ అంటారు. ఆడది లేకపోతే మానవజాతి మనుగడే కష్టం అంటారు. అమ్మవారిగా పూజిస్తారు.. అదే ఆడపిల్లగా పుడితే మాత్రం చీదరించుకుంటారు. తల్లి గర్భం నుంచి భూమాత ఓడి చేరేంత వరకు ఆడవారు ఎన్ని కష్టాలు దాటాలో. అసలు అమ్మ కడుపు నుంచి బయటకు రాకుండానే రాలిపోతున్న ప్రాణాలు ఎన్నో. భూమ్మిద పడ్డాక కనిపించకుండా పోతున్న స్త్రీల సంఖ్య లక్షల్లో ఉందంటేనే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాశ్చాత్య దేశాల సంగతి పక్కన పెడితే.. స్త్రీని ఆదిపరాశక్తిగా కొలిచే మన దేశంలో శతాబ్దాలుగా ఆడవారి పట్ల చిన్న చూపు.. చులకన భావం. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత అభివృద్ది సాధించిన ఈ తారతమ్యాలు మాత్రం తొలగడం లేదు. యూనైటెడ్ పాపులేషన్ ఫండ్ నివేదిక చూస్తే ఈ మాటలు వాస్తవం అని మరోసారి రుజువు అవుతుంది. యూఎన్ఎఫ్పీఏ 2020 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 46 లక్షల మంది మహిళలు తప్పిపోతున్నారని తెలిపింది. అందులో 4.6 లక్షల మంది బాలికలు లింగవివక్షత కారణంగా తల్లి గర్భంలోనే లేక పురిట్లోనే కన్ను మూస్తున్నారని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం భారత్ ఇప్పటికి కూడా మహిళలకు అత్యంత అసురక్షిత దేశాల్లో ఒకటిగా పేర్కొనడం శోచనియం. పుట్టుకలోనే తప్పిపోవడం బాలికల నిష్పత్తిని పెంచడం కోసం గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావో.. భేటీ పడావో వంటి పథకాలేన్నో తీసుకొచ్చాయి. కానీ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్(ఎస్‌డబ్ల్యూఓపీ-స్వాప్) యూఎన్ఎఫ్పీఏ 2020 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జెండర్ బేస్డ్ సెక్స్ సెలక్షన్(జీబీఎస్ఎస్-లింగ ఆధారిత ఎంపిక) వల్ల 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా వీరిలో 46 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కల్గించే అంశం. మరి దారుణం ఏంటంటే దాదాపు 4.6 లక్షల మంది బాలికలు తల్లి గర్భంలోనే లేక పుట్టిన వెంటనే కనిపించకుండా(అంటే చంపడం, వదిలించుకోవడం) పోతున్నారని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పురిట్లోనే కనిపించకుండా పోతున్న ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరు భారతదేశానికి చెందిన వారే కావడం ఆందోళన కల్గిస్తుంది. ప్రతి ఏట ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ఎస్ వల్ల 12 లక్షల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతుండగా.. వీరిలో 40 శాతం మందితో భారత్ రెండో స్థానంలో ఉండగా.. 50 శాతంతో చైనా ప్రథమ స్థానంలో ఉంది. లింగవివక్షతకు వ్యతిరేంకగా ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేదని ఈ నివేదిక వెల్లడిస్తుంది. స్వాప్ నివేదిక ప్రకారం 2016-2018 సంవత్సరానికి గాను ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 899 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నది. హర్యానాతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో(ఉత్తరాఖండ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్) బాలికల సంఖ్య 900 కన్నా తక్కువ ఉందని నివేదిక తెలిపింది. బాల్య వివాహం, ఇతర వివక్షలు జీబీఎస్ఎస్ మాత్రమే కాక భారతదేశంలో బాలికలు బాల్య వివాహం, కట్నం, గృహ హింసతో పాటు లైంగిక వేధింపులు వంటి ఇతర లింగ ఆధారిత దురాగతాలకు గురవుతున్నారని నివేదిక తెలుపుతోంది. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ 2015-16 సర్వే గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి 18 ఏళ్ళలోపే వివాహం జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక 20-24 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలలో 26.8 శాతం మంది 18 సంవత్సరాల వయస్సులోపు వివాహం చేసుకున్నారని నివేదిక తెలిపింది. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు 8,000 మంది మహిళలపై ఎన్హెచ్ఏఎఫ్ నిర్వహించిన ఈ సర్వేలో 18 ఏళ్ళకు ముందే వివాహం చేసుకున్న బాలికలలో 32 శాతం మంది వారి భర్త చేతిలో శారీరక హింసకు గురయినట్లు వెల్లడించింది. అంతేకాక 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు వివాహితల్లో ఒకరు తన భర్త నుంచి లైంగిక హింసను అనుభవించినట్లు సర్వే వెల్లడించింది. బాల్యవివాహాల డాటా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ఉదాహరణకు బిహార్,పశ్చిమ బెంగాల్లో ప్రతి ముగ్గురు బాలికలలో ఇద్దరికి 18 ఏళ్ల లోపే వివాహం కాగా.. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ముగ్గురిలో ఒకరికి బాల్య వివాహం జరిగినట్లు సర్వే వెల్లడించింది. అబ్బాయే ముద్దు.. ఆడపిల్ల వద్దు భారతదేశంలో కొడుకు అంటే వల్లమాలిన అభిమానం. ఆడపిల్ల పుడితే పెంచి, పెద్ద చేసి కట్నం ఇచ్చి ఒకరింటికి పంపాలి. అదే కొడుకయితే.. ఖర్చు పెట్టినప్పటికి కట్నం వస్తుందనే ఉద్దేశంతో భారతీయులు కొడుకు పట్ల వల్లమాలిన అభిమానం ప్రదర్శిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి వల్లే ఇండియాలో ఆడపిల్లల సంఖ్య బాలుర కంటే తక్కువగా ఉంటుంది. బాల్య వివాహాలకు ఇది కూడా ఓ కారణం అవుతుందని సర్వే తెలిపింది. ప్రస్తుతం చిన్న కుటుంబాలు ఏర్పడటం.. ఆదాయం పెరగటంతో పట్టణాల్లో లింగనిర్థారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే.. వెంటనే హతమారుస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాదని ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్దతి కొనసాగుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా.. వీరిలో భారత్‌కు చెదిన వారే 46 మిలియన్ల మంది ఉండటం శోచనీయం. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు వస్తేనే ఆడపిల్లల మనుగడ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని.. ఉన్నత విద్యనభ్యసించే బాలికల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు కుంటుపడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
ఇక మగాళ్లూ పుట్టరు
ఉత్తరాఖండ్.. ఉత్తరకాశీ జిల్లాలోని 132 గ్రామాల్లో రెండు నెలలలో రెండువందల పదహారు మంది పిల్లలు పుట్టారు.. అందరూ మగశిశువులే! యాదృచ్ఛికమా? కాకపోయుండొచ్చు.. ఆడపిల్లలను కడుపులోనే చంపేసి ఉంటారు.. అందుకే పుట్టలేదు! కొన్నాళ్లయితే ఆడపిల్లలు ఉండరు.. అప్పుడు కాన్పులూ ఉండవ్.. మగాళ్లుండరు! ఇక మగాళ్లూ పుట్టరు!! ఒక ఊళ్లో ఒక కుటుంబం. నాలుగు తరాల కిందట ఆ ఇంట్లో ఇద్దరు ఆడపడచులుండేవారు. అయిదుగురు మగపిల్లలు. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేసి పంపారు. ఆ తర్వాత ఆ ఇంట్లో జరిగిన శుభకార్యాలకు తప్ప ఆ ఆడపడచులను ఈ ఇంటికి పిలిచిందిలేదు.. మంచిచెడు, కష్టంసుఖం అడిగింది లేదు. ఆ తర్వాత తరంలో ఒక అమ్మాయి, ముగ్గురు మగపిల్లలు. ఆ అమ్మాయినీ అంతే.. పెళ్లి చేసి పంపితే మళ్లీ ఆమె మొహం చూసి ఎరిగినవారు కాదు ఈ కుటుంబ సభ్యులు. ఆ తర్వాత తరంలో అమ్మాయిలే పుట్టలేదు. ముగ్గురూ మగపిల్లలే. ఉన్న చోట సంబంధాలు కరువై కర్ణాటక, కేరళ అమ్మాయిలను చూసి పెళ్లి చేశారు వాళ్లకు. ఈ తరానికి ఆ కుటుంబంలో ఒకే ఒక్క మగపిల్లాడు పుట్టాడు. వంశానికొక్కడే అని అల్లారుముద్దుగా పెంచారు. బాగా చదివించారు. మంచి ఉద్యోగమూ వచ్చింది. చూడచక్కగా ఉంటాడు. పెళ్లి చేయాలని ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా అమ్మాయి దొరకలేదు. కుల పట్టింపులూ సడలించుకున్నారు. స్థానిక మ్యారేజ్ బ్యూరోలు.. మ్యాట్రిమోనీల్లో జల్లెడ పట్టి గాలించారు. ఆ అబ్బాయి తండ్రి, పెద్దనాన్న, బాబాయ్‌లకు చూసినట్టే కర్ణాటక, కేరళే కాదు.. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్దాకా వెళ్లారు. అయినా అమ్మాయి దొరకలేదు. రెండు తరాల కిందటి ఆ ఇంటి ఆడపడచుల సంతతిలో వరసైన ఆడపిల్లల గురించీ వాకబు చేశారు. వరుస సంగతి బ్రహ్మ ఎరుగు.. అసలు ఆ ఇళ్లల్లోనూ ఆడనలుసే లేదని తెలిసింది. ఇప్పుడు ఆ అబ్బాయికి 37 ఏళ్లు. ఆ ఇంటికి ఏ చుట్టమొచ్చినా.. వధువు గురించి ఆరా తీస్తారు. ‘‘ప్చ్..’’ అనే పెదవి విరుపే అవతలి వైపు నుంచి. ‘‘మా ఇళ్లల్లోనూ పెళ్లికాని అబ్బాయిలున్నారు. మీ ఇంటికి వచ్చిందీ వధువుల వేటలోనే’’ అనే సమాధానం అదనంగా! ఇది కథలాగా అనిపిస్తున్న వాస్తవం. ఇలాంటి కుటుంబాలు కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా కొన్ని వందల్లో ఉన్నాయి. దేశంలో ఎక్కడిదాకో ఎందుకు తెలంగాణలోనే బోలెడు ఉదాహరణలు. సిద్దిపేటలో ఇలాగే మూడు తరాలుగా ఒకే కొడుకు పుడుతూ వస్తున్న ఒక కుటుంబం (పేరు, వివరాలు గోప్యం)లోని అబ్బాయికి ఎక్కడా అమ్మాయి దొరక్కపోయేసరికి అతని 34వ యేట ఉత్తరప్రదేశ్‌లోని ఓ పేద కుటుంబం నుంచి పదిహేడేళ్ల అమ్మాయిని తెచ్చి పెళ్లిచేశారు. గర్భవతి అయింది. రక్తహీనతతో బాధపడుతూన్న ఆ అమ్మాయికి ఆరునెలలకే ప్రసవమైంది. మృతశిశువును కన్నది. ఆ తర్వాత రెండు నెలలకే ఆమె చనిపోయింది. మరో జిల్లాలో... 30 ఏళ్లు పైబడ్డ యువకుడికి బిహార్‌కు చెందిన అమ్మాయితో కులాంతర వివాహం చేశారు. ఆ అబ్బాయి పెళ్లయ్యేంత వరకు ‘‘ఏ కులం అమ్మాయి అయినా సరే.. మా వాడికి పిల్ల దొరికితే చాలు.. పెళ్లయితే చాలు’’ అనే రాజీ ధోరణిలో ఉన్న ఆ కుటుంబం.. తీరా పెళ్లయ్యాక కులం, సంస్కృతీ సంప్రదాయాల పేరుతో ఆ పిల్లను దెప్పడం మొదలుపెట్టింది. ఆ హేళన భరించలేక ఆ అమ్మాయి పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు ఉదాహరణల్లో ఆడపిల్ల పుట్టని కుటుంబాలే అవి. ఆ ఇళ్లకొచ్చిన ఆడపిల్లలూ అనారోగ్యంతోనో, బలవన్మరణంతోనో తనువు చాలించిన వాళ్లే. ఈ మొత్తం ప్రస్తావనలో.. ఆడపిల్ల లేదు.. అంటే తల్లిలేదు.. ఇంకా చెప్పాలంటే మళ్లీ వంశాంకురాలు పుట్టే యోగ్యంలేని ఇళ్లన్నమాట! లాల్.. అనుకుంటున్నారా తేలిగ్గా? కాదు సీరియస్. ఈ వారం మొదట్లో అన్ని పత్రికల్లో ‘నో గర్ల్స్ విలేజెస్’గా అచ్చయిన ఒక వార్త దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశీ జిల్లాలోని 132 గ్రామాల్లో రెండు నెలల్లో రెండు వందల పదహారు మంది శిశువులు పుడితే వాళ్లంతా మగపిల్లలే అనేదే ఆ న్యూస్. కేవలం మగపిల్లలే పుట్టడం కాకతాళీయం కాదు కదా? అంటే కడుపులో ఉన్నది మగబిడ్డో.. ఆడబిడ్డో తెలుసుకొని ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయించుకుని కేవలం మగపిల్లలనే కని ఉండాలి అనేది అవగతమైన నిజం. అయితే తర్వాత దీని మీద ఉత్తరాఖండ్ ప్రభుత్వాధికారులు సర్వే నిర్వహించి.. ఆ జిల్లాలో కేవలం 132 గ్రామాల డాటా మాత్రమే తీసుకున్నారని, ఏప్రిల్, జూన్ నెలల్లోనే మరో 129 గ్రామాల్లో ఒక్క మగ శిశువు లేకుండా 189 మంది ఆడపిల్లలే పుట్టారనీ సవరించారు. సత్యదూరమా? సరే.. వార్తలు... సర్వేలు.. సవరణలు పక్కన పెడితే కనిపిస్తున్న ప్రాక్టికాలిటీ మాత్రం నో గర్ల్స్ విలేజెస్ అన్న మాటకు సత్యదూరంగా లేదు. అబద్ధమే అయినా .. పరిస్థితి అక్కడిదాకా రాకుండా అలర్ట్ అవడంలో తప్పులేదు. 2015– 2017.. ఈ రెండేళ్లలో ప్రతి వెయ్యి మంది మగశిశువులకు ఆడశిశువుల సంఖ్య 896కి పడిపోయింది. 2019 ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారమైతే లింగ నిష్పత్తిలో 201 దేశాల్లోకి మనది 191వ స్థానం. యాభైఒక్క ఆసియా దేశాలతో పోలిస్తే మనది 43వ స్థానం. కాబట్టి మొదట్లో చెప్పుకున్న కథలాంటి వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి కదా ఈ లెక్కలు?! పరాయి పెరట్లో మొక్కకు నీళ్లు పోసి పెంచినట్లే! ఎవరిని? మన ఆడపిల్లలను! అవును.. మగపిల్లలకు చదువు చెప్పిస్తే చాలు... జీతం, కట్నంతో పాటు వంశం పేరూ మిగులుతుంది. ఎన్ని లాభాలు? మరి అమ్మాయిల విషయంలో? చదువు చెప్పించి.. కట్నమూ ఇచ్చి పంపిస్తే ఇంకో వంశం పేరు నిలబెట్టే నలుసును కని ఇస్తుంది. అంటే పరాయి పెరట్లో మొక్కకు నీళ్లు పోసి పెంచినట్టు కాదా’’ అని అంటోందట మన దేశం! 2018లో ఐక్యరాజ్యసమితి ‘‘మిస్సింగ్ డాటర్స్’’ పేరుతో చేసిన అధ్యయనంలో తేలిన విషయం. ఒళ్లు గగుర్పొడిచే మరిన్ని నిజాలూ వెల్లడయ్యాయి. మెట్రో నగరాల్లోని చాలా న్యుక్లియర్ ఫ్యామిలీస్.. అసలు ఆడపిల్ల గర్భంలో పడకుండా.. ప్రినాటల్ సెక్స్ సెలక్షన్ అనే అడ్వాన్స్డ్ మెథడ్‌తో మగ శిశువే కడుపులో పడేలా చూసుకుంటున్నారట. అన్వాంటెడ్ డాటర్స్ ఈ టెక్నాలజీ అందుబాటులో లేనివాళ్లు, తెలియని వాళ్లు, గ్రామీణులు, లింగ నిర్ధారణ పరీక్ష కఠినంగా అమల్లో ఉన్న ప్రాంతాల వాళ్లు పుట్టిన ఆడపిల్ల మీద ప్రతాపం చూపిస్తున్నారట. పురిట్లోనే పిల్లను చంపేయడం, లేదంటే తల్లిపాలను ఆపేయడం, సంరక్షణ చేయకపోవడం, టీకాలు వంటివాటిని వేయించకపోవడం, పడేయడం, బిడ్డలకు ఇన్ఫెక్షన్స్ సోకేలా చూడ్డం.. వీటి బారినపడి ఆ బిడ్డ ప్రాణం పోయేలా చేస్తున్నారట. అబార్షన్‌తో సహా ఇలాంటి రకరకాల కారణాలతో యేటా ఆరు లక్షల ఇరవైతొమ్మిదివేల మంది (పాత లెక్కలు) ఆరేళ్లలోపు ఆడపిల్లలు అసువులుబాస్తున్నారట. ప్రతి యాభై సెకండ్లకొక ఆడపిల్లను చంపుతున్నారట. ‘‘మొదటిసారి ఆడపిల్ల పుట్టి రెండోసారి ప్రెగ్నెన్సీలో ఆడపిల్లే ఉంటే అబార్షన్ అనివార్యం. మూడోసారి కచ్చితంగా కొడుకునే కనాలి’’ అని చెప్తుంది రస్సమల్ అనే సంప్రదాయ వైద్యురాలు. ‘‘కొడుకు పుట్టకపోతే అత్తింటి నుంచే కాదు సమాజం నుంచీ ఛీత్కారాలు తప్పవు’’ అంటుంది హరియాణాకు చెందిన ఒక ఉన్నత కుటుంబపు కోడలు. ‘‘ఫస్ట్ టైమ్ కూతురు పుట్టింది. రెండోసారీ కూతురే అని తేలింది. దాంతో అయిదో నెలలో అబార్షన్ చేయించుకోమని బలవంతపెట్టాడు మా ఆయన’’ అంటూ తన బాధను పంచుకుంది అహ్మదాబాద్‌కు చెందిన పూజా సలోట్. ఆమె భర్త పెద్ద పారిశ్రామికవేత్త. ఈ అబార్షన్ల బాధ భరించలేక అత్తింటి నుంచి బయటకు వచ్చేసింది ఆమె. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. వద్దు... తమిళనాడుతోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా ఆడపిల్లలు పుడితే చివరి ఆడపిల్లలకు ‘వద్దు’ (వేండామ్, నహీ) అనే పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది. అలా వేండామ్ అనే పేరున్న తమిళనాడు నారాయణపురంలోని ఓS అమ్మాయి ఇంజనీరింగ్ చదివి, ఒక జపనీస్ కంపెనీలో సంవత్సరానికి 22 లక్షల రూపాయల జీతంతో ఉద్యోగాన్నీ సంపాదించి ఆ పేరును వెక్కిరిస్తోంది. అందుకే మగపిల్లలే అనే పక్షపాతం వద్దు! ఇద్దరూ మన పిల్లలే అనే మమకారం కావాలి! ... ఆడపిల్ల.. బ్యాలెన్సింగ్ ఫీచర్‌ను ప్రకృతి నుంచి పొందిన ఏకైక శక్తి. అది అర్థం చేసుకోకుండా ఆడపిల్లా అని నొసలు చిట్లించి పుట్టకుండా చూస్తే పుట్టగతులే లేకుండాపోతాయ్. – సరస్వతి రమ -
మూడు నెలల్లో ఒక్క ఆడ శిశువు కూడా..
ఉత్తరకాశీ: గత మూడు నెలల కాలంలో ఆ 132 గ్రామాల్లో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించలేదట. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. ఒక పక్క ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికారిక గణంకాల ప్రకారం.. ఉత్తరకాశీ జిల్లాలోని 132 గ్రామాల్లో గత మూడు నెలల్లో 216 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఒక్క ఆడ శిశువు కూడా లేదని ప్రభుత్వ లెక్కలు వెల్లడించాయి. దీని వెనుకున్న కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర సర్వే, అధ్యయనం చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆశిష్ చౌహాన్ తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆశా వర్కర్లతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా చూసేందుకు నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. కాకతాళీయం కాదు, కుట్ర మూడు నెలల కాలంలో వందకు పైగా గ్రామాల్లో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించకపోవడం కాకతాళీయంగా జరిగింది కాదని, దీని వెనుక కుట్ర ఉందని సామాజిక కార్యకర్త కల్పనా థాకూర్ ఆరోపించారు. ఉత్తర కాశీలో ఆడపిల్లలు పుట్టకుండా చేసేందుకు భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నాయని మండిపడ్డారు. గట్టి చర్యలు తీసుకోండి భ్రూణహత్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సీనియర్ జర్నలిస్ట్ శివసింగ్ థన్‌వాల్ డిమాండ్ చేశారు. ‘లింగ నిష్పత్తిపై ప్రభుత్వ గణాంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకంపై ప్రశ్నలు రేకెత్తించేలా ఉత్తరకాశీలో పరిస్థితి ఉంది. ఆడ శిశువులను గర్భంలో ఉండగానే చంపేస్తున్నారని అధికారిక లెక్కలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి అనాగరిక చర్యలకు అడ్డుకట్టవేయాల’ని అన్నారు. -
944/1000
సాక్షి, హైదరాబాద్ : సమాజపు ఆలోచనలో వస్తున్న మార్పులో.. బేటీ బచావ్ బేటీ æపఢావ్ వంటిపథకాలో.. స్వచ్ఛంద సంస్థల చైతన్య కార్యక్రమాలో తెలియదు గానీ.. రెండేళ్లుగా తెలంగాణలో శిశువుల్లో లింగ నిష్పత్తిలో అంతరం తగ్గుతూ వస్తోంది. 2018లో నమోదైన జననా ల వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఈ వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపించింది. దీని ప్రకారం.. రెండేళ్ల నాటి పరిస్థితులతో పోలిస్తే రాష్ట్రంలో శిశు జననాల్లో లింగ నిష్పత్తి అంతరంలో చాలా మార్పు వచ్చింది. 2018లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 944 మంది ఆడ శిశువులు జన్మించినట్లు నివేదిక పేర్కొంది. 2016లో తెలంగాణలో ఈ నిష్పత్తి 1000:880గా నమోదైంది. 2017లో బాలికల సంఖ్య 914కి చేరగా ఈసారి 944గా నమోదైంది. ఇక జిల్లాల వారీగా చూస్తే గతేడాది అత్యధికంగా వనపర్తి జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 985 మంది ఆడ శిశువులు జన్మించారు. తర్వాత వికారాబాద్ జిల్లాలో 984మంది ఆడ శిశువులు పుట్టారు. పలు జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది ఆడ శిశువులు జన్మించారు. జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి–కొత్తగూడెం, పాలమూరు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, హైదరాబాద్ జిల్లాలు రాష్ట్ర సగటును దాటేశాయి. మిగిలిన జిల్లాలు సగటు కన్నా తక్కువగా ఉన్నాయి. అత్యంత తక్కువగా జనగామ జిల్లాలో వెయ్యి మందికి కేవలం 864 మంది ఆడ శిశువులే జన్మించారు. ఆ తర్వాత ఆసిఫాబాద్–కొమురంభీం జిల్లాలో 883 మంది ఉన్నారని నివేదిక తెలిపింది. 2016లో కరీంగనగర్‌లో ఈ నిష్పత్తి 1000:716గా నమోదవగా 2018లో ఈ సంఖ్య 1000:923కి చేరుకుంది. గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు అధికంగా జరిగేవి. తర్వాత ప్రభుత్వం సర్కారు దవాఖానాల్లో ప్రత్యేక వసతులు కల్పించడంతో.. పరిస్థితి చాలా మెరుగుపడింది. తగ్గిన జననాలు రాష్ట్రంలో జననాల సంఖ్య నాలుగేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం 2018లో తెలంగాణలో 6,03,919 మంది జన్మించారు. అందులో 3,10,594 మంది మగ శిశువులు, 2,93,325 మంది ఆడ శిశువులు. అత్యధికంగా హైదరాబాద్‌లో 79,359 మంది పుట్టారు. మేడ్చల్ జిల్లాలో 43,846, నిజామాబాద్ జిల్లాలో 38,027 జననాలు నమోదయ్యాయి. అయితే నాలుగేళ్లతో పోలిస్తే ఈసారి జననాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. 2015లో 6,12,489 మంది జన్మించగా, 2016లో 6,24,581 మంది, 2017లో 6,17,620 మంది జన్మించారు. 2017తో పోలిస్తే ఈసారి 13,701 మంది తక్కువగా పుట్టడం గమనార్హం. -
లింగ నిష్పత్తిలో అట్టడుగున ఏపీ
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో బాలబాలికల నిష్పత్తిలో అంతులేని అంతరం ఉన్నట్టు తాజా పరిశీలనలు తేల్చి చెప్పాయి. స్త్రీల అభ్యున్నతికి అది చేశాం, ఇది చేశాం అంటూ ప్రభుత్వం గుప్పిస్తున్న ప్రకటనలకూ వాస్తవికతకూ నక్కకీ నాగలోకానికీ ఉన్న తేడా ఉన్నట్టు ఈ పరిశోధన తేల్చి చెప్పింది. 2007 నుంచి 2016 కి ఆంధ్రప్రదేశ్ బాలబాలికల నిష్పత్తి దేశంలోకెల్లా అత్యంత దారుణంగా పడిపోయి సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో బాలబాలికల నిష్పత్తి 2007 నుంచి, 2016కి 168 పాయింట్లు పడిపోయి ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు ఆడ పిల్లలు కేవలం 806 మంది ఉన్నట్టు తేలింది. 2007లో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 974 మంది ఆడపిల్లలుంటే ఆ సంఖ్య తీవ్రంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో స్త్రీపురుష అంతరాలు అంతకంతకూ అధికమౌతున్నట్టు తాజా పరిశోధనలు తేల్చి చెపుతున్నాయి. కర్నాటకలోనూ పరిస్థితి ఇదే కొనసాగుతోంది. కర్నాటకలో 2007 – 2016 మధ్యన బాలబాలికల లింగ నిష్పత్తి 108 పాయింట్లు పడిపోయింది. తమిళనాడులో 95 పాయింట్లు పడిపోయి ఆ రాష్ట్రంలో సైతం లింగనిష్పత్తి వ్యత్యాసం అధికంగా ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో బాలబాలికల లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది బాలురకీ 954 మంది బాలికలు. 2016 నాటికి 73 పాయింట్లు పడిపోయి ఆడపిల్లల సంఖ్య మరింత క్షీణించి 881కి చేరింది. ఇదే సమయంలో గోవాలో 47 పాయింట్లు పడిపోయింది. దక్షిణాదిలో లింగ నిష్పత్తిలో కేరళ భేష్.... దక్షిణ భారతదేశంలో కేవలం కేరళలో మాత్రమే లింగనిష్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించింది. కేరళ లో లింగనిష్పత్తి 10 పాయింట్లు పెరిగి ప్రతి వెయ్యి మంది బాలురకి 2007లో 944 మంది ఆడపిల్లలు పుడితే 2016 కి ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి 954 మంది ఆడపిల్లలు ఉండడం ఆశావహంగా కనిపించింది. ఇదే కాలంలో ఒడిశాలో చైల్డ్ సెక్స్ రేషియో 61 పాయింట్లు పడిపోయింది, ఉత్తరాఖండ్ లో 44 పాయింట్లకు పడిపోయింది. 2016లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో సెక్స్ రేషియో అగాధంలో.... పుట్టుకలో ఆడపిల్లల సంఖ్య అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంటే రాజస్థాన్ కూడా అదే స్థితిలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పుట్టుకలో అంతరాన్ని బట్టి ఆడపిల్లల పట్ల వివక్ష తీవ్రత అర్థం అవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతివెయ్యి మంది మగపిల్లలకీ ఆడపిల్లలు కేవలం 806 మంది ఉంటున్నారు. ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి ఆడపిల్లలు ఉత్తరాఖండ్‌లో 825 మంది, బీహార్‌లో 837 మందికే పరిమితమయ్యారు. తమిళనాడు ఆడపిల్లల నిష్పత్తిలో ఐదో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ప్రతివెయ్యి మంది మగపిల్లలకు 840 మంది ఆడపిల్లలే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడించాయి. ఈశాన్య రాష్ట్రాలు మేలు లింగ నిష్పత్తిలో ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. సిక్కింలో ప్రతి వెయ్యిమంది మగపిల్లలకీ అత్యధికంగా 999 మంది ఆడపిల్లలు ఉంటున్నారు. నాగాలాండ్‌లో 967 మంది, ఆరుణాచల్ ప్రదేశ్‌లో 964, మిజోరాం సైతం 964, త్రిపుర లో 917 మంది ఆడపిల్లలతో 2016లో పుట్టుకలో లింగనిష్పత్తి విషయంలో మెరుగ్గా ఉన్నట్టు తేలింది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో 987 మంది ఆడపిల్లలూ, ఛత్తీస్‌గఢ్‌లో 980 మంది ఆడపిల్లలూ, డామన్ డయ్యూలో 974 మంది ఆడపిల్లలతో ప్రతి వెయ్యి మంది మగపిల్లలతో మిగిలిన రాష్ట్రాలకంటే కొంత మెరుగైన పరిస్థితే ఉంది.