Sharmila
-
బాబు అండ్ కో ఉచ్చులో షర్మిల.. వైఎస్ కుటుంబంపై కుట్ర
-
ఆస్తుల కోసం పరువు పోగొట్టుకుంటున్న షర్మిల!
ఆస్తుల కోసం ఇంతలా ఆరాటపడతారా? అది కూడా వందల కోట్లు పొందిన తరువాత మరింత కావాలని? అది కూడా సొదరుడు జైలుకెళ్లే ప్రమాదాన్ని పణంగా పెట్టిమరీ ఒక చెల్లి ఇలా ఆస్తి కోరుకుంటుందా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల తీరు అందరిని నివ్వెరపోయేలా చేస్తుంది. నిజంగానే ఆమెకు రావాల్సిన ఆస్తి ఏదైనా ఉంటే అడగడం తప్పు కాదు కానీ.. అడగాల్సిన అవసరమే లేకుండా అన్న జగన్ స్పష్టంగా సరస్వతి పవర్ లో వాటాలు రాసివ్వడానికి సిద్దపడినా, నానా రచ్చ చేయడంతో షర్మిల సాధించేది ఏమిటో ఆమెకే తెలియాలి. పేదరికంలో ఉన్నవారు కూడా సోదరుడి ఆస్తిలో వాటా కోసం ఇలా గుక్కపెట్టి రోదించరేమో!ఏం తక్కువైందని షర్మిల ఇంతలా గొడవ చేస్తున్నారు. ప్రమాణాలు చేస్తానంటున్నారు? అయితే ఈ ప్రమాణాలకు, ప్రతిజ్ఞలకు విలువెంతో ఆమె చరిత్రే చెబుతుంది. తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుదిర్చి చేసిన పెళ్లినాటి ప్రమాణాలకే తిలోదకాలిచ్చిన విషయం షర్మిల మరచిపోయి ఉండవచ్చు.అయితే అందులో తప్పు ఒప్పుల గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. కానీ అలాంటి నిర్ణయాలు ఒకరి వ్యక్తిత్వాన్ని సూచిస్తూంటాయి అని మాత్రం చెప్పక తప్పదు. తెలంగాణ బిడ్డనంటూ అక్కడ రాజకీయాలు మొదలుపెట్టి.. పాలేరు నియోజకవర్గంలో మట్టిపై ప్రమాణం చేసి ఇక్కడే ఉంటానని, పోటీచేస్తానని కూడా షర్మిల ప్రతిజ్ఞ చేసిన విషయం ఇక్కడ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్నకు పోటీగా రాజకీయాలు చేయనని చెప్పిన ఆమె తెలుగుదేశం ట్రాప్‌లో పడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టారు? సోదరుడు జగన్‌కు విరోధిగా ఎలా మారారు? ఒకప్పుడు తీవ్రంగా దూషించిన కాంగ్రెస్ పంచనే మళ్లీ ఎలా చేరారు? ఆ పార్టీని తానే ఉద్దరిస్తానని చెప్పుకుంటూ ఎలా తిరుగుతున్నారు? తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా రేవంత్‌ను ఉద్దేశించి షర్మిల అనుచితంగా దొంగ అని అన్ననోటితోనే ఆయన ముఖ్యమంత్రి కాగానే పొగిడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల ఆయనతో కార్యక్రమాలూ పెట్టించారు. తన సోదరుడు అంటే తనకు ప్రాణం అన్న స్వరంతోనే ఇప్పుడు విషనాగు అంటూ విషం చిమ్ముతున్నారు.మీడియా సమావేశం పెట్టి షర్మిల ఏడుపులకు దిగడం ఏమిటో, సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డిని పట్టుకుని జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని వ్యాఖ్యానించి అవమానించడం ఏమిటో! అంతేకాదు..ఆమె తల్లి ప్రస్తావన తెస్తూ, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా? చిన్నప్పుడే చంపేస్తే బాగుండు అని తల్లి విజయమ్మ అనడం లేదంటూ చివరికి సోదరుడి మరణాన్ని కూడా పరోక్షంగా కోరుకుంటున్న వైనం బహుశా ఏ సోదరి ఇంత నీచంగా మాట్లాడదేమో! ఇలాంటివి చూడడానికే బతికి ఉన్నానా అని విజయమ్మ బాధ పడుతోందని ఆమె చెప్పారు.నిజమే ఇంటిలో ఏ వివాదం వచ్చినా బాధపడేది అమ్మే. అయినా ఇప్పుడు షర్మిల మాటలు ఆమెకు ముల్లు మాదిరి గుచ్చుకుని ఉండాలి.అన్నంటే ప్రాణం అని చెప్పే వారేవరైనా ఇలా అరాచకంగా వ్యవహరిస్తారా? తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, సోదరుడు జగన్ కు ప్రత్యర్దులైన చంద్రబాబు నాయుడు కళ్లలోను, పగబట్టినట్లు దారుణమైన అసత్య కథనాలు రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతిల కళ్లలోను ఆనందం చూడడానికి అన్నట్లు షర్మిల వ్యవహరిస్తున్న తీరుతో ఎవరికి ఇలాంటి చెల్లి ఉండకూడదురా బాబు అనిపించదా! పోనీ ఇంత సానుభూతి నటిస్తున్న ఎల్లో మీడియా మరో వైపు జగన్‌వి అక్రమ ఆస్తులని ఎందుకు ప్రచారం చేస్తున్నాయి? ఇక్కడే వారి కుట్ర అర్ధం కావడం లేదా? ఏ కుటుంబంలో అయినా గొడవలు వచ్చినప్పుడు ఎక్కడో చోట రాజీ కుదురుతుంది. ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తారు.కానీ షర్మిల సరళి అంతా అన్ని దారులు మూసుకుపోవడానికే అన్నట్లుగా ఉంది. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా, జగన్ నుంచి 200 కోట్లు పొందిన మాట నిజమేనని ఒప్పుకుంటూ, అదేదో డివిడెండ్ అని చెబితే ఎలా కుదురుతుంది. ఆయా సంస్థలలో వాటాలు ఉంటేనే కదా డివిడెండ్ వచ్చేది. అదేమీ లేకుండానే షర్మిలకు అంత భారీ మొత్తం ఎలా ముట్టింది? చట్టం ప్రకరం ఆ డబ్బు కూడా ఇవ్వనవసరం లేదన్న సంగతి ఆమెకు తెలియదా! అయినా జగన్ ఇచ్చారంటే అది ఆమె మీద ఉన్న అభిమానం కాదా? తన తండ్రి జీవించి ఉన్నప్పుడు మనుమరాళ్లు, మనుమడు సమానం అని అన్నారని, కనుక తనకు జగన్ ఆస్తిలో వాటా రావాలనే ఎలా డిమాండ్ చేస్తున్నారు? సాక్షి, భారతి సిమెంట్ కంపెనీలలో తనకు వాటా ఉందని దబాయిస్తున్న తీరు చూస్తే దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందనిపిస్తుంది.జగన్, భారతిలు ఈ కంపెనీల వృద్దికి విశేష కృషి చేశారు. వాటిని దెబ్బతీస్తే, జగన్ ఆర్థికంగా దెబ్బతింటారన్న కుట్ర ఉండి ఉండవచ్చు. రాజకీయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదతర ఎల్లో మీడియా సాక్షి మీడియానాశనం అవ్వాలని కోరుకుంటుంది. అందుకోసం షర్మిలను రెచ్చగొడుతుంటారు. అలాగే చంద్రబాబుకు సాక్షి తప్ప, మిగిలిన మీడియాలో అత్యధిక భాగం భజన చేసేవే. సాక్షి మీడియా లేకపోతే తన ప్రభుత్వంలో జరిగే అక్రమాలు ఏవీ బయటకు రావన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఈ నేపథ్యంలో షర్మిల వారికి ఒక ఆయుధంగా మారినట్లుగా ఉంది. షర్మిలను రాజకీయంగా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని వదలివేస్తారు. అంతెందుకు! ఈనాడు మీడియా ఇదే సరస్వతి పవర్‌పై ఎన్ని దారుణమైన కథనాలు రాస్తోంది. ఆ కంపెనీ వాటాలన్నీ తనకే రావాలని కోరుతున్న షర్మిల ఈనాడు స్టోరీలను కనీసం ఖండించడం లేదేమి? తన తండ్రి పేరును పనిగట్టుకుని లాయర్ పొన్నవోలు సధాకరరెడ్డి ఛార్జిషీట్లో చేర్పించారని పిచ్చి ఆరోపణ చేశారుఒక లాయర్ కోరితే కోర్టులు వైఎస్ పేరును ఛార్జ్షీటులో చేర్చుతాయా? లేక దర్యాప్తు సంస్థ కోరితే చేర్చుతాయా? అసలు అన్నపై పెట్టింది అక్రమ కేసులేనని ఆమె చెప్పారు కదా? ఆ కేసులను పెట్టించింది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యేనని పలుమార్లు షర్మిలే చెప్పారు కదా? అన్న వదలిన బాణం అంటూ పాదయాత్ర చేశారు కదా? జగన్ కోరకపోయినా ఈమె పాదయాత్ర చేశారన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు ఆమె చేస్తున్న కుట్రలు చూస్తుంటే జగన్ జైలులోనే ఉండాలని కోరుకున్నట్లుగా లేదా? జగన్ పై పెట్టిన కేసులు వంటి వాటిని మరెవరిపై పెట్టి ఉంటే, మూడు రోజులలో బెయిల్ వచ్చేదని ప్రముఖ న్యాయవాది ఎస్.రామచంద్రరావు అనేవారు. తన బెయిల్ రద్దు అవుతుందని తల్లి, చెల్లిపై కేసు పెడతారా అని అడగడంలోనే ఆమె విషపు ఆలోచనలు కనిపిస్తాయి. అంటే ఏమిటి దాని అర్థంఝ జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదు కాని, తనకు మాత్రం వందల కోట్ల ఆస్తి అప్పనంగా రావాలని కోరుకోవడమే కదా!నిజానికి వారిపై జగన్ కేసే పెట్టలేదు. కేవలం తన వైపు వాదనను ఎన్.సి.ఎల్.టి కి తెలియచేశారు. గతంలో తానే బైబై బాబు అని నినాదం ఇచ్చానని చెప్పారు. బాగానే ఉంది.కాని ఇప్పుడు జైజై బాబు అన్నట్లుగా ఎలా మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. చంద్రబాబు ఎలాగైతే డబుల్ టాక్ చేస్తారో, అచ్చం అలాగే షర్మిల కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు జగన్ సోదరిగా షర్మిలపై ఎలాంటి విమర్శలు చేయడానికి అయినా వైసీపీ నేతలు వెనుకాడేవారు. ఎప్పుడైతే షర్మిల హద్దులు దాటారో, అప్పటి నుంచి వైసీపీ వారు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉదాహరణకు ఆమె వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ,దానికి స్పందించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్, ఆమె చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారా అని ప్రశ్నించారు.ఆ పరిస్థితి తెచ్చుకోవడం దురదృష్టకరం.ఇంకో విషయం చెప్పుకోవాలి. చట్టపరంగా షర్మిలకు ఈ ఆస్తులలో వాటా వచ్చే అవకాశం ఉంటే, ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండేవారు కదా? అలా కాకుండా తండ్రి ఏదో అన్నారని చెబుతూ దానికి జగన్ బైండింగ్ కావాలని అనడం చట్టరీత్యా ఎలా కుదురుతుంది? అసలు తండ్రి ఏమన్నారో, ఏమి అనలేదో ఎవరికి తెలుసు. నిజంగానే వైఎస్ కు అలాంటి ఆలోనలు ఉంటే ఆమెను ఏదో కంపెనీలో డైరెక్టర్ గా చేసేవారు కదా అన్న ప్రశ్నకు బదులు దొరకదు.ఇక్కడే షర్మిల వాదనలో బలహీనత కనిపిస్తుంది. షర్మిల తానేదో సోదరుడిని రచ్చ చేయగలిగానని సంతోషిస్తుండవచ్చు. చంద్రబాబో, ఎల్లో మీడియానో ఏదో సాయపడతారని ఆమె భ్రమపడుతుండవచ్చు.వాళ్ల లక్ష్యం జగనే తప్ప, షర్మిలకు ఉపయోగపడదామని కాదన్న సంగతి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఈ పరిణామాలవల్ల జగన్ కు కొద్దికాలం చికాకు కలగవచ్చు. కాని షర్మిల తిరిగి కోలుకోలేని విధంగా పూర్తిగా ప్రతిష్టను కోల్పోయారు. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బెయిల్ రద్దు కుట్రలో భాగమౌతారా?: విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈడీ జప్తు చేసిన, హైకోర్టు స్టే విధించిన సరస్వతి పవర్ షేర్లను ట్రాన్స్ఫర్ చేస్తే వైఎస్ జగన్‌కు ఇబ్బందులు ఎదురై బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తెలిసినా షర్మిల రాజకీయ కుట్రలో భాగస్వామిగా మారి కుట్రపూరితంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై వైఎస్ జగన్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీల న్యాయ సలహాను షర్మిలకు పంపించినా పెడచెవిన పెట్టారని చెప్పారు. ఏ చెల్లి అయినా ఇలా చేస్తుందా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయిన పదేళ్లకు.. షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తరువాత తాను వ్యాపారాల ద్వారా సంపాదించిన వాటిల్లో రూ.200 కోట్లు ఇచ్చిన అన్న పట్ల.. తన సొంత ఆస్తిలో 40 % ఇవ్వటానికి సిద్ధపడిన అన్నపై కనీస కృతజ్ఞత లేకపోగా నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే.. చంద్రబాబుతో కలసి బెయిల్ రద్దు చేసే కుట్రలు పన్నటమేని షర్మిలను విమర్శించారు. మీరు తాజ్‌మహల్, విప్రో కావాలని అడిగితే ఇచ్చేస్తారా షర్మిలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులను షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. అతి మంచితనం వల్లే జగన్ అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియాతో కలిసి నిర్వహించే మీడియా సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే జగన్‌పై దూషణలకే షర్మిల 95 శాతం ప్రాధాన్యమిస్తోందన్నారు. తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికే ఇదంతా అని షర్మిల చెప్పడం అబద్ధమని, చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే అన్నపై కుయుక్తులు పన్నుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై, వైవీ సుబ్బారెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు, ఆస్తుల విషయంలో జగన్‌పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారానికి సంబంధించిందన్నారు. జగన్‌ను తిరిగి సీఎం కాకుండా చేయాలన్నదే షర్మిల ఆలోచనని, చంద్రబాబు ఇచ్చిన అజెండాతోనే ఆమె పనిచేస్తున్నారన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నా, కేంద్రంలో ఆ పార్టీకి ఎన్డీఏ వ్యతిరేకమైనా, ఆమె బాబుతో లాలూచీపడి జగన్‌పై కుట్రలు చేస్తోందన్నారు. షర్మిల మాటలను ప్రజలు నమ్మరుతల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం లబ్ధి చేకూరుస్తారని ప్రశ్నించడం, జగన్‌ను నమ్మొదని చెప్పడం ఎంత ద్రోహమో, అన్యాయమో తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని షర్మిలకు సూచించారు. చంద్రబాబు మాటలనే ఆమె వల్లిస్తున్నారని, ఆయన అజెండాను నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ కోటిన్నర కుటుంబాలకు, 80 లక్షల మంది అక్క చెల్మెమ్మలకు ఆసరా ఇచ్చారని, 45 లక్షల మందికి అమ్మ ఒడి అమలు చేశారని, అలాంటి సీఎం దేశంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇంత మందికి మేలు చేసిన జగన్ సొంత ఇంట్లో తల్లి, చెల్లికి అన్యాయం చేస్తారని కుట్రపూరితంగా చెబుతుంటే ఎవరు నమ్ముతారని షర్మిలను నిలదీశారు. మహిళల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెంచాలనే చంద్రబాబు దుర్మార్గ అజెండాకు షర్మిల సహకరిస్తోందన్నారు. తండ్రి మృతికి కారణమైన బాబుతో దోస్తీదివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి కారణమైన చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు చేయడం దుర్మార్గమని సాయిరెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి మరణానికి చంద్రబాబే కారణమని షర్మిల గతంలో అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాజశేఖర్‌రెడ్డి మరో 15 రోజుల్లో దుర్మార్గమైన చావు చస్తాడని’ అంతకుముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. వైఎస్ మరణానికి చంద్రబాబే కారణమని దీన్ని బట్టి అర్థం కావడం లేదా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం, పసుపు చీర కట్టుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం, చర్చలు జరపడం, కుట్రలు చేయడం... ఇంతకన్నా అమానవీయ ప్రవర్తన ఉంటుందా? అని ప్రశ్నించారు. శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వాడుకుని జగన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపిన విషయం మరిచిపోయారా? అని షర్మిలను ప్రశ్నించారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ అనుకూలంగా మాట్లాడుతున్నామని తనను, వైవీ సుబ్బారెడ్డిని షర్మిల విమర్శించడం సహేతుకం కాదన్నారు. శత్రువుకు మేలు చేసేందుకు సొంత అన్ననే వేటాడి, వెంటాడి కాటేసే చెల్మెమ్మ షర్మిల మినహా ఎక్కడా చూడలేదన్నారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోభకు కారణమైన షర్మిల ఎల్లో మీడియా ముందు పెట్టే కన్నీటికి విలువ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్రలకు షర్మిలను వాడుకుంటున్నాడని విమర్శించారు.దేశంలో ఇలాంటి అన్న ఉంటాడా?వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్కు వచ్చిన ఆస్తులను కుమారుడు, కుమార్తెకు ఆయన జీవించి ఉన్నప్పుడే పంచారని తెలిపారు. విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్, కోడూరు ఆఫీసు ఆస్తులు, బైరైటీస్ మినరల్స్ స్టాక్స్, 25 మెగావాట్ల సరస్వతి పవర్, ఎస్ఆర్ఎస్ హైడ్రో, 51 ఎకరాల ఇడుపులపాయ భూములు, 79 ఎకరాల శెట్టిగుంట ఆస్తులు, 7.6 ఎకరాల పులివెందుల భూములు, బంజారాహిల్స్‌లోని 280 గజాలు, విజయవాడలోని రాజ్యువరాజ్ థియేటర్లు షర్మిలకు అప్పగించారని చెప్పారు. వైఎస్ జగన్ తనకు వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేశారన్నారు. జగన్ నెలకొల్పిన భారతీ సిమెంట్స్ కోసం తొలుత రూ.1,400 కోట్లు అప్పు చేశారని, ఆ తర్వాత తీర్చారని తెలిపారు. సాక్షి మీడియా మొదట్లో నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ నష్టాలు, అప్పులను షర్మిల ఎప్పుడూ పంచుకోలేదన్నారు. ఇవన్నీ జగన్ తన దక్షతతో అభివృద్ధి చేసి, లాభాల్లోకి నడిపించారని గుర్తు చేశారు. ఆయన అభివృద్ధి చేశారు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టారని, తానే ఆ పేర్లు సూచించానని వెల్లడించారు. ఆమెకు ఏదైనా కంపెనీ నచ్చితే ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తుల పంపకాలు ఏ విధంగా జరిగాయో తెలుస్తుందన్నారు. అమ్మ తటస్థతపై సందేహాలు!తన అసంబద్ధ చర్యలు కుమారుడి బెయిల్ రద్దు పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిసినా ఆ కుట్రలకు వైఎస్ విజయమ్మ పరోక్షంగా సహకరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. విజయమ్మ తటస్థతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.విజయమ్మను మొదటి నుంచి భావోద్వేగాలకు గురి చేసి షర్మిల ప్రభావితం చేస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టమైందని నెటిజన్లు, ప్రజలు చర్చించుకుంటున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా సరస్వతి షేర్ల ట్రాన్స్ఫర్ పత్రాలపై సంతకాలు చేయడం.. పలు సందర్భాల్లో షర్మిలకు అనుకూలంగా వ్యవహరించడం ఆమె తటస్థ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చినట్లు చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సైతం కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో విదేశాల నుంచి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియో సందేశాన్ని విడుదల చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను సమానంగా చూడాల్సిన అమ్మ ఒకవైపే మొగ్గడం సరికాదని పేర్కొంటున్నారు. నీ అత్యాశ, కుతంత్రాల్లో అమ్మను కూడా పావుగా వాడుకున్నావు. తప్పుడు ప్రకటనలకు అమ్మను ఓ సాక్షిగా, అమలుకర్తగా చేశావంటూ వైఎస్ జగన్ తన సోదరికి రాసిన లేఖను గుర్తు చేస్తున్నారు. ‘క్షమార్హం కాని అక్రమ చర్యల్లో అమ్మను భాగం చేశావు. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మను భావోద్వేగాలకు నువ్వు వాడుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. నీ సొంత వ్యూహాల్లో అమ్మను భాగం చేశావు. కోర్టు అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేస్తే నాకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని తెలిసీ బదలాయింపు చేశావు. అంతేకాక షేర్ సర్టిఫికెట్లు, షేర్ ట్రాన్స్ఫర్ ఫారాలు పోయినట్లుగా అమ్మ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించావు. అంతిమంగా అక్రమ పద్ధతిలో వాటాలను బదలాయింపు చేశావు. దీనివల్ల కుమారుడిగా నాకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నీ చర్యల్లో భాగస్వామి అయింది. ఆమె తటస్థతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాక ఆమె ఒకవైపే ఉందన్న భావన కలిగిస్తోంది...’ అని తీవ్ర ఆవేదనతో వైఎస్ జగన్ లేఖ రాయటాన్ని నెటిజన్లు, ప్రజలు ఉదహరిస్తున్నారు.కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
అందుకే షర్మిలను ప్రజలు నమ్మలేదు: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్‌లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్వం వదులుకున్న వ్యక్తి అని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ అధిస్టానాన్ని సైతం వైఎస్ జగన్ ధిక్కరించారు. కుట్రతో తప్పుడు కేసులు పెట్టినా ఆయన వీరుడిలా పోరాడారన్నారు.‘‘వైఎస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్ అనే వ్యక్తి ఒక యుద్ధ వీరుడు. అందుకే పార్టీ ఓడిపోయినా కోట్లాది మంది జగన్ వెంటే ఉన్నారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి జగన్ మాత్రమే. అందుకే ఆయనను ప్రజలు నమ్మారు. తెలంగాణ మెట్టినిల్లు అంటూ షర్మిల అక్కడ రాజకీయాలు చేశారు. మళ్లీ చాపచుట్టేసి తిరిగి ఏపీకి వచ్చారు.. చంద్రబాబుకు నేరుగా మద్దతు పలుకుతున్నారు. షర్మిలను తెలంగాణ, ఏపీ ప్రజలు నమ్మలేదు. చంద్రబాబుతో కలసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారు. మీ లాంటి చెల్లి వైఎస్ జగన్‌కు ఉండటం బాధగా ఉంది. వైఎస్ జగన్ చిన్న తప్పు కూడా చేయలేదు.’’ అని భూమన చెప్పారు.‘‘షర్మిల రాసిన లేఖలు టీడీపీ వెబ్సైట్లలో ఎలా వస్తున్నాయి?. చంద్రబాబుతో కలిసి అన్నపై కుట్ర చేయడం మీకు తగునా?. కేవలం రెండున్నర ఎకరాల చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు.. అందులో తమ్ముడి, సోదరీమణులకు ఎంత ఆస్తి పంచి ఇచ్చారు.’’ అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. -
వైఎస్ షర్మిలపై అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం
-
షర్మిల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: గుడివాడ అమర్నాథ్
సాక్షి,విశాఖపట్నం: షర్మిల చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో శనివారం(అక్టోబర్ 26) అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై ఫైరయ్యారు. ‘మీరు చేసిన ఆరోపణలు ఖండించిన వాళ్లంతా మోచేతి నీళ్లు తాగినట్లు కనిపిస్తే అది మీ అమాయకత్వం. వైఎస్సార్సీపీ నాయకులకు అలాంటి లక్షణాలు లేవు. మేం నిజాలను ప్రజల ముందు పెడుతుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పండి. సొంత అన్నను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ చూస్తు ఊరుకోరు. వైవీ సుబ్బారెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దుకు కుట్రలు చేస్తున్నారు.ఎవరి పతనాన్ని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు ఈ స్థాయికి దిగజారారు. కాంగ్రెస్ పెట్టిన కేసులను తట్టుకుని నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన దమ్ము, ధైర్యం, హీరోయిజాన్ని ఇష్టపడే చాలా మంది ఆయనతో నడుస్తున్నారు’అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరదు కళ్యాణి -
షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్‌బాబు
సాక్షి,తాడేపల్లి: షర్మిలకు మానవత్వం ఉందా అని, వైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలుపుతారా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్ 26) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.‘రేవంత్‌రెడ్డి,చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారు.షర్మిల పాదయాత్రను వైఎస్సార్, వైఎస్జగన్ అభిమానులు కలిసి సక్సెస్ చేశారు. షర్మిల కోసం వైవీసుబ్బారెడ్డి ఎన్నోత్యాగాలు చేశారు’అని సుధాకర్‌బాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు: పెద్దిరెడ్డి -
చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు: పెద్దిరెడ్డి
సాక్షి, కడప: రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. అలాగే, షర్మిలను ప్రత్యేకంగా ఏమీ పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల సూచనలు తీసుకుని జిల్లా కమిటీలు వేస్తాం. పార్టీని ప్రక్షాళన చేసి సమర్ధులైన వ్యక్తులకు పదవులు ఇస్తాం. విద్యుత్ చార్జీలు విషయంలో ఈరోజు పచ్చ పత్రికలు మాట్లాడటం లేదు. రూ.6వేల కోట్ల భారం చంద్రబాబు ప్రజలపై వేస్తున్నారు. ఇప్పుడు జగన్ తప్పిదం వల్ల చార్జీలు పెరుగుతున్నాయి అంటూ రాస్తున్నారు. వరదల నుంచి అన్నీ జగన్ వల్లే అంటూ అభూత కల్పనలు సృష్టిస్తున్నారు.రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారు. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేశారు. ప్రజలు ఇప్పటికే ఎవరి పరిపాలన ఏమిటో గమనించారు. క్రాప్ ఇన్స్యూరెన్స్ ఇప్పుడు రైతులే కట్టుకోవాలి అంటున్నారు. వ్యవసాయం దండగ ఆన్న వ్యక్తి రైతులను ఏ విధంగా ఆదుకుంటాడు?. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు. ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకూ షేర్లు బదలాయింపు జరగదు. ఆమెకు అన్నీ తెలుసు.. ఆమె పద్ధతి జగన్‌ని దెబ్బతీయాలనే విధంగా ఉంది. మేము ప్రత్యేకంగా ఆమెను పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
KSR Comment: చంద్రబాబు చక్రబంధంలో చెల్లెమ్మ
-
ఆస్తి కోసం నమ్మించి మోసం.. చెల్లెమ్మతో చెల్లు
-
అన్న నాశనాన్ని కోరుకున్న చెల్లి..
-
KSR Live Show: షర్మిలకు ఆస్తిలో భాగం లేదు.. సాక్ష్యాలు ఇవే! హైకోర్టు న్యాయవాది సంచలన నిజాలు
-
చెల్లెమ్మా ఇంత పనిచేస్తావా..! జగనన్న మనసు నీకు తెలియదా ?.. చంద్రబాబు ఉచ్చులో పడి..!
-
షర్మిలకు రాసిన లేఖలో.. అన్నగా జగన్ తాపత్రయం
-
నిజంగా మీకు వాటా ఉంటే కంపెనీ లిస్టులో మీ పేర్లు ఎందుకు లేవు ?
-
MOUలో ఉన్నదేంటి?.. సంతకం పెట్టిన షర్మిల.. సాక్షి చేతిలో కోర్టు ఇచ్చిన డాక్యుమెంట్
-
అన్న జైలుకు పోయినా సరే.. నాకు ఆస్తి కావాలి అంతే!
-
ఆస్తి కోసం మరీ ఇంత దారుణమా?
-
టీడీపీ.. కుటుంబ తగాదాలపై ఎందుకంత ఆసక్తి?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? అని ప్రశ్నించింది వైఎస్సార్సీపీ. నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగాలనే లక్ష్యం కాదంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? వైయస్.జగన్మోహన్రెడ్డిగారికి, ఆయన సోదరి షర్మిలమ్మ రాసిన లేఖని టీడీపీ అఫీషియల్ X హ్యాండిల్లో బిగ్ బ్లాస్ట్ అంటూ పోస్ట్ చేసి ఈ గొడవని రెచ్చగొట్టి, నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?.దీన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగాలనే లక్ష్యం కాదంటారా?. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఘోరమైన పాలనా వైఫల్యం నుంచి ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కాదా? దిగజారుతున్న లా అండ్ ఆర్డర్‌తో కడతేరుతున్న ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాల నుంచి, డయేరియా మరణాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ తప్పుడు రాజకీయాలు కాదా?రాజకీయంగా వైఎస్ జగన్ అంతాన్ని కోరుకుంటున్నవారితో తన వంతు పాత్ర పోషిస్తున్న ఘట్టం నేపథ్యంలో, ప్రజలకు అన్ని వాస్తవాలు తెలిసేలా వైఎస్ జగన్ తన సోదరికి రాసిన అన్ని లేఖలను, తన స్వార్జిత ఆస్తుల్లో ఇవ్వదలుచుకున్న ఆస్తుల వివరాలతో కూడిన MOUనుకూడా వెల్లడిస్తున్నాం. తప్పుడు ప్రచారాలు, వక్రీకరణలు కాకుండా వాస్తవాలకు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో విడుదల చేస్తున్నాం’ అని తెలిపింది. కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? వైయస్.జగన్మోహన్రెడ్డిగారికి, ఆయన సోదరి షర్మిలమ్మ రాసిన లేఖని @JaiTDP అఫీషియల్ X హ్యాండిల్ లో బిగ్ బ్లాస్ట్ అంటూ పోస్ట్ చేసి ఈ గొడవని రెచ్చగొట్టి, నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? దీన్ని… pic.twitter.com/1plILAl9cq— YSR Congress Party (@YSRCParty) October 25, 2024 -
ఈ 10 ప్రశ్నలకు.. సమాధానం చెప్పమ్మా చెల్లెమ్మా
-
కుట్ర, అవకాశవాదం ఒకవైపు.. ఇచ్చిన మాటకోసం నిలబడే నిజం మరోవైపు..
-
వైఎస్ఆర్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారు: పేర్నినాని
-
టీడీపీ కుట్రలో షర్మిల భాగమయ్యారు: వైవీ సుబ్బారెడ్డి
-
ఆ ఆస్తులన్నీ మా అన్న కష్టార్జితమే.. షర్మిల అన్ని తెలిసే సంతకం పెట్టింది.. Evidenceతో సహా నిజాలు బయటపెట్టిన సాక్షి
-
బెయిల్ రద్దు కుట్రలో భాగంగా బాబుతో కలిసి అన్నకే వెన్నుపోటు