south indian
-
బెస్ట్ కపుల్స్‌గా స్నేహ దంపతులు.. ఫ్రెండ్స్‌తో వెకేషన్ ప్లాన్ (ఫోటోలు)
-
‘సైమా’ 2024 అవార్డుల విజేతలు వీళ్లే! (ఫోటోలు)
-
ఫరా ఖాన్ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!
బాలీవుడ్ ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, దర్శకుడు ఫరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా రెసిపీలు, ప్రముఖ రెస్టారెంట్ల భోజనం గురించి అభిమానులతో షేర్ చేస్తుంటారు. యఖ్నీ పులావ్ నుంచి ఝలక్ దిఖ్లా జా షో సెట్స్‌లో నోరూరించే భోజనం వరకు ప్రతిదీ షేర్ చేస్తుంటారు. ఆ వీడియోలో ఎక్కువగా ఆహారప్రియులు ఇష్టపడే ప్రముఖ వంటకాలే ఉండటం విశేషం. అలానే ఈ సారి కూడా ముంబైలో ఒక రెస్టారెంట్లో పాడ్‌కాస్టర్ రాజ్ షమనితో కలిసి ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నవీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ముంబైలోని సౌత్ టిఫిన్హౌస్లో కండివలి అనే విచిత్రమైన తినుబండారాన్ని పరిచయం చేశారు ఫరా. ఈ మైండ్ బ్లోయింగ్ సౌత్ ఇండియన్ ఫుడ్‌ని రాజ్ షమానీతో కలిసి ఆస్వాదిస్తున్నట్లు వీడియోలో పేర్కొంది ఫరా ఖాన్. వారు అక్కడ టేబుల్ వద్ద కూర్చొన్నప్పుడూ సర్వర్ ఆ రెసీపీని తీసుకురాగనే ముందుగా వివిధ చట్నీలతో కూడిన ప్లేట్ ఒకవైపు మరోవైపు కండివలి అనే విచిత్ర తినుబండారం. ఆ ప్లేట్లో వివిధ రాష్ట్రాల్లో ఉండే ఫేమస్ ఇడ్లీలు ఉన్నాయి. ఇది చూస్తే ఇడ్లీలో ఇన్ని రకాలు ఉన్నాయా..? అని విస్తుపోతారు. అందులో బొగ్గు మాదిరిగా ఉండే ఇడ్లీ చూస్తే వామ్మో ఏంటిది అనుకుంటారు. ఫరా ఖాన్ కూడా వీడియోలో బొగ్గు ఇడ్లీని చూపిస్తూ ఇదేం ఇడ్లీరా బాబు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మిగిలి ఇడ్లీలు వరసగా లావా సాంబార్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ, ఆవిడి కుడుములాంటి ఇడ్లీ తదితరాలన్నింటిని వీడియోలో పరిచయం చేసింది. చివరగా రాజ్ కారప్పోడి నెయ్యితో ఉన్న ఇడ్లీని టేస్ట్ చేస్తూ బాగుందని చెబుతాడు. నిజంగానే బాగుందా? అని ఆశ్యర్యంగా అడుగుతుంది ఫరా. ఏం పర్లేదు బేషుగ్గా తినొచ్చు. బాగుంది ఇడ్లీ అని చెబుతాడు. ఫరా ఈ వీడియోని వ్యాపార సలహాలు అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వీడియోకి ఏకంగా లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder) (చదవండి: నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!) -
కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో దిగనున్నారు. భారతీయ మూలాలు ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించడం విశేషం. ఆమె నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె తల్లి తమిళనాడుకి చెందిన భారతీయురాలు, తండ్రి జమైకన్. ఆమె తల్లిదండ్రులిద్దరూ అమెరికాకి వలస వచ్చారు. అయితే కమలా హారిస్ ఆహార్యం ఎల్లప్పుడూ తన పూర్వీకులను ప్రతిబింబించేలా ఉండటం గర్వించదగ్గ విషయం. అదీగాక కమల హారిస్ చిన్నతనంలో తన తల్లి, చెల్లితో కలిసి తరుచుగా చెన్నై రావడంతో తన మూలాలను ఎన్నటికీ మరచిపోలేదని అంటోంది. అంతేగాదు 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా తమిళనాడు ప్రజలు ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలో ఉందని తెలిసి మరింత సంతోషం వ్యక్తం చేశారు. అంతేగాదు కమలా హారిస్ ట్రంప్‌పై విజయం సాధించాలంటూ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేయడం విశేషం. ఇక ఆమె తరుచుగా బహిరంగా ప్రచారాల్లో భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. అంతేగాదు ఒకానొక ఇంటర్వ్యూలో తమ ఇంట్లో ఎలాంటి ఆహారం ఉంటుందో వివరిస్తూ..దక్షిణ భారతీయ వంటకాలైన అన్నం, పెరుగు, బంగాళాదుంప కూర, పప్పు, ఇండ్డీ సాంబార్ తింటూ పెరిగాననని సగర్వంగా చెప్పింది. ఆమెకు భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమే అమెరికాలో ఉండే భారతీయ అమెరికన్ కమ్యూనిటీలకు దగ్గర చేసింది. అంతేగాదు తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ సాంబార్ తప్పనిసరిగా ఉంటుందని కూడా చెప్పారు కమలా హారిస్. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నప్పటికీ తన దేశ సంస్కృతిని, మూలాలను వదిలిపెట్టలేదు. అది కేవలం భోజనపరంగానే కాదు ఆహార్యం పరంగా కూడా పెద్ద బొట్టు, విభూతి పెట్టుకుని కనిపిస్తూ తరుచుగా వార్తల్లో నిలుస్తుంటారు కమలా హారిస్. దటీజ్ ఇండియన్ కదా..!(చదవండి: టీ అమ్మే వ్యక్తి కూతురు సీఏ అయ్యింది..ఏడుస్తూ తండ్రిని..!) -
తెలుగమ్మాయే కానీ తమిళంలో సూపర్ ఫేమస్.. డైరెక్టర్ని పెళ్లి చేసుకుని (ఫొటోలు)
-
ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్
నెట్టింట యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వుతోంది. అందులో విదేశాల్లోని రెస్టారెంట్లో మన దక్షిణభారతదేశ బ్రేక్‌ఫాస్ట్‌ల పేర్లు, ధరలు గురించి షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌లో.. తాను అమెరికాలోని ఓ రెస్టారెంట్ మన దక్షిణ భారతదేశ అల్పహారాలకు ఫ్యాన్సీ పేర్లు పెట్టి మరీ అమ్మేయడం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. వాటి ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం అన్నారు. నిజంగా ఆ పేర్లు వింటే గనుక ఖానే కా మజా ఖతం(ఇలాంటి పేర్లతో తింటే..తినడంలో ఉండే ఆనందం పోతుంది) అని క్యాప్షన్ జోడించి మరీ సదరు రెస్టారెంట్ మెనుని కూడా జత చేసి మరీ పోస్ట్ చేశారు. అందులో మన దక్షిణ భారతదేశపు అల్పాహారాల పేర్లుకు ఆ మెనులో ఉన్న ఫ్యానీ పేర్లు వరుసగా..వడకి "డంక్డ్ డోనట్ డిలైట్", ఇడ్డీకి "డంక్డ్ రైస్ కేక్ డిలైట్", దోసకి "నేక్డ్ క్రేప్" ఫ్యాన్సీ పేర్లు పెట్టి విక్రయించేస్తున్నారు. ఇక వాటి ధరలు చూస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. ప్లేట్ దోసె ధర రూ. 1400/-, ఇడ్లీ సాంబార్ ధర రూ. 1300/-, వడ ధర రూ.1400/-గా మెనులో ధరలు ఉండటం విశేషం. ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. బహుశా వాళ్లు ఈ వంటకాలు తయారు చేయడానికి ఎంతమంది పనివాళ్లను పెట్టుకున్నారో అందుకే కాబోలు చుక్కలు చూపించేలా ఈ ధరలు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. Who knew vada, idli, and dosa could sound so fancy? With these strange names khaane ka mazaa khatam! Agree 😂? pic.twitter.com/Px94gQGUAd— Harsh Goenka (@hvgoenka) July 2, 2024 (చదవండి: 'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం చేసిన ఆ పర్యటనే..) -
ఈ సౌత్ ఇండియన్ భామలపై ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
-
వడాపావ్ మంత్రం: పద్మాసని విజయరహస్యం
ఇంటి పనులతోనే సమయం సరిపోవడం లేదనే కంప్లైంట్ గృహిణుల నోట తరచూ వినిపిస్తుంటుంది. కొందరు మాత్రం కొద్దిపాటి ఖాళీ సమయాన్ని కూడాసద్వినియోగం చేసుకుంటూ తమని తాము తీర్చిదిద్దుకుంటారు. అలాంటి కొందరిలో పద్మాసని దరూరి ఒకరు. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న 53 ఏళ్ల పద్మాసని దరూరి గృహిణిగా ఉంటూ సంస్కృతంతో పాటు అనేక భాషల మీద పట్టు సాధించారు.భర్త ఉద్యోగరీత్యా పుణెలో ఉండటంతో అక్కడి స్థానిక వంటకాలను నేర్చుకున్నారు. పిల్లలు ఉద్యోగాలు చేసే సమయానికి వచ్చేసరికి నగరవాసులకు ‘పావ్ మంత్ర’ పేరుతో మహారాష్ట్రియన్ వంటకాలను పరిచయం చేస్తూ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగారు. లోనూ ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్‌ను ్రపారంభిస్తున్నారు.గృహిణిగా ఉంటూనే వ్యాపారవేత్తగా ఎదిగిన పద్మాసని దరూరిని పలకరిస్తే ఇలా ఎన్నో కబుర్లు మన ముందుంచారు.‘‘మనలో అభిరుచి ఉండాలే గానీ ఎక్కడ ఉన్నా దానిని వృద్ధిలోకి తీసుకురావచ్చు. మా వారి ఉద్యోగ రీత్యా పుణేలో ఉండేవాళ్లం. గృహిణిగా ఇల్లు, పిల్లల పనులు ఎప్పుడూ ఉండేవే. పిల్లలు హై స్కూల్‌కి వచ్చాక నేను వేదాంత అకాడమీలో చేరి మూడు నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకున్నాను. మన పురాణేతిహాసాలు చదువుతూ సబ్జెక్ట్‌పై పట్టు సాధించగలిగాను. కార్పొరేట్ కంపెనీలలో పని చేసేవారి ఆసక్తిని బట్టి, అక్కడకు వెళ్లి సంస్కృతం క్లాసులు తీసుకునేదాన్ని. రామాయణ, మహా భారతాల గురించి క్షుణ్ణంగా వివరించేదాన్ని. వేదాంత అకాడమీలో నేర్చుకున్న విషయాలను ఇంటికి వచ్చి పిల్లలకు చెబుతుండేదాన్ని. దీంతో వారు స్కూల్లో చదువుకున్న విషయాలే కాకుండా మన వేదాల గురించి, పురాణాల గురించీ కూడా తెలుసుకోగలిగారు.వివిధ రకాల భాషలుసంస్కృతంతో పాటు హిందీ, ఇంగ్లిష్, మరాఠీ.. ఇలా రకరకాల భాషలను ఆసక్తితో నేర్చుకున్నాను. వీటితోపాటు దేశంలోని అన్ని రకాల ్రపాచీన సంస్కృతుల గురించి తెలుసుకోవడం, వాటిని ఆచరించడం చేస్తుండేదాన్ని. ఈ క్రమంలో అన్ని రకాల వంటకాల తయారీని ఇష్టంగా చేసేదాన్ని. వాటిని మా ఇంట్లో వారికే కాదు మా చుట్టుపక్కల వారికీ రుచి చూపించేదాన్ని. అందరూ మెచ్చుకునేవారు. మా అబ్బాయిలిద్దరూ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తయ్యాక నాకు మరింత వెసులుబాటు దొరికింది. నా వంటకాల రుచితో బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. రుచిగా.. పావ్ మంత్రతరచూ ఇంట్లో బిజినెస్ ఆలోచనల గురించి చర్చ జరుగుతున్నప్పుడు నేను, మా పెద్దబ్బాయి కలిసి ఒక ఫుడ్ స్టార్టప్ ్రపారంభించాలనుకున్నాం. మా స్టార్టప్‌కి వాత్సల్య అనే పేరు అనుకున్నాం. పుణెలో స్థానిక ఫుడ్ వడాపావ్. అక్కడ స్ట్రీట్ఫుడ్గా దీనికి పేరుంది. హైదరాబాద్ వాసులకు ఈ వడాపావ్ రుచిని కొత్తగా అందించాలనుకున్నాను. పుణెలో వడాపావ్ టేస్ట్, మన దగ్గర టేస్ట్‌కి భిన్నంగా ఉంటుంది. ఏ పనైనా ఒకసారి మొదలుపెడితే దాంట్లో నూటికి నూరు శాతం దృష్టి పెట్టాల్సిందే అనుకొని వ్యాపారంలోకి దిగాను. పావ్‌కి విభిన్నమైన రుచిని తెప్పించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసి, విజయవంతమయ్యాం. మా పిల్లలు వామన్, కేశవ్ లు తమ పూర్తి సహకారాన్ని నాకు అందించారు. దాంతో ‘పావ్మంత్ర’ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను కరోనా సెకండ్ వేవ్‌లో మాదాపూర్‌లో ్రపారంభించాం. మా స్టార్టప్‌కి మహారాష్ట్ర, ఫార్సీ ఆంబియన్స్ వచ్చేలా ΄్లాన్ చేశాం. కొద్ది రోజుల్లోనే నోటి మాట ద్వారానే అందరికీ తెలియడంతో మంచి పేరు వచ్చింది. నేను కన్న కల రెండున్నరేళ్లలోనే సాకారం అయ్యింది. ఈ నెలలో పుణెలో ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్‌ను అందించబోతున్నాను. గృహిణిగా ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉన్న నేను 53 ఏళ్ల వయసులో ఇలా బిజినెస్ ఉమెన్‌గా ఎదుగుతానని అస్సలు ఊహించలేదు. నా అభిరుచికి మేరకు ఒక్కో ప్రయత్నం చేస్తూ ప్రయాణిస్తున్నాను. ఈ ప్రయాణంలో నా పిల్లలు తోడయ్యారు. తొంభై ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులూ నా ఆసక్తిని, అభిరుచిని గౌరవిస్తూ తమ ఆశీస్సులను అందిస్తున్నారు. అమ్మనాన్నలను చూసుకుంటూ, భర్త, పిల్లల బాగోగులను గమనిస్తూ, నన్ను నేనుగా మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నం ఎప్పుడూ నాకు మంచి ఫలితాలను ఇస్తూ వచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింతగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ వివరించారు పద్మాసని. – నిర్మలారెడ్డి -
Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
-
సౌత్ డైరెక్షన్‌కి సై అంటున్న బాలీవుడ్ హీరోలు!
బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలతో దక్షిణాది సినిమా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.సౌత్ డైరెక్టర్ల క్రేజ్ కూడా బాగా పెరిగింది. అందుకే బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి సై అంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తమిళ దర్శకుడు అట్లీ వంటి వారు బాలీవుడ్లో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాది దర్శకులతో ఉత్తరాది హీరోలు చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. సికందర్ సిద్ధం దాదాపు పదిహేనేళ్ల క్రితమే హిందీ ‘గజిని’ కోసం హిందీ హీరో సల్మాన్ ఖాన్, తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కలిసి పని చేయాల్సింది. అయితే ఆ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించగా మురుగదాస్ దర్శకత్వం వహించారు. ‘గజిని’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ మురుగదాస్ మాత్రం సల్మాన్ ఖాన్‌తో ఎలాగైనా ఓ సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్‌కు ఓ కథ చెప్పారు మురుగదాస్. ఈ కథ సల్మాన్‌కు నచ్చలేదట. దీంతో సెట్ కాలేదు. కానీ తనతో సినిమా చేయాలనుకుంటున్న మురుగదాస్‌కు మరో నరేషన్ ఇచ్చే చాన్స్ ఇచ్చారు సల్మాన్. ఈసారి సల్మాన్‌కు కథ నచ్చడంతో సినిమా సెట్ అయ్యింది. ఈ సినిమాకు ‘సికందర్’ టైటిల్ పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ఆరంభం కానుందట. వచ్చే ఏడాది ఈద్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ ‘ది బుల్’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు ‘షేర్షా’ వంటి హిట్ ఇచ్చిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. బాలీవుడ్ అపరిచితుడు విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘అన్నియన్’ (‘అపరిచితుడు’) సినిమా బ్లాక్‌బస్టర్. ఈ సినిమాను రణ్వీర్ సింగ్‌తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు శంకర్. దాదాపు మూడేళ్ల క్రితం ఈ సినిమా ప్రకటించినా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాల పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్, ‘గేమ్ చేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నారు శంకర్. ఈ సినిమాలు విడుదలయ్యాక రణ్వీర్ సింగ్‌తో శంకర్ సినిమా ఉంటుందట. అయితే ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో రణ్వీర్తో ‘అన్నియన్’ సినిమానే శంకర్ చేస్తారా? లేక కొత్త కథతో సెట్స్‌పైకి వెళ్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. దసరాకు దేవా ఈ దసరాకి షాహిద్ కపూర్‌ను ‘దేవా’గా థియేటర్స్‌కు తీసుకురావాలనుకుంటున్నారు మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్. షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్‌లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హిందీలో రోషన్ ఆండ్రూస్‌కు ‘దేవా’ తొలి చిత్రం. కాగా షాహిద్ కపూర్ నెక్ట్స్ ఫిల్మ్ కూడా దక్షిణాది దర్శకుడుతోనే ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్ రవితో ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ ఫిల్మ్ కమిటయ్యారు షాహిద్. ‘దేవా’ పూర్తి కాగానే ‘అశ్వత్థామ: ది సాగా...’ షూటింగ్ ఆరంభం అవుతుందట. బేబీ జాన్ వస్తున్నాడు వరుణ్ ధావన్‌ను ‘బేబీ జాన్’గా మార్చేశారు తమిళ దర్శకుడు కాలిస్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న సినిమా ‘బేబీ జాన్’. కాలిస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లు. ఈ సినిమా మే 31న రిలీజ్ కానుంది. హిట్ రీమేక్‌తో... తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ హిందీలో ‘సర్ఫిరా’గా రీమేక్ అవుతుండగా, అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. మాతృతకు దర్శకత్వం వహించిన సుధ కొంగరయే ‘సర్ఫిరా’కు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘సూరరై పోట్రు’లో నటించిన సూర్య ‘సర్ఫిరా’కు ఓ నిర్మాతగా ఉంటూ, గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది.ఇంకా తెలుగు దర్శకులు తేజ, గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ, తమిళ దర్శకుడు పా. రంజిత్ తదితరులు చెప్పిన కథలను హిందీ హీరోలు విన్నారని సమాచారం. -
బిగ్ బాస్ అశ్విని శ్రీకి ఇంత గొప్ప అవార్డా? (ఫోటోలు)
-
ముద్దుగా ఉండే బొద్దుగుమ్మ బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
చావుబతుకుల మధ్య పోరాటం.. వారం రోజులుగా ఐసీయూలో హీరోయిన్ (ఫోటోలు)
-
సౌత్ డైరెక్టర్ల వైపు చూస్తున బాలీవుడ్ టాప్ హీరోస్..!
-
‘అనువాదం’ బొమ్మ అదిరింది
కథ బాగుందా? బొమ్మ (సినిమా) అనువాదం అయినా తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే వసూళ్లు ఇస్తారు. అలా ఈ ఏడాది డబ్బింగ్ బొమ్మల వసూళ్లు బాగానే ఉన్నాయి. కొన్ని భారీ వసూళ్లు సాధిస్తే.. కొన్ని ఫర్వాలేదనిపించుకున్నాయి. కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఏది ఏమైనా ఈ ఏడాది అనువాదం బొమ్మ అదిరిందనే చెప్పాలి. ఆ విశేషాల్లోకి... మాతృక హిట్.. అనువాదం ఫట్ తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు తెలుగులో ఫర్వాలేదనిపించుకున్నాయి. కొన్ని మాతృకలో హిట్టయినా, ఇక్కడ ఆశించిన ఫలితం సాధించలేకపోయాయి. విశాల్ ‘మార్క్ ఆంటోనీ’, అదా శర్మ ‘ది కేరళ స్టోరీ’, ఎస్.జె. సూర్య, రాఘవా లారెన్స్‌ల ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’, రక్షిత్‌శెట్టి ‘సప్తసాగరాలు దాటి’ రెండు భాగాలు, దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత, కార్తీ ‘జపాన్’, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’, శివ రాజ్‌కుమార్ ‘ది ఘోస్ట్’, రిషబ్ శెట్టి ‘బాయ్స్ హాస్టల్’, పూ రాము, కాళీ వెంకట్ కీలక పాత్రల్లో నటించిన ‘దీపావళి’ వంటి చిత్రాలు మాతృకలో ఫర్వాలేదనిపించినా తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణపోందలేకపోయాయి. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’, వంటి హిందీ చిత్రాలు తెలుగులో హిట్ టాక్ని సొంతం చేసుకోలేక పోయాయి. జైలర్ రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆశించిన విజయాలు ఇవ్వకుండా ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచిన ఆయన ‘జైలర్’తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, రమ్యకృష్ణ జోడీగా నటించారు. ఈ మూవీలో జైలర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజనీ నటించారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ అతిథి పాత్రల్లో అలరించారు. తెలుగు, తమిళ భాషల్లో ‘జైలర్’ సూపర్ హిట్. వారసుడు.. లియో విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వారిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి.పోట్లూరి, పెరల్ వి.పోట్లూరి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో జనవరి 11న తమిళంలో రిలీజైంది. ‘వారసుడు’ పేరుతో తెలుగులోకి అనువదించి, సంక్రాంతి పోటీలోనే జనవరి 14న రిలీజ్ చేశారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులోనూ హిట్‌గా నిలిచింది. ఇక విజయ్ నటించిన మరో చిత్రం ‘లియో’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ తెలుగులో డబ్ చేసి, అక్టోబర్ 19నే రిలీజ్ చేశారు. తెలుగులో ‘లియో’ టైటిల్‌పై వివాదం చెలరేగినా, ఆ తర్వాత సద్దుమణిగింది. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లియో’ తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. పొన్నియిన్ సెల్వన్–2 కల్కి కృష్ణమూర్తి నవలపోన్ని యిన్ సెల్వన్ ఆధారంగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ 1’. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి, శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మణిరత్నం, సుభాస్కరన్ నిర్మాతలు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది విడుదలై, తమిళ్, తెలుగు భాషల్లో హిట్ అయింది. పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజైంది. తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేయగా మంచి వసూళ్లు రాబట్టింది. పఠాన్.. జవాన్ ‘జీరో’ (2018) సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్పై యాక్షన్ నేపథ్యంలో ఆదిత్యా చో్రపా నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ‘పఠాన్’ రికార్డులు సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఇక షారుక్ నటించిన మరో చిత్రం ‘జవాన్’ కూడా తెలుగులో ఓకే అనిపించుకుంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. షారుక్ నటించిన తాజా చిత్రం ‘డంకీ’ ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే మూడు విజయాలతో షారుక్ ఈ ఏడాది హ్యాట్రిక్ సాధించినట్లే. యానిమల్ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యానిమల్’. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న రిలీజైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని అడల్ట్ కంటెంట్‌పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ అవేవీ వసూళ్లను ఆపలేకపోయాయి. విడుదలైన రోజు నుంచి ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. బిచ్చగాడు 2 విజయ్ ఆంటోని కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘బిచ్చగాడు’ (‘పిచ్చైకారన్’). శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో విడుదలై ఘనవిజయం సాధించింది. తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘బిచ్చగాడు’ విడుదలైన ఏడేళ్లకు ఈ ఏడాది ‘బిచ్చగాడు 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. రిలీజ్ రోజున మిక్డ్స్ టాక్ వచ్చినా, మంచి వసూళ్లు రాబట్టింది. 2018 కేరళప్రాంతంలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘2018’. టోవినో థామస్, కుంచకో బోబన్, అపర్ణా బాలమురళి, లాల్, ఆసిఫ్ అలీ నటించారు. జూడ్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటోని జోసెఫ్ నిర్మించిన ఈ సినిమా మే 5న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. రూ. వంద కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. మలయాళంలో విడుదలైన 20 రోజులకే ఈ చిత్రం తెలుగులోనూ ‘2018’ పేరుతోనే అనువాదం అయింది. నిర్మాత ‘బన్నీ’ వాసు తెలుగులో విడుదల చేయగా, ఇక్కడ కూడా హిట్‌గా నిలిచింది. 2018లో కేరళలో వచ్చిన వరదలు, అప్పుడు ప్రజలు పడ్డ ఇబ్బందులు, భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. -
భారతీయ వంటకాలతో అదరహో అనిపిస్తున్న జపాన్ కుర్రాళ్లు! ఏకంగా..
జపాన్ వాసులు ఆహారాన్ని చేతితో తినడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వారు మన భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్‌ని నిర్వహిస్తున్నారంటే నమ్ముతారా!. వెంటనే జోక్ చేస్తున్నారా..!అని కచ్చితంగా అంటాం. కానీ ఇది నిజం. నమ్మశక్యంగా లేకపోయిన నమ్మకతప్పని నిజం. ఆ రెస్టారెంట్లో ఎక్కువ కస్టమర్లు కూడా జపాన్ వాసులు కావడం విశేషం. భారతీయులు ముఖ్యంగా విదేశాలకు వెళ్తే భారతీయ వంటకాలను కూడా పట్టకెళ్తారు. కనీసం ఊరు నుంచి ఎవ్వరైనా విదేశాలకు వస్తున్నారని తెలిసినా.. వెంటనే వారిని సంప్రదించి మనకు కావల్సినవి తెప్పించేసుకుంటాం. అదృష్టం కొద్దీ..మన దేశం నుంచి వచ్చి విదేశాల్లో సెటిల్ అయినవాళ్లు ఎవరైనా.. ఇండియన్ రెస్టారెంట్ పెట్టుకుంటే..హమ్మయ్యా మనోడిది అంటూ లొట్టలేసుకుంటూ తినేందుకు ఆ రెస్టారెంట్లో వాలిపోతాం. కానీ జపాన్‌లోని తడ్కా అనే ప్రాంతంలో క్యోటోలో ఈ కిక్ ఎ అనే సౌత్ ఇండియన్ రెస్టారెట్ ఉంది. ఐతే దీన్ని మన భారతీయులు నిర్వహిస్తున్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీన్ని ఇద్దరు జపాన్ కుర్రాళ్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు ఇష్టంగాతినే ఇడ్లీ, దోస, అన్నం, పప్పు తదితర వంటకాలన్నీ భారత చెఫ్‌లకు తీసుపోనీ విధంగా రుచికరంగా అందిస్తున్నారు. వాస్తవానికి జపాన్ వాసులు ఆహారాన్ని చాప్ స్టిక్‌లతో తప్పించి చేతితో తినేందుకే ఇష్టపడరు. అలాంటి వారు మన ఆహారాన్ని రుచికరంగా వండటమే విశేషమంటే..? మనలానే అక్కడ జపాన్ ప్రజలు మన వంటకాలను చేతితో తినడం మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక్కసారిగా వాళ్లు కూడా మన సంస్కృతిని ఫాలో అవుతున్నారా? అని షాకింగ్ అనిపిస్తుంది. అంతేగాదు ఈ రెస్టారెంట్‌కి మన భారతీయుల కంటే చైనా కస్టర్లే ఎక్కువగా వస్తారు. అందుకు సంబంధించిన విషయాన్ని గోవా ముఖ్యమంత్రికి మాజీ పాలసీ సలహదారు ప్రసన్న కార్తీక్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఆయన అందుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ రెస్టారెంట్‌ని నిర్వహిస్తున్న జపాన్ కుర్రాళ్లు ప్రతి ఏడాది చెన్నై వెళ్లి అక్కడ దోస, ఇడ్లీ తయారీ విధానాన్ని నేర్చుకుని వస్తుంటారని పోస్ట్‌లో పేర్కొన్నారు కార్తీక్. In the process, the two have truly embraced Indian culture from the bottom of their heart. They developed a deeper understanding of Hinduism and fell in love with it. pic.twitter.com/Jbhpglskyo — Prasanna Karthik (@prasannakarthik) October 29, 2023 పైగా చెన్నై వెళ్లిన ప్రతిసారి తిరువనమలై దేవాలయాన్ని సందర్శించడమే గాక భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి కొద్దిసేపు ధ్యానం చేసి వస్తుంటారని చెప్పుకొచ్చాడు. అంతేగాదు మన ఇండియన్ రెస్టారెంట్ల మాదిరిగా కాంప్లిమెంటరీ కాఫీని సైతం ఆ జపాన్ కుర్రాళ్లు అందించినట్లు వెల్లడించారు. ఈ కుర్రాళ్లిద్దరూ జపాన్ స్థాయిని ఒక్కసారిగా పెంచేశారంటూ ట్విట్టర్లో ప్రశంసలతో ముంచెత్తాడు. I don’t have coffee or tea. But when I was leaving, they gave me a complimentary cup of south Indian filter coffee. Since I did not want to be rude, I accepted it. It turned out to be the best filter coffee I’ve ever had. These guys took Japanese precision to an all new level. pic.twitter.com/ZETj1lUN9T — Prasanna Karthik (@prasannakarthik) October 29, 2023 (చదవండి: వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?) -
పంచెకట్టు, షేర్వాణీలో మెరిసిపోతున్న ఒబామా: ఫోటో వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి వేడుక సందర్భంగా దక్షిణ భారత వస్త్రాధారణలో మెరిసిపోతున్నాడు. ఆయన భార్య మిచెల్, కూతుళ్లు కూడా భారత సంప్రదాయ దుస్తుల్లో అలరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఒబామ్ కుటుంబం ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలో కింద హ్యాపీ దీపావళి అని కూడా ఉంది. వాస్తవానికి అవి మార్ఫింగ్ ఫోటోలే అయినపట్టికీ ఆ ఫోటోలు అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి ముంచెత్తించి.. కళ్తు తిప్పుకోనివ్వకుండా చేశాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని ప్రభుత్వ స్కూల్స్‌కి 2023 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించనుందట. ఈ విషయాన్ని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్‌లు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేగాదు దీపావళిని జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన సుమారు 2 లక్షల మంది న్యూయార్క్ వాసులను గుర్తించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని రాజకుమార్ ఈ సందర్భంగా అన్నారు. పైగా జూన్ మొదటి గురువారం జరుపుకునే వార్షికోత్సవాన్ని దీపావళిగా మార్చి మరీ సెలవు ప్రకటించనుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలను చూసి ఆయన భారత్ ఒబామా అని ఒకరు కిర్రాక్ ఒబామ అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. obama’s Diwali party outfit pic.twitter.com/Ny7c1Jl6le — bad bitch in booties 👢 (@lilcosmicowgirl) October 18, 2022 (చదవండి: భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు) -
గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్
Senior Actress Meena Receives UAE Golden Visa: ఈ మధ్య కాలంలో సినీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇచ్చే గోల్డెన్ వీసాలను అందుకుంటున్నారు. 2019 నుంచి ఈ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ అరుదైన గౌరవాన్ని తాజాగా సీనియర్ హీరోయిన్, నటి మీనాకు దక్కింది. ఈ వీసాను స్వీకరించిన మీనా దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్ఫోలో పాల్గొన్నారు. తనకు గోల్డెన్ వీసాను యూఏఈ ప్రదానం చేయడం పట్ల మీనా సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే అరబ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. ఈ వీసాను సాధించిన హీరోయిన్ త్రిష.. తొలి తమిళ కథానాయికగా అవతరించింది. తర్వాత అమలా పాల్‌ను కూడా గోల్డెన్ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్ లాల్ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ వీసాను పొందారు. -
ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్ మాత్రమే.. ఎందులో అంటే ?
Nithin Is The First South Indian Hero With Highest Views: బాలీవుడ్ ఆడియెన్స్‌కు కొన్నిసార్లు తమ చిత్రాలకంటే ఇతర భాష సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. అందుకే యూట్యూబ్‌లో బీటౌన్ చిత్రాలకంటే హిందీలో డబ్ అయిన మూవీస్‌కే ప్రజాదరణ వస్తోంది. ఇలా హిందీలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన ఏకైక సౌత్ ఇండియా హీరోగా నితిన్ మాత్రమే రికార్డ్‌కెక్కాడు. గత కొన్నేళ్లుగా యూట్యూబ్‌లో నితిన్ సినిమాలకు ఎక్కవ వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో తన చిత్రాలు హిందీలో డబ్ అవడమేకాకుండా బాలీవుడ్ ప్రేక్షక అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు నితిన్. నితిన్ నటించిన హిందీ డబ్బింగ్ చిత్రాలన్నింటికి కలిపి యూట్యూబ్‌లో 2.3 బిలియన్ల వ్యూస్ రావడం విశేషంగా మారింది. నితిన్ నటించిన తెలుగు మూవీస్ అన్నీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం భారీ మొత్తంగా వసూలు చేయడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్ఎస్ రాజా శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా చేస్తోంది. -
ఇండస్ట్రీలో మరో విషాదం.. లెజండరీ నటి కన్నుమూత
Actress KPAC Lalitha Passes Away Celebrities Condolences: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి కేపీఏసీ లలిత మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 22) కేరళలోని త్రిపుణితురలో కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేపీఏసీ సినిమాలో లలిత నటనకు అదే ఇంటిపేరుగా మారిపోయింది. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించింది ఈ లెజండరీ నటి. ఆమె ఐదేళ్ల సినీ కెరీర్లో 550కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేరళ సంగీత నాటక అకాడమీకి 5 సంవత్సరాలు చైర్‌పర్సన్‌గా సేవలు కూడా అందిచారు లలిత. దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్‌ను వివాహం చేసుకున్న ఆమె ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, 4 రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. 74 ఏళ్ల లలితకు కుమారుడు సిద్ధార్థ్ భరతన్, కుమార్తె శ్రీకుట్టి భరతన్ ఉన్నారు. లిలిత మృతిపట్ల సౌత్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. Rest in peace Lalitha aunty! It was a privilege to have shared the silver screen with you! One of the finest actors I’ve known. 🙏💔#KPACLalitha pic.twitter.com/zAGeRr7rM0 — Prithviraj Sukumaran (@PrithviOfficial) February 22, 2022 పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు అనేకమంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు. ఈ లెజండరీ నటి మృతిపట్ల కీర్తి సురేష్, మంజూ వారియర్ భావోద్వేగపు పోస్ట్‌లు పెట్టారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సంతాపం తెలియజేశారు. 'లలిత తన నటనా నైపుణ్యంతో విభిన్న తరాల హృదయాల్లోకి అల్లుకుపోయారు. చరిత్రలో నిలిచిపోయారు' అని పేర్కొన్నారు. Extremely saddened to hear about the passing of the legendary KPAC Lalitha aunty. My heartfelt condolences to the family. pic.twitter.com/nGqxO5tpGb — Keerthy Suresh (@KeerthyOfficial) February 22, 2022 -
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
Senior Director KS Sethu Madhavan Passed Away In Chennai: సినీ పరిశ్రమలో మరోసారి విషాదం నెలకొంది. దక్షిణ భారత ప్రమఖ దర్శకుడు కెఎస్. సేతు మాధవన్ కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న 90 ఏళ్ల సేతు మాధవన్ చెన్నైలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. 1961లో మలయాళంతో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కిపైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన స్త్రీ సినిమాను డైరెక్ట్ చేశారు సేతు మాధవన్. కేరళలోని పాలక్కడ్‌లో 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు కే. సుబ్రహ్మణ్యం సేతు మాధవన్. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్, ఉమ, సంతోష్ సేతు మాధవన్ ఉన్నారు. 1991లో మరుపక్కమ్ అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. -
విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే ?
Criminal Case Registered Against Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే బ్లాక్ బ్లస్టర్ మూవీ ఉప్పెన చిత్రంతో ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళంలో విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఆయన్ను అభిమానులు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. విజయ్‌తోపాటు అతని మేనేజర్ జాన్సన్‌లపై చర్యలు తీసుకోవాలని సైదాపేట కోర్టులో కేసు వేశారు. నవంబర్‌లో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు విజయ్‌పై గాంధీ అనే వ్యక్తి దాడి చేయగా.. అప్రమత్తమైన విజయ్ సేతుపతి మేనేజర్, ఇతర భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఈ విషయంపై పరువు నష్టం దావా వేసిన గాంధీ విజయ్‌పై తాజాగా క్రిమినల్ కేసు పెట్టాడు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళ్తున్నాని, బెంగళూరు ఎయిర్‌పోర్టులో విజయ్‌ని కలిశానని చెప్పాడు. అప్పుడు వారి ఇద్దరి మధ్య అపార్థాలు రావడంతో విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కూడా నటుడినని, కాబట్టే విజయ్ను పలకరించానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సూపర్ డీలక్స్ చిత్రానికిగానూ విజయ్ సేతుపతికి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చినందుకు అతడిని ప్రశంసించినట్లు తెలిపాడు. అయితే విజయ్ మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన కులాన్ని కించపరిచడాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై జరిగిన దాడిలో తన చెవికి దెబ్బ తగిలిందని, దీంతో చెవి పూర్తిగా వినిపించడం లేదని తెలిపాడు. అంతేకాకుండా అతను విజయ్, అతని మేనేజర్‌పై అస్సలు దాడి చేయలేదని చెప్పాడు. అలాగే ఘటన జరిగిన సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని విజయ్ సేతుపతి తప్పుడు ప్రచారం చేయడంతో తన పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లిందని, గతంలో రూ. 3 కోట్లు పరువు నష్టం దావా వేశాడు గాంధీ. ఇదీ చదవండి: విజయ్ సేతుపతిని తన్నమని రివార్డు.. వ్యక్తిపై కేసు నమోదు -
తెరపైకి బిస్కెట్ కింగ్ బయోపిక్.. ప్రధాన పాత్రలో ఎవరంటే ?
Prithviraj Sukumaran New Web Series On Biscuit King Rajan Pillai: వెండితెరపై ప్రముఖుల జీవిత చరిత్రలు బయోపిక్‌లుగా వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డర్టీ పిక్చర్ సినిమా నుంచి స్కామ్ 1992 వెబ్ సిరీస్ వరకు ఎన్నో జీవితగాథలు తెరపై, ఓటీటీల్లో సందడి చేశాయి. తాజాగా 'బిస్కెట్ కింగ్'గా పేరొందిన రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ వెబ్ సిరీస్ రానుంది. ఈ సిరీస్‌లో మలయాళీ దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పృథ్వీరాజ్ దర్శకుడిగా బాలీవుడ్లో చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇది. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసీఫర్' (మలయాళం) చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్‌గా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ నటించిన మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోశియమ్' సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను పవన్ కల్యాణ్, రానా హీరోలుగా భీమ్లా నాయక్‌గా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజన్ పిళ్లై ఒక వ్యాపారవేత్త. బ్రిటానియా ఇండస్ట్రీలో వాటాదారు. 1970లో సింగపూర్ కేంద్రంగా తన వ్యాపారాన్ని కొనసాగించి బిస్కెంట్ కింగ్‌గా ఎదిగారు. 1993లో సింగపూర్ వాణిజ్య వ్యవహారాల శాఖ అతనిపై విచారణ చేపట్టింది. సింగపూర్ ప్రభుత్వ సమాచారం మేరకు భారత పోలీసులు 1995 జూలై 4న కొత్త ఢిల్లీలోని ఓ హోటల్లో అరెస్ట్ చేశారు. అనంతరం తీహార్ జైలుకు పంపించారు. అనారోగ్యంతో రాజన్ పిళ్లై కస్టడీలోనే మరణించడంతో అప్పట్లో సంచలనమైంది. కె. గోవిందన్ కుట్టితో కలిసి రాజన్ సోదరుడు రామ్మోహన్ పిళ్లై 'ఏ వేస్టెడ్ డెత్: ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రాజన్ పిళ్లై' పేరుతో పుస్తకం కూడా రాశారు. 2001లో విడుదలైన ఈ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. -
ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది.. చెల్లిపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్
Sai Pallavi Post About Her Sister Debut Movie: సాయి పల్లవి పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన నటనతో, డ్యాన్స్‌తో ఎంతగానో అలరించింది. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా కన్నన్ అరంగ్రేటం చేసిన తమిళ చిత్రం 'చితిరై సెవ్వానమ్' ఇవాళ (డిసెంబర్ 3) ఓటీటీ సంస్థ జీ5లో విడదలైంది. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది సాయి పల్లవి. డిసెంబర్ 3 తనకు ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించింది. తన చెల్లెలు పూజా కన్నన్ నటించే ప్రతి సినిమాతో ఎదగాలని ప్రార్థిస్థున్నాని తెలిపింది సాయి పల్లవి. సాయి పల్లవి తన ఇన్‌స్టా గ్రామ్‌లో 'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, అనారోగ్యంతో ఉన్నట్లు నటించడం, అమ్మనాన్నలకు అబద్ధాలు చెప్పడం నుంచి క్లాస్‌లకు బంక్ కొట్టడం, డిప్రెషన్ సమంయలో కూడా చలాకీగా ఉండటం వరకు ఎదిగిన నా చెల్లిని, తన నటనను నేను మాత్రమే చూశాను. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. ఈరోజు చితిరై సెవ్వానమ్ చిత్రంతో నటిగా అరంగ్రేటం చేస్తోంది. మీరందరూ ఆ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దర్శకుడిగా అరంగ్రేటం చేస్తున్న సిల్వా మాస్టర్‌కు, దర్శక నిర్మాత విజయ్ సర్ మీకు శుభాకాంక్షలు. పూజా ఇది నీకోసం. నువ్ ఎంతగా ఆస్వాదించి పాత్రలో లీనమైతే ప్రేక్షకులు నిన్ను అంతలా ఆదరిస్తారు. నువ్ నీ జర్నీని ఆస్వాదించాలని, నీ చుట్టూ ఎప్పుడూ పాజిటివిటీ ఉండి మెరుగైన వ్యక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను నిన్ను ఎప్పటికీ కాపాడుతూ ఉంటాను.' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) 'చితిరై సెవ్వానమ్' చిత్రంతో స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా దర్శకుడిగా అరంగ్రేటం చేశాడు. తన వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వగానే తప్పిపోయిన ఐశ్వర్య అనే అమ్మాయి గురించి తండ్రి వెతుకుతూ ఉంటాడు. ఇందుకోసం పోలీసుల సహాయం తీసుకుంటాడు. మరీ అతను తన కుమార్తెను కనిపెట్టాడా లేదా అనేదే సినిమా కథ. ఇందులో సముద్ర ఖని, రిమా కల్లింగల్ కీలక పాత్రల్లో నటించారు. -
నయన తార కొత్త ఇల్లు కొనుగోలు.. ఎక్కడో తెలుసా ?
Nayantara Buys A New House At Poes Garden In Chennai: నయనతార.. ఈ స్టార్ హీరోయిన్ అందం, అభినయం గురించి ఎంత చెప్పిన తక్కువే. పుట్టింది కేరళలోని తిరువల్ల అయిన తెలుగు అమ్మాయికి ఏమాత్రం తీసిపోదు. లక్ష్మీ, తులసి, యోగి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. నయన్ తాజాగా చెన్నైలోని పొయెస్ గార్డెన్లో నాలుగు పడక గదుల ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలో తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కొత్త ఇంటికి మారనుందని ప్రచారం జరుగుతోంది. నయన్ కొత్త ఇళ్లు తీసుకున్న పొయెస్ గార్డెన్ చెన్నైలోని నాగరిక ప్రదేశాలలో ఒకటి. ఈ గార్డెన్‌కు మంచి సెలబ్రిటీ చరిత్ర కూడా ఉంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, రజనీకాంత్‌ల నివాసాలు ఈ పొయెస్ గార్డెన్‌లోనే ఉన్నాయి. రజనీ కాంత్ ఇంటిపక్కనే ధనుష్ తన డ్రీమ్ హౌజ్‌ను నిర్మిస్తున్నాడు. చెన్నైలోని పొయెస్ గార్డెన్లో భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అదే ప్రాంతంలో మరో ఇంటిని కూడా కొనుగోలు చేయాలని ఆలోచిస్తుందట. సుమారు అక్కడ ఫ్లాట్స్ కోట్లలో ఉండొచ్చని సమాచారం. నయనతార ఇటీవలే 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాతువాకుల రెండు కాదల్ సినిమా సెట్లో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో పుట్టిన రోజు జరుపుకుంది. వివిధ భాషల్లో చిత్రాలతో బిజీగా ఉన్న నయన్. ఈ సంవత్సరం ప్రారంభంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని చెప్పింది నయన తార.