Sri Lanka Crisis
-
శ్రీలంకలో కీలక పరిణామం.. 4 నెలల తర్వాత అలా!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతోంది శ్రీలంక. నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అధ్యక్షుడు, ప్రధాని భవనాలను వేలాది మంది ముట్టడించటంతో అప్పటి ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడి భవనం సమీపంలోని ప్రధాన నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు నిరసనకారులు. దేశ రాజధాని, గాలేఫోస్ సీఫ్రంట్‌లోని టెంట్లను తొలగిస్తున్నట్లు యూనివర్సిటీ విద్యార్థులు, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలోని బృందం తెలిపింది. స్థానిక హోటళ్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, టెంట్లను తొలగించాలని పోలీసులు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన 4 పిటిషన్లను సైతం ఉపసంహరించుకుంటున్నట్లు నిరసనకారుల ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే నిరసనకారుల టెంట్లను తొలగిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలు, ఇంధనం, ఆహార కొరత ఏర్పడటంతో ఏప్రిల్ 9న నిరసనలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఉద్యమం ఉధృతంగా మారింది. జులై 9న అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంలోకి వందల మంది నిరసనకారులు చొరబడ్డారు. దాంతో గొటబయ దేశం విడిచి పారిపోయారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధ్యక్ష భవనం, నివాసాలను నిరసనకారులు ఖాళీ చేశారు. పోలీసుల దాడుల్లో సుమారు 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆందోళనకారులు అరెస్టయ్యారు. అంతర్జాతీయంగా వచ్చిన వ్యతిరేకతో వాణిజ్యం సంఘం అగ్రనేత జోసెఫ్ స్టాలిన్‌ను గత సోమవారం విడుదల చేశారు. మరోవైపు.. గొటబయ రాజపక్స వారసుడిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రణీల్ విక్రమ సింఘే. దేశంలో మళ్లీ నిరసనలు జరగకుండా అత్యవసర పరిస్థితి విధించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: థాయ్‌లాండ్ చెక్కేసిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు -
Sri Lanka: రుణ ఉపశమనం కాదు.. రుణ న్యాయం కావాలి
శ్రీలంక పార్లమెంటులో జూలై 20న అధ్యక్షుడిగా విక్రమసింఘె ఎన్నిక, కొత్త ప్రధాని గుణవర్దనె నియామకం, ప్రధాని మోదీ వారిని అభినందించటం ఇటీవలి వార్తలు. విక్రమ సింఘె గెలుపు ఖాయమని ముందు రోజునే తేలిపోయిందనీ, గెలుపునకు భారత ప్రభుత్వ సహాయ సహకా రాలున్నాయనీ, ఆ ఇద్దరూ అమెరికా, యూరప్, ఇండియాలకి ఆమోదయోగ్యులే అని విశ్లేషణలు వెలువడ్డాయి. జూలై 19నే కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక ప్రభుత్వానికి పూర్తి సహకారం, ఐఎంఎఫ్ రుణం పొందటానికి తగిన సాయం చేస్తామని విదే శాంగమంత్రి జయశంకర్ చెప్పారు. పనిలోపనిగా ఇక్కడి రాష్ట్రాల రుణాలను, సబ్సిడీలను ఈ సందర్భంగా తప్పుపట్టే రీతిలో వివరించారు. ఇది అప్రస్తుతమనీ, శ్రీలంక ‘దేశం’ అప్పులను ‘రాష్ట్రాల’ అప్పులతో పోల్చి గందర గోళం సృష్టిస్తున్నారనీ, ఆ పేరుతో ఇక్కడ ‘రాజకీయాలు’ చేయటం, పరోక్షంగా రాష్ట్రాలను నిందించటం తగదనీ వివిధ పార్టీలు నిరసన తెలిపాయి. శ్రీలంకకు చెందిన 30 మంది ఆర్థిక, సామాజిక శాస్త్రాల నిపుణులు; మాజీ అధికారులు, విద్యార్థి కార్మిక రైతాంగం మత్స్యకారుల సంఘాల నేతలు అధ్యక్ష ఎన్నిక తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి ముఖ్య కారణం ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్ సావరీన్ బాండ్ (ఐఎస్బీ), అమెరికా, యూరపు దేశాల, ‘బ్లాక్ రాక్’ వంటి కమర్షియల్ రుణాలూ, వారి షరతులే. 2022 మే నెలలో శ్రీలంక రుణాలు 5 వేల కోట్ల డాలర్లు కాగా అందులో సగానికి పైగా పైన పేర్కొన్న రుణ సంస్థల వాటాయే. నిజానికి ఈ ఏడు కట్టాల్సిన రుణం 500 కోట్ల డాలర్లే. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం, వాటివల్ల భారాలు పెరిగి, టీ వంటి ఎగుమతులూ, టూరిజం ఆదాయం తగ్గి, అనేక దేశాల్లాగే శ్రీలంకా దెబ్బతిన్నది. స్వతంత్రం వచ్చాక శ్రీలంకలో బాకీలు తీర్చలేని స్థితికి చేరడం ఇదే మొదటిసారి. కాగా అతిశయోక్తులతో, తప్పుడు సమాచారంతో పై పాశ్చాత్య శక్తులు, వారి మీడియా విదేశీమారకం (డాలర్ల) కొరతనీ ‘దివాళా స్థితిగా చిత్రించి’ రుణదిగ్బంధనం వంటిది చేశారు. మానవాభివృద్ధి సూచికలో పైకి వచ్చిన శ్రీలంకని ప్రస్తుత రుణ సంక్షోభంతో ఇప్పుడు ‘అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం’గా (ఎల్డీసీ) పునర్వర్గీకరించ చూస్తున్నారు. అలాంటి దేశాలకు ఆర్థిక విదేశాంగ వ్యవహారాల్లో అటానమీ, సార్వభౌమాధికారం నిరాకరించబడుతుంది. ఇది నిజంగా దివాళా కాదు, ఇది వారు ‘సృష్టించిన డిఫాల్ట్’. తమ వ్యూహా నికి తగినట్టుగా వారు శ్రీలంక వనరులను, ఆస్తులను, పెట్టుబడులను తగ్గించి చూపి, ఆర్థిక–ద్రవ్య లెక్కలనూ, సూచికలనూ, అల్గారిథమ్స్– మ్యాట్రిసెస్నూ తారుమారు చేస్తున్నార’’నేది ఆ ప్రకటన సారాంశం. శ్రీలంకలో ‘ఆర్థిక ప్రజాస్వామ్య సమష్టి వేదిక’ పేరిట ఉన్న ఈ ప్రకటనలో ఐఎంఎఫ్‌తో కొద్దివారాల క్రితమే మొదలైన చర్చలలో పారదర్శకత బొత్తిగా లేదని ఆరోపించారు. ప్రపంచ సముద్ర రహదారుల్లో కీలక స్థావరంగా ఉన్న శ్రీలంక ‘క్వాడ్’లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ‘కోవిడ్–19 బెయిల్ అవుట్ ఫండ్’ పేరిట అమెరికా ప్రభుత్వం అనేక పేద దేశాలకు రుణాలు ఇచ్చి ఆయా దేశాల సంపదల్ని కాజేయటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్నీ, ప్రాజెక్టుల్నీ... చౌకగా, చాటుగా అమ్మేసే, ప్రైవేటీకరించే రీతిలో స్థానిక వనరుల ఆస్తుల విలువను తగ్గించి చూపుతున్నారనీ; దేశ ఇంధనం, ఆహార భద్రతలనూ, సార్వభౌమత్వాన్నీ బలిపెడుతున్నారనీ ఆరోపించారు. ‘యుగ ఘనవి పవర్ ప్లాంట్’ని ఇప్పటికే అమె రికాకు చెందిన కంపెనీ ‘న్యూఫోర్ట్రెస్’కు కారుచౌకగా కట్ట బెట్టారని ఉదహరించారు. ‘ఇప్పుడు కావల్సింది రుణ ఉపశమనం కాదు, రుణ న్యాయం’ అన్నారు. అర్జెంటీనా, గ్రీస్, లెబనాన్ దేశాల్ని ఉదహరించి, ‘సంక్షోభానికి ఐఎమ్ఎఫ్ కారణమే కాని పరిష్కారం కాజాలదు’ అని చెప్పారు. డాలరు ఏకచ్ఛత్రాధిపత్యాన్ని రద్దు చేసి, వివిధ కరెన్సీల బాస్కెట్‌తో లావాదేవీలు జరపాలనీ... కుబేరులపై పన్నులు వేసి వసూలు చేయాలనీ, ‘స్థానిక ఉత్పత్తుల్ని కొనాలి’ అన్న ఉద్యమాన్ని ప్రోత్సహిం చాలనీ వారు కోరారు. రాజపక్స కుటుంబాల వంటి వాటికాజేసిన ఆస్తులను రాబట్టడం అవసరమే కానీ అంతకు మించి రుణ న్యాయం, రుణాల రద్దు అవసరమని అన్నారు. మొత్తం మీద ఈ ప్రకటన శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితినీ, ప్రజల ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తోంది. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) - డా. ఎమ్. బాపూజీ సీఎస్ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త -
శ్రీలంక పోర్టుకు చైనా షిప్.. స్పందించిన భారత్!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతోంది శ్రీలంక. కొలంబో సంక్షోభానికి చైనా కుట్రపూరిత రుణాలేనని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలే.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో మళ్లీ తన లీలలు మొదలు పెట్టింది చైనా. తన అధీనంలో ఉన్న శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని హమ్‌బన్‌తోటా పోర్టుకు పరిశోధన, సర్వే నౌకను పంపిస్తోంది. అది ఆగస్టు 11న శ్రీలంక నౌకాశ్రయానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో స్పందించింది భారత్. పరిస్థితులను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. చైనా నౌక సోమవారం పోర్టుకు వచ్చే అంశంపై కేబినెట్ చర్చించినట్లు శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి బందులా గుణవర్ధెన పేర్కొన్నారు. ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత్, చైనాలు మాకు సాయం అందించాయి.’ అని పేర్కొన్నారు. అయితే.. చైనా వల్లే దేశంలో పరిస్థితులు దిగజారాయనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిరసన క్యాంపులను ఖాళీ చేసేందుకు ససేమిరా.. శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్ష భవనం సమీపంలోని గాలే ఫేస్ నిరసన క్యాంప్‌ను శుక్రవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే.. వాటిని తిరస్కరించారు నిరసనకారులు. నిరసనలు కొనసాగుతాయని, క్యాంపులను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఖాళీ చేయించేందుకు పోలీసుల వద్ద కోర్టు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ ప్రాంతాన్ని నిరసనలు చేసుకునేందుకు అనుమతించారని గుర్తు చేశారు. ఇదీ చదవండి: Raghuram Rajan: అందుకే భారత్‌కు శ్రీలంక పరిస్థితి రాలేదు -
Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడిగింపు
కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో సాదారణ స్థితికి వచ్చేలా కనిపించటం లేదు. ఇటీవలే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయన పదవి చేపట్టిన క్రమంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. నిరసనకారుల టెంట్లను తొలగించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. తాజాగా.. దేశంలో ఎమర్జెన్సీని మరో నెల రోజుల పాటు పొడిగించింది విక్రమ సింఘే ప్రభుత్వం. అత్యవసర పరిస్థితి పొడిగించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది ఆ దేశ పార్లమెంట్. దీనిపై ఓటింగ్ చేపట్టగా 120 మంది అనుకూలంగా ఓటు వేశారు. 63 మంది చట్టసభ్యులు వ్యతిరేకించారు. ప్రజాభద్రత, నిరాటంకంగా నిత్యావసరాల సరఫరా వంటి అంశాలను చూపుతూ జులై 18న దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రణీల్ విక్రమ సింఘే. ఆ ఆర్డినెన్స్‌కు 14 రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదం తెలపకపోతే అది రద్దవుతుంది. కానీ, తాజాగా పార్లెమెంట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో మరో నెల రోజుల పాటు దేశంలో అత్యవసర స్థితి అమలులో ఉండనుంది. సింగపూర్‌లో మరో 14 రోజులు గొటబయ.. ప్రజాగ్రహంతో దేశం విడిచి సింగపూర్ పారిపోయారు శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. జులై 14న మాల్దీవుల నుంచి సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆయనకు 14 రోజుల పర్యటక పాస్‌ను ఇచ్చింది ఆ దేశం. అయితే.. సమయం ముగియనుండటంతో మరో 14 రోజులు పొడిగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆగస్టు 11 వరకు గొటబయ సింగపూర్‌లో ఉండనున్నారని తెలిపింది. మరోవైపు.. సింగపూర్ నుంచి గొటబయ తిరిగి వస్తారని రెండు రోజుల క్రితం శ్రీలంక కేబినెట్ ప్రతినిధి బందులా గునవర్ధనే పేర్కొనటం గమనార్హం. సింగపూర్ వెళ్లిన తర్వాత ఓ హోటల్లో బస చేసిన గొటబయ.. ప్రస్తుతం ప్రైవేట్ ఇంటికి మారినట్లు సమాచారం. ఇదీ చదవండి: Volodymyr Zelensky: భార్య ఒలేనాతో జెలెన్స్కీ పోజులు.. నెటిజన్ల విమర్శలు -
Sri Lanka: శ్రీలంక ప్రజలకు మరో 12నెలల పాటు ఆ బాధ తప్పదటా..!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కనిపించటం లేదు. దేశంలో ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలక ప్రకటన చేశారు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి. మరో 12 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో విదేశీ మారక నిలువల కొరత ఉన్నందున వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులపై పరిమితులు కొనసాగుతాయని తెలిపారు. ‘దేశంలో విదేశీ మారక నిలువల కొరత కారణంగా.. వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులు పరిమితంగానే ఉంటాయి.’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు మంత్రి కాంచన విజేసేకర. చమురు రేషన్ వ్యవస్థను తీసుకురావటం వెనుకున్న కారణాలను వివరించారు. అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు తొలి అడుగుగా ఇంధన రేషన్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలు ప్రారంభం.. దేశంలో తీవ్ర చమురు కొరత ఉన్నప్పటికీ పాఠశాలలను సోమవారం పునఃప్రారంభించింది శ్రీలంక. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు మరో నెలరోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని కోరింది. మరోవైపు.. వచ్చే ఆగస్టులో 30వేల టన్నుల చొప్పున రెండు సార్లు చమురు దిగుమతులు చేసుకోనున్నట్లు లంక ఐఓసీ ఎండీ మనోజ్ గుప్తా తెలిపారు. ‘సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. పరిశ్రమలకు ఇంధన సరఫరా మా తొలి ప్రాధాన్యం.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! -
Gotabaya Rajapaksa: సింగపూర్‌లో ‘గొటబయ’కు ఊహించని షాక్..!
సింగపూర్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రజాగ్రహంతో దేశం విడిచిన గొటబయ రాజపక్స ప్రస్తుతం సింగపూర్‌లో తలదాచుకుంటున్నారు. అయితే.. అక్కడా ఊహించని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రజాహక్కుల గ్రూప్ గొటబయపై క్రిమినల్ కేసు పెట్టింది. యుద్ధ నేరాల ఆరోపణలతో గొటబయను అరెస్ట్ చేయాలంటూ.. సింగపూర్ అటార్నీ జెనరల్‌కు 63 పేజీల ఫిర్యాదును అందజేశారు ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్(ఐటీజేపీ) న్యాయవాదులు. 2009లో జరిగిన అంతర్యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న రాజపక్సే.. జెనీవా ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. అవి అంతర్జాతీయ న్యాయపరిధిలో భాగంగా సింగపూర్ దేశీయ ప్రాసిక్యూషన్‌కు లోబడిన నేరాలుగా పేర్కొన్నారు. పిటిషన్ ప్రకారం.. అంతర్యుద్ధం సమయంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టం, అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలను గొటబయ ఉల్లంఘించారు.‘అందులో హత్య, ఉరి తీయించటం, వేధించటం, అమానవీయంగా కొట్టటం, అత్యాచంర, ఇతర లైంగిక వేధింపులు, స్వేచ్ఛను హరించటం, మానసికంగా క్షోభకు గురిచేయంట వంటివి ఉన్నాయి. ఆర్థిక మాంద్యంతో ప్రభుత్వం పతనాన్ని చూసింది, అయితే శ్రీలంకలో సంక్షోభం నిజంగా మూడు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్రితం జరిగిన తీవ్రమైన అంతర్జాతీయ నేరాలతో ముడిపడి ఉంది. ఈ ఫిర్యాదు కేవలం అవినీతి, ఆర్థిక అవకతవకల గురించే కాదు.. తీవ్ర నేరాలకు బాధ్యత వహించాలని నమోదు చేశాం.’ అని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోస్మిన్ సూకా పేర్కొన్నారు. గొటబయ రాజపక్సను అరెస్ట్ చేసి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని కోరింది ఐటీజేపీ. 1989లో ఆయన ఆర్మీ కమాండర్‌గా ఉన్నప్పుడు.. సుమారు 700 మంది కనిపించకుండా పోయారని ఆరోపించింది. ముఖ్యంగా రక్షణ శాఖ సెక్రెటెరీగా ఉన్నప్పుడు ఆ నేరాలు మరింత పెరిగాయని తెలిపింది. తన కింది అధికారులకు టెలిఫోన్ ద్వారా నేరుగా ఆదేశాలు ఇచ్చి ప్రజలపై దాడి చేయించే వారని ఆరోపించింది. ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టి చోరీకి పాల్పడిన దుండగులు.. వీడియో వైరల్! -
Srilanka crisis: అధ్యక్షుడి భవనంలో విలువైన వస్తువులు మిస్సింగ్.. వారి పనేనా?
కొలంబో: ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ప్రజాగ్రహంతో దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడుకింది. ఇటీవలే కొత్త అధ్యక్షుడు, ప్రధాని బాధ్యతలు చేపట్టగా నిరసనలు కాస్త సద్దుమణిగినట్లు తెలుస్తోంది. అయితే.. జులై 9న గొటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ అధ్యక్ష భవనాన్ని చుట్టు ముట్టారు నిరసనకారులు. ప్రధాని నివాసానికి నిప్పు పెట్టారు. అధ్యక్షుడి భవనంలోకి ప్రవేశించి రచ్చ రచ్చ చేశారు. ఇదే అదునుగా కొందరు చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది. అధ్యక్ష, ప్రధాని భవనాల్లోని అత్యంత విలువైన, పురాతనమైన 1,000కిపైగా వివిధ కళాకృతులు కనిపించకుండా పోయాయి. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. రెండు భవనాల్లో ఎన్ని కళాఖండాలు మిస్సయ్యాయనేది ప్రాథమిక విచారణ తర్వాత తేలుతుందని అధికారులు తెలిపారు. అయితే.. శ్రీలంక పురావస్తు శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేకపోవటం వల్ల కచ్చితమైన సంఖ్యను కనిపెట్టలేరని వెబ్ పోర్టల్ కొలంబో పేజ్ పేర్కొంది. వెయ్యికిపైగా విలువైన కళాఖండాలు చోరీకి గురైన సంఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. భవనాల ముట్టడి.. ఆర్థిక సంక్షోభానికి పాలకుల నిర్ణయాలే కారణమని, అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలనే పిలుపు మేరకు లక్షల మంది ఒక్కసారికి రోడ్లపైకి వచ్చారు. జులై 9న అధ్యక్ష భవనాన్ని చుట్టు ముట్టారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఈ క్రమంలో భవనంలోకి ప్రవేశించిన నిరసనకారులు అక్కడ గుట్టలకొద్ది నోట్ల కట్టలను గుర్తించి పోలీసులకు అప్పగించారు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదీ చదవండి: Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు -
శ్రీలంకకు జిన్‌పింగ్ ఆఫర్..
బీజింగ్: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమ సింఘేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంక త్వరలోనే వాటి నుంచి బయటపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లంక ఆర్థికంగా, సామాజికంగా కోలుకుంటుందని, చైనా నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి ఆ దేశం చేసిన అప్పులే ప్రధాన కారణం. చైనాకు లంక దాదాపు 5 బిలియన్ డాలర్ల అప్పు ఉంది. కానీ వాస్తవానికి అది 10 బిలియన్ డాలర్లు అయి ఉంటుందనే అంచనాలున్నాయి. చైనా తర్వాత భారత్‌కు 3.8 బిలియన్ డాలర్లు రుణపడి ఉంది లంక. జపాన్‌కు కూడా 3.5 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వివరాల ప్రకారం మరో బిలియన్ డాలర్లు ఇతర సంపన్న దేశాల నుంచి రుణంగా తీసుకుంది. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడే పరిస్థితి తెచ్చుకుంది. గొటబాయ రాజపక్స రాజీనామా అనంతరం రణిల్ విక్రమ సింఘే గురువారం నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. లాయర్ అయిన ఆయనకు ఆరు సార్లు ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే శ్రీలంక ప్రజలు మాత్రం రణిల్ విక్రమ సింఘేను కూడా వ్యతిరేకిస్తున్నారు. కొద్ది నెలలుగా లంకేయులు చేస్తున్న ఆందోళనలకు భయపడి గొటబాయ గతవారమే దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చదవండి: చేతులెత్తేస్తున్న రష్యా సైన్యం.. కోలుకోలేని దెబ్బకొట్టేందుకు ఉక్రెయిన్ సిద్ధం! -
శ్రీలంకలో అర్ధరాత్రి అలజడి.. నిరసనకారులపై విరుచుకుపడిన బలగాలు!
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశ అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నిరసనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోనే ప్రధాన క్యాంప్‌పై గురువారం అర్ధరాత్రి వందల మంది ఆ దేశ భద్రతా బలగాలు, పోలీసులు దాడులు చేపట్టారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు. అధ్యక్షుడి సెక్రెటేరియట్ భవనం ముందు నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించే పనులు చేపట్టాయి భద్రతా బలగాలు. అయితే.. తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు నిరసనకారులు. ఏప్రిల్ 9 నుంచి అధ్యక్షుడి కార్యాలయం ప్రవేశ ద్వారాన్ని మూసివేసిన వారు.. కొత్త అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. ‘ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే మాకు విజయం సాధ్యమవుతుంది.’ అని నిరసన బృందాల ప్రతినిధి లాహిరు వీరసేకర పేర్కొన్నారు. సముద్రతీర కార్యాలయాన్ని సైనికులు చుట్టుముట్టారు. ఏప్రిల్ నుంచి వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు అవసరమైన సామగ్రిని అందించడానికి ఏర్పాటు చేసిన అనేక తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు. అధ్యక్ష భవనం సమీపంలో తమకు నిరసనలు చేపట్టేందుకు చోటు చూపించాలని డిమాండ్ చేశారు. ‘రణీల్ విక్రమసింఘే మమల్ని చెదరగొట్టాలనుకుంటున్నారు. వారు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. కానీ మేము వదిలిపెట్టం. నీచ రాజకీయాల నుంచి దేశాన్ని విడిపించటమే మా లక్ష్యం.’ అని స్పష్టం చేశారు. #WATCH | Sri Lanka: Tents of protestors being dismantled by the armed security personnel amid a late-night clampdown outside the premises of the Sri Lankan Presidential Secretariat in Colombo pic.twitter.com/yuhRWU0lRj — ANI (@ANI) July 21, 2022 ఇదీ చదవండి: డ్రాగన్ చైనా వల్లే లంకేయులకు ఈ గతి.. ప్రపంచ దేశాలకు ఇదే హెచ్చరిక! -
దేశాన్ని చక్కబెడతారా?
పాలకుడు మారితే పరిస్థితులు మారతాయని ఎక్కడైనా అనుకుంటారు. ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభానికి ప్రయాణిస్తున్న శ్రీలంకకు ఆ సూత్రం పని చేయకపోవచ్చు. దేశాన్ని వదిలి పారిపోయిన గొటబయ రాజపక్సే స్థానంలో ఆయన పార్టీ ఆశీస్సులతోనే రణిల్ విక్రమసింఘే గురు వారం కొత్త అధ్యక్షుడిగా కొలువు తీరడంతో ఇప్పుడు పలువురి అనుమానం ఇదే. గొటబయ బదులు ఆయన మాట జవదాటని సన్నిహితులే గద్దెపైకి చేరడంతో పేర్లు మారాయే తప్ప, పాలన మారుతుందా అని సందేహిస్తున్నారు. 1977లో రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఆరుసార్లు ప్రధాని పదవినెక్కి, ఏ ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని ఘనత రణిల్ది. కథ ముగిసిందనుకున్న ప్రతిసారీ రాజకీయంగా పునరుత్థానమై, గత అయిదు దశాబ్దాల శ్రీలంక రాజకీయ చరిత్రలో ‘జిత్తులమారి నక్క’గా పేరొందారు. అధ్యక్షపదవి కోసం పలుసార్లు విఫలయత్నం చేసి, ఎట్టకేలకు బుధవారం పార్లమెంటరీ రహస్య బ్యాలెట్లో జీవితకాల వాంఛ నెరవేర్చుకున్నారు. ఇక దేశానికి తొమ్మిదో అధ్య క్షుడిగా ఎంతకాలం నిలబడతారు, ఎలాంటి ఎత్తులు జిత్తులతో కథ నడుపుతారన్నది ఆసక్తికరం. లంక చరిత్రలో తొలిసారిగా నేరుగా ఎంపీల మద్దతుతో ఎన్నికైన ఈ మాజీ వకీలు గురువారం పదవీ బాధ్యతలు చేపడుతూనే, ప్రజాందోళనకారుల్ని ‘ఫాసిస్టులు’గా అభివర్ణించారు. ఉక్కుపాదం మోపుతానని తేల్చేశారు. పాఠశాలలో చిన్నప్పటి తన సహపాఠీ దినేశ్ గుణవర్దనను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే పనిలోపడ్డారు. గొటబయ వర్గం మద్దతుతో సాగిన ఎన్నిక కానీ, పదవీ స్వీకారోత్సవానికి హాజరైన గొటబయ అన్న మహిందా ఆత్మీయత కానీ, రాజపక్సేయులకు నమ్మినబంటైన దినేశ్ ఎంపిక కానీ చూస్తే – ఒకటి స్పష్టం. రణిల్ నుంచి రాజపక్సేల వ్యతిరేక పాలననైతే చూడలేం. గతంలో ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్ రాజకీయంగా రాజపక్సేలకు ప్రతిపక్షమే. కానీ, వ్యక్తిగత అనుబంధాలతో వివాదాస్పద రాజపక్సే కుటుంబానికి ఆయన వీర విధేయుడు. కాబట్టి, దేశ దుఃస్థితికి కారణమైన రాజపక్సేలను గతంలో తాను ప్రధానిగా ఉన్నప్పటిలానే ఇప్పుడూ ఆయన కాపాడతారని నిరసనకారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమం ద్వారా తాము డిమాండ్ చేస్తున్న రాజ్యాంగపరమైన మార్పు కానీ, చివరకు అధ్యక్షుడికి ముద్దరముడుపుగా అధికారాలు కట్టబెట్టే ‘ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ’ విధానాన్ని కానీ రణిల్ మార్చకపోవచ్చని అనుమానిస్తున్నారు. అంటే, మొదట ప్రధాని స్థానం నుంచి మహిందా, తాజాగా అధ్యక్ష పదవి నుంచి ఆయన తమ్ముడు గొటబయ తప్పుకున్నా లంక వాసులు నిజాయతీగా ఆశించిన మార్పు రానే లేదు. రణిల్ తాజా వ్యాఖ్యలతో అసహనం పెరిగి, ఆందోళనలు కొనసాగే సూచనలున్నాయి. ఒకప్పుడు బలమైన ‘యునైటెడ్ నేషనల్ పార్టీ’ (యూఎన్‌పీ)కి నేతగా వెలిగినా, ఆనక జనా దరణ కోల్పోయి, 2020లో జాబితా విధానంతో పార్లమెంట్లో తమ పార్టీకి ఏకైక ప్రతినిధిగా మిగిలారు రణిల్. మొన్న మే దాకా రాజకీయంగా దాదాపు తెర మరుగైన ఆయనకు ఆపద్ధర్మ ప్రధాని హోదా, ఇప్పుడు దేశాధ్యక్ష హోదా అనూహ్యంగా వచ్చి ఒళ్ళోపడ్డాయి. లెక్కప్రకారం గొట బయ పదవీకాలం ముగిసే 2024 నవంబర్ దాకా ఆయన అధ్యక్ష హోదాలో ఉండాలి. ఇది ఆయనకు ముళ్ళకిరీటమే. కానీ, ఆర్థిక వ్యవహారాల్లో దిట్టగా పేరున్న ఈ పాశ్చాత్య అనుకూల సంస్కరణవాదికి 2001లో సింహళాన్ని ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలాంటి ఇంద్రజాలం చేయగలరా? చైనా పన్నిన అప్పుల ఉచ్చులో చిక్కుకుపోవడమే సింహళ ఆర్థిక సంక్షోభానికి కారణమని అమెరికాకు చెందిన సీఐఏ లాంటివి తాజాగా ఆరోపిస్తున్నా, అది నిజం కాదని విశ్లేషకుల మాట. కొలంబోకున్న అప్పుల్లో చైనావి సుమారు 10 శాతమే అనీ, లంకేయుల వార్షిక విదేశీ రుణ సర్వీ సింగ్లోనూ అవి 5 శాతం మించవనీ వారి లెక్క. అనేకచోట్ల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి అధిక వడ్డీ రేట్లకు తెచ్చిన అంతర్జాతీయ సార్వభౌమ బాండ్లు ఈ ద్వీపదేశపు విదేశీ మారక నిల్వలు కరిగి, ఖాళీ అయిపోవడానికి ఓ ప్రధాన కారణం. 2002కి ఆ బాండ్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం 1.5 బిలియన్ డాలర్లు మించి, మొన్న మేలో చెల్లించలేక చేతులెత్తేసి, దేశాన్ని దివాళా తీయించింది. ఆర్థిక, పాలనా సంస్కరణలే ఇప్పుడు రణిల్‌కు దిక్కు. సంప్రతింపుల్లో 3.5 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ కార్యక్రమానికి ఓకే చెబితే, ఇతర ద్వైపాక్షిక సాయాలకూ మార్గం సుగమం అవుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని పీడిస్తున్న అవినీతి, అధికార అలసత్వాన్ని వదిలించుకోవాలి. భారత్ లాంటి స్నేహదేశాలతో ఆర్థిక వారధి నిర్మించుకోవాలి. వివాదాస్పద ప్రాజెక్టులకు 6 శాతం వ్యాపార వడ్డీ రేటుతో అప్పులిచ్చి, ముక్కుపిండి వసూలుకు దిగిన చైనా కన్నా, ఆహారం, ఆరోగ్యం, ఇంధనాల సాయంలో తోడు నిలిచిన భారత్‌తో దోస్తీ పెంచాలి. భారత్ సైతం హాంగ్‌కాంగ్ – చైనా నమూనాలో ద్వీపదేశంతో వాణిజ్య – పెట్టుబడుల జోడీ కడితే ఉభయతారకం. గత రెండు నెలల్లో ఆపద్ధర్మ ప్రధానిగా కొంత ప్రయత్నించిన రణిల్ ఇకపై ఏం చేస్తారో చూడాలి. అయితే, పులుకడిగిన ముత్యాన్నని చెప్పుకున్నా, గతంలో కేంద్ర బ్యాంకులో ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి ఆరోపణల్ని ఎదుర్కొన్న ఆయన ఈసారీ అలాంటి బాట పడితే జాతి క్షమించదు. సింహళంతో పాటు ఇప్పుడు యావత్ ప్రపంచం చూపూ రణిల్ మీదే! -
చైనా దారుణాలతోనే శ్రీలంకకు ప్రస్తుత దుస్థితి!
వాషింగ్టన్: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పతనానికి చైనానే కారణమని అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) చీఫ్ విలియమ్ బర్న్స్ ఆరోపించారు. చైనా పెట్టుబడులపై కొలంబో 'మూగ పందాలు' వేసిందని, అదే విపత్తు పరిస్థితులకు దారి తీసిందన్నారు. ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్‌లో మాట్లాడారు సీఐఏ చీఫ్. ‘చైనీయులు తమ పెట్టుబడుల కోసం ముందు ఆకర్షనీయమైన చర్యలు చేపడతారు. ఆ తర్వాతే అసలు విషయం బయటకు వస్తుంది. చైనా వద్ద భారీగా అప్పులు చేసిన శ్రీలంక పరిస్థితులను ప్రపంచ దేశాలు ఓసారి చూడాలి. వారు తమ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై మూగ పందాలు వేశారు. ఇప్పుడు విపత్తు వంటి పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు. దాని ద్వారా ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి దారి తీసింది.’ అని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలోని దేశాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు సైతం శ్రీలంక పరిస్థితులు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు సీఐఏ చీఫ్. చైనాతో శ్రీలంక ఏ విధంగా వ్యవహరించిందే ఓసారి పరిశీలించాలని సూచించారు. చైనాతో పాటు చాలా దేశాల నుంచి శ్రీలంక అప్పులు చేసిందని గుర్తు చేశారు. 2017లో 1.4 బిలియన్ డాలర్ల రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఓ పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చిందని గుర్తు చేశారు. 21వ శతాబ్దంలో భౌగోళికంగా అమెరికాకు చైనానే ఏకైక సవాలుగా పేర్కొన్నారు. తాహతకు మించి అప్పులు చేస్తున్న దేశాలు శ్రీలంకను చూసి గుణపాఠం నేర్చుకోవాలని ఐఎంఎఫ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా గత శనివారం హెచ్చరించారు. ఆయా దేశాలకు ఇదొక హెచ్చరికగా పేర్కొన్నారు. ఐఎంఎఫ్ హెచ్చరిక చేసిన కొద్ది రోజుల్లోనే సీఐఏ చీఫ్ ఈ వాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. 1948, స్వాతంత్య్రం సాధించిన తర్వాత శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరైన ఆహారం, ఔషదాలు, వంట గ్యాస్, చమురు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. అధ్యక్షుడిగా విక్రమ సింఘే ప్రమాణం.. గొటబయ రాజపక్స స్థానంలో అధ్యక్షుడిగా ఎన్నికైన రణీల్ విక్రమ సింఘే.. పార్లమెంట్లో జరిగిన కార్యక్రమంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు. బుధవారమే విక్రమ సింఘేను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకుంది పార్లమెంట్. సింఘేకు 134 ఓట్లు వచ్చాయి. ఇదీ చదవండి: Sri Lanka Crisis: శ్రీలంకలో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన -
శ్రీలంకలో మానవ హక్కులపై ‘సంక్షోభం’ పిడుగు.. ఐక్యరాజ్య సమితి ఆందోళన
కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలకు తక్షణం మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణుల బృందం కోరింది. అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి సాయం అందించాలని సూచించింది. శ్రీలంకలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు మానవ హక్కుల నిపుణులు.' శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలి. అది కేవలం మానవతా సంస్థల నుంచే కాదు.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రైవేటు లెండర్స్, ఇతర దేశాలు ముందుకు రావాలి.' అని పేర్కొన్నారు. శ్రీలంకలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్తు, ఇంధన సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ పతనంపై తొమ్మిది మంది నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మానవ హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. సరైన ఆహారం, వైద్యం అందకపోవటం వల్ల తీవ్ర అనారోగ్యాలు ఎదురవుతాయని, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సహాయం అవసరమని తెలిపింది. అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ మిచెల్ బచెలెట్. హింసాత్మక ఘటనలు జరగటాన్ని ఖండించారు. ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు తీసుకునే నిర్ణయాల్లో మానవ హక్కులను ప్రధానంగా చూడాలన్నారు. ప్రభుత్వం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్లే సంక్షోభం తలెత్తిందని తెలిపారు. ఇదీ చదవండి: Sri Lanka Crisis: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే! -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై ప్రచారం.. భారత్ రియాక్షన్ ఇదే..
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి నాయకులను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నించిందని విదేశీ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను కొలంబోలోని భారత హైకమిషన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార, కల్పిత ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈమేరకు ట్విట్టర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు ఎలాంటి ప్రమేయం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం, కల్పితం. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు, రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకోదు' అని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి మాల్దీవులకు పారిపోయినప్పుడు కూడా భారత్ సహకరించిందని శ్రీలంక మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు కూడా భారత హైకమిషన్ స్పందించింది. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేసింది. శ్రీలంక పార్లమెంటులో నూతన అధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేనే విజయం సాధించారు. మొత్తం 225 మంది సభ్యులకు గానూ ఆయనకు అనుకూలంగా 134 ఓట్లు వచ్చాయి. చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే -
శ్రీలంక మహిళల దుస్థితి.. బుక్కెడు బువ్వ, మందుల కోసం సెక్స్ వర్కర్లుగా..
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది శ్రీలంక. ప్రజలు తినడానికి తిండిలేక పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది . ఇప్పుడు అక్కడి మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి వస్త్రపరిశ్రమలో పనిచేసే మహిళలు ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాయి. కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి 'ఆయుర్వేద స్పా'ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. సెక్స్ వర్కర్లుగా చేరుతున్న మహిళల సంఖ్య 30 శాతం వృద్ధి చెందింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు వీరంతా వస్త్రపరిశ్రమ రంగంలో పనిచేసిన వారే కావడం గమనార్హం. ఉద్యోగం పోతుందనే భయంతో గత్యంతరం లేకే తాము ఈ ఊబిలోకి దిగుతున్నట్లు ఓ మహిళ చెప్పింది. ఉద్యోగం చేస్తే తమకు నెలకు రూ.28,000 నుంచి 35,000వరకు మాత్రమే వచ్చేదని, కానీ వ్యభిచారంలో రోజుకు రూ.15,000 సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని ఆమె పేర్కొంది. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులకు అండగా ఉండేందుకు మహిళలు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదని శ్రీలంక సెక్స్ వర్కర్ల న్యాయవాద సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషిల దండేనియా తెలిపారు. దేశంలో ఇతర వృత్తులతో పోల్చితే వ్యభిచారంలోనే అత్యంత వేగంగా డబ్బు సంపాదించవచ్చనే వాళ్లు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యావసరాల కోసం.. నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆహారం, ఔషధాల కోసం కొంతమంది మహిళలు దుకాణ యజమానులతో శృంగారంలో పాల్గొంటున్నారనే విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కొలంబో పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి చోట్ల పోలీసుల సహకారంతో వ్యభిచారం జరుగుతున్నట్లు నివేదికలు బహిర్గతం చేశాయి. వ్యభిచారం సాఫీగా చేసుకునేందుకు కొంతమంది బ్రోకర్లు మహిళలను పోలీసులతో బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేస్తున్నట్లు వెల్లడించాయి. చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే -
మీ అప్పుల కతేంది?.. కేంద్రాన్ని నిలదీత
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కాస్త అధికార బీజేపీ, బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి వేదికగా మారింది. శ్రీలంక ఆర్ధిక పరిస్థితులకు మితిమీరన అప్పులే కారణమన్న కేంద్రం, ఆ క్రమంలో పలు రాష్ట్రాలు చేస్తున్న అప్పులను ప్రస్తావించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్రం తీరును బీజేపీయేతర పక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శ్రీలంక సంక్షోభంపై చర్చకని పిలిచి రాష్ట్రాల అప్పులను చర్చకు పెడతారా అంటూ ధ్వజమెత్తాయి. ముందుగా కేంద్రం చేస్తున్న అప్పుల లెక్కలు చెప్పాలంటూ గట్టిగా నిలదీశాయి. దాంతో వాతావరణం వేడెక్కింది. శ్రీలంక సంక్షోభంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే సహా అన్ని విపక్షాలు పాల్గొన్నాయి. శ్రీలంక ప్రస్తుత పరిస్థితులు, మనపై దాని ప్రభావం, లంకకు భారత సాయం తదితరాలపై జైశంకర్ వివరించారు. లంక ఆర్ధిక, రాజకీయ సంక్షోభానికి కారణాలు, పర్యావసానాలు, దివాలాకు కారణమైన అప్పులపై విదేశాంగ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరిగిన అప్పులతో తిప్పలు, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రస్తావించారు. ఆ వెంటనే పలు రాష్ట్రాల అప్పులపై కేంద్రం ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలను ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల అప్పులనే ప్రస్తావించడంతో భేటీ ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ అప్పులను ప్రస్తావించడాన్ని టీఆర్ఎస్ ఉభయ సభాపక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘భేటీ ఉద్దేశమేమిటి? మీరు మాట్లాడున్నదేమిటి?’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘తెలంగాణ జీఎస్డీపీని 25 శాతంగా నిర్ణయిస్తే చేసిన అప్పులు 23 శాతం మాత్రమే. కేంద్రం మాత్రం 40 శాతంగా జీస్‌డీపీ నిర్ణయిస్తే ఏకంగా 60 శాతం అప్పులు చేసింది’’ అంటూ దుయ్యబట్టారు. దేశ అప్పులు 2013–14 దాకా రూ.57 లక్షల కోట్లుంటే మోదీ హయాంలో ఏకంగా మరో రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారు’’ అంటూ గణాంకాలు తీశారు. ముందు కేంద్రం చేసిన అప్పులపై మాట్లాడి ఆ తర్వాతే రాష్ట్రాల అప్పులను ప్రస్తావించాలన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ధోరణితో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీ అప్పులను ప్రస్తావించడాన్ని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలో త్రిముఖ పోరు.. ముళ్ల కిరీటం ఎవరిదో?
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను గట్టున పడేసే నాయకుడి కోసం యావత్ దేశం చూస్తోంది. ఆ దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా అంత సులభమేమీ కాదు. ఈ క్రమంలో దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ఇటీవలే ప్రారంభించింది ఆ దేశ పార్లమెంట్. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స స్థానాన్ని బర్తి చేసేందుకు మంగళవారం ముగ్గురు నామినేట్ అయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ నేత అనురా దిస్సనాయకేలు పోటీ పడుతున్నట్లు పార్లమెంట్ మంగళవారం ప్రకటించింది. బుధవారం ఎన్నిక జరగనుంది. భారీ భద్రత మధ్య మంగళవారం సమావేశమైన పార్లమెంట్లో చట్టసభ్యులు ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ సభ కేవలం 10 నిమిషాల్లోనే ముగియటం గమనార్హం. నేతల మధ్య ఒప్పందం..! పార్లమెంట్ సమావేశానికి కొద్ది సమయం ముందు విపక్ష నేత సాజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలహప్పెరుమాకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు.. రాత్రికి రాత్రే ఇరువురు నేతలు ఓ ఒప్పందానికి వచ్చారనే వాదనలు వినపడుతున్నాయి. ఒకరు అధ్యక్షుడు, మరొకరు ప్రధానిగా బాధ్యతులు చేపట్టి ప్రభుత్వాన్ని నడపాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. విక్రమ సింఘేకే అవకాశం.. 73 ఏళ్ల విక్రమ సింఘేకు అపార అనుభవం ఉంది. ఆరుసార్లు ప్రధానిగా చేశారు. ఎస్ఎల్పీపీ పార్టీ నాయకత్వం ఆయనకు మద్దతు ఇస్తోంది. దీంతో ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 225 సభ్యులు గల పార్లమెంట్లో ఎస్‌ఎల్‌పీపీనే అతిపెద్ద పార్టీగా ఉంది. మూడో అభ్యర్థి, జేవీపీ, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ నేత, 53 ఏళ్ల అనురా దిస్సనాయకే పార్టీకి పార్లమెంట్లో మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు.. అధ్యక్ష బరిలో నిలవాలని భావించిన ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫొన్సెకా చట్టసభ్యుల మద్దతు కూడగట్టటంలో విఫలమయ్యారు. కొత్తగా బాధ్యతులు చేపట్టే అధ్యక్షుడు 2024, నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇదీ చదవండి: Sri Lanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షుడు -
శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం.. టీ20 లీగ్ వాయిదా..!
శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల దృష్ట్యా ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్‌ని వాయిదా వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. "ఆగస్టు 1 నుంచి 21 వరకు జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ 2022ను తాత్కాలికంగా వాయిదా వేశాం. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది అని" శ్రీలంక క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. శ్రీలంక-పాకిస్తాన్ రెండో టెస్టు వేదిక మార్పు శ్రీలంక-పాకిస్థాన్ రెండో టెస్టు వేదికను శ్రీలంక క్రికెట్ మార్పు చేసింది. కొలంబో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ గాలెలో జరగనుంది. శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల మధ్య ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పాక్-లంక మధ్య తొలి టెస్టు ప్రస్తుతం గాలే వేదికగానే జరుగుతోంది. కాబట్టి రెండో టెస్టు కూడా అక్కడే నిర్వహించడం సురక్షితమని శ్రీలంక క్రికెట్ భావించినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ కూడా కష్టమే శ్రీలంక వేదికగా ఈ ఏడాది ఆగస్టులో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక, రాజకీయ సంక్షోబాల మధ్య శ్రీలంకలో ఆసియా కప్ జరిగేలా లేదు. ఆసియా కప్‌ను శ్రీలంక నుంచి యూఏఈ కు తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) భావిస్తున్నట్లు సమాచారం. ఇక జూలై 27న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యలు సమావేశం కానున్నారు. అనంతరం టోర్నీ షెడ్యూల్, వేదిక మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. Sri Lanka Cricket (SLC) wishes to announce that the Lanka Premier League 2022, which was scheduled to be held from 1st to 21st August, 2022 will be postponed, with immediate effect. #LPL2022https://t.co/Gb6yg3LK7k — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 17, 2022 చదవండి: Asia Cup 2022: శ్రీలంకలో కష్టమే.. యూఏఈ వేదికగా ఆసియా కప్..! -
Sri Lanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటన
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించటం లేదు. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. అయినప్పటికీ.. మరోమారు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే. దేశ ప్రజలకు భద్రత కల్పించటం, ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుని ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు విక్రమ సింఘే. 1959లోని 8వ చట్ట సవరణ, ప్రజా భద్రత ఆర్డినెన్స్(చాప్టర్ 40)లోని సెక్షన్ ప్రకారం తనకు అందిన అధికారల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జులై 18 నుంచి ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ప్రజానిరసనల నడుమ శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది మూడోసారి. ఇదీ చదవండి: శ్రీలంక ఆందోళనలకు 100 రోజులు.. సమస్య సద్దుమణిగేనా? -
100వ రోజుకు శ్రీలంక ఆందోళనలు.. ఎప్పుడు ఏం జరిగిందంటే?
కొలంబో: శ్రీలంక.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి దీన స్థితికి చేరుకుంది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. పెట్రోల్, గ్యాస్ కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితులు. పెరుగుతున్న ధరలతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాలకుల అసమర్థత వల్లే దేశం పరిస్థితి దారుణంగా మారిపోయిందనే కారణంతో తిరుగుబాటు చేశారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. అధ్యక్షుడు, ప్రధాని భవనాలను చుట్టు ముట్టారు. దీంతో ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఇది ఇలా ఉండగా.. శ్రీలంక ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఆదివారంతో వందవ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 9న రెండు రోజుల నిరసనలతో.. అధ్యక్షుడు గొటబయ రాజపక్స సహా కుటుంబ పాలనను గద్దె దించటమే లక్ష్యంగా.. ఫేస్బుక్, ట్విట్టర్, టిక్‌టాక్‌లలో పోస్టులు వెలిచాయి. వాటితో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సింహాళులకు తోడు మైనారిటీ తమిళులు, ముస్లింలు ఆందోళనల్లో పాల్గొన్నారు. మొదట ఏప్రిల్ 9న రెండు రోజుల నిరసనలకు పిలుపునిచ్చారు. అధ్యక్షుడు రాజపక్స కార్యాలయం ముందు వేల మంది ప్రజలు నిరసనలు చేపట్టారు. నిర్వాహకులు ఊహించినదానికంటే.. ఎక్కువ మంది ఈ ఆందోళనకు రావటం గమనార్హం. మేలో మహింద రాజీనామా.. నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలను శాంతింపజేసేందుకు మహింద రాజపక్స ఈ ఏడాది మే నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రణీల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించారు గొటబయ. పార్లమెంట్లో ఒక్క సీటు ఉన్న రణీల్కు ప్రధాని పదవికి ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఆ చర్య సైతం ఆందోళన కారులను శాంతింపజేయకపోగా.. మరింత కోపానికి గురి చేసింది. దీంతో అధ్యక్ష భవనాన్ని వేలాది మంది చుట్టు ముట్టారు. ప్రధాని రణీల్ విక్రమసింఘే ప్రైవేటు ఇంటికి నిప్పు పెట్టారు. సింగపూర్‌కు గొటబయ.. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టేందుకు వేలాది మంది లంకేయులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 12న దేశం దాటారు అధ్యక్షుడు గొటబయ రాజపక్స. మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రణీల్ విక్రమసింఘే. కొత్త అధ్యక్షుడిని ఈనెల 20న ఎన్నుకోనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు.. రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు నిరసనకారుల ప్రతినిధి.'రణీస్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ఇందులో పాల్గొన్న గ్రూప్‌లతో చర్చిస్తున్నాం.' అని పేర్కొన్నారు. అయితే.. గొటబయ రాజపక్స దేశం విడిచిన తర్వాత నిరసనకారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అధ్యక్ష, ప్రధాని అధికారిక భవనాలను ఖాళీ చేశారు. ఇదీ చూడండి: అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన -
శ్రీలంక సంక్షోభంపై తమిళుల ఆందోళన.. అఖిల పక్ష భేటీకి కేంద్రం పిలుపు
ఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. తినడానికి సరైన తిండి దొరకని పరిస్థితులో జీవనం వెళ్లదీస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికే పలు విధాలుగా సాయం అందించింది భారత్. శ్రీలంకలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభంపై చర్చించేందుకు మరోమారు అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. వచ్చే మంగళవారం ఈ సమావేశం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఆల్‌పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అనంతరం శ్రీలంక సంక్షోభంపై అఖిల పక్ష సమావేశం అంశాన్ని వెల్లడించారు జోషీ. శ్రీలంక పరిస్థితులపై భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతారని చెప్పారు. శ్రీలంక సంక్షోభంలో భారత్ కలుగజేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కోరినట్లు తెలిపారు. గొటబయ రాజపక్స రాజీనామా చేసిన క్రమంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రక్రియ ప్రారంభించింది శ్రీలంక పార్లమెంట్. ఈనెల 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం అఖిల పక్ష భేటీకి పిలుపునివ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమకు సాయం చేసిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని శ్రీలంక మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఇదీ చదవండి: అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన -
శ్రీలంకలో కష్టమే.. యూఏఈ వేదికగా ఆసియా కప్..!
శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు టీ20 ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే శ్రీలంకలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉండడంతో.. మరోసారి ఆసియా కప్ నిర్వహణపై చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలు ప్రకారం.. శ్రీలంక గడ్డపై జరగాల్సిన ఆసియా కప్‌ను యూఏఈ కు తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)తో ఆసియా క్రికెట్ కౌన్సిల్ జరిపినట్లు సమాచారం. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీలంకలో ఆసియాకప్‌ను నిర్వహించడం సరైనది కాదని భావిస్తున్నాం" అని ఎసిసి అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్టు పాల్గొనున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ ఆర్హత సాధించగా.. మరో స్థానం కోసం హాంకాంగ్, కువైట్, సింగపూర్,యూఏఈ జట్లు క్వాలిఫయర్ రౌండ్లో తలపడనున్నాయి. చదవండి: Singapore Open 2022: సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. మూడో భారత ప్లేయర్‌గా..! -
మాకు సాయం చేసిన ఒకే ఒక్క దేశం భారత్: శ్రీలంక మంత్రి
కొలంబో: చరిత్రలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు భారత్ మాత్రమే సాయం అందించిందని చెప్పారు శ్రీలంక మంత్రి కాంచన విజెసేకర. భారత్ ఆహన్నహస్తం గురించి ప్రపంచానికి తెలియజెప్పారు. తీవ్ర ఇంధన కొరతతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న తాము.. సాయం చేయాలని అన్ని దేశాలను అడిగామని చెప్పారు. కానీ భారత్ మాత్రమే రుణ సాయం చేసి ఆదుకుందని శనివారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సాయం కావాలని రష్యాను కూడా అడుగుతున్నట్లు చెప్పారు శ్రీలంక మంత్రి. ఈ విషయంపై రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. తమకు కావాల్సిన సాయం గురించి రష్యాకు వివరించామని, ఆ దేశం ఎలాంటి సాయం అందిస్తుందోనని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 3.8 బిలియన్ డాలర్ల సాయం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఆహార పదార్థాలు వంటి నిత్యావసర వస్తువుల కొరతతో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. వీటిని దిగుమతి చేసుకునేందుకు విదేశీ నిల్వలు లేక దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ అండగా నిలిచింది. 3.8 బిలియన్ డాలర్లు విలువ చేసే సాయం అందించి గొప్ప మనసు చాటుకుంది. కరెన్సీ మార్పిడులు, శ్రీలంక చెల్లించాల్సిన రుణాలను వాయిదా వేయడం సహా 1.5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఇంధనం, ఔషధాలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను పంపింది. భారత్ పెద్దన్న శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య భారత్ చేసిన సాయాన్ని కొనియాడాడు. తాము కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఇండియా పెద్దన్నలా సాయం చేస్తోందని చెప్పాడు. భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రుణపడి ఉంటామన్నాడు. ఈ కష్టాల నుంచి తాము త్వరలోనే బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: ‘కోవిడ్ కూడా ముంచింది’ -
సాక్షి కార్టూన్ 17-7-2022
...దమ్ముంటే కోవిడ్‌ని పట్టుకుని శిక్షించమంటున్నాడ్సార్! -
'శ్రీలంక కోలుకునే వరకు భారత్ సాయం చేస్తూనే ఉంటుంది'
కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. ఈ నేపథ్యంలో కొలంబోలోని భారత హైకమిషనర్.. పార్లమెంటు స్పీకర్‌ను శనివారం ఉదయం కలిశారు. కష్టాల్లో ఉన్న లంకకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంటు పాత్రను కొనియాడారు. చదవండి: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే ప్రమాణం శ్రీలంక ఆర్థికంగా కోలుకునేందుకు, దేశంలో స్థిరత్వం నెలకొనేవరకు భారత్ సాయం కొనసాగిస్తుందని హైకమిషనర్ పేర్కొన్నారు. ఈమేరకు కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం ట్వీట్ చేసింది. శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబయ రాజీనామ చేసి తాత్కాలిక అధ్యక్షునిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన మరునాడే ఈ సమావేశం జరిగింది. High Commissioner called on Hon’ble Speaker today morning. Appreciated Parliament's role in upholding democracy and Constitutional framework, especially at this crucial juncture. Conveyed that 🇮🇳 will continue to be supportive of democracy, stability and economic recovery in 🇱🇰. pic.twitter.com/apXeVWCnMA — India in Sri Lanka (@IndiainSL) July 16, 2022 -
శ్రీలంక: రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్
కోలంబో: ఆర్థికంగా లంకను దిగజార్చి తీవ్ర సంక్షోభంతో.. ఆపై రాజకీయ సంక్షోభంతో ప్రజానిరసనలతో అట్టుడికిపోయేలా చేసిన రాజపక్స కుటుంబానికి భారీ షాక్ తగిలింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స, సోదరుడు బాసిల్ రాజపక్సలను, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను దేశం విడచి వెళ్లరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ‘రాజీనామా’ భయంతో దేశం విడిచిపారిపోయాడు. ఆపై సింగపూర్ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో ఇవాళ లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్ జస్టిస్ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. #WATCH | Ranil Wickremesinghe sworn in as Acting-President a short while ago by Sri Lankan Chief Justice Jayantha Jayasuriya#SriLanka pic.twitter.com/odjNmfd4cf — ANI (@ANI) July 15, 2022 ఇప్పటికే గోటబయ దేశం విడిచి వెళ్లారని, కాబట్టి మహీంద బాసిల్లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిగ్గా తీవ్ర నిరసనల నడుమే ప్రధాని హోదాలో కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించిన మహీంద రాజపక్స.. చివరకు రాజీనామా చేసి అక్కడే అజ్ఞాతంలో ఉండిపోయారు. కొత్త కేబినెట్ గనుక కొలువుదీరితే మాత్రం.. అవినీతి, ఇతరత్ర ఆరోపణలపై రాజపక్స కుటుంబం విచారణ.. రుజువైతే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. Sri Lanka's Supreme Court today issued an interim order preventing former Prime Minister Mahinda Rajapaksa and former Minister Basil Rajapaksa from leaving the country without the court's permission until July 28th: Sri Lanka's DailyMirror (File photos) pic.twitter.com/xg290lfmLX — ANI (@ANI) July 15, 2022 కుటుంబ పాలనతో ద్వీప దేశాన్ని సర్వనాశనం చేశారని రాజపక్స కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడిగా, అతని అన్న మహీంద రాజపక్సా ప్రధానిగా, మరో సోదరుడు బసిల్ రాజపక్సా ఆర్థిక శాఖను, పెద్దన్న చామల్ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా, మరో బంధువు నమల్ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా కీలక పదవులను నిర్వహించారు.