sub station
-
తూర్పు ఏజెన్సీలో కరెంట్ కష్టాలకు చెక్ పెట్టిన వైఎస్ జగన్
-
ఖమ్మం: ఈ భూమి నాది.. సబ్ స్టేషన్‌కు తాళం వేసేశాడు
-
నా జాగా తీసుకున్నరు.. ఆ సంగతేమైంది సారూ?
సాక్షి, ఖమ్మం: తనకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో జాప్యం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో అసహనం ప్రదర్శించాడు. అది అలాఇలా కాదు.. ఏకంగా ఆ ఊరి సబ్స్టేషన్కే తాళం వేసి!. పైగా భార్యాపిల్లలతో పాటు ఆ సబ్‌స్టేషన్ ముందు నిరసన చేపట్టాడు. ఖమ్మంలోని రఘునాథపాలెం మండల పరిధిలోని బావోజి తండాలో ఇది చోటు చేసుకుంది. బావోజి తండాకు చెందిన తేజవత్ మహేందర్ గతంలో తమ ఊరి సబ్‌స్టేషన్ నిర్మాణం కోసమని తన భూమిని ఇచ్చాడు. అయితే.. తమ కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ జాబ్ ఇస్తామనే హామీ మేరకు అతని ఆ భూమిని అప్పగించాడట. ఈ క్రమంలో అధికారులు ఆ హామీ నెరవేర్చకపోవడంతో అలా తాళం వేశాడట. అంతేకాదు.. తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి ఆ గేటు ముందు నిల్చుని నిరసన చేపట్టాడు. ఊరి కోసం తన భూమిని ఇచ్చానని, కానీ, ఇప్పుడు కుటుంబ పోషణ భారం కావడంతోనే తాను ఈ పనికి దిగాల్సి వచ్చిందని అంటున్నాడతను. అయితే.. అధికారులు మాత్రం మరోలా స్పందించారు. మహేందర్‌కు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చామని చెబుతున్నారు. అంతేకాదు.. గతంలోనూ మహేందర్ ఓసారి ఇలాగే గేటుకు తాళం వేశాడని, అప్పుడు మాట్లాడి తాము అతన్ని శాంతిపజేశామని అంటున్నారు. -
AP: నేడు కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం.. ప్రమాదాల నివారణ దీని ప్రత్యేకత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్మించిన కంటైనర్ సబ్‌స్టేషన్‌ను సోమవారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (అడ్వాన్స్డ్ టెక్నాలజీ)తో అతి తక్కువ స్థలంలో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ కె.పద్మజనార్దనరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్‌స్టేషన్ ఇదే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ఈ కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మించింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీనివాసనగర్‌లో ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సబ్‌స్టేషన్ ట్రయల్ రన్ ఇప్పటికే విజయవంతమైంది. ఈ సబ్‌స్టేషన్ 4.5 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల పొడవున ఉంది. అందులోనే సబ్ స్టేషన్‌కు సంబంధించిన పరికరాలు అన్నింటినీ ఏర్పాటు చేశారు. అత్యాధునిక రీతిలో తక్కువ స్థలంలో కంప్యూటర్ ఆధారంగా ఆపరేట్ చేసేలా ఈ కంటైనర్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. దీని నుంచి ట్రాన్‌ఫార్మర్లకు కనెక్షన్ ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తారు. పూర్తి ఆటోమేషన్ విధానంలోనే ఈ కంటైనర్ సబ్ స్టేషన్ పనిచేస్తుంది. ఈ సబ్ స్టేషన్‌తో అర్బన్ ప్రాంతాల్లో బహుళ ప్రయోజనాలున్నాయి. ఎంతో ప్రయోజనకరం గొల్లపూడి ప్రజలకు ఈ కంటైనర్ సబ్ స్టేషన్ వరం లాంటిది. ఈ ప్రాంతం «శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిషత్తులో నిరంత విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ కంటైనర్‌లో సబ్ స్టేషన్‌ను నిర్మించారు. మా ప్రాంత విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన వెంటనే స్పందించారు. కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సహకరించిన మంత్రి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. – కారంపూడి సురేష్, మార్కెట్ యార్డు చెర్మన్ గొల్లపూడి నిర్వహణ వ్యయం తక్కువ కంటైనర్ సబ్స్టేషన్ల ద్వారా డిస్కంలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గొల్లపూడిలో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. స్తంభాలతో పనిలేకుండా ఈ కంటైనర్ సబ్స్టేషన్లు ఆకర్షణీయంగా పనిచేస్తాయి. దీని నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి, మంత్రి, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. – వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే ప్రయోజనాలు ఇలా.. కంటైనర్ సబ్‌స్టేసన్‌లో సమస్య తలెత్తితే వెంటనే సెన్సార్ల ద్వారా ఆటోమెటిక్‌గా తలుపులు తెరచుకొంటాయి. వీడియో కాల్ ద్వారా సబ్‌స్టేషన్ పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చి సమస్యలను పరిష్కరించే వెసులుబాటు ఉంది. సబ్‌స్టేషన్ లోపల ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లు తెగిన వెంటనే ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా నిలిచిపోయే వ్యవస్థ ఉంది. ఏ వీధిలో అయినా సమస్య తలెత్తితే సబ్‌స్టేసన్‌లో తెలుసుకొనే వీలుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని చోట రిమోట్ లోకేషన్ నుంచి కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. -
విద్యుత్ కోతలపై రైతుల నిరసన
నల్లగొండ: విద్యుత్ కోతలను నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. తిప్పర్తిలో అద్దంకి – నార్కట్‌పల్లి హైవేపై ధర్నా చేశారు. నకిరేకల్, పెద్దవూర, రామన్నపేట మండలాల్లో సబ్ స్టేషన్ల ఎదుట ఆందోళన చేపట్టారు. 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. -
కరెంట్ కోతలపై అన్నదాతల నిరసన
జగిత్యాల రూరల్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలోని రైతులు ఆదివారం స్థానిక సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయ రంగానికి వచ్చే త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులను కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి తాళం వేశారు. సబ్‌స్టేషన్ ఎదుట సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. వ్యవసాయ రంగానికి నిరంతరం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. సమయపాలన లేకుండా అధికారులు కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాత్రి, పగలు తేడాలేకుండా 24 గంటలపాటూ వ్యవసాయ బావుల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాస్తున్నామని పేర్కొన్నారు. కాగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గది తాళం తీసి వారికి విముక్తి కల్పించారు. -
స్థలం ఇచ్చాను.. ఉద్యోగం ఇచ్చాకే లోపలికి వెళ్లండి
బయ్యారం: ‘సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇస్తే ఉద్యోగం ఇస్తామన్నారు.. నమ్మి అప్పగిస్తే ఇంత వరకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆ బెంగతో మా కుటుంబపెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు ఉద్యోగం ఇచ్చాకే మీరు లోపలికి వెళ్లాలి..’అని సబ్‌స్టేషన్‌కు స్థలం ఇచ్చిన కుటుంబం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను అడ్డుకుంది. వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామంలో 20 గుంటల భూమిని 2018 సంవత్సరంలో సంతులాల్‌పోడు తండాకు చెందిన గుగులోత్ లాల్‌సింగ్ విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం ఇచ్చాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని స్థానిక పెద్దలు, అప్పటి అధికారులు హామీ ఇచ్చారు. అయితే సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయినా ఉద్యోగం ఇవ్వకపోవటంతో మనస్థాపంతో స్థలం ఇచ్చిన లాల్‌సింగ్ 2020లో సబ్‌స్టేషన్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మృతుడి భార్య కౌసల్య, కుమారులు మల్సూర్, వినోద్‌కుమార్ ఉద్యోగం కోసం పలువురు అధికారులను కలసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇటీవల స్థలదాత కుటుంబసభ్యులు సబ్‌స్టేషన్ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో ఆదివారం మంత్రి సబ్‌స్టేషన్ వద్దకు రావటంతో స్థలదాత కుటుంబసభ్యులు తాళం వేసిన గేటు ఎదుట నిలబడి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మంత్రి కాళ్లపైబడి తమకు న్యాయం చేయాలని వేడుకోవడంతో.. ఆమె విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్ అభిలాష అభినవత్‌తో మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పారు. కాగా, సబ్‌స్టేషన్ లోనికి వెళ్లకుండానే మంత్రి వెనుదిరిగారు. -
మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్ల వీరంగం
తాడిపత్రి: పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పాత కక్షల నేపథ్యంలో టీడీపీలోని ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మత్తులో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ధ్వంసం చేశారు. అసలేం జరిగిందంటే... తన మేనత్త సరస్వతి టీడీపీ తరఫున వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన సందర్భంగా కొట్టే విజయ్‌కుమార్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విందు ఇచ్చాడు. ఈ విందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. సాయంత్రం వైస్‌చైర్‌పర్సన్ సరస్వతి మేనల్లుడు కొట్టే విజయ్‌కుమార్ శివాలయం సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో తన మిత్రులకు విందు ఏర్పాటు చేశాడు. ట్రాన్స్‌కో ఉద్యోగులు శివనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వీరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వెళ్లి మద్యం తాగారు. వీరితోపాటు టీడీపీ కార్యకర్తలు జనార్దన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి కూడా మద్యం తాగి, విద్యుత్ సబ్ స్టేషన్లోకి వెళ్లారు. పాతకక్షలుండడంతో విషయం తెలుసుకున్న టీడీపీ మరో వర్గానికి చెందిన పరమేష్, అతని అనుచరులు సుమారు 25 మంది కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని మద్యం సేవిస్తున్న కొట్టే విజయ్‌కుమార్ వర్గీయులు ఐదుగురిపై కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్, పరికరాలను ధ్వంసం చేశారు. గాయపడిన వారు డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదని ట్రాన్స్‌కో ఉద్యోగులు శివనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో వైస్ చైర్ పర్సన్ సరస్వతి వర్గానికి చెందిన జనార్ధన్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విద్యుత్ సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్!
సాక్షి, నల్గొండ: నార్కట్‌పల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. భారీగా అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి. పోలీసు, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక దళ సిబ్బంది వెనువెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానప్పటికీ.. అధిక ఉష్ణోగ్రతకు తోడు వర్షం పడటంతో 220/132 కేవీ సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ ట్రాన్స్ ఫార్మర్లు పేలి పోవడంతో ఆ ప్రాంతమంతా గట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం..షార్ట్ సర్క్యూట్!
-
పవర్ పరిష్కారం.!
ఏళ్ల తరబడి వేధిస్తున్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించనుంది. నిత్యం గ్రామాల నుంచి పట్టణాల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ సమస్యలకు ప్రభుత్వం చెక్ చెప్పనుంది. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ‘పవర్ వీక్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందు లో ప్రజల నుంచి సమస్యల వివరాల ను సేకరించారు. దీనికి అనుగుణం గా 60 రోజుల ప్రణాళిక రూపొందించారు. సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్) : విద్యుత్ సమస్యలను ప్రజల భాగస్వామ్యంతో గుర్తించి వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు ట్రాన్స్‌కో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో విద్యుత్‌శాఖ అధికారులు ఈ నెల 19 నుంచి 26 వరకు పవర్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్‌శాఖ అధికారులకు సమస్యల వివరాలను పూర్తిగా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించాలని ఏఈలను, సిబ్బందిని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడడంతో పాటు సబ్స్టేషన్ల మరమ్మతు, శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయడం. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలోని సమస్యలను పూర్తిగా పరిష్కరించనున్నారు. వీటిపై పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 13,159 స్పాన్స్ (కొత్త స్తంభాల ఏర్పాటు)ను గుర్తించారు. ముందుగా గ్రామాలు, పట్టణాల్లో గృహ, వాణిజ్య అవసరాల తర్వాత వ్యవసాయానికి అందించే విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 అంశాలపై సమగ్ర సర్వేపవర్ వీక్‌లో భాగంగా విద్యుత్‌శాఖ అధికారులు ప్రధానంగా 17 సమస్యలపై సర్వే చేపట్టారు. ఇందులో 11 కేవీ, ఎల్టీ లూజ్ లైన్లు సరిచేయడం, శిథిలావస్థకు చేరిన, పాడైపోయిన, తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాలను గుర్తించడం. పాడైన స్టే వైర్లు, స్టర్డ్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, కాలిపోయిన, పాడైపోయిన విద్యుత్ కేబుల్స్ మార్చడం. ఏబి స్విచ్‌లను, హెచ్‌జీ స్విచ్‌లను బాగు చేయడం, రోడ్డు క్రాసింగ్‌పై వైర్ల ఎత్తు పెంచడం, అవసరమైన చోట నూతన ఎస్బీ స్విచ్‌లను ఏర్పాటు చేయడం. వీధి దీపాల పనులు, స్ట్రీట్ లైట్ల కోసం ప్రత్యేకంగా విద్యుత్‌మీటర్లు ఏర్పాటు చేయడం. ఎంసీబీల ఏర్పాటు, గ్రామాలలో పాడైపోయిన స్ట్రీట్లైట్ల మీటర్లు మార్చడంతో పాటు వీటికి అవసరమైన 3, 5వ వైర్లు లాగడం (దీని వల్ల పగలు విద్యుత్ బల్బ్‌లు వెలగకుండా ఉంటాయి) వంటి పనులు చేపడుతున్నారు. ప్రతీ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేయనున్న ప్రత్యేక బృందాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు 60 రోజుల ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతీ సబ్‌స్టేషన్‌ను ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తుంది. ఆయా సబ్స్టేషన్లలో లోపాలు గుర్తించడంతో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఎర్తింగ్ ఆయిల్ లెవల్, బ్రేకర్, బ్యాటరీల పనితీరు, ట్రిప్పింగ్ కాయిల్స్, ఏబి స్విచ్‌లకు కావలసిన పరికరాలపై నివేదికలను రూపొందిచనున్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయనున్నారు. వారితో కలిసి గ్రామాల్లో అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్థంభాల ఏర్పాటు, వీధిలైట్లకు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో విద్యుత్ సమస్యలను పూర్తిగా నివారించడమే కాకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందించే వీలుంటుంది. 60 రోజుల్లో.. ‘పవర్‌వీక్’ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో గుర్తించిన సమస్యలకు 60 రోజుల్లోగా పరిష్కారం లభించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ, వాణిజ్య, వ్యవసాయానికి అందే విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా, విద్యుత్ వృథా కాకుండా గ్రామాలు, పట్టణాల్లో 3,5వ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనాథ్, ట్రాన్స్‌కో, ఎస్ఈ మెదక్ -
బినామీలతో విధులా..!
పుల్లంపేట: నేడు టీడీపీలో చక్రం తిప్పుతున్న ఓ చోటా నాయకుడి అండతో 2013లో మండలంలోని వత్తలూరు పంచాయతీలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అదే గ్రామానికి ఓ వ్యక్తి వాచ్‌మెన్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఆ తరుణంలో తనకు ఏమి తక్కువ అనుకున్నాడో.. నన్నెవరు ప్రశ్నిస్తారని అనుకున్నాడోగానీ జాయిన్ సంతకం చేయకుండానే విధుల్లో చేరాడు. ఏడాది గడిచిన తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సదరు వ్యక్తిని ప్రశ్నించేవారు కరువయ్యారు. అప్పటి నుంచి దాదాపు ఆరేళ్లపాటు ఆ వాచ్మెన్ సబ్‌స్టేషన్ ముఖం కూడా చూడలేదు. ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో సబ్‌స్టేషన్ అపరిశుభ్రంగా మారింది. కంపచెట్లు ఏపుగా పెరిగిపోయాయి. మందు బాబులకు నిలయంగా సబ్‌స్టేషన్ మారిందనడానికి నిదర్శం.. అక్కడ మద్యం సీసాలు దర్శనమివ్వడమే. ఒక్కరోజు కూడా విధులుకు హజరుకాకుండానే జీతం అందుకుంటున్నాడు. సబ్‌స్టేషన్‌లో ప్రతి రోజు నీటి తొట్టికి, తాగేందుకు నీరు నింపేందుకు ఒక వ్యకిని నెలకు రూ.300 ఇచ్చి వాచ్మెన్ తనకు అసిస్టెంట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నెలకు రూ.1500 ఇచ్చి తన స్థానంలో వాచ్‌మెన్‌గా మరోవ్యక్తిని నియమించుకున్నాడు. టీడీపీ నాయకుల అండతో బినామీలతో రోజులు వెళ్లదీస్తున్న ఈ ఖరీదైన వాచ్మెన్పై మండలస్థాయిలో చర్చనీయాంశమైంది. కడుపు నిండని దిగువ తరగతి వారికి ఇవ్వవలసిన వాచ్మెన్ కొలువు కడుపు నిండిన వారికి ఇవ్వడంతో సబ్‌స్టేషన్ ఆలనా పాలనా చూసే వాడే కరువయ్యాడని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాచ్మెన్పై విచారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అర్హతగల స్థానిక ఎస్సీ, ఎస్టీలకు వాచ్మెన్ ఉద్యోగం ఇప్పించాలని పంచాయతీలోని పలువురు సూచిస్తున్నారు. మా వంటి వారికి ఉద్యోగం ఇవ్వాలి అర్హత ఉన్న మాలాంటి వారికి వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వాలి. సబ్‌స్టేషన్ వైపు కన్నెత్తి చూడని సిద్దవటం మల్లికార్జున వంటి వారికి ఉద్యోగం ఇస్తే సబ్‌స్టేషన్ ఆవరణ అధ్వానంగా ఉంటుంది. నిరుద్యోగులకు అన్యాయం చేయడం బాధాకరం. – మూరముట్ల గణేష్, మూరముట్లపల్లి, వత్తలూరు వాచ్‌మెన్‌ను విచారించరా..? బినామీలతో విధులు నిర్వహింపజేస్తున్న వాచ్మెన్ ను విద్యుత్‌శాఖ అధికారులు ఇదేమిటని కూడా ప్రశ్నించరా. అగ్రవర్ణాలకు ఒక న్యాయం.. దళితులకు ఒక న్యాయమా. మేము వాచ్‌మెన్‌గా ఉండి విధులకు హజరు కాకుంటే జీతం ఇచ్చేవారా. ఉద్యోగంలో ఉండనిచ్చేవారా.– కుప్పం అమరయ్య, వత్తలూరు -
నిర్లక్ష్యమే శాపమై!
జడ్చర్ల: కరెంట్‌తో చెలగాటం ఆశామాషీ కాదు. ఏ చిన్న కరెంటు పని ఉన్నా అనేక జాగ్రత్తలు తీసుకోవడం.. నైపుణ్యం ఉన్నవారిచే చేయించ డం ఉత్తమం. సామాన్య ప్రజలే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సంబంధిత వి ద్యుత్ శాఖ అధికారులు మరెన్ని జాగ్రత్తలు తీ సుకోవాలి. కానీ ఆ శాఖ అధికారుల తప్పిదం, సి బ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగా.. మిడ్జిల్‌లోని 33 /11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో గాయపడిన బాధితులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలేం జరిగిందంటే.. మిడ్జిల్ సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ స్తంభాలు ఇతర మెటీరియల్‌కు పెయింట్ వేసేందుకు సంబంధిత ఏఈ చర్యలు చేపట్టారు. కానీ ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పనులు చేపట్టారు. అంతా సవ్యంగా సాగితే ఏ ఇబ్బంది లేకుండేది. కానీ సబ్‌స్టేషన్‌లో పెయింట్ చేస్తున్న కూలీలు విద్యుత్ ప్రమాదానికి గురికావడంతో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేయడమంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇందుకు సంబంధించి ఊర్కొండ మండలం బాల్యలోక్యతండాకు చెందిన శ్రీను, వెంకటేశ్, తిరుపతి, దేవ్యలను పెయింట్ వేసేందుకు రప్పించారు. సబ్‌స్టేషన్‌లో ఒక లైన్‌కు సంబంధించి విద్యుత్ సరఫరా నిలిపివేసి.. మరో లైన్‌కు సంబంధించి సరఫరాను కొనసాగిస్తూనే పనులు చేయించారు. దీంతో ప్రమాదవశాత్తు పెయింట్ వేస్తున్న వారికి విద్యుత్ షాక్ తగలడంతో.. తీవ్రగాయాలతో బయటపడి ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో శ్రీను పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మిగతా వారు కూడా తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్షణ చర్యలేవీ..? వాస్తవంగా పెయింట్ చేస్తున్న కూలీలకు సంబంధిత అధికారులు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. వారికి విద్యుత్ షాక్ తగలకుండా ముందస్తుగా చే తులకు, కాళ్లకు ప్లాస్టిక్ బ్లౌజ్‌లు, ఇతర రక్షణ ఏ ర్పాట్లు చేయడంతోపాటు అక్కడ ప్రత్యేకంగా ప నులను చేస్తున్న సమయంలో ఎక్కడెక్కడ కరెంటు సరఫరా ఉంటుందో దగ్గరుండి హెచ్చరిస్తూ పర్యవేక్షించాలి. కానీ సిబ్బంది, ఏఈ ఎవరూ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదానికి కారణమయినట్ల తెలుస్తుంది. అంతేగాక పెయింటింగ్ వేసేందుకు ఇనుప నిచ్చెన వినియోగించడం మరింత ఆజ్యం పోసినట్లయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధిత కుటుంబాల సభ్యులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఇద్దరు మృత్యువాత జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామ శివారులో గతంలో విద్యుత్ లైన్లు బిగిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. అప్పుడు కూడా సంబంధిత విద్యుత్ శాఖ సిబ్బంది, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందన్న ఆరోపణలున్నాయి. విద్యుదాఘాతానికి వ్యక్తి బలి శ్రీరంగాపూర్ (కొత్తకోట): పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి ఓ గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం శ్రీరంగాపూర్లో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గొల్ల బొక్కలయ్య(40) గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తన గొర్రెలను మేపడానికి తీసుకెళ్లిన బొక్కలయ్య రాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఒక గొర్రె కనిపించకపోవడంతో శుక్రవారం ఉదయం బొక్కలయ్య దానిని వెతుకుతూ వెళ్లగా సమీపంలోని ఒక పొలంలో పడిన విద్యుత్ తీగ వద్ద గొర్రె పడి ఉంది. గమనించిన బొక్కలయ్య వెంటనే వెళ్లి చూడగా విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్లిన రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వెళ్లి బోరున విలపించారు. బొక్కలయ్యకు భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
సెల్ టవర్ ఎక్కి ఆందోళన
-
సెల్ టవర్ ఎక్కి.. పరిహారం చెల్లించాలని
సాక్షి, జనగామ : వడ్లకొండ చంపక్ హిల్స్ ప్రాంతంలో ఉద్రిక్త వాతారణం ఏర్పడింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మిస్తోంది. అయితే పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తీసుకున్న భూములకు తగిన పరిహారం ఇవ్వాలని సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
మందు డబ్బాతో ఆందోళన
బెజ్జంకి(సిద్దిపేట): గతంలో ఇచ్చిన హామీ మేరకు సబ్ స్టేషన్ కోసం తీసుకున్న తమ మూడెకరాల భూమికి బదులు వేరే చోట భూమి ఇవ్వాలని కల్లెపెల్లికి చెందిన రైతు బిట్ల కనుకయ్య కుటుంబ సభ్యులతో కలిసి పురుగులు మందు డబ్బాతో మంగళవారం ఆందోళనకు దిగాడు. స్థానికులు జోక్యం చేసుకుని వారిని బుజ్జగించి ఆందోళనను విరమింపజేశారు. వివరాల ప్రకారం..గతేడాది గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి అనువుగా ఉందని కనుకయ్యకు చెందిన 1.04 గుంటల భూమిని సబ్‌స్టేషన్‌కు అప్పగిస్తే ప్రభుత్వం నుంచి 3 ఎకరాల సాగుభూమిని ఇప్పిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇంత వరకు నెరవేరలేదు. నిరుపేద అయిన కనుకయ్యకు నలుగురు కూతుళ్లు. సాగు చేసే భూమి పోవడంతో తమకు పూట గడిచే పరిస్థితి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య రాజేశ్వరి పేరున ప్రభుత్వం నుంచి 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించినప్పటికీ హద్దులు చూపించి కాస్తుకు ఇవ్వడంలేదని వాపోయారు. గతంలో భూమి పట్టాదారుకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వటంలేదని వారికి రిజిస్ట్రేషన్ చేసినా భూమిలోకి రానివ్వటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇది మాదే... అదీ మాదే!
కాంట్రాక్టు మాకే దక్కాలి. లేకపోతే వాటా అయినా ఇవ్వాలి. అంతవరకు టెండర్లు పెండింగే.. ఇదీ సబ్స్టేషన్ల కాంట్రాక్టులపై ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి అల్టిమేటం. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం, లింగాయపాలెం సబ్‌స్టేషన్ టెండర్లు ఖరారు కాకుండా ఆ ప్రజాప్రతినిధి సైంధవపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రూ.40 కోట్ల టెండరుతోపాటు మొత్తం రూ.640 కోట్ల సబ్స్టేషన్ల కాంట్రాక్టుపై కన్నేసిన ఆయన ఒత్తిడికి ట్రాన్స్‌కో తలొగ్గుతోంది. సాక్షి, అమరావతిబ్యూరో: రాజధాని అమరావతిలో 16 సబ్స్టేషన్లను దశలవారీగా నిర్మించాలని ట్రాన్స్‌కో నిర్ణయిం చింది. ఈ మేరకు సీఆర్డీఏ కేటాయిం చిన రూ.640కోట్ల బడ్జెట్‌తో ప్రణాళికలు రూపొందించింది. మొదటగా లింగాయపాలెంలో రూ.40 కోట్లతో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. విజయవాడకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు బినామీ సంస్థ పేరిట టెండరు వేశారు. ముంబాయి, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపె నీలు కూడా టెండర్లు దాఖలు చేశాయి. టెక్నికల్ బిడ్‌ను ఆరు నెలల క్రితం తెరి చారు. అయితే ప్రైస్‌బిడ్‌ను ఇంకా తెరవడం లేదు. టెండర్లు ఖరారు చేయడం లేదు. జాప్యం ఎందుకు జరుగుతోందా అని ఆరా తీయగా ఆ ప్రజాప్రతినిధి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి లింగాయపాలెం సబ్‌స్టేషన్ కాంట్రాక్టును తాను సూచించిన సంస్థకే ఏకపక్షంగా కేటాయించాలని విజయవాడకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి పట్టుబడుతున్నారని విశ్వసనీయ సమాచారం. ముంబాయి, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థలు కూడా టెండర్లు దాఖలు చేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ప్రజాప్రతినిధి సూచించిన సంస్థకు టెండరు వచ్చే అవకాశాలు తక్కువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధి ట్రాన్స్‌కో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్ల ప్రక్రియనే పెండింగులో పెట్టేలా చక్రం తిప్పారని సమాచారం. సాంకేతిక కారణాల పేరుతో టెండర్ల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ పిలవాలని ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. వాటా ఇస్తామంటే సరే..లేకుంటే అంతే.. ఒక్క లింగాయపాలెం సబ్ స్టేషన్ కాంట్రాక్టే కాదు, ఆ తరువాతి దశల్లో నిర్మించే 15 సబ్స్టేషన్ల కాంట్రాక్టుపైనా ఆ ప్రజాప్రతినిధి కన్నేశారు. అంటే రూ.640 కోట్ల కాంట్రాక్టును దక్కించుకోవడమే లక్ష్యంగా చేసుకున్నారు. తాను సూచించిన సంస్థకు టెండరు దక్కాలి, లేకుంటే తనకు వాటా ఇచ్చే సంస్థకు కేటాయించాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్‌కో సంస్థలో ప్రస్తుతం కీలకంగా ఉన్న ఉన్నతాధికారి ద్వారా కథ నడిపిస్తున్నారు. ఆ ఉన్నతాధికారి హైదరాబాద్, ముంబాయిలకు చెందిన సంస్థలతో మంతనాలు సాగిస్తున్నారని సమచారం. లింగాయపాలెం సబ్‌స్టేషన్‌తోపాటు భవిష్యత్‌తో నిర్మించనున్న సబ్స్టేషన్ల కాంట్రాక్టుల్లో ఆ ప్రజాప్రతినిధి సంస్థకు వాటా ఇవ్వాలని ప్రతిపాదించారు. అందుకు సమ్మతిస్తేనే కాంట్రాక్టులు దక్కేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారని సమాచారం. ఆ విషయంపై స్పష్టత వచ్చేవరకు లింగాయపాలెం సబ్‌స్టేషన్ కాంట్రాక్టును పెండింగులోనే ఉంచాలని ఆ ప్రజాప్రతినిధి తేల్చిచెప్పారు. దీంతో ట్రాన్స్‌కో వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడికి లొంగి ఆ టెండరు ప్రక్రియను ప్రస్తుతానికి పక్కనపెట్టేశాయి. అమరావతిలో సబ్స్టేషన్ల కాంట్రాక్టు వ్యవహారం మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. -
లోవోల్టేజీపై సమరం
చింతలపూడి : విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లింగగూడెం సబ్‌స్టేషన్ పరిధిలోని రైతులు రోడ్డెక్కారు. లోవోలే్టజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని, పంటలకు నీరందక ఎండిపోతున్నాయని మేడిశెట్టివారిపాలెం, చింతంపల్లి, గున్నేపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ఎ దుట బైఠాయించి ధర్నా చేశారు. మెట్ట ప్రాంతంలో ప్రస్తుతం వేరుశనగ, అరటి, మొక్కజొన్న, ఆయిల్‌పామ్, జామ తోట లతో పాటు రబీ వరి సాగులో ఉన్నాయని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.బలరామ్ అన్నారు. కొద్దిరోజులుగా లోవోలే్టజీ కారణంగా మోటార్లు తిరగడం లేదని, కొన్నిచోట్ల కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సరిగా నీరందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. పంట లకు 9 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నెలరోజు లుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా విద్యుత్ శాఖాధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అధికారులు ఎంతకీ రాకపోవడంతో చింతలపూడి–సత్తుపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. రాఘవాపురం ట్రాన్స్‌కో ఏఈ బాణావతు వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. లోవోలే్టజీ సమస్యను పరిష్కరిస్తామని హా మీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో సీపీఎం డివిజన్ కార్యదర్శి రామిశెట్టి సత్యనారాయణ, రైతులు రాజబోయిన నరసింహారావు, చందా శ్రీను పాల్గొన్నారు. -
సబ్‌స్టేషన్‌లో అగ్నికీలలు
* 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ పేలి భారీగా మంటలు * రూ.75 లక్షల నష్టం * జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం తాడికొండ రూరల్: తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఉన్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. తాడికొండ, పొన్నెకల్లు పరిసర ప్రాంతవాసులకూ అగ్నికీలలతో పాటు భారీగా ఎగసిపడుతున్న పొగ కనిపించింది. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు ఎగసిపడినట్లు గుర్తించారు. సుమారు దీని విలువ రూ.50 నుంచి 75 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. కాగా సకాలంలో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించినప్పటికీ విఫలం కావడంతో రెండు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. అనంతరం వర్షం కూడా తోడవడంతో 8.30 గంటలకు కొంతమేరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తిగా మంటలు ఆరిపోతే కానీ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకొనే పరిస్థితి లేదని ఎస్ఈ తెలిపారు. జిల్లాలో మూడొంతుల విద్యుత్ సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది కనుక కొంత మేరకు ఇబ్బంది తప్పదని చెప్పారు. -
సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన
కీసర మండల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు సబ్ స్టేషన్లకు విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 33/11 సబ్స్టేషన్ల ద్వారా నాగారం, రాంపల్లి, అంకిరెడ్డి గ్రామాలకు విద్యుత్ అందనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
సబ్‌స్టేషన్ ముందు రైతుల ఆందోళన
మిర్యాలగూడ రూరల్(నల్లగొండ): సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ.. రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ మండలంలోని అవంతిపురం సబ్‌స్టేషన్ ప్రాంగణంలో జరిగింది. గత వారం రోజులుగా లో వోల్టేజీ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతుందని.. దీనివల్ల వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు పడుతున్నామని ఎన్నిమార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. విద్యుత్ అధికారుల తీరుతో విసుగెత్తిన రైతులు కోదాడ మిర్యాలగూడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
సబ్ స్టేషన్లో ప్రమాదం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్లు, అయిల్ ఇంజిన్లు ఉన్న గోదాములో షార్ట్ సర్కూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో గోదాంలోని విద్యుత్ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టం విలువను అధికారులు అంచనా వేస్తున్నారు. -
స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గూడెం మండలంలోని సబ్‌స్టేషన్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని గూడెం గ్రామస్తులు శుక్రవారం సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. అందులో ఉద్యోగాలను కాంట్రాక్టర్ స్థానికులకు ఇవ్వకుండా బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల గ్రామస్తులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం నియమించిన ఉద్యోగులను తొలగించి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. (గూడెం) -
గాలొచ్చినా.. వానొచ్చినా.. చిమ్మ చీకటే !
సాక్షి, అనంతపురం : చిరుగాలులకే చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇక ఈదురుగాలులు వీస్తే జిల్లా అంతటా అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. ఏటా రుతుపవనాల రాకకు ముందు చేపట్టాల్సిన చర్యలు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఇటు విద్యుత్ సంస్థ, అటు వినియోగదారులు నష్టపోతున్నారు. తూతూమంత్రంగా పీఎంఐ ప్రతియేటా మార్చి, ఏప్రిల్ మాసాల్లో విద్యుత్ శాఖ అధికారులు ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ (పీఎంఐ) నిర్వహించాల్సి ఉంటుంది. రుతు పవనాలు, గాలి దుమారాలు రాక ముందే విద్యుత్ లైన్లను పటిష్టపరచాలి. 11 కేవీ, 33 కేవీ, ఎల్టీ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలి. చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర చిన్నపనులకు గాను ప్రభుత్వం ఒక్కో సెక్షన్ అధికారికి నెలకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు మంజూరు చేస్తోంది. ఇదే విధంగా ఏఈ, ఏడీఈలకు కూడా మంజూరు చేస్తోంది. ఈ మొత్తాన్ని చాలా మంది నొక్కేస్తున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఫీడర్లు ఉంటాయి. ఒక్కో ఫీడర్ పరిధిలో 11 కేవీ లైన్లు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటాయి. వీటి నిర్వహణకు ఈ నిధులు ఏమాత్రమూ చాలడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారు. చాలామంది పనులు చేయించకుండానే నిధులు జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒకటీ అరా సబ్స్టేషన్ల పరిధిలో తప్ప మిగతా చోట్ల ఏడీఈలు, ఏఈలు... పీఎంఐని విస్మరించడంతో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఒక్కో సెక్షన్ అధికారి పరిధిలో మూడు నుంచి నాలుగు సబ్స్టేషన్లు ఉన్నాయి. దీనివల్ల పర్యవేక్షణ కూడా భారంగా మారింది. లూజులైన్లతో సమస్యలు నిబంధనల ప్రకారం 33 కేవీ, 11 కేవీ, ఎల్టీ లైన్లకు ఒక స్తంభానికి మరో స్తంభానికి మధ్య దూరం 50 నుంచి 60 మీటర్లు ఉండాలి. ప్రస్తుతం 90 నుంచి 100 మీటర్లు ఉంటోంది. దీంతో తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదంగా మారాయి. చిన్న గాలులు వచ్చినా తెగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం గుంతకల్లు, విడపనకల్లు, కొత్తచెరువు, హిందూపురం ప్రాంతాల్లో గాలీవానకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. గుంతకల్లులోని అబ్బేకాలనీలో ఎల్టీ లైనుకు సంబంధించి రెండు స్తంభాలు విరిగిపడ్డాయి, విడపనకల్లు వద్ద 33 కేవీ లైన్లకు సంబంధించి ఐదు స్తంభాలు నేలకూలాయి. కొత్తచెరువులో విద్యుత్ స్తంభంతో పాటు ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. హిందూపురం వద్ద విద్యుత్‌స్తంభాలు, తీగలు తెగిపడి ఒక రోజంతా గ్రామాలు అంధకారంలో మగ్గాయి. బుధవారం కనగానపల్లి మండలం మామిళ్లపల్లి బీసీ కాలనీలో 11 కేవీ విద్యుత్ లైన్ తెగి పడడంతో ఇళ్లలో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. కాలనీవాసులు బెంబే లెత్తిపోయారు. కరెంటు స్తంభాలు నాణ్యత లేకపోవటంతో గాలి దుమారాలకు దెబ్బతింటున్నాయి. దీనివల్ల విద్యుత్ సంస్థ రూ.లక్షల్లో నష్టపోతోంది. విద్యుత్ స్తంభం ఎక్కేవారేరీ? విద్యుత్ లైన్లలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు స్తంభం ఎక్కేవారు కరువయ్యారు. ఇన్సులేటర్లు, డిస్కులు మార్చాలన్నా, కండక్టర్లు చుట్టాలన్నా సిబ్బంది ఉండటం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పనులు చేస్తున్నారు. చాలామంది హెల్పర్లు, లైన్మెన్లు, అసిస్టెంట్ లైన్మెన్లు స్తంభాలు ఎక్కలేకపోతున్నారు. ప్రయివేటు వ్యక్తులతో ఈ పనులు చేయిస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగినపుడు ప్రైయివేటు వ్యక్తులు బలవుతున్నారు. దీనికి తోడు విద్యుత్ సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది. చర్యలు తీసుకుంటున్నాం మార్చి, ఏప్రిల్ మాసాల్లో తలెత్తే విద్యుత్ సమస్యలను పరిష్కరించే విషయమై ఒక్కో సెక్షన్ ఆఫీసర్, ఏఈ, ఏడీఈలకు రూ.2 వేల నుంచి రూ.4 వేల చొప్పున మంజూరు చేస్తాం. ఏ నెల మొత్తం ఆ నెల క్లోజ్ చేసిన తరువాతే మరుసటి మాసానికి మంజూరు చేస్తాం. ఈ ఏడాదికి సంబంధించి నిధులు ఇంకా మంజూరు కాలేదు. చిరుగాలులకే విద్యుత్ అంతరాయాలు వస్తుండడంపై చర్యలు తీసుకుంటున్నాం. - ప్రసాద్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ -
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం!
జడ్చర్ల, న్యూస్‌లైన్ : సబ్ స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా లై న్ బిగిస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతాని కి గురై ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మ రొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వె ళితే... ఇటీవల జడ్చర్ల మండలం గంగాపూర్ శి వారులో కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్ ని ర్మాణ చేపట్టారు. ఇందులో భాగంగా స్తంభాల కు కొన్నిరోజుల క్రితం తీగలు బిగించారు. అ యితే అవి కిందకు వేలాడుతుండడంతో సరిచేసేందుకుగాను సంబంధిత కాంట్రాక్టర్ ఆది వారం సాయంత్రం కూలీలను పనుల్లోకి దిం చారు. వీరిలో మహబూబ్‌నగర్ మండలం రాం చంద్రాపురానికి చెందిన మహేశ్ (22), దేవరక ద్ర మండలం గూరకొండ వాసి బాలు ఉన్నారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న 11 కేవీ పాత లైన్‌కు సబ్‌స్టేషన్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, బాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన అక్కడివారు వెంటనే బాధితుడిని వెంటనే ఆటోలో ఎనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మహేశ్ అవివాహితుడు కాగా బాలుకు భార్య శివలీల ఉంది. ఇదిలాఉండగా సబ్‌స్టేషన్ నిర్మాణ సమయంలో ఉన్నపుడు మరో 11 కేవీకి సంబంధించి లైన్ క్లియర్ తీసుకుని పనులు చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగు చర్య తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.