Telugu Latest News
-
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. రామాయపట్నం పోర్టుతో ఏపీకి ఎంతో మేలు.. సహకరించిన వాళ్లకు కృతజ్ఞతలు: సీఎం జగన్ రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బుధవారం పోర్టు పూజా కార్యక్రమం, శంకుస్థాపనల సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర కాల్పులు.. సింగర్ సిద్ధూ హత్య కేసులో ఇద్దరు నిందితులు హతం పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీడీపీలోనూ ఓ షిండే.. చంద్రబాబుకి గెలిచే శక్తి లేదు: టీడీపీ కీలక నేత వ్యాఖ్యల కలకలం తెలుగు దేశం పార్టీకి చెందిన కీలక నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేలా.. టీడీపీకి సీఎం రమేష్ ఉన్నాడంటూ ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీకి పరాజయం తప్పదని జోస్యం చెప్పారాయన. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పోర్టు మా కల.. జగనన్నకు కృతజ్ఞతలు: నిర్వాసితులు ప్రగతి తీరంగా రామాయపట్నం పోర్టును తీర్చిదిద్దుతుండడంపై నెల్లూరు, ప్రకాశం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పూజ, శంకుస్థాపన పనుల ప్రారంభంతో తమ కల నెరవేరనుందని చెప్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ.. ‘అంతా తెలంగాణ సర్కారే చేసింది’ తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరించడాన్ని నిలిపివేశామని కేంద్రం ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో మరో అన్యూహ ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. సుప్రీంకోర్టులో థాక్రేకు మళ్లీ ఎదురుదెబ్బ.. సీఎం షిండే వర్గానికి గడువిచ్చిన సుప్రీం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటిలోగా ఏక్నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎంపీగా పరుగుల రాణి ప్రమాణం.. సంతోషంగా ఉందంటూ ప్రధాని ట్వీట్ ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన పరుగుల రాణి, మాజీ అథ్లెట్ పీటీ ఉష ఇవాళ (జూలై 20) ఉదయం పార్లమెంట్ భవనంలో ప్రమాణం చేశారు. రాజ్యసభ స్పీకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన నారాయణ మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు సీపీఐ నారాయణ. తాను వాడిన పదాలను భాషాదోషంగా పరిగణిస్తున్నానని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.ప్రయాణికులకు షాకిచ్చిన భారతీయ రైల్వే! రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్సీటీసీ. ఇకపై రైళ్లలో భోజనం, స్నాక్స్ ధరలను ఏకంగా రూ.50 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. అధికారం అంటే అజమాయీషీ కాదు.. అందరికీ సంక్షేమం: సీఎం జగన్ అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రసంగించారు . 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమే: కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే అందుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలి పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడటాన్ని తప్పుపట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. క్లౌడ్ బరస్ట్‌పై సీఎం కేసీఆర్ అలా.. గవర్నర్ తమిళిసై ఇలా.. క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. ప్యాకేజీ ఫుడ్స్, ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడుపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో జీఎస్టీ వర్తించని కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. నానికి బిగ్ షాక్..ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా? కెరీర్ బిగినింగ్ నుంచి చేతినిండా చిత్రాలతో ఎప్పుడూ బిజీగా కనిపించాడు నేనురల్ స్టార్ నాని. అయితే అంటే సుందరానికి తర్వాత ఈ స్పీడ్ తగ్గింది. చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా దసరా ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. మినీ ఐపీఎల్ తలపిస్తోంది క్రికెట్లో అత్యంత విజయవంతమైన లీగ్‌గా పేరు పొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). క్యాష్‌రిచ్ లీగ్‌గా ముద్రించుకున్న ఈ టోర్నీ ఆటగాళ్లకు కాసుల పంట పండిస్తుంది. వేలంలో కోట్ల రూపాయలను గుమ్మరించే ఐపీఎల్ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌ల్లోనూ తమ హవాను చూపించడం మొదలెట్టాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్ అదే! బాలీవుడ్ తెరపై వెలిగిన మంగళూరు అందం శిల్పాశెట్టి. తన సౌందర్యంతో యువతను కట్టిపడేసి 90వ దశకంలో ఆరాధ్య హీరోయిన్గా మారింది. నటిగా, నిర్మాతగా, డాన్సర్‌గా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. నూహ్‌లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో రైడింగ్‌కు వెళ్లిన ఆయనను.. మాఫియా గ్యాంగ్ ట్రక్కుతో తొక్కించి కిరాతకంగా చంపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై సీఎం జగన్ సమీక్ష ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రిజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చంద్రబాబు చీప్ పాలిటిక్స్: మంత్రి కారుమూరి గోదావరికి ఎన్నడూ లేనంతగా ఉధృతంగా వరదలు వచ్చాయని.. ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరదలపై అధికారులను అలర్ట్ చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్ రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సోమవారం ఉదయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్నూర్ మండల సమీపంలోని మేనూర్ హైవేపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్‌కు షాకిచ్చిన సీతక్క.. పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. డెలివరీ బాయ్ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు అర్ధరాత్రి మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి ప్రాణాలకు తెగించి వెళ్లాడు ఓ పిజ్జా డెలివరీ బాయ్. అందులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ఈ క్రమంలో అద్దాలు పగలగొట్టి మరీ మొదటి అంతస్తు నుంచి దూకి చేతికి గాయం చేసుకున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం! ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు భారీ కుదుపు! స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు. తాను వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు స్టోక్స్ సోమవారం ప్రకటించాడు. దక్షిణాప్రికాతో డర్హమ్‌లో మంగళవారం జరిగే వన్డే మ్యాచ్ తన చివరిదని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. తెలుగు ప్రేక్షకులపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ బంద్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 8 యాప్‌లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! ప్రస్తుత 4జీ కాలంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. టెక్నాలజీ పుణ్యమా అని మనకు కావాల్సినవన్నీ మొబైల్లోనే ప్రత్యక్షమవుతన్నాయి. అయితే దీంతో పాటే కొన్ని సార్లు వైరస్, హాకర్ల రూపంలో ప్రమాదాలు వస్తుంటాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 45వేల పైమాటే! ప్రత్యేకత ఏమిటంటే! ఆవకాయ బిర్యానీ గుర్తుంది కదా.. వంటకం కాదండీ.. రెస్టారెంట్ పేరు అంతకన్నా కాదు. అచ్చతెలుగు హీరోయిన్.. మదనపల్లె మగువ.. బిందు మాధవి. గ్లామర్‌తో వెండి తెర మీదే కాదు తనదైన సిగ్నేచర్ స్టయిల్‌తో ఫ్యాషన్ వరల్డ్‌లోనూ మెరిసిపోతోంది ఇలా 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం.. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదో అంశంపై వేడి వేడిగా చర్చ జరుగుతోంది. ప్రఖ్యాత సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా ఆగ్రహంతో.. ‘ప్రధాని నెహ్రూ మొఘల్ చక్రవర్తుల కోర్టుల్లో చప్రాసీలుగా పనిచేసిన వంశం నుంచి వచ్చినవాడు..’ అని మాట తూలారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Atchannaidu: అచ్చెన్నాయుడు ఆడియో కలకలం టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆడియో కలకలం రేపుతోంది. ఆ ఆడియోలో అచ్చెన్న మరొకరి సంభాషణ గూడు పుఠానీలా ఉంది. సంతమ్మాళి మండలం కోటపాడు–కొత్తూరు గ్రామ వాసి మృతి వెనుక కుట్రే ఏదో దాగి ఉంద ని తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. Godavari Floods 2022: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం భద్రాచలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండడంతో గోదారమ్మ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భీతిగొలిపేలా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పెట్టుబడుల వాస్తవరూపంలో ఏపీ నంబర్ 1 రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఘనంగా లష్కర్ బోనాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. MLA Seethakka: సీతక్కకు తప్పిన ప్రమాదం ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు శనివారం ఆమె ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి జంపన్నవాగు మీదుగా పడవలో వెళ్లారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ENG vs IND: విజయంతో ముగించేందుకు... ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు పర్యటన చివరి అంకానికి చేరింది. గత ఏడాది అర్ధాంతరంగా ఆగిన టెస్టు సిరీస్‌ను ఈ నెలారంభంలో ఓటమితో ముగించిన టీమిండియా ఆపై టి20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 'ఇదేం పద్ధతయ్యా.. ఎలాన్ మస్క్ కొత్త రగడ' ఎలాన్ మస్క్.. మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ల మధ్య కొనుగోలు వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మస్క్‌ను ట్విట్టర్ తరుపు లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ ఎలా పొందారని మస్క్‌ను ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Shabaash Mithu: సండే సినిమా ఉమన్ ఇన్ బ్లూ ‘మెన్ ఇన్ బ్లూ’ అంటే భారత క్రికెట్ జట్టు. అంటే మగ జట్టు. క్రికెట్ మగవారి ఆట. క్రికెట్ కీర్తి మగవారిది. క్రికెట్ గ్రౌండ్ మగవారిది. కాని ఈ ఆటను మార్చే అమ్మాయి వచ్చింది. ‘మెన్ ఇన్ బ్లూ’ స్థానంలో ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అనిపించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఐటీ రాజధానిలో హైటెక్ మయసభ..! ఇరవై అంతస్తుల భవనం...వేల మంది ఉద్యోగులు.. వందల సంఖ్యలో కార్లు! నేలపై.. భూగర్భంలోనూ పార్కింగ్! హైటెక్ యుగంలో ఏ ఐటీ ఆఫీసును తీసుకున్నా ఇలాగే ఉంటుంది! ఇలాంటి ఆఫీసులో మిత్రుడిని కలిసేందుకు వెళ్లారనుకోండి... పార్కింగ్ స్థలం వెతుక్కునేందుకు పదిహేను నిమిషాలు.. సెక్యూరిటీ వ్యవహారాల పూర్తికి ఇంకొన్ని నిమిషాలు.. రిసెప్షన్‌లోనో.. క్యాంటీన్లోనో పడిగాపులు..ఇదీ తంతు! వందేళ్ల రాబర్ట్ బాష్ కంపెనీలో మాత్రం దీనికి భిన్నం! 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1.ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. కాన్వాయ్ వేగంగా దూసుకెళుతున్నప్పటికీ ఆపన్న హస్తం కోసం రోడ్డు పక్కనే ఎదురు చూస్తున్న ఓ కుటుంబం సీఎం జగన్ దృష్టి నుంచి దాటిపోలేదు. విశాఖ షిప్ యార్డులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే పొన్నపువ్వు ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం భద్రాచలం వద్ద గోదావరి మరింత ఉధృతంగా మారుతోంది. గంటగంటకూ మరింతగా వరద మట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి 71 అడుగులతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.గోదా'వర్రీ'!.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్! బ్రిటన్ ప్రధాని రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక, బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్‌తో సహా మరో ఐదుగురి మధ్య పోటీ సాగుతున్నది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి యత్నిస్తున్నారా? అవుననే సమాధానం అన్నాడీఎంకేలో వినిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులపై బహిష్కరణ వేటు వేసిన పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తొలగించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.తగ్గేదేలే.. కేంద్రంపై సమరమే..! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలపై పార్లమెంటుతో పాటు దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.తాజా సర్వే: ఈ యువతకు ఏమైంది? పెళ్లి వద్దంటున్నారు! ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు అంటారు. ఉద్యోగం వచ్చి కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన మన దగ్గర పెరిగి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు పెళ్లే వద్దనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం గమనించాల్సిన సంగతి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.అదానీ గ్రూప్ చేతికి ఇజ్రాయెల్ పోర్టు ఇజ్రాయెల్‌లోని పోర్ట్ ఆఫ్ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్), గాడోట్ గ్రూప్ కన్సార్టియం దక్కించుకుంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.రెమ్యునరేషన్ లెక్కలు బయటపెట్టిన కీర్తి పారితోషికం పెంచలేదని అంటోంది కీర్తి సురేష్. కొన్ని చిత్రాలకు తగ్గించే రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని అంటోంది ఈ బ్యూటీ. దక్షిణాది సినిమాలో నటి కీర్తీసురేశ్‌కు అంటూ కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ అమ్మడు ఇటీవల మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించి విజయాన్ని సాధించింది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.ఐర్లాండ్ ఓడినా... వణికించింది! అయ్యో... ఐర్లాండ్! కొండను కరిగించే పనిలో పరుగు తేడాతో ఓడింది. ఇదివరకే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన ఐర్లాండ్ మూడో మ్యాచ్ ఓటమితో ‘వైట్‌వాష్’ అయ్యింది. కానీ అసాధారణ పోరాటంతో ఆఖరి బంతి దాకా కివీస్ ఆటగాళ్లను వణికించింది 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. తీవ్ర దుఃఖంలో ట్రంప్.. భార్య మృతితో భావోద్వేగ సందేశం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం కన్నుముశారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా తన సొంత సోషల్ మీడియా 'ట్రుత్ సోషల్' వేదికగా వెల్లడించారు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్‌కు చేరిన బరి‘తెగింపు’ తెలుగుదేశం పార్టీ తాన అంటే ఈనాడు తందాన అంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలని ప్రయత్నించే చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలను గుడ్డిగా అచ్చేస్తుంది. నిజానిజాల పట్టింపు లేదు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Godavari River Floods: ఉగ్ర గోదారి 'హై అలర్ట్' గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ రాష్ట్రంలో ఆరు రోజులుగా దంచికొడుతున్న వానలు గురువారానికి కాస్త నెమ్మదించాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కాళేశ్వరానికి వరద పోటు కనీవినీ ఎరుగని రీతిలో గోదావరికి వచ్చిన భారీ వరద కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభావం చూపింది. ప్రాజెక్టు పరిధిలోని సరస్వతి (అన్నారం), మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్‌లు పూర్తిగా నీట మునిగాయి. పంపుహౌస్‌లలోని పంపులు, మోటార్లు, ప్యానెల్ బోర్డు, విద్యుత్ పరిక రాలూ నీట మునిగాయి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే:‘టాప్’లీ లేపేశాడు.. లార్డ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్ కుదేలైంది. దీంతో భారత్ రెండో వన్డేలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. మూడు నెలల కనిష్టమే.. అయినా రెండంకెల పైనే! టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 15.18 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్‌తో పోల్చితే ఈ బాస్కెట్ ధర 15.18 శాతం పెరిగిందన్నమాట. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. మే నెలతో పోల్చితే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రెండంకెలపైనే ఈ రేటు కొనసాగడం ఇది వరుసగా 15వ నెల. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మా నాన్న రియల్ హీరో: వరలక్షి శరత్ కుమార్ పాన్ ఇండియా నటుడు శరత్‌కుమార్‌ను అభిమానులు సుప్రీం హీరో అంటారు. తమిళ సినిమాలో కథానాయకుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడడం లేదు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. వితం ఇబ్బందుల్లో పడిందని ఆవేదన చెందిన మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంగొండనహళ్లి నివాసి, ఐటీ ఉద్యోగి అయిన అనిత (25) మృతురాలు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. Kadem Project: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం కడెం ప్రాజెక్ట్‌కు పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. వరద నీరు తగ్గడంతో ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి.. నీతి ఆయోగ్ ప్రశంస నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అట్టడుగు స్థాయి నుంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నవరత్నాలను ఏకీకరణ చేసి అమలు చేస్తోందని నీతి ఆయోగ్ పేర్కొంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. వలంటీర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం నాగార్జున యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలంటీర్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం ఆర్థిక సాయం అందించారు. వలంటీర్ కుటుంబ సభ్యులకు రూ 10 లక్షల చెక్కు అందజేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘ఫిట్నెస్’ పెనాల్టీ మినహాయింపు.. ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా..? రవాణా వాహన యజమానులకు పెద్ద ఊరట. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుము విధింపు నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రెండు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. బ్రిటన్ ప్రధాని పీఠం: తొలి రౌండ్ రిషిదే.. గట్టి పోటీ ఇస్తున్న పెన్నీ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ (42) దూసుకెళ్తున్నారు. బుధవారం తొలి రౌండ్ ముగిసే సరికి ఆయన అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను సాధించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పళనిస్వామికి కొత్త తలనొప్పి.. కలకలం రేపిన రహస్య సంభాషణ మొన్నటి వరకు పన్నీర్‌సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్‌తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. భారత్ జోరును ఆపతరమా! బర్మింగ్‌హామ్ టెస్టు ఫలితం తర్వాత ఇంగ్లండ్ జట్టు ఊహించి ఉండకపోవచ్చు తాము టి20 సిరీస్ కోల్పోతామని...ఊహించకపోవచ్చు తొలి వన్డేలో ఇంత ఘోరంగా ఓడతామని...బుమ్రా స్వింగ్ బౌలింగ్ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేసి ఉండకపోవచ్చు...కానీ ఇప్పుడు వారికి టీమిండియా అసలు సత్తా ఏమిటో తెలిసొచ్చింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా వెలిగి పోతున్న నటి పూజా హెగ్డే. చిన్న గ్యాప్ దొరికినా విహారయాత్రకు బయలుదేతుంది. తాజాగా మూడు ఖండాలు.. నాలుగు నగరాలు.. ఒక నెల అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది ఈ భామ. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 2021–2022: 41 నగరాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు! హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంది. ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో 2021–22లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన రెసిడెక్స్ సూచీ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. రోల్ మోడల్: తొలి ఇండియన్ అమ్మాయిగా చరిత్ర సృష్టించనున్న రిజా వయసుకు తగ్గట్టుగా మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా ఎదగని పిల్లల...మాట, నడక, నవ్వు సాధారణ పిల్లలకంటే విభిన్నంగా ఉంటుంది. కొంతమంది అయితే ఒకటీ రెండు మాటలు కూడా స్పష్టంగా పలకడం కూడా కష్టమే. అటువంటిది డౌన్‌సిండ్రోమ్‌తో బాధపడుతోన్న రిజా రేజి ఏకంగా ప్రీమియర్ ఫ్యాషన్ షోకు ఎంపికైంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. గొటబాయకు ఎయిర్‌పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి.. చివరికి సైనిక విమానంలో.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అవి మోదీ మార్కు సింహాలు.. క్రూరంగా, కోపంగా కనిపించడం అవసరమా? పార్లమెంట్ నూతన భవనంపై ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించిన భారీ జాతీయ చిహ్నం(నాలుగు సింహాల)పై ప్రతిపక్షాలు, చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాన్ని సైతం మోదీ ప్రభుత్వం వక్రీకరించిందని ఆరోపించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSR Vahana Mitra: మూడేళ్ల కంటే మిన్నగా.. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్సార్ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రూ.261.51 కోట్ల మేర డ్రైవర్లకు ప్రయోజనం కలగనుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. వరద వేగాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు? గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు.. 64 ఏళ్ల రికార్డు బద్దలు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు: ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు, రాజ కీయ పక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతుంటే.. ఈ చర్చతో సంబంధం లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బుమ్రా బౌలింగ్.. రోహిత్ బ్యాటింగ్; టీమిండియా ఘన విజయం ఆకాశం మబ్బులు పట్టి ఉంది, పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకున్నానంటూ టాస్ సమయంలో రోహిత్ తమ పేసర్లపై ఉంచిన నమ్మకాన్ని వారు గొప్పగా నిలబెట్టారు. స్వింగ్‌తో చెలరేగిన మన పేసర్ల అద్భుత బౌలింగ్ ముందు ప్రపంచ చాంపియన్ తలవంచింది. లైనప్‌లో ఒక్కో ఆటగాడి పేరు, ఇటీవలి ఫామ్ చూస్తే ఈ టీమ్ కనీసం 350 పరుగులు చేస్తుందేమో అనిపించగా, వంద దాటేందుకు కూడా ఆపసోపాలు పడింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సమ్మర్ వార్ కు సై అంటున్న హీరోలు.. బరిలో 7 పెద్ద సినిమాలే! సినిమాలకు మంచి సీజన్ అంటే సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి... ఈ ఏడాది సమ్మర్ ముగిసింది. ఇక 2023 వేసవి బరిలో నిలిచేందుకు భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. డేట్‌ని ఫిక్స్ చేయకపోయినా వేసవి బరిలో నిలిచేందుకు ముందుగానే కర్చీఫ్ వేసేస్తున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టాటా ఎలక్ట్రిక్ కారు, ఒకసారి చార్జింగ్ చేస్తే 312కి.మీ ప్రయాణం! వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా నెక్సన్ ఈవీ ప్రైమ్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.14.99–17.5 లక్షల మధ్య ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే కారు 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. 129 పీఎస్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్, 30.2 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్‌కు తాకడంతో.. వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. కఠిన ఆంక్షలు అమలు చేసినా కట్టడి కాని కరోనా.. చైనాలో కొత్త వేరియంట్ కలకలం కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అన్నాడీఎంకే అంతర్గత కలహాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని తేల్చి చెప్పింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే మోదీకీ పడుతుందని అన్నారు. ఆయనలాగే మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని పేర్కొన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. విశాఖకు సీఎం జగన్.. టూర్ షెడ్యూల్ ఇదే..| ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు వెళ్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Pawan Kalyan: జనవాణా.. విషవాణా? ‘జనవాణి’ పేరిట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషవాణి వినిపిస్తున్నారు. అవాస్తవాలు, కట్టుకథలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళతో ఆయన హైడ్రామా సృష్టించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. IND vs ENG 3rd T20: సూర్య 'ప్రతాపం' సరిపోలేదు.. సిరీస్ మాత్రం టీమిండియాదే ఆఖరి పోరులో ఇంగ్లండ్ చెమటోడ్చి పరువు నిలబెట్టుకుంది. మూడో టి20లో సూర్య కుమార్ యాదవ్ (55 బంతుల్లో 117; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు సరైన సహకారం లేక భారత్ 17 పరుగులతో ఓడింది. సిరీస్‌ను 2–1తో సరిపెట్టుకుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Dil Raju-Nithin: ఇండస్ట్రీలో 20 ఏళ్లు.. ఇది మామూలు విషయం కాదు ‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్ సక్సెస్ ఫుల్‌గా ఉండటం గొప్ప విషయం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎస్సై లీలలు.. పెళ్లి చేసుకుంటానని పదేళ్లుగా సహజీవనం, మరొక మహిళతో.. కణతపై తుపాకీ గురిపెట్టి వివాహితను ఓ పోలీసు అధికారి అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువక మునుపే పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి మోసం చేసిన మరో పోలీసు అధికారి అరాచకం వెలుగులోకి వచ్చింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. DMart: డీమార్ట్ ఆకర్షణీయ ఫలితాలు.. మరింత పెరిగిన లాభాలు డీమార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం పలు రెట్లు ఎగసి రూ. 643 కోట్లకు చేరింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు ‘‘నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్ మహౌషథుల్’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. YSRCP Plenary 2022: వన్స్‌మోర్ జగనన్న ‘వన్స్‌మోర్ జగనన్న’ అన్నదే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని మహిళల నినాదం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం, రక్షణ, సాధికారికతలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన సీఎం వైఎస్ జగన్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళలందరిపై ఉందన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. AP CM YS Jagan: అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి అమర్నాథ్లో కుండపోత వాన, అకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. జర పైలం.. రెండ్రోజులు.. జోరు వాన! నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, దానికి తోడుగా ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడింది. వాగులు వంకలు ఉప్పొంగాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గమనించాలి: పోలీస్ ఫోన్ నెంబర్లు మారనున్నాయ్! ప్రస్తుతం సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ కంటే తక్కువ ధరకు ఎక్కువ సదుపాయాలు ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో పోలీసు విభాగం ఫోన్లు ఎయిర్‌టెల్‌కు మారనున్నాయని కొత్వాల్ సీవీ ఆనంద్ శుక్రవారం పేర్కొన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది ఉక్రెయిన్ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. IND vs ENG 2nd T20: సిరీస్ విజయమే లక్ష్యంగా... కోహ్లికి పరీక్ష! ఆతిథ్య ఇంగ్లండ్‌పై తొలి టి20లో పైచేయి సాధించిన భారత్ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి భారీ తేడాతో నెగ్గిన టీమిండియా అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే ఇంగ్లండ్‌ను మరోసారి దెబ్బ తీయవచ్చు. అయితే అనూహ్య ఓటమి నుంచి కోలుకొని సిరీస్ కాపాడుకునేందుకు బట్లర్ బృందం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. OTT-Web Series: సినిమాతో చెప్పలేని కథలను.. ఓటీటీలో చెప్పేందుకు సై అన్న స్టార్స్ సినిమాని థియేటర్లో చూస్తే ఆ అనుభూతే వేరు అని సినీ ప్రముఖులు అంటుంటారు. ఇది నిజమే. అయితే సినిమాలో చెప్పలేని కొన్ని కథలు ఉంటాయి. అవి ఓటీటీలో చెప్పడానికి కుదురుతాయి. ఇలాంటి కథలకు స్టార్స్ ఓకే చెప్పి, ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అందరికీ వృద్ధి ఫలాలు అందడమే అసలైన అభివృద్ధి సమ్మిళిత వృద్ధి (అందరికీ వృద్ధి ఫలాలు చేరేలా) లేకుండా అసలైన వృద్ధి సాధ్యపడదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు ఈ దిశగా తీసుకున్నట్టు చెప్పారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మధ్యాహ్నం పూట పడుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి మధ్యాహ్నం పూట ఒక గంట పాటు నిద్రించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అలాగే మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని, శరీరం చురుగ్గా ఉండటానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. గుజరాత్లో వరుణ విలయం దక్షిణ గుజరాత్లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్‌నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning 10 AM Top News: మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో ఓ సభలో మాట్లాడుతుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాయి. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSR Jayanthi 2022: వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. సేవకుల తయారీ విధానమది బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్‌లో చేరికలు.. అలకలు ‘ఒక్క చేరిక.. రెండు అసంతృప్తులు’ అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందనే చర్చ కార్యకర్తల్లో సాగుతోంది. కొత్త చేరికలు పాతవారి అలకలకు కారణమవుతున్నాయి. చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలో కొంతమంది పాతనేతల అసంతృప్తి క్యాడర్‌ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. The Warrior-Ram Pothineni: ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్ ‘‘నేను ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా 13 విజయాలు అందుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన మొదటి టీ20లో విజయంతో ఈ ఘనతను రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విమాన ప్రయాణికులకు బంపరాఫర్! విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్ ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్‌గా మారాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning 10 AM Top News: మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. CM YS Jagan: మార్గ నిర్దేశకుడు తప్పుడు కేసులకు భయపడలేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వెరవలేదు. ప్రజలకు మేలు చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పదేళ్లు అలుపెరగని పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలా భరోసా కల్పించారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బ్రిటన్ ప్రధాని బోరిస్‌కు మరో షాక్.. సర్కార్ పడిపోనుందా..? బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి తీవ్రతరమైంది. మంగళవారం భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లతో మొదలైన రాజీనామాల పర్వం బుధవారం మరింత ఊపందుకుంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. Rajya Sabha Nominated MPs 2022: రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకొని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మరో అస్త్రం సంధించింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Eknath Shinde: పిక్చర్ అభీ బాకీ హై! ‘కాస్తంత ఊపిరి తీసుకోనివ్వండి. కొద్దిరోజులుగా బోలెడంత హడావిడిలో ఉన్నా!’ మహారాష్ట్ర శాసనసభలో సోమవారం నాటి విశ్వాస పరీక్షలో నెగ్గిన వెంటనే విలేఖరులతో కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే అన్న మాటలివి. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. హైదరాబాద్‌కు ‘ఎగిరొచ్చిన’ ప్రపంచంలోనే నంబర్ 1 సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. Krishna Vamsi: కృష్ణ వంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్! కరోనా తర్వాత జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. దీంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్ కోసం బాగానే ఖర్చు చేస్తున్నాయి. తెలుగులో కూడా పదుల సంఖ్యల్లో వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. IND vs ENG T20: టి20 సమరానికి సై.. పూర్తి స్థాయి టి20 స్పెషలిస్ట్‌ల టీమ్‌తో ఇంగ్లండ్ ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో టి20 ప్రపంచకప్ జరగనుంది. ఆ లోగా భారత్ వేర్వేరు టోర్నీల్లో కలిపి 15 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి ప్రపంచకప్ జట్టు కూర్పు విషయంలో ఒక అంచనాకు వచ్చేందుకు ఇంగ్లండ్‌తో సిరీస్ టీమ్ మేనేజ్మెంట్కు ఉపయోగపడుతుంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. వంటనూనెల ధరల్ని తగ్గించండి, తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు! అంతర్జాతీయంగా రేట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా లీటరుకు రూ. 10 వరకూ తగ్గించాలని తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అలాగే, ఒక బ్రాండ్ ఆయిల్‌పై దేశవ్యాప్తంగా ఒకే ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) ఉండాలని సూచించింది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. గృహిణులు టార్గెట్‌గా కొత్త రకం ఆన్లైన్ మోసాలు పిల్లలు స్కూల్‌కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ ఇటీవల జరిగిన ‘అగ్నిపథ్’ ఆందోళనలు, రైళ్ల దహనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో అధునాతన సీసీటీవీ భద్రతా వ్యవస్థను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సీసీ కెమెరాల స్థానంలో హైటెక్ కెమెరాలతో కూడిన వీడియో నిఘా వ్యవస్థ–వీఎస్ఎస్ (సీసీటీవీ కెమెరాల నెట్వర్క్)ను ఏర్పాటు చేయనుంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning 10 AM Top News: మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. రెండు రోజుల పాటు.. జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. సామాన్యులకు షాక్, భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర! పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. ఇళ్లలో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి.దీంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సిలిండర్ ధరకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSRCP Plenary 2022: తిరుగులేని శక్తి రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీని అణగదొక్కడానికి చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు, సవాళ్లు, దాడులు ఎదుర్కొంది. అయినప్పటికీ వైఎస్ జగన్ ఒకే మాట.. ఒకే బాటగా ముందుకు సాగారు. ఏ దశలోనూ ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. స్వమిత్వ పథకం: తెలంగాణలో పైలట్ ప్రాజెక్టుకు సెలక్టైన గ్రామాలివే! పల్లె ఇల్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోకి వెళ్లు.. ప్రతి ఇంటి లెక్క పక్కాగా సేకరిస్తారు. అందుకే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ‘స్వమిత్వ’పథకం పేరుతో ఇళ్ల సర్వే మొదలుపెట్టింది. గ్రామకంఠం మొత్తాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించి, వాటి ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు కోనోకార్పస్.. ఈ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్షశాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో సుందరీకరణ కోసం దీన్ని విరివిగా పెంచుతున్నారు. అయితే.. వీటితో పర్యావరణానికి పలువిధాలుగా విఘాతం కలుగుతోందని, ముఖ్యంగా పట్టణప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని, మున్సిపాలిటీలకు రూ.లక్షల్లో నష్టం కలుగుజేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు కరోనా, మంకీ ఫీవర్‌కి తోడుగా మరో జబ్బు జిల్లాలో తలెత్తింది. శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 81 ఎలుక జ్వరం (ఆర్బీఎఫ్) కేసులు నమోదు కావడం జరిగిందని శివమొగ్గ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మే నెల చివరి నాటికి సుమారు 30 కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి నేటి వరకు అవి మొత్తం 81 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.Johnson Government: సంక్షోభంలో జాన్సన్ సర్కారు బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్ జాన్సన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.టీమిండియా ఓటమిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందన గత కొన్ని ఫలితాలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో, ఇక్కడా మాకు మంచి అవకాశాలు లభించాయి. కానీ వాటిని ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్‌లో ఒకే తరహా తీవ్రత, ప్రదర్శన, ఫిట్నెస్ మ్యాచ్ ఆసాంతం కొనసాగించలేకపోవడం దానికి కారణమని భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. తల్లి నగలు తాకట్టు పెట్టి గెర్బెరా పూలను సాగు చేశారు.. లక్షలు అర్జిస్తున్నారు కోశాక నీటి తడిలో ఉంచితే 15 రోజుల పాటు వాడవు గెర్బెరా పూలు. జార్ఖండ్‌లో ఈ పూలు కావాలంటే బెంగళూరు నుంచి తెప్పించుకోవాలి. ఇప్పుడు జెమ్‌షడ్‌పూర్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ప్రియాంక, ప్రీతిలను అడిగితే చాలు వెంటనే లోడ్ పంపిస్తారు. లాకౌట్ కాలంలో తండ్రికి పనిపోవడంతో ఖాళీగా ఉన్న పొలంలో అలంకరణ పూలైన గెర్బెరాను సాగు చేశారు వీరు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. Jagananna Vidya Kanuka: రూ.931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక కార్పొరేట్ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్ కిట్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కానిస్టేబుల్‌పై దాడి.. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ ఎంపీ రఘురామ ఇంటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Russia-Ukraine War: లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లోని అత్యంత కీలకమైన డోన్బాస్లో భాగమైన లుహాన్స్క్ ప్రావిన్స్‌లో రష్యా విజయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఖరారు చేశారు. లుహాన్స్క్లో జెండా పాతేశామని అన్నారు. ఈ ప్రాంతంపై రష్యా సైన్యం పూర్తిస్థాయిలో పట్టుబిగించడంతో ఉక్రెయిన్ సేనలు ఆదివారం వెనుదిరిగాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘కాళీ’ పోస్టర్‌పై తీవ్ర వివాదం.. ‘బతికున్నంతకాలం నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటా’ ‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో ఈ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాళీ మాత పాత్రధారి సిగరెట్ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్(ఎల్జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్లో కనిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్‌ను అందజేసిన భారత్‌ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్‌పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లో వెళ్లకపోవడం బెటర్! బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య తాను ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తానని, డబుల్ మీనింగ్‌లో మాట్లాడడం రాదని నాగచైతన్య అన్నారు. చైతూ, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నాయర్, అవికా గోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. IND vs ENG 5th Test: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా? ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యం... ఒకదశలో స్కోరు 107/0... ఇంగ్లండ్‌దే పైచేయిగా అనిపించింది. ఇంతలో బుమ్రా బౌలింగ్, బ్యాటర్ల స్వయంకృతం కలిపి 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... 109/3... భారత్‌కు పట్టు చిక్కినట్లే కనిపించింది. కానీ రూట్, బెయిర్‌స్టో అనూహ్యంగా ఎదురు దాడికి దిగారు. నాలుగో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్ ఇంత సులువా అన్నట్లుగా పరుగులు సాధిస్తూ దూసుకుపోయారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. దిగుమతుల బిల్లుకు క్రూడ్, పసిడి సెగ! ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారత్ ఎకానమీకి ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఎగుమతులు జూన్‌లో 17 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 64 బిలియన్ డాలర్లకు చేరింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మిస్ ఇండియా 2022: తుళు సౌందర్యానికి మరో కిరీటం ఐశ్వర్యా రాయ్... శిల్పా శెట్టి... శ్రీనిధి శెట్టి... అందాల పోటీల్లో కిరీటాలు సాధించారు. ముగ్గురూ ‘తుళు’ భాషీయులే. కేరళ, కర్నాటక, గోవా ప్రాంతాలలో ఉండే తుళు భాషీయుల నుంచే ఇప్పుడు మరో సౌందర్యరాశి దేశాన్ని పలుకరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీ పర్యటనకు రానున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్‌లోని లోయలో పడిపోయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Maharashtra political crisis: విల్లు బాణమెవరికో? సిసలైన శివసేన ఎవరిది? మహారాష్ట్ర పెద్దపులి బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ ఎవరి సొంతమవుతుంది? పార్టీ చిహ్నమైన విల్లుబాణం సీఎం షిండే పరమయ్యేనా? ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే కనీసం పార్టీనైనా కాపాడుకోగలరా? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. బాబుతో దోస్తీ.. కాపులకు న్యాయమేది? పవన్‌ను ప్రశ్నించిన కాపు ఐక్యవేదిక జనవాణి కార్యక్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ వైఖరినే ప్రశ్నిస్తూ కాపు ఐక్యవేదిక వినతిపత్రం అందజేసింది. కాపు రిజర్వేషన్ల అంశం సహా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు సంబంధించి పలు డిమాండ్లపై పార్టీ తరఫున బహిరంగ ప్రకటన చేయాలని అందులో డిమాండ్ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు! కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. పదేపదే పార్టీ లైన్ దాటుతూ వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిపై చర్యలు కఠినంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సభ సక్సెస్.. బీజేపీకి టానిక్! బీజేపీ ప్రధాని మోదీతో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’బాగా విజయవంతమైం దని బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాది మంది తరలిరావడం, ఏర్పాట్లు బాగా చేయడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టడం, ప్రధాని సహా ఇతర నేతలంతా హుషారుగా కనిపించడంతో రాష్ట్ర పార్టీ నాయకులు సంబరపడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. వారిద్దరూ ఎలా కలిసి ఉంటారో చూస్తా.. నరేష్ మూడో భార్య రమ్య శపథం తాను ఇంకా విడాకులు తీసుకోలేదని, అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్తతో కలిసి తిరుగుతోందని నరేష్ మూడో భార్య రమ్య మండిపడింది. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆఖరి టెస్టులో భారత్ ‘పట్టు’.. చతేశ్వర్ పుజారా అర్ధసెంచరీ గతేడాది 2–1తో ఆగిపోయిన ఐదు టెస్టుల సిరీస్ 3–1తో తమ వశమయ్యే దిశగా భారత్ అడుగులేస్తోంది. ఇంగ్లండ్ బ్యాటర్లను మన బౌలర్లు కట్టడి చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 300 పరుగుల్లోపే ఆలౌటైంది. భారత్‌కు 132 పరుగుల ఆధిక్యం లభించగా, రెండో ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా అర్ధసెంచరీతో టీమిండియా ఆధిక్యం 257 పరుగులకు చేరుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. బ్యాంకుకు వెళ్లిన సాగర్‌కు మతి పోయినంతపనైంది.. భద్రం బ్రదరూ! ఇంతకూ ఏమైంది? సాధారణంగా షాపింగ్‌కో, ఆన్లైన్ పేమెంట్లకో క్రెడిట్ కార్డు వాడటం సాగర్‌కు అలవాటు. కానీ ఈ మధ్య ఆన్లైన్లో అత్యంత సౌకర్యంగా ఉండటంతో ఇన్స్టంట్ లోన్/పేమెంట్ యాప్‌లను ఎడాపెడా వాడటం మొదలెట్టాడు. తరువాత చెల్లింవచ్చు కదా (పోస్ట్ పెయిడ్) అనే ఉద్దేశంతో చాలా యాప్‌లలో కొంత మొత్తం చొప్పున వాడేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వినయమే బలం.. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని విర్రవీగితే ఇక అంతే! ఒకడు బాగా రాస్తాడు, ఒకడికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒకడు బాగా పాడతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మాట్లాడతాడు...ఏది ఉన్నా అది భగవంతుడు వాడికి ఇచ్చిన విభూతి. ‘‘యద్యత్ విభూతిరాతిమత్ సత్వం శ్రీమదూర్జిత మేవనా/తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్’’ అంటాడు గీతాచార్యుడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. తెలంగాణపై ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన బీజేపీ తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బీజేపీ సభ వేళ టీఆర్ఎస్కు ఊహించని షాక్ తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్లాన్స్ రచిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ భారీ భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వరదాపురం సూరిపై ఏసీబీ విచారణ మొదలైంది. అనంతపురం జిల్లాలో భారీగా భూ అక్రమాలకు పాల్పడటంతో పాటు టీడీపీ హయాంలో అధికార బలంతో ప్రభుత్వ భూములను అక్రమంగా కొనుగోలు చేశారు. 2014–19 మధ్య కాలంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి...ఆ సమయంలోనే రూ.కోట్లు విలువైన భూములను అక్రమంగా తీసుకున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మహారాష్ట్ర స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్.. థాక్రేకు షాక్ మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏక్నాథ్ శిండే సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అందుకోసం రెండు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలను జరిపేందుకు సిద్దమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అత్యంత హాస్యభరితమైన జోక్ ఇది! అది ఏంటంటే? ఏదైనా జోక్ వింటే చటుక్కున నవ్వు వచ్చేస్తుంది.. కానీ అన్ని జోకులు అందరికీ నచ్చవు. కొన్ని సార్లు పడీ పడీ నవ్వేస్తుంటాం.. మరికొన్ని సార్లు చిన్నగా నవ్వి ఊరుకుంటాం. మరి ఎన్నో జోక్‌లు ఉన్నా ఎక్కువ మందికి నచ్చే జోక్ ఏమిటన్న డౌట్ వస్తుంది కదా.. రిచర్డ్ వైస్మాన్ అనే సైకాలజిస్టుకూ ఇదే అనుమానం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బాగా ఇష్టపడే జోక్ ఏమిటా అన్న దానిపై ఓ ప్రయోగం మొదలుపెట్టాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Lamborghini Aventador Car: ఇండియాలో రెండో లక్కీయెస్ట్ ఓనర్! లగ్జరీ స్పోర్ట్స్ కార్లు అండ్ ఎస్‌యూవీలను అందించే ఇటలీ కార్ మేకర్ లంబోర్ఘిని లేటెస్ట్ సూపర్ కార్ అవెంటడోర్ అల్టిమే రోడ్‌స్టర్ రెండో కారును భారత మార్కెట్లో డెలివరీ చేసింది. గ్లోబల్‌గా లిమిటెడ్ ఎడిషన్‌గా లాంచ్ చేసిన ఈ కారులో రెండోది ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు ముందు కరోనా బారిన పడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో రోహిత్ శర్మకు నెగిటివ్‌గా తేలింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. పెళ్లిళ్లు బాధాకరంగా ఉండేందుకు మీరే కారణం: సమంత అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. క్యాన్సర్‌తో బాధపడుతున్నారా.. బీట్రూట్ తిన్నారంటే..! బీట్రూట్లో బిటాలెయిన్స్ అనే పోషకం ఉంటుంది. బీట్రూట్కు ఎర్రటి రంగునిచ్చేది ఇదే. ఇదో శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్. అంతేకాదు... బీట్రూట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. క్యాన్సర్‌ను నివారించడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక భూమిక పోషిస్తాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పెళ్లి అయి మూడు నెలలు కాకుండానే.. వ్యాయామం చేస్తూ.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆషాడమాసం తర్వాత హనీమూన్ వెళ్లాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. విధి వక్రించింది. వ్యాయామం చేస్తున్న యువకుడు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆషాడ మాసానికని పుట్టింటికి వెళ్లిన భార్య భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిసిన ఉద్దవ్.. షిండే అసలైన సీఎం కాదని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం ముందుకెళ్లరాదని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. HYD: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.. నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరేడ్ గ్రౌండ్ వద్ద శుక్రవారం భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనందర్ పరిశీలించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘చంద్రబాబు సీఎంగా ఉంటే కరోనా వచ్చేది కాదంట..’ చంద్రబాబు పాలనంతా అబద్ధాలమయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కరోనా వైరస్ కాదు.. బయో వార్ అది!: ఉత్తర కొరియా సంచలన ఆరోపణలు ప్రపంచమంతా కరోనా వైరస్‌ను సాధారణ పరిస్థితులుగా భావిస్తున్న తరుణంలో.. ఉత్తర కొరియాలో మాత్రం తాజా విజృంభణతో లక్షల మంది వైరస్ బారినపడ్డారు. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిపై సంచలన ఆరోపణలకు దిగింది ఆ దేశం. పొరుగుదేశం బయో వార్‌కు ప్రయత్నించిందనేది కిమ్ జోంగ్ ఉన్ తాజా ఆరోపణ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్ తెలంగాణకు కేంద్రం నుంచి ఒక మంచిపనైనా చేయించడం చేతగాని దద్దమ్మగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మిగిలిపోయారంటూ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను మోసం చేస్తోంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాదా? విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కిషన్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆమె వివరాలు చెప్పండి.. నా వంతు సాయం చేస్తా: కేటీఆర్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎవరైనా బాధితులు.. సాయం కోసం సోషల్ మీడియాలో కేటీఆర్‌ను సాయం అడిగితే వెంటనే స్పందించి.. వారికి తన వంతు సాయం అందిస్తుంటారు. తాజాగా ఓ వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్.. బాలిక వివరాలను చెప్పాలని ఆమెకు సాయం అందిస్తానని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Ind Vs Eng: నాకు దక్కిన గొప్ప గౌరవం.. బుమ్రా భావోద్వేగం ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. తొలిసారి భారత జట్టు సారథి హోదాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌తో కలిసి టాస్ సమయంలో ఎడ్జ్‌బాస్టన్ మైదానానికి వచ్చాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. కేంద్రం కీలక నిర్ణయం, పెట్రో ఎగుమతులపై ట్యాక్స్ పెంపు.. వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. పెట్రో ఎగుమతులపై విధించే ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతులపై రూ.13 పెంచుతున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఉదయ్‌పూర్ ఘటన నూపుర్ వల్లే జరిగింది.. సుప్రీం కోర్టు మండిపాటు బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వెల్లగక్కింది. అధికారం ఉందనే పొగరు తలకెక్కి నూపుర్ శర్మ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని శుక్రవారం మండిపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. Maharashtra Politics: ‘మహా’ ట్విస్ట్.. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే! మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే ఈరోజు (గురువారం) సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం.. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కుప్పంలో తమిళ యాక్టర్ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ చూడండి తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల ఫలితాల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. దళారీలకు టీటీడీ చెక్.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం దళారీ వ్యవస్థకు టీటీడీ చెక్ పెడుతుండడంతో శ్రీవారి ఖజానా కాసులతో నిండుతోంది. సిఫార్సు వ్యవస్థని ఆసరాగా చేసుకొని జేబులు నింపుకుంటున్న దళారులను ఇంటిదారి పట్టించడంతో శ్రీవారి ఖజానాకు ఏడాదికి రూ.500 కోట్లు పైగానే ఆదాయం లభిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. హైదరాబాద్ కలెక్టర్‌గా అమయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా (ఎఫ్ఏసీ–పూర్తిఅదనపు బాధ్యతలు) రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంగ్లండ్‌తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా? వ్యూహాలు రచించలేరా? టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుకు సారథిగా జస్ప్రీత్ బుమ్రా పేరు దాదాపుగా ఖరారైనట్లే! ఒకవేళ అదే జరిగితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ తర్వాత కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్న మొదటి పేసర్‌గా బుమ్రా నిలవనున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Major: మేజర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మేజర్. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. సీతారామన్ టంగ్ స్లిప్: కేటీఆర్ కౌంటర్, వైరల్ వీడియో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుర్రపు పందాలపై జీఎస్టీ అంశం గురించి మాట్లాడుతున్నపుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్టీ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. టీమ్వ్యూమర్, ఎనీడెస్క్ వంటివి డౌన్లోడ్ చేయమంటారు? ఓటీపీ చెబితే అంతే సంగతులు! సుందర్ టీవీ చూస్తూ టిఫిన్ చేస్తున్నాడు. కాసేపట్లో ఆఫీసుకు బయల్దేరాలి. అప్పుడే ఫోన్ రావడంతో విసుగ్గా ఆన్సర్ చేశాడు. అవతలి నుంచి క్రెడిట్ కార్డ్ బోనస్ పాయింట్స్ రిడీమ్ చేసుకోమంటూ కస్టమర్ కేర్ కాల్. కట్ చేద్దామంటే పాయింట్స్ గురించి చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు, డిటిజల్ లెర్నింగ్‌పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్ అందించడంపై సీఎం జగన్ చర్చించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. డాక్టర్ల నుంచి సిబ్బంది కొరత ఉందనే మాట రాకూడదు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు–నేడుతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు.. మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ హస్తీనా చేరుకున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిషాతో ఫడ్నవీస్ భేటీ కానున్నారు. మరోవైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే కూడా గౌహతి నుంచి ఢిల్లీ బయల్దేరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Chandrababu: చంద్రబాబు-మానసిక బలహీనతలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఒక సందర్భంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయనకు వయసు మీద పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అంతవరకు ఓకే. కానీ.. ఆ కౌంటర్ లో చెప్పినట్లుగా ఆయన బ్యాలెన్స్డ్గా ఉంటున్నారా?.. ఉండడం లేదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. Kodali Nani: దత్త పుత్రుడిని, సొంత పుత్రుడిని తుక్కుతుక్కుగా ఓడించాం పనికిమాలిన 420లు అంతా అమ్మఒడి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్పొరేట్స్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి మూడేళ్లలోనే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2022) ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఫలితాల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1 న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు వింబుల్డన్ 2022లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్‌కు శుభారంభం లభించింది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ఆటగాడు, ప్రపంచ 81వ ర్యాంకర్ సూన్‌వూ క్వాన్‌పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించిన జకో.. రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో జకో ఓ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఎలాంటి ఆఫర్స్ రాలేదు దక్షిణాదిలో ప్రస్తుతం పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్ హీరోలదరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాలతో ఆమె కెరీర్లో దూసుకుపోతుంది. అయితే ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్‌లు నిరాశ పరిచిన పూజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. బ్లింకిట్ డీల్: జొమాటోలో వేల కోట్ల రూపాయలు హాంఫట్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కిరాణా డెలివరీ స్టార్టప్ బ్లింకిట్‌ను కొనుగోలు ఒప్పందం ప్రకటించిన తరువాత దాదాపు ఒక బిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ భారీ నష్టాన్న చవి చూసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ధరణి పోర్టల్ ట్యాంపరింగ్.. మీసేవ ఆపరేటర్ల హస్తం! తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక్రమార్కులు ధరణి పోర్టల్‌ను ట్యాంపరింగ్ చేశారు. పాసు పుస్తకం ఉన్నప్పటికీ పెండింగ్ మ్యుటేషన్‌గా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. షిండే వర్గానికి ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టులో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పైసా ఇవ్వని వాళ్లు.. ఆ రెండు వేల కోసం విమర్శిస్తున్నారు: సీఎం జగన్ పిల్లలకు ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్లు.. ఇవాళ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, అలాంటి వాళ్లు విమర్శించే మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో సోమవారం జరిగిన మూడవ విడత అమ్మఒడి నిధుల విడుదల సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్ కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయంటున్న బీజేపీ రాష్ట్ర నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తోంది ఎంత.. కేంద్ర నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు ఎంత అన్న దానిపై కమలం పెద్దలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రెబల్స్ మంత్రులకు షాక్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన నిర్ణయం! మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్‌పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమై.. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. తొలుత డిమాండ్ చేసి.. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును జత చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీంతో గత కొంతకాలంగా ఈ విషయంలో ఏర్పడిన సందిగ్ద పరిస్థితి తొలగిపోయిందని అనుకోవచ్చు. దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు కూడా వివాదం అవుతుందని ఎవరూ ఊహించలేరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. టీ20 కెప్టెన్సీ నుంచి అతడికి విముక్తి కల్పించండి! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడికి టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి సూచించాడు. అప్పుడు హిట్‌మ్యాన్‌పై భారం తగ్గి టెస్టు, వన్డేల్లో మరింత మెరుగ్గా కెప్టెన్సీ చేయగలడని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్, కాజల్ టాప్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంగోత్రి మూవీతో అల్లు వారి వారసుడిగా పరిచయమైన బన్నీ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఇక ఆ తర్వాత ఆర్య, దేశముదురు, పరుగు, ఆర్య 2, జులాయి వంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రాష్ట్రపతి రేసులో మీరెందుకు లేరు? సుధామూర్తి ఆసక్తికర సమాధానం ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చడంలో ఇతోధికంగా తోడ్పడిన కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. నారాయణమూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్ దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా వెలుగొందుతోంది. ఇన్ఫోసిస్ ఎదుగుదల వెనుక ఫౌండర్ నారాయణమూర్తి శ్రమతోతో పాటు ఆయన భార్య సుధామూర్తి సహకారం కూడా ఉంది. రచయితగా, సామాజిక కార్యకర్తగా ఎప్పుడూ చురుగ్గా ఉండే సుధా నారాయణమూర్తికి ఆడియన్స్ నుంచి ఊహించిన ప్రశ్న ఎదురైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. పిల్లలు పక్క తడుపుతున్నారా? కారణాలివే! క్రాన్బెర్రీ జ్యూస్, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు!| పిల్లల మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం కూడా ఒక కారణం. ఈ సమస్య తో ఉన్న పిల్లలు ఎక్కువ సేపు మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి వంట విషయంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన బాదల్ తమాంగ్(29), సకిల మిశ్ర మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మణికొండ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్‌ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పోలీస్ శాఖతో గవర్నర్ చర్చలు.. రాష్ట్రపతి పాలన రాబోతోందా? మహారాష్ట్రలో శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మొదలైన పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసినప్పటికీ సీఎం ఉద్దవ్ థాక్రే ఈ పోరులో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే బృందం అసలైన బాల్‌ఠాక్రే వారసులం తామేనని ప్రకటించుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇంటికే వస్తా అంటే రమ్మంటిని.. రాత్రి నుంచి చూస్తున్నా ఎక్కడా? మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా పలు మలుపులు తిరుగుతోంది. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం ఉద్దవ్ థాక్రే సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. దీంతో, సర్కార్ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. కాగా, పొలిటికల్ సంక్షోభం కొనసాగుతున్న వేళ మరో ట్విస్ట్ నెలకొంది. సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య.. రష్మీ థాక్రే రాజకీయ చదరంగంలోకి దిగారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు ప్రపంచ మాజీ నంబర్ 2 టెన్నిస్ క్రీడాకారిణి, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనలిస్ట్ అయిన ఆండ్రియా జేగర్ (అమెరికా) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ స్టాఫ్ మెంబర్ ఒకరు తనపై 30కి పైగా సందర్భాల్లో లైంగికంగా దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మావాడికి నేను ఎక్స్పోజింగ్ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా.. బిగ్‌బాస్ షోతో బాగా పాపులర్ అయింది రాఖీ సావంత్. కానీ ఎప్పుడైతే షో నుంచి బయటకు వచ్చిందో అప్పటినుంచి ఆమెను కష్టాలు వెంటాడాయి. తను ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన వ్యక్తికి ఇదివరకే వివాహమైందని తెలియడంతో ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ బంపరాఫర్! ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం, పాస్వర్డ్ షేరింగ్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడంతో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 2లక్షమంది వినియోగదారుల్ని కోల్పోయింది. 30శాతం షేర్లు నష్టపోయాయి. క్యూ2లో మరో 20లక్షల వినియోగారుల్ని కోల్పోవచ్చని నెట్‌ఫ్లిక్స్ అంచానా వేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. వెండి తెరపై చినుకుల తుళ్లింత గొప్ప దర్శకులు వానను కూడా పాత్రగా తీసుకున్నారు. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసావా తీసిన ‘రోషమాన్’ సినిమా ప్రారంభంలోనే రోషమాన్ నగర శిథిల ద్వారం దగ్గర హోరుమని కురిసే వర్షాన్ని చూపుతాడు దర్శకుడు. ఆ శిథిల ద్వారం, ఆ క్రూర వర్షం 12వ శతాబ్దపు జపనీయ స్థితిగతులకు సంకేతం. 1950లో తీసిన ఈ సినిమాకు ముందు వానను అలా చూపినవారు లేరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. 30 ఏళ్ల కిందట పేలిన తూటా.. శంకరన్న చేతిలో సరళ బలి కరీంనగర్–నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణిస్తోంది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. ఫొటోలు, వీడియోలు విడుదల.. ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించిన అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు గంప అనిల్, యాళ్ల నాగులతోపాటు 18 మందిని సోమవారం అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు న్యూఢిల్లీ/దుబాయ్: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కేశినేని నాని కార్యాలయం ముందు ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన చేపట్టారు. కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేశినేని నాని కార్యాలయం పక్కనే నాగయ్య ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఎంపీ నాని కార్పొరేషన్‌తో నోటీసులు ఇప్పించాడని నాగయ్య తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. Monkeypox Virus: 27 దేశాలకు పాకిన మంకీపాక్స్.. మొత్తం 780 కేసులు మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు.. ఈ నెల 30వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. SL vs AUS: శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్‌వెల్ మాయ చేస్తాడా..? ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కొలంబోలో నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో తలపడుతుంది. వార్నర్, మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, స్టార్క్, స్మిత్, లబుషేన్, హాజల్‌వుడ్‌లతో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఎన్ఆర్ఐలను ఊరిస్తున్న రియల్టీ ఎన్ఆర్ఐలు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇటీవలి కాలంలో క్షీణించడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం తదితర అంశాలు ఎన్ఆర్ఐలను భారత మార్కెట్లో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రతిభ..: జయం మనదే! అమెరికాలో స్పెల్లింగ్ బీ పోటీలకు పెద్ద చరిత్ర, ఘనత ఉన్నాయి. ఆ చరిత్రను భారత సంతతికి చెందిన పిల్లలు తమ ఘనతతో తిరగరాస్తున్నారు. గెలుపు జెండా ఎగరేస్తున్నారు... తాజాగా పద్నాలుగు సంవత్సరాల హరిణి లోగాన్ ‘2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీ విజేతగా నిలిచింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. మచిలీపట్నంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు మచిలీపట్నం మండలం గరాల దిబ్బలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. AP SSC Results 2022: నేడే టెన్త్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే.. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను జూన్ 6వ తేదీన(సోమవారం) విడుదల చేయనున్నారు.ఈ ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. 20లోగా ఇంటర్ ఫలితాలు.. నెలాఖరుకు టెన్త్ ఫలితాలు కూడా..! రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా సాగుతోంది. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ నెల 20లోగా ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డ్ కృత నిశ్చయంతో ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.TS Group 1 Prelims: గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ తీరే వేరు! గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే నోటిఫికేషన్లో వెల్లడించింది. పరీక్షల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కూడా మరింత సన్నద్ధతతో దీక్ష చేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే మెయిన్ పరీక్షలకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తే ఖబడ్దార్ ఉక్రెయిన్‌కు లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్, ఇతర ఆయుధాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని, తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇప్పటిదాకా ఎన్నడూ దాడి చేయని లక్ష్యాలపై దాడులకు దిగుతామని తేల్చిచెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి! కుక్క కాటుకు అదేదో దెబ్బ అని ఒక నానుడి ఉంది. కుక్క కరిస్తే యాంటి రేబీస్ టీకాలు వేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. ఆపై బెంగళూరు పాలికెలో దరఖాస్తు చేసుకుంటే పరిహారం కూడా లభిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.‘ఇష్టపడి పెళ్లి, ఇష్టపడే ఆత్మహత్య చేసుకుంటున్నా.. క్షమించు అమ్మా’ నవ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. చిక్కమగళూరు జిల్లా చోళనహళ్లికి చెందిన అంజు (26) ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. నాలుగు నెలల క్రితం అంజన్ కణియార్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! మట్టికోర్టులో తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఏకంగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి సత్తా చాటాడు. తద్వారా కెరీర్లో 22వ ‘గ్రాండ్’ టైటిల్ కైవసం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కోలీవుడ్‌కి కియారా.. ఆ హీరోతో ఫస్ట్ మూవీ! బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తమిళంలో ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శివ కార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు కియారా అద్వానీని సంప్రదించి, కథ కూడా వినిపించారట దర్శకుడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమోగే నగరం ముంబై. కొద్దినెలలుగా చడీచప్పుడూ లేకుండా మూగబోయింది. కానీ ఆదివారం జరిగిన ఓ భరత నాట్య ప్రదర్శన మాత్రం అంతటా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ–నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ భరతనాట్యం అరంగేట్ర కార్యక్రమం అది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. ‘చంద్రబాబు చేసిన అక్రమాలను కోదండరాం ఎందుకు ప్రశ్నించరు’ చంద్రబాబు చేసిన అక్రమాలను కోదండరాం ఎందుకు ప్రశ్నించరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఏపీలో 30 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తోందని, అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్యాకేజ్‌లను కూడా పెంచామన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇదేం ఆనందం కిమ్.. కొరియన్లు చస్తుంటే ఇలా చేశావేంటి..? కోవిడ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్న సమయంలో కిమ్.. క్షిపణి పరీక్షల్లో మునిగిపోయారు. నార్త్ కొరియా ఆదివారం ఏకంగా 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అమెరికాను హెచ్చరిస్తూ కిమ్ మరోసారి క్షిపణి పరీక్షలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. డైనమిక్ సీఎం యోగి జీ.. హ్యాపీ బర్త్ డే: మోదీ స్పెషల్ విషెస్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పుట్టినరోజు నేడు (ఆదివారం). ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం యోగికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉతరప్రదేశ్ ముఖ్యమంత్రి, డైనమిక్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ జన్మదిన శుభాకాంక్షలు.. యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతమైన నాయకత్వంలో యూపీ ప్రగతి పథంలో కొత్త శిఖరాలకు చేరుకుంది’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రమాదానికి కారణం అమోనియం కాదా...? బ్రాండిక్స్‌లో సీడ్స్ కంపెనీలో ప్రమాదకర వాయువు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై నిపుణుల కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే విషవాయువుల వ్యాప్తి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ వాయువుల్లో అమోనియం లేదని, ఉండి ఉంటే కళ్లకు మరింత ప్రమాదముంటుందని నిపుణుల బృందం భావిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. 'జన గణ మన' మూవీ రివ్యూ విభిన్నమైన కథా కథనాలతో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది మలయాళ సినీ ఇండస్ట్రీ. అందులోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల ఎంపికను మెచ్చుకోక తప్పదు. నటుడిగా అయ్యప్పనుమ్ కోషియుమ్, డైరెక్టర్‌గా లూసీఫర్ తదితర చిత్రాలతో అలరించిన ఆయన తాజాగా 'జన గణ మన' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. చై కోసం స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన సమంత! ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప తర్వాత హీరోయిన్ సమంత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత విషయాలతోనూ సామ్ పేరు నిత్యం సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ హీరోయిన్ గురించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. 'రోహిత్ శర్మకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్ధం కావడం లేదు' దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి,జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. లక్షల కార్లలో లోపాలు, మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్! ప్రముఖ జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్‌కు భారీ షాక్ తగిలింది. బెంజ్ కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాల్ని జర్మన్ ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎత్తిచూపించింది. వెంటనే బెంజ్‌కు చెందిన 1మిలియన్ కార్లను రీకాల్ చేయాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన ఐదుగురు నిందితులు.. అందరూ పొలిటికల్ లీడర్ల కొడుకులే జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్‌పై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆన్లైన్ మోసం.. ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు వచ్చింది! ఒక్కోసారి మాత్రం ఒకటి ఆర్డర్ పెడితే ఇంకోటి ప్రత్యక్షమై, కస్టమర్లను కంగారుపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫోన్ బుక్ చేస్తే బట్టల సబ్బు దర్శమిచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో వెలుగు చూసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1.జనసేనలో లుకలుకలు.. నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకున్నారా? జనసేన పార్టీలో నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన సమావేశం సందర్భంగా పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరింది. ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా పీఆర్సీ కూడా అమలుచేయనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. ‘కూతుళ్లూ అర్హులే’ మేజర్లుగా ఉన్న కుమారులకు పునరావాసం, పునఃనిర్మాణం (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ ఇచ్చి మేజర్లైన కుమార్తెలకు ఇవ్వకపోవడం వివక్ష అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..? బాధిత యువతి ఢిల్లీలోని జోర్‌బాగ్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కింది. అనంతరం రైలులో ఉన్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓ అడ్రస్ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్ చెప్పింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.ఎలన్ మస్క్ కామెంట్లు.. మీడియా సాక్షిగా బైడెన్ చురకలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలన్ మస్క్‌కు చురకలు అంటించారు. తాను ఎప్పటికీ బైడెన్ అభిమానిని కాదంటూ ప్రకటించుకున్న ఎలన్ మస్క్.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాయిటర్స్‌లో పబ్లిష్ అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.మంకీపాక్స్ టెర్రర్.. ఒక్కరోజే 51 కేసులు.. ఈ వయస్సు వారే బాధితులు కరోనా వేరియంట్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంకీపాక్స్ రూపంలో మరో ఉపద్రవం తోడైంది. ఈ కొత్త వైరస్ మంకీపాక్స్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8.శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా మలింగ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఈ నెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టుకు బౌలింగ్ వ్యూహాత్మక కోచ్‌గా ఆ దేశ దిగ్గజ పేస్ బౌలర్ లసిత్ మలింగ వ్యవహరిస్తాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా ? వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్–ప్రశాంత్ సినిమా సెట్స్‌కి వెళుతుందని టాక్. ఈ చిత్రానికి ‘అసుర’ లేదా ‘అసురుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10.ఒక్క ఏడాదిలోనే ఎంత అభివృద్ధి! రూ. 9 లక్షల బహుమతిని గ్రామం! సర్పంచ్‌గా ఏడాదిపాటు ఉండి పర్యావరణాన్ని ఎంతబాగా కాపాడుకోవచ్చో చేతల్లో చేసి చూపించి ఎంతోమందికి ఉదాహరణగా నిలుస్తోంది ప్రియాంక. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి