Teppotsavam
-
ఖైరతాబాద్ : గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో తెప్పోత్సవం (ఫొటోలు)
-
ఖైరతాబాద్‌లో ఘనంగా గంగ తెప్పోత్సవం బోనాలు (ఫోటోలు)
-
విజయనగరం జిల్లాలో ఘనంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు (తెప్పోత్సవం)
-
తిరుమలలో మరో అద్భుత ఘట్టానికి ఏర్పాట్లు
-
తిరుమల క్షేత్రం మరో ఉత్సవానికి సిద్ధం
-
వైభవంగా దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వస్వామి వార్ల తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శివాలయం నుంచి దుర్గాఘాట్‌కు దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులు చేరుకుని.. హంస వాహనంపై కొలువు దీరారు. ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు.(చదవండి: Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?) మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెప్పోత్సవాన్ని తిలకించారు. వరద నేపథ్యంలో నదిలో విహారం లేకుండా తెప్పోత్సవం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఇచ్చారు. -
Vijayawada: తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా జరిపే తెప్పోత్సవానికి ఈ నెల 14వ తేదీన ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ట్రయల్ రన్‌పై దేవస్థానం ఈఈ భాస్కర్ మంగళవారం ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. హంస వాహనం ఇప్పటికే సిద్ధమవగా, వాహనంపై చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కృష్ణానదీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తెప్పోత్సవంపై జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ నాటికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై చర్చించారు. దుర్గమ్మ ఆదాయం రూ.18.08 లక్షలు వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం అమ్మవారికి రూ.18.08 లక్షల ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. మూలానక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం వరకూ వివిధ సేవా టిక్కెట్లు, ప్రసాదాల టికెట్ల విక్రయం ద్వారా ఈ ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. -
తిరుమలలో ఘనంగా శ్రీవారి తెప్పోత్సవం
-
కృష్ణానదిలో కన్నుల పండుగగా తెప్పోత్సవం
సాక్షి, విజయవాడ : విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంలో ఆదిదంపతులు దుర్గామల్లేశ్వరస్వామివార్లు కృష్ణా నదిలో విహరించారు. ఈ వాహన సేవలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దంపతులు, కలెక్టర్ మాధవి లత, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు పాల్గొన్నారు. దాదాపు గంటన్నరపాటు తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రకాశం బ్యారేజ్, పున్నమి ఘాట్, భవాని ద్వీపం, పవిత్ర సంగమం వద్ద నుంచి భక్తులు తెప్పోత్సవాన్ని వీక్షించారు. అంతకుముందు దుర్గ గుడి అధికారులు.. స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఇంద్రకీలాద్రి నుంచి మేళ తాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా దుర్గా ఘాట్‌కు తీసుకువచ్చారు. ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. మంగళవారం మధ్యాహ్నం అర్చకులు సంప్రదాయ బద్ధంగా పూర్ణహుతిని నిర్వహించి దసరా ఉత్సవాలను ముగించారు. పూర్ణాహుతిలో ఆలయ ఈవో సురేశ్‌బాబు, ప్రధాన అర్చకుడు శివప్రసాద్, ఇతర అర్చకులు పాల్గొన్నారు. -
తెప్పోత్సవానికి చకచకా ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైనా మంగళవారం నిర్వహించనున్న తెప్పోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. విద్యుత్ దీపాలంకరణ చేసిన హంస వాహనంపై ఆదిదంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాముల వారు కృష్ణానదిలో విహరించనున్నారు. కృష్ణానదిలో వరద ప్రవాహం ఉండటంతో దుర్గ గుడి అధికారులు తెప్పోత్సవానికి నీటిపారుదల శాఖ అనుమతి తీసుకున్నారు. అనంతరం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్లో డీసీపీ విజయరావు, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్‌రావు మాట్లాడుతూ.. కృష్ణానదిలో 40 నిమిషాల పాటు హంస వాహనం ట్రయల్ రన్ నిర్వహించినట్టు తెలిపారు. తెప్పోత్సవం సందర్భంగా 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హంస వాహనంపై 32 మందికి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. -
దుర్గమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
సాక్షి, విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. టీటీడీ తరపున దుర్గమ్మకు పట్టు వస్ర్తాలు సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. టీటీడీ తరపున దుర్గమ్మకు సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని వైవీ తెలిపారు. రాష్ట్ర్రంలో అన్ని దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు దేవాదాయ శాఖ నిధులు కేటాయించిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకు దుర్గమ్మ ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుబ్బారెడ్డికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేష్‌బాబు,అర్చకులు స్వాగతం పలికారు. విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దుర్గమ్మ తెప్పోత్సవానికి రెండంచెల భద్రత దుర్గమ్మ తెప్పోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆదివారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రెండంచెల భద్రత నడుమ దుర్గమ్మ తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందన్నారు. బోటు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన తర్వాతే తెప్పోత్సవం నిర్వహించాలని వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ,పోలీస్, దేవాదాయ, పురపాలక, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ట్యాంక్ బండ్ వద్ద గంగా తెప్పోత్సవం
-
రుక్మిణీ సమేతం.. వైభవోపేతం
-
తిరుమలేశుని తెప్పోత్సవం
-
భక్తిశ్రద్ధలతో భీమేశ్వరుని తెప్పోత్సవం
సామర్లకోట : కుమారరామ భీమేశ్వరస్వామి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి ఆలయ కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో స్వామికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. రాత్రి ఆలయ కోనేరు వద్ద స్వామి, బాలా త్రిపుర సుందరీదేవి ఉత్సవ విగ్రహాలకు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, తెప్పోత్సవ నిర్వాహక కుటుంబ సభ్యులు పూజలు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ఉంచి కోనేరు చుట్టూ తెప్పోత్సవం నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు కటకం సతీష్, సరేష్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కంటే బాబు, కార్య నిర్వాహణాధికారి పులి నారాయణమూర్తి, సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల పుత్రయ్య, బి. త్రిమూర్తులు, అన్నదాన ట్రస్తు నాయకులు బిక్కిన సాయిపరమేశ్వరరావు, చుండ్రు గోపాలకృష్ణ, చుండ్రు వాసు, భక్త సంఘం నాయకులు బూరయ్య, తూతిక కామేశ్వర రావు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కన్నులపండువగా తెప్పోత్సవం
పంపానదిలో హంసవాహనంపై సత్యదేవుని విహారం అన్నవరం: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి పంపానదిలో సత్యదేవుని తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిగా విచ్చేసిన భక్తులు తిలకిస్తుండగా సత్యదేవుడు, అమ్మవార్లను హంసవాహనంపై మూడుసార్లు పంపానదిలో విహరింపజేశారు. మిరుమిట్లు గొలిపే దీపపు కాంతులు, బాణసంచా కాల్పుల మధ్య, పండితుల మంత్రోచ్ఛారణ మధ్య సాగిన ఈ తెప్పోత్సవం భక్తులకు నయనానందాన్ని మిగిల్చింది. ఊరేగింపుగా పంపా తీరానికి స్వామి, అమ్మవార్లు సాయంత్రం ఐదున్నర గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను మేళతాళాలతో ఊరేగింపుగా రత్నగిరి నుంచి పంపానదీ తీరం వద్ద గల దేవస్థానం పవర్‌హౌస్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న ప్రత్యేక సింహాసనంపై స్వామి, అమ్మవార్లను, మరోపక్క సీతారాములను ఉంచి పండితులు తులసీధాత్రి, తదితర పూజలు చేశారు. వేదపండితులు చతుర్వేద స్వస్తి, సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజనమంత్రపుష్పాలు అందజేశారు. వేదపండితులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు మొదలైన తెప్పోత్సవం వేదికపై పూజలందుకున్న సత్యదేవుడు, అమ్మవార్లను రాత్రి ఏడు గంటలకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా పంపానదిలోని హంసవాహనం మీదకు తీసుకువచ్చి అక్కడ గల ప్రత్యేక మందిరంలో ఉంచి పూజలు చేశారు. తరువాత పండితుల మంత్రోచ్ఛారణ మధ్య తెప్పోత్సవం ప్రారంభమైంది. హంసవాహనాన్ని పంపా నదిలో తూర్పు దిశగా ప్రయాణించి మూడు సార్లు ప్రదక్షణం చేసింది. ఈ సారి తెప్పపైకి కేవలం వైదిక సిబ్బంది, తెప్ప నడిపే సిబ్బందిని మాత్రమే అనుమతించారు. కారణమేంటో తెలియదు కానీ ఈ సారి తెప్పోత్సవానికి ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకాలేదు. తెప్పోత్సవం చివర్లో మాత్రం కాకినాడ ఎంపీ తోట నరసింహం వచ్చినా దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, ఉత్సవాల ఏర్పాట్లు పర్యవేక్షించారు. సుమారు వందమంది పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
కనుల పండువగా తెప్పోత్సవం
యానాం టౌన్ : యానాం వేంకటేశ్వరస్వామివారి చతుర్ధశి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి మీసాల వెంకన్న స్వామి వారి తెప్సోత్సవాన్ని స్థానిక అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్‌గాంధీ రివర్‌బీచ్ వద్ద గౌతమి గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. విద్యుత్ దీపాలు, వివిధరకాల పూలతో హంసరూపంలో సుందరంగా అలంకరించిన తెప్పపై కొలువుతీరిన వేంకటేశ్వరస్వామివారు గౌతమి గోదావరిలో కొంతసేపు విహరించారు. తొలుత తెప్పపై ప్రముఖ వైఖానస పండితులు వాడపల్లి గోపాలాచార్యులు, ఆలయఅర్చకులు, వేదపండితులు ఆధ్వర్యంలో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. పరిపాలనా«ధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, దేవస్దాన కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్ పాల్గొన్నారు. గౌతమిగోదావరిలో గంటపాటు సాగిన తెప్పోత్సవాన్ని వందలాది మంది భక్తులు, స్థానిక ప్రముఖులు, నాయకులు తిలకించారు. -
జలోత్సవం.. జన సమ్మోహనం
రేయితోటకు పూసిన విద్యుత్ పూలతో అలంకరించిన రంగురంగుల రాయంచ రథం.. దానిపై చిరునవ్వులు చిందిస్తూ ఆదిదంపతులు ఆశీనులై అలల దారులపై అలాఅలా విహరిస్తుంటే.. ఒడ్డున ఉన్న జనమే కాదు.. జలమూ పులకించిపోయింది. జగదానందకారకమైన ఈ మహోత్సవాన్ని చూసి జాబిలి పరవశించిపోగా, నక్షత్రాలు బాణసంచా టపాసులై జయజయధ్వానాలు పలికాయి. ముక్కోటి దేవతలు ముమ్మారు అమ్మను అనుసరించాయి. దసర ఉత్సవాల్లో చివరి ఘట్టమైన తెప్పోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడ (ఇంద్రకీలాద్రి) : విద్యుద్దీపకాంతులతో దైదీప్యమానంగా వెలిగిపోతున్న హంస వాహనంపై మంగళవారం సాయంసంధ్యవేళ గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లు నదీవిహారం చేశారు. దుర్గాఘాట్‌లో జరిగిన ఈ సంబరానికి అశేష భక్తజనవాహిని హాజరైంది. ప్రకాశం బ్యారేజీ భక్తులతో కిక్కిరిసింది. తొలుత ఉత్సవమూర్తులకు దుర్గాఘాట్‌లో ఈవో సూర్యకుమారి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఘాట్‌లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తిభావాన్ని చాటాయి. డాక్టర్ పాలపర్తి శ్యామలానందప్రసాద్, దూళిపాళ్ల రామకృష్ణ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్కరాల నేపథ్యంలో దుర్గాఘాట్‌ను అభివృద్ధి చేయడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఘాట్‌కు చేరుకుని తెప్పోత్సవాన్ని తిలకించారు. అయితే, కమాండ్ కంట్రోల్ రూమ్ వైపునకు అనుమతించకపోవడంతో ఘాట్ వెలవెలబోయింది. కనులపండువగా ఊరేగింపు తొలుత ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం నుంచి గంగా పార్వతులతో పాటు మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పంచ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, కోలాటకాలతో ఊరేగింపు కనులపండువగా సాగింది. కలెక్టర్ బాబు.ఏ, సీపీ గౌతమ్ సవాంగ్, ఎంపీ కేశినేని నాని, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, పలువురు పోలీసు అధికారులతో పాటు దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నదీ విహారం అనంతరం ఉత్సవమూర్తులను బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు వద్దకు తరలించారు. వన్‌టౌన్ పీఎస్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు దంపతులు శమీపూజ నిర్వహించారు. -
వైభవంగా తెప్పోత్సవం
-
తిరుమలలో వైభవంగా తెప్పోత్సవాలు ఆరంభం
- ఐదు రోజులపాటు వేడుక - తొలిరోజు శ్రీరామచంద్రుడి దర్శనం తిరుమల : తిరుమలలో శనివారం రాత్రి శ్రీవారి తెప్పోత్సవాలు ఆరంభమయ్యాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో ప్రదక్షిణగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు పుష్కరిణిలో విహరించనున్నారు. క్రీ.శ.1468 సాళువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యలో ఉత్సవాలకు అనువుగా 'నీరాళి మంటపం' నిర్మించారు. అంతకుముందు నుంచే శ్రీవారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నట్టు శాసనాధారం. ఈ సందర్భంగా ఆర్జిత సేవలైన వసంతోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవ రద్దు చేశారు. తెప్పోత్సవం సందర్భంగా పుష్కరిణితోపాటు ఆలయానికి దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో అలంకరణ, ప్రత్యేకంగా దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. రాత్రి 7 నుండి 8 గంటల మధ్య జరిగిన ఉత్సవ వేడుక లో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు దంపతులు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ రమణదీక్షితులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. -
కడువైభవం.. భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం
ఇదిగాక సంతోషం ఉందా.. ఇదిగాక ఆనందం ఉదా.. అంటూ భక్తులు పరవశంతో ఉప్పొంగినవేళ.. శ్రీ సీతారామచంద్రస్వామిస్వామివారు గోదావరిలో ఆనంద విహారం చేశారు. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పొద్దుపోయిన తర్వాత అర్చకులు నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉదయం యాగశాలలో చతుస్థానార్చన, హోమాలు జరిగాయి. సాయంత్రం ప్రత్యేక అలంకరణ చేసి స్వామివారిని పల్లకిపై ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకెళ్లారు. మేళతాళాలు, కోలాటాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామివారు గోదావరి నదికి వెళ్లారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఉంచి దొంగల దోపు ఉత్సవం నిర్వహించారు. గోదావరి నదిలో విహరిస్తున్న స్వామివారి నగలను ఒక దొంగ ఎత్తుకుపోవటం, ఆ తరువాత అతడు పరివర్తన చెంది రామునికి పరమభక్తునిగా మారుతాడు. దీనిని గుర్తుచేస్తూ తిరుమంగైళ్వార్ చరిత్రను మననం చేసుకునే క్రమంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ తంతు నిర్వహించటం ఆనవాయితీ. తిరుమంగై ఆళ్వార్, రాజుల వేషధారణలో ఆలయ సిబ్బంది నటించి ఉత్సవాన్ని రక్తి కట్టించారు. ఈ ఉత్సవం తరువాత స్వామివారిని అశ్వవాహనంపై కొలువు తీర్చి తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. -
కృష్ణానదిలో వైభవంగా తెప్పోత్సవం
తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా చేసుకున్న అమ్మవారు, స్వామివార్లు కృష్ణానదిలో విహారానికి బయల్దేరారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వైభవంగా మొదలైంది. విద్యుద్దీపాలతో అలంకరించిన హంస వాహనం మీద స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అలకంరించారు. అంతకుముందు విగ్రహాల ఊరేగింపు జరిగింది. ఆలయం నుంచి కృష్ణానది వరకు ఊరేగింపుగా తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను వాహనంలో ఉంచి కృష్ణానదిలో విహారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దపెట్టున జయజయధ్వానాలు చేశారు. -
కన్నుల పండువగా తెప్పోత్సవం
అద్దంకి, న్యూస్‌లైన్ : సంక్రాంతి సందర్భంగా శింగరకొండ లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయస్వామి వార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు ఆలయ వేదపండితులు షోడపోచార.. రాజోపచార.. సకలోపచార పూజలు చేశారు. అనంతరం ఉభయ దేవతామూర్తులను వసంత మండపం వద్దకు తీసుకెళ్లి మంగళవాయిద్యాలతో వేదస్వస్తి, హరెరామనామ సంకీర్తనలతో ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం స్వామివార్ల పల్లకీని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ టి.వెంకటకృష్ణయ్య భవనాశి చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కుంభం పోసి కూష్మాండబలి ఇచ్చి స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించిన పడవలో భవనాశి చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు వంగల శివశంకరావధాని మాట్లాడుతూ తెప్పోత్సవాన్ని వరుసగా 49 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కనుమ సందర్భంగా ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమణమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సందిరెడ్డి శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
దృశ్య మనోహరం
భద్రాచలం, న్యూస్‌లైన్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో శుక్రవారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో శ్రీరామునికి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో భక్తులు ఈ వేడుకను కనులారా వీక్షించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీసీతారామచంద్రస్వామి వారికి గర్భగుడిలో దర్బారు సేవ నిర్వహించి, ఉత్సవ మూర్తులకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. ఉదయం సేవాకాలం, శ్రీ తిరుమంగై అళ్వార్ పరమపదోత్సవం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతితో పగల్ పత్తు ముగిసింది. అనంతరం వేదపండితులు మంత్రాలు చదువుతుండగా..., మంగ ళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ఆలయం నుంచి స్వామి వారిని ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకు వెళ్లారు. గోదావరి నదిలో విహరించేందుకు రాజాధిరాజ వాహనంపై బయలుదేరిన శ్రీ సీతారామచంద్ర స్వామివారిని చూసి తరించేందుకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. గోదావరి తీరానికి చేరిన తరువాత అర్చకులు ముందుగా పుణ్యజలాలతో హంసవాహనాన్ని సంప్రోక్షణ చేశారు. ఊరేగింపుగా వచ్చిన స్వామివారికి ఆలయ ఈఓ రఘునాథ్ గుమ్మడికాయతో దిష్టి తీసిన అనంతరం హంసవాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు కూడా పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేదాలు, నాలాయిర దివ్యప్రబంధం, పంచసూత్రాలు, స్తోత్ర పాఠాలు చదివారు. అనంతరం మంగళహారతి ఇచ్చి, ప్రసాద నివేదన చేశారు. తరువాత రామనామ సంకీర్తనలు, భక్తుల కోలాహలం మధ్య స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. గోదావరి నదిలో ఐదు సార్లు స్వామి వారు హంసవాహనంపై విహరించారు. విహారం మొదలైనప్పటి నుంచి ఉత్సవం పూర్తి అయ్యేంత వరకూ బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చారు. మిరిమిట్లు గొలిపే వె లుగులతో గోదావరి తీరం పున్నమి కాంతులీనింది. తెప్పోత్సవం సమయానికి గోదావరి తీరం భక్తులతో నిండిపోయింది. బాణసంచా వెలుగులు, విద్యుత్ దీపాల కాంతుల నుడుమ హంసవాహనంపై స్వామి వారు గోదావరి నదిలో విహరిస్తున్నంత సేపు నదీతీరం రామనామ జయ జయ ధ్వానాలతో మార్మోగింది. ఆకట్టుకున్న కోలాటాలు... రాజాధిరాజ వాహనంపై తెప్పోత్సవానికి స్వామి వారు వెళ్లే సమయంలో పల్లకి ముందు వివిధ కోలాట సంస్థల ఆధ్వర్యంలో మహిళలు చేసిన కోలాట ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కీర్తనలు ఆలపిస్తూ వేద విద్యార్థులు.., వికాస తరంగణి, శ్రీ కృష్ణ కోలాట భజన మండలి, శ్రీ సాయి వాసవీ మహిళా కోలాట సమితి, గోవిందరాజ స్వామి కోలాట సమితికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ పూజలు.. స్వామివారిని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్, ఎస్పీ రంగనాథ్, భద్రాచలం ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు సతీ సమేతంగా దర్శించుకొని పూజలు చేశారు. అదే విధంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాల్వంచ ఆర్డీవో శ్యాంప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. తెప్పోత్సవం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భద్రాచలం పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పోలీసులు పర్యవేక్షించారు. ఉత్సవ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ఏఈవో శ్రావణ్ కుమార్, ఆలయ పీఆర్వో సాయిబాబా, ఇరిగేషన్ ఈఈ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. -
వైభవంగా పర్ణశాల రామయ్య తెప్పోత్సవం
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో శ్రీసీతారామచంద్రస్వామి వారికి వైభవంగా గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించారు. భద్రాచలంలో వైకుంఠ ముక్కోటి ఉత్సవాలను నిర్వహించే తరుణంలో పర్ణశాల లోనూ తెప్పోత్సవం నిర్వహించారు. సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా మేళతాళాడు, బాణసంచా, భక్తుల సందడి మధ్య గ్రామ పురవీధుల మీదుగా గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చారు. గోదావరి తీరంలో అప్పటికే సిద్ధంగా ఉన్న హంసవాహనంలో స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ముచ్చటగొలిపే హంస వాహనంపై గోదావరిలో స్వామి వారిని మూడుసార్లు తిప్పారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన జయజయద్వానాలతో ఆ ప్రాంతం మార్మోగింది. గోదావరిలో విహరించిన స్వామి వారిని 6.30 నిమిషాల సమయంలో హంస వాహనం నుంచి స్నానఘట్టాల వరకు పల్లకిలో తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు ఎన్‌బీవీఎల్‌ఎన్ ఆచార్యులు, శ్యాసం కిరణ్‌కుమారాచార్యులు, కె విష్ణువర్ధనాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులు, కృష్ణమాచార్యులు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై సత్యనారాయణ సమక్షంలో స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఆశాలత, స్థానిక తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విశ్వనాథసుబ్రహ్మణ్యం, ఈఓఆర్డీ అల్లాడి నాగేశ్వరరావు, కార్యదర్శి నారాయణ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్, వీఆర్వోలు, వైద్య, సాక్షరభారత్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు.