unemployment rate
-
దేశంలో తగ్గుతున్న నిరుద్యోగ రేటు
సాక్షి, అమరావతి: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరక్షరాస్యులతో పాటు విద్యావంతుల్లో కూడా నిరుద్యోగ రేటు తగ్గిందని తెలిపింది. 2021–22లో దేశంలో నిరుద్యోగ రేటు 4.1 శాతం ఉండగా 2022 – 23లో 3.2 శాతానికి తగ్గిందని తెలిపింది. నైపుణ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రారంభించిందని, మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలపై దేశంలోని యువతకు రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను, ఉత్పాదకతను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, జన శిక్షణ సంస్ధాన్, నేషనల్ అప్రెంటిస్íÙప్ ప్రమోషన్ స్కీమ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా అన్ని విద్యా సంస్థల్లో విద్యతో పాటు వృత్తి విద్యా కార్యక్రమాలను ప్రారంభించినట్లు పేర్కొంది. యువతకు స్వయం ఉపాధిని మరింత సులభతరం చేసేందుకు ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ప్రారంభించినట్లు తెలిపింది. దీని కింద స్వయం ఉపాధికి పూచీ కత్తు లేకుండా ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణం మంజూరు చేయించడం ద్వారా సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్ధలను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. పీఎంఎంవై కింద గత ఏడాది నవంబర్ నాటికి 44.41 కోట్ల ఖాతాలకు రుణాలు మంజూరు చేసినట్లు వివరించింది. వీధి వ్యాపారుల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపింది. -
తగ్గిన నిరుద్యోగ రేటు - గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి నిరుద్యోగిత రేటు 6.6 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఇది 7.2 శాతం నమోదైంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.8 శాతంగా ఉండగా, ఏప్రిల్–జూన్‌లో 6.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని స్త్రీలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగం రేటు 2023–24 ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 8.6 శాతానికి వచ్చి చేరింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 9.4 శాతంగా ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో 9.1 శాతం, జనవరి–మార్చిలో 9.2 శాతం, అక్టోబర్–డిసెంబర్ 9.6 శాతం నమోదైంది. పట్టణ ప్రాంత పురుషులలో నిరుద్యోగిత రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌లో 6 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 6.6 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌లో 5.9 శాతం ఉంది. 2022–23 జనవరి–మార్చిలో 6 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 6.5 శాతంగా నమోదైంది. క్రియాశీల శ్రామిక శక్తి.. 2023 జూలై–సెప్టెంబర్‌లో పట్టణ ప్రాంతాలలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల్లో క్రియాశీల శ్రామిక శక్తి 49.3 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.9 శాతంగా ఉంది. 2023 ఏప్రిల్–జూన్‌లో 48.8 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చిలో 48.5 శాతం, అక్టోబర్–డిసెంబర్లో 48.2 శాతం నమోదైంది. -
దేశంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: భారత్‌లో జూలై 2022–జూన్ 2023 మధ్యకాలంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల నిరుద్యోగితా రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయిలో 3.2 శాతంగా నమోదయ్యింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022–23 వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఎన్ఎస్ఎస్ఓ విడుదల చేసిన ఆరవ సర్వే నివేదిక ఇది. (ప్చ్.. విప్రో ఉద్యోగులకు తప్పని నిరాశ!) సర్వేకు ముందు 365 రోజుల కాలాన్ని ‘నిరుద్యోగ రేటు’కు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే, ఒక్క గ్రామీణ ప్రాంతాన్ని తీసుకుంటే, 2017–18లో 5.3 శాతం ఉన్న నిరుద్యోగితా రేటు 2022–23లో 2.4 శాతానికి దిగివచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 7.7 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. పురుషుల విషయంలో ఇదే కాలంలో నిరుద్యోగితా రేటు 6.1 శాతం నుంచి 3.3 శాతానికి దిగివస్తే, మహిళల విషయంలో 5.6 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గింది. గత నాలుగేళ్లలో ఇలా.. కాలం రేటు (శాతంలో) 2022–23 3.2 2021–22 4.1 2020–21 4.2 2019–20 4.8 2018–19 5.8 2017–18 6.0 -
జూన్ త్రైమాసికంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 7.6 శాతంగా ఉన్నట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 19వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను విడుదల చేసింది. 15 ఏళ్ల పైన వయసుండి, పనిచేసే అర్హతలు కలిగిన వారిలో, ఉపాధి లేమిని ఈ రేటు సూచిస్తుంటుంది. 2023 జనవరి–మార్చి కాలంలో నిరుద్యోగం 6.8 శాతంగా, 2022 జూలై–సెప్టెంబర్, అక్టోబర్–డిసెంబర్లో 7.2 శాతంగా నిరుద్యోగ రేటు ఉండడం గమనించొచ్చు. పట్టణాల్లో 15 ఏళ్లకు పైన మహిళల్లో నిరుద్యోగం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది ఇది 9.2 శాతంగా ఉంది. పురుషుల్లో నిరుద్యోగ రేటు జూన్ త్రైమాసికంలో 5.9 శాతానికి క్షీణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.1 శాతంగా ఉంటే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 6 శాతంగా ఉండడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.8 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది పట్టణాల్లో 48.5 శాతంగా ఉంది. -
యువత ఆశల్ని కేంద్రం చిదిమేసింది
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులైన కొందరు మిత్రుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది యువత ఆశల్ని చిదిమేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లోని 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుకుందని తెలిపారు. దేశానికి గర్వకారణమైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం ప్రతి నిరుద్యోగ యువతకు కల..అలాంటి వాటిని ప్రభుత్వం వదిలేసిందన్నారు. రాహుల్ గాంధీ ఆదివారం ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘2014లో పీఎస్‌యూల్లో 16.9 లక్షల ఉద్యోగాలుండగా 2022 వచ్చే సరికి వాటి సంఖ్య 14.9 లక్షలకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్లో 1,81,127 ఉద్యోగాలు, సెయిల్‌లో 61,928, ఎంటీఎన్ఎల్లో 34,997, ఎస్ఈసీఎల్లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్జీసీలో 21,120 ఉద్యోగాలు తగ్గిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగిత పడిపోతుందా?’అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగాల కల్పనను మరిచిపోయి 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందన్నారు. ఇదే సమయంలో పీఎస్‌యూల్లో కాంట్రాక్టు నియామకాలు పెరిగిపోయాయి. ఇలా కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం రిజర్వేషన్ హక్కును లాగేసుకోవడం కాదా? ఇది ఈ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే కుట్ర కాదా?’అని రాహుల్ ప్రశ్నించారు. ఒక వైపు పారిశ్రామిక వేత్తల రుణాల మాఫీ, మరోవైపు పీఎస్‌యూల్లో ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు! అమృత్కాల్ అంటే ఇదేనా’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
భారత్‌లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే?
ముంబై: దేశంలో నిరుద్యోగం మే నెలలో తగ్గుముఖం పట్టింది. 7.7 శాతానికి తగ్గినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేటు పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఉపాధి లేమి 8.5 శాతంగా ఉండడం గమనించొచ్చు. ఏప్రిల్ నెలతో పోలిస్తే కార్మికుల భాగస్వామ్య రేటు మే నెలలో 1.1 శాతం తగ్గి 39.6 శాతంగా ఉన్నట్టు సీఎంఐఈ పేర్కొంది. ఏప్రిల్ నెలలో పెద్ద ఎత్తున పనుల్లోకి చేరడంతో మే నెలలో కార్మికుల భాగస్వామ్య రేటు తగ్గుతుందని అంచనా వేసిందేనని తెలిపింది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం) దీనివల్ల మే నెలలో ఉపాధి కోసం అన్వేషించే వారి సంఖ్య తగ్గినట్టు వివరించింది. ఫలితంగా కార్మిక శక్తి 453.5 మిలియన్ల నుంచి 441.9 మిలియన్లకు తగ్గిందని సీఎంఐఈ ప్రకటించింది. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. పట్టణాల్లో పనిచేసే కార్మికులు 4.5 మిలియన్లు తగ్గారు. ఏప్రిల్ నెలలో పట్టణాల్లో పనిచేసే కార్మికులు 147 మిలియన్లుగా ఉంటే, మే నెలలో 142.5 మిలియన్లకు తగ్గారు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) పట్టణాల్లో ఉద్యోగుల సంఖ్యతోపాటు, నిరుద్యోగుల సంఖ్య కూడా తగ్గినట్టు యూఎంఐఈ వెల్లడించింది. పట్టణాల్లో కార్మిక శక్తి 129.5 మిలియన్లుగా ఉంటే, 13 మిలియన్లు నిరుద్యోగులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే మాదిరి ఉద్యోగం, నిరుద్యోగం రేటు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు 299.4 మిలియన్లుగా మే నెలలో ఉన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 306.5 మిలియన్లుగా ఉంది. మరిన్ని బిజినెస్ వార్తలు, సక్సెస్ స్టోరీస్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
నిరుద్యోగం తగ్గింది.. జాతీయ శాంపిల్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు (15 ఏళ్లు నిండిన వారు) ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 6.8 శాతానికి పరిమితమైంది. 2022 సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఉన్న 8.2 శాతంతో పోలిస్తే చెప్పుకోతగ్గ మేర తగ్గింది. పనిచేసే శక్తి ఉండి, ఉపాధి లేని వారిని నిరుద్యోగుల కింద పరిగణిస్తారు. గతేడాది మొదటి త్రైమాసికంలో నిరుద్యోగం ఎక్కవగా ఉండడానికి కరోనా వైరస్ ఇంకా సమసిపోకపోవడమేనని చెప్పుకోవాలి. ఇక 2022 అక్టోబర్–డిసెంబర్, జూలై–సెప్టెంబర్ కాలంలో 7.2 శాతం చొప్పున నిరుద్యోగ రేటు నమోదైంది. 2022 ఏప్రిల్–జూన్‌లో 7.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగం 2023 మొదటి మూడు నెలల్లో 9.2 శాతానికి తగ్గింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇది 10.1 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగ రేటు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.7 శాతంగా ఉంది. 2022 అక్టోబర్–డిసెంబర్లో ఇది 6.5 శాతంగా ఉంది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.5 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 47.3 శాతంతో పోలిస్తే కొంత మెరుగుపడింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్ ప్రైవేటీకరణ ఆగదు.. ప్రైవేటులోకి మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు -
మార్చిలో 3 నెలల గరిష్టానికి ‘నిరుద్యోగం’
ముంబై: దేశంలో నిరుద్యోగ సమస్య మార్చిలో తీవ్రమైంది. మూడు నెలల గరిష్ట స్థాయిలో 7.8 శాతంగా నమోదయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2022లో డిసెంబర్లో 8.30 శాతానికి పెరిగి న నిరుద్యోగితా రేటు జనవరిలో 7.14 శాతానికి తగ్గింది. అయితే మరుసటి రెండు నెలల్లో మళ్లీ పెరుగుదల ప్రారంమైంది. ఫిబ్రవరిలో 7.5 శాతం అన్ఎంప్లాయ్మెంట్ రేటు నమోదయితే, మార్చితో మరింత పెరిగి 7.8 శాతానికి ఎగసింది. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.4 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా నమోదయ్యింది. మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► మార్చిలో నిరుద్యోగం విషయంలో హర్యానా 26.8%తో అగ్ర స్థానంలో ఉంది. రాజస్తాన్ (26.4%), జమ్మూ, కశ్మీర్ (23.1%), సిక్కిం (20.7%), బీహార్ (17.6%), జార్ఖండ్ (17.5%) తరువాతి స్థానాల్లో నిలిచాయి. ► తక్కువ నిరుద్యోగితా రేటు (0.8 శాతం) ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్‌లో నమోదయితే, అటుపైన పుదుచ్చేరి (1.5 శాతం), గుజరాత్ (1.8 శాతం), కర్ణాటక (2.3 శాతం), మేఘాలయ, ఒడిస్సా (2.6 శాతం) ఉన్నాయి. పండుగ సీజన్ తర్వాత డౌన్ అక్టోబర్–జనవరి పండుగ సీజన్ తర్వాత రిటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగాల్లో ఉపాధి తగ్గింది. ఐటీ, టెక్నాలజీ, స్టార్టప్‌ల్లో క్రియాశీలత తగ్గింది. ఇది తాజా నియామకాలలో మందగమనానికి దారితీసింది. ఇక మార్చి ఆర్థిక సంవత్సరాంతము, పరీక్షల నెల కావడంతో ప్రమాణాలు, పర్యాటకం, వినోదం, ఆతిథ్య రంగాల్లో అధిక డిమాండ్ కనిపించ లేదు.ఇది నిరుద్యోగితా శాతం పెరుగుదలకు దారితీసింది. తయారీ, ఇంజనీరింగ్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే ఉంది. ఆయా అంశాలు ఉద్యోగ మార్కెట్ వేగాన్ని తగ్గించాయి. అయితే ఏప్రిల్‌లో పురోగమనం ఉంటుందని భావిస్తున్నాం. – ఆదిత్య మిశ్రా, సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ, డైరెక్టర్ తాత్కాలికమే కావచ్చు... నిరుద్యోగ డేటా ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణానికి అద్దం పడుతోంది. భారత్ కార్పొరేట్ రంగం వ్యయాల విషయంలో చాలా విచక్షణతో వ్యవహరిస్తోంది. ప్రతి అడుగును జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భారత్‌నూ ప్రభావం చూస్తుంది కాబట్టి, దేశంలో కార్కొరేట్ రంగం నియామకాలను తాత్కాలికంగా తగ్గించింది. అయితే భారత్ సవాళ్లను అధిగమించే పరిస్థితిలో ఉంది కాబట్టి, తాజా నిరుద్యోగ సమస్య తాత్కాలికమే అని నేను భావిస్తున్నాను. – రితుపర్ణ చక్రవర్తి, టీమ్‌లీజ్ సర్వీసెస్ కో–ఫౌండర్ -
పట్వారీ కొలువుల కోసం 12 లక్షలకు పైగా దరఖాస్తులు
భోపాల్: పెరుగుతున్న జనాభా, కరోనా తర్వాతి పరిస్థితులు.. ఇలా పలు కారణాలతో దేశంలో నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. మరోవైపు పోటీ ప్రపంచంలోనూ తీవ్రత ఊహించని రీతిలోనే ఉంటోంది. తాజాగా పట్వారీ కొలువుల కోసం ఏకంగా 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లో ల్యాండ్ రెవెన్యూ అధికారుల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్. అటు ఇటుగా ఆరు వేల దాకా ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే పోటీ ఎంతలా ఉందంటే.. ఏకంగా ఈ పోస్టుల కోసం పన్నెండున్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్లలో పీహెచ్డీ చేసిన వాళ్లతో పాటు ఇంజినీరింగ్ స్డూడెంట్స్, ఎంబీఏ చదివిన వాళ్లు సైతం ఉన్నారు. మొత్తం 12.79 లక్షల మంది అభ్యర్థులకుగానూ.. వెయ్యి మంది హీహెచ్డీ చేసిన వాళ్లు, 85 వేలమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్, లక్ష దాకా ఎంబీఏ చేసిన వాళ్లు, మరో రెండు లక్షల మంది ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వాళ్లు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగ శాతం 1.9 గా ఉందని ఈ జనవరిలో సీఎంఐఈ(సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) నివేదిక ఇచ్చింది. ఈ తరుణంలో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారాయన. ఇదిలా ఉంటే.. తాజా నోటిఫికేషన్ అభ్యర్థుల గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగవకాశాలను కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
మహిళా కార్మికుల ముందంజ
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా శ్రామిక శక్తి నాలుగేళ్లలో 6.4 శాతం మేర పెరిగింది. పురుషుల కన్నా మహిళా కార్మికుల సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉంది. పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. 2017–18లో మహిళా కార్మిక శక్తి 23.1 శాతం ఉంటే 2020–21 నాటికి అది 29.5 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ కాలంలో దేశంలో ఉపాధి, శ్రామిక శక్తిలో చోటుచేసుకున్న మార్పులపై నీతి ఆయోగ్ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2017–18లో దేశంలో 485.3 మిలియన్ల కార్మిక శక్తి ఉండగా 2020–21 నాటికి అది 563.7 మిలియన్లకు పెరిగింది. అంటే.. మూడేళ్లలో 16.15 శాతం మేర పెరిగింది. కార్మిక శక్తి పెరుగుదల పురుషులతో పాటు మహిళా జనాభాలో కూడా నమోదైంది. అలాగే, ఈ పెరుగుదల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉందని నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. దేశంలో 2019–20లో గ్రామీణ కార్మిక శక్తి 70.7 శాతం ఉండగా 2020–21లో 73 శాతానికి పెరిగింది. పట్టణాల నుంచి పల్లెలకు వలసలు ఇక కోవిడ్ సమయంలో ఆసక్తికరంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలు జరిగాయని నివేదిక తెలిపింది. దీంతో ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్మిక శక్తి 8 శాతం మేర పెరుగుదల ఉంటే పట్టణ ప్రాంతాల్లో మూడు శాతం తగ్గింది. మూడేళ్లుగా మహిళా కార్మిక శక్తి పురుషుల కన్నా ఎక్కువ శాతం పెరిగింది. ఈ పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. నిరుద్యోగ రేటూ తగ్గుముఖం మరోవైపు.. దేశంలో 2017–18 నుంచి నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. 2017–18లో నిరుద్యోగ రేటు 6.07 శాతం ఉండగా 2018–19లో 5.84 శాతానికి.. 2019–20లో 4.84 శాతానికి, 2020–21లో 4.33 శాతానికి తగ్గినట్లు తెలిపింది. అదే సమయంలో.. రాష్ట్రంలో 2018–19లో నిరుద్యోగత రేటు 5.3 శాతం ఉండగా 2020–21 నాటికి 4.1 శాతనికి తగ్గింది. దేశంలో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగత రేటు తక్కువగా ఉంది. కోవిడ్–19తో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడినప్పటికీ కూడా పరిశ్రమ, సేవల రంగాల్లో 2019–20 నుంచి 2020–21 మధ్య ఉద్యోగాల సంఖ్య పెరిగింది. పరిశ్రమల రంగంలో 2018–19లో 4.8 మిలియన్ల ఉద్యోగాలు జోడించగా 2019–20లో 3.4 మిలియన్ల ఉద్యోగాలు, 2020–21లో 7.6 మిలియన్ల ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, సర్వీసు రంగంలో కూడా 2018–19లో 10.1 మిలియన్ల ఉద్యోగాలు 2019–20లో 6 మిలియన్ ఉద్యోగాలు, 2020–21లో 2.3 మిలియన్ ఉద్యోగాలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
న్యూఢిల్లీ: భారత్‌లో నిరుద్యోగం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. డిసెంబర్లో అత్యధికంగా 8.3% శాతానికి నిరుద్యోగం రేటు ఎగబాకింది. గత 16 నెలల్లో అదే అత్యధికమని సెంటర్ ఫర్ మోనటిరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక నివేదికలో తెలిపింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 2022 నవంబర్‌లో 8.96 ఉంటే, డిసెంబర్ వచ్చేసరికి 10.09 శాతానికి పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు నవంబర్‌లో 7.55% ఉంటే స్వల్పంగా తగ్గి డిసెంబర్ నాటికి 7.44శాతానికి చేరుకుంది. నిరుద్యోగం రేటు అత్యధికంగా హర్యానాలో 37.4% ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (28.5%), ఢిల్లీ (20.8%) ఉన్నాయి. కేంద్రానికి అతి పెద్ద సవాల్ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం అదుపు చెయ్యడం, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం మోదీ సర్కార్ ముందున్న అతి పెద్ద సవాల్‌గా ఉంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాదయాత్రలో కూడా అధిక ధరలు, నిరుద్యోగం సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగం రేటు మరోసారి పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే. అయితే కరోనా భయాలు తొలగిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల భాగస్వామ్యం బాగా పెరిగిందని, ఇది నిజంగానే మంచి విషయమని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ వ్యాస్ చెప్పారు. గత ఏడాది కాలంలో ఉపాధి కార్మికులు భాగస్వామ్యం రేటు పెరిగి డిసెంబర్లో అత్యధికంగా 40.48% నమోదైందని ఆయన వివరించారు. -
CMIE: నవంబర్‌లో మూడు నెలల గరిష్టానికి నిరుద్యోగం!
ముంబై: దేశంలో నిరుద్యోగం రేటు నవంబర్‌లో మూడు నెలల గరిష్టం ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం– పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.96 శాతానికి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 7.55 శాతంగా ఉంది. అక్టోబర్‌లో దేశంలో నిరుద్యోగం రేటు 7.77 శాతం. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.21 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.04 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌లో నిరుద్యోగిత రేటు 6.43 శాతంగా ఉంది. నవంబర్‌లో 30.6 శాతంతో హర్యానా నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాజస్తాన్ (24.5 శాతం), జమ్మూ,కశ్మీర్ (23.9 శాతం) బీహార్ (17.3 శాతం), త్రిపుర (14.5)లు ఉన్నాయి. అతి తక్కువ నిరుద్యోగం రేటు విషయంలో చత్తీస్‌గఢ్ (0.1 శాతం), ఉత్తరాఖండ్ (1.2 శాతం), ఒడిస్సా (1.6 శాతం), కర్ణాటక (1.8 శాతం), మేఘాలయ (2.1 శాతం)లు ఉన్నాయి. -
దేశంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్ వరకు)లో నిరుద్యోగ రేటు 7.2 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిరుద్యోగం 9.8 శాతంగా ఉండడం గమనార్హం. నాడు కరోనా తీవ్రత అధికంగా ఉండడం ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపించింది. 15 ఏళ్లు నిండి, అర్హతలుండీ పనిలేని వారిని ఈ గణాంకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడడం, క్రమంగా పురోగతి చూపిస్తున్న క్రమంలో నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తోంది. 16వ పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) గురువారం విడుదల చేసింది. ► జూలై–సెప్టెంబర్ మధ్య పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.6 శాతంగా ఉంది. ► పట్టణ మహిళల్లో ఇది 9.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో పట్టణాల్లో మహిళా నిరుద్యోగ రేటు 11.6 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 9.5 శాతంగా ఉంది. ► ఇక పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో నిరుద్యోగం 6.6 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 9.3 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ఇది 7.1 శాతంగా ఉంది. ► 2017 ఏప్రిల్ నుంచి ఎన్ఎస్వో ప్రతి మూడు నెలల కాలానికి సంబంధించి నిరుద్యోగం వివరాలను విడుదల చేస్తోంది. -
ఏపీలోనే నిరుద్యోగం తక్కువ
సాక్షి, అమరావతి: దేశంలో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోనే నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. అంతేకాదు దేశీయ సగటు కంటే కూడా ఏపీ నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి జాతీయ సగటు నిరుద్యోగ రేటు 8.3%గా ఉండగా.. ఏపీలో నిరుద్యోగ రేటు 6 శాతమేనని సీఎంఐఈ తెలిపింది. ఇక పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఏపీలోనే నిరుద్యోగ రేటు చాలా తక్కువగా ఉంది. తమిళనాడులో 7.2%గా ఉంటే.. తెలంగాణలో 6.9%గా నమోదయ్యింది. దేశంలో అత్యధికంగా హరియాణాలో 37.3%, జమ్మూ అండ్ కశ్మీర్ 32.8, రాజస్తాన్‌లో 31.4% ఉండగా.. అత్యల్పంగా చత్తీస్‌గఢ్‌లో 0.4% మేర నిరుద్యోగముంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్రలో 2.2%, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో 2.6%గా నిరుద్యోగ రేటు నమోదయ్యింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కోవిడ్‌ను అధిగమించి.. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. 2020 ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగ రేటు 23.6 శాతానికి చేరగా.. ఏపీలో 20.5 శాతంగా నమోదయ్యింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తీసుకున్న చర్యలతో నిరుద్యోగ రేటు తగ్గుతూ వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విభాగాల్లో కలిపి మొత్తం 6,16,323 మందికి ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించింది. ఇందులో శాశ్వత ఉద్యోగాలు 2,06,638 ఉన్నాయి. ఇవి కాకుండా కోవిడ్ సమయంలో పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు మూతపడకుండా.. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునే విధంగా చేపట్టిన చర్యలు కూడా సత్ఫలితాలనిచ్చాయి. రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించి ఎంఎస్ఎంఈలను ఆదుకోవడం వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించింది. అలాగే ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం.. ఇప్పటికే పలు సంస్థలు తమ పరిశ్రమలను ప్రారంభించడంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి ఎన్నో నిర్ణయాల వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. -
Bharat Jodo Yatra: పెచ్చరిల్లిన నిరుద్యోగం
కొల్లం: దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని, గత 45 ఏళ్లలో రికార్డు స్థాయికి నిరుద్యోగం రేటు చేరుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో సానుకూల దృక్పథాన్ని నెలకొల్పి వారి భవిష్యత్‌ను బలోపేతం చేయాలన్న నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తొమ్మిదో రోజు కొల్లామ్ జిల్లా పొలయతోడు నుంచి కరునాగపల్లి వరకు సాగింది. తన పాదయాత్ర విశేషాలను ఫేస్బుక్లో పంచుకున్న రాహుల్ గాంధీ తాను ఎంతో మంది యువతీ యువకుల్ని కలుసుకున్నానని, ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకున్నానని వెల్లడించారు. యువ శక్తిని భారత్ సద్వినియోగం చేసుకుంటే దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘ఇప్పుడు యువత ఉద్యోగాలు దొరక్క తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. 45 ఏళ్లలో నిరుద్యోగం రేటు అత్యధిక స్థాయికి చేరుకుంది. యువతలో నిరాశను పోగొట్టి భవిష్యత్‌పై భరోసా కల్పించాల్సిన బాధ్యత మనదే’’ అని రాహుల్ అన్నారు. స్కూలు విద్యార్థులతో మాట మంతీ రాహుల్ పాదయాత్రను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. దారి పొడవునా ప్రజలు ఆయనను చూడడానికి ఎగబడ్డారు. సీనియర్ సిటిజన్లు సెక్యూరిటీని దాటుకొని కరచాలనానికి, సెల్ఫీలకు ప్రయత్నించారు. ఒక కథాకళి డ్యాన్సర్ నాట్యం చేయడంతో రాహుల్ ఆసక్తిగా చూశారు. నీన్దకరలోని ఒక పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. వారితో ఫోటోలు దిగారు. ‘‘కేరళ అందాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఇక్కడి ప్రజలు రాష్ట్రానికి మరింత అందం తెస్తున్నారు’’ అన్నారు. -
నిరుద్యోగం పైపైకి.. ఉద్యోగాలు లేక యువత విలవిల
న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్ను దాటేశామని మీసాలు మెలేస్తున్నాం. కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం పరిస్థితి నానాటికి దిగజారుతోంది. గత ఏడాది కాలంలో నిరుద్యోగ రేటు పెరిగిపోతూ వస్తోంది. ఆగస్టులో నిరుద్యోగం రేటు ఏకంగా 8% శాతానికి చేరుకుంది. అయిదేళ్ల క్రితం 5% ఉన్న నిరుద్యోగ రేటు అలా అలా పెరుగుతూనే ఉంది. 2021 ఆగస్టులో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో 8.35%కి చేరుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి 6.56 శాతానికి తగ్గినప్పటికీ మళ్లీ బాగా పెరిగిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక గ్రామీణ భారతంలో ఉద్యోగాలు లేక యువత విలవిలలాడిపోతున్నారు. గ్రామీణ భారత్‌లో నిరుద్యోగం రేటు 9.6% ఉంటే, పట్టణాల్లో 7.7%గా ఉంది. రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం రాష్ట్రాల వారీగా నిరుద్యోగ రేటులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 30% కంటే ఎక్కువగా నిరుద్యోగం రేటు ఉన్న రాష్ట్రాలు మూడు ఉంటే, 3%కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు నాలుగున్నాయి. హరియాణాలో అత్యధికంగా 37.3 శాతంతో నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉంటే జమ్ము కశ్మీర్లో 32.8%, రాజస్థాన్‌లో 31.4% ఉంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 6.9% నిరుద్యోగం రేటు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 6%గా ఉన్నట్టు సీఎంఐఈ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగం రేటు అత్యల్పంగా 0.4% ఉంటే, 3శాతం కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా; మేఘాలయా ఉన్నాయి. 40% మంది యువతకి ఉద్యోగాల్లేవ్ కొత్త ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2016–17 నుంచి 2021–22 గణాంకాలను పరిశీలించి చూస్తే ఉపాధి లేక మహిళలు, యువత ఎక్కువగా నష్టపోతున్నారు. గత ఏడేళ్ల కాలంలో యువతలో సగటు నిరుద్యోగం రేటు 42.6%గా ఉంది. ప్రస్తుతం యువతలో నిరుద్యోగం రేటు 34%గా ఉంది. ఇక పనిచేసే రంగంలో ఉండే మహిళలు పదేళ్ల క్రితం 26% ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 19శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గడం, యువతలో నైపుణ్యాలు కరువు, పనిచేసే ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యధికంగా వినియోగించడం వంటివన్నీ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తున్నాయి. మరికొంత మంది యువత చిన్నా చితక ఉద్యోగాలు చేయలేక వదులుకొని వెళ్లిపోవడం కూడా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణంగా మారింది. ప్రభుత్వం ఏం చేస్తోంది ? నిరుద్యోగం కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2023 చివరి నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ రంగంలో నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయడానికి ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికేనని ప్రభుత్వం చెబుతోంది. నాలుగేళ్ల తర్వాత ప్రైవేటు రంగంలో పని చేయడానికి నిపుణులైన కార్మికులు లభిస్తారన్నది కేంద్రం వాదనగా ఉంది. రవాణా రంగంలో ఊబర్, ఓలా, ఆతిథ్య రంగంలో ఇంటికి ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గి, జోమాటో సర్వీసులతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికీ తయారీ రంగం, మౌలికసదుపాయాల కల్పన ద్వారా ఉపాధి అవకాశాల్ని పెంచాల్సిన అవసరం ఉందని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్‌తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం -
గ్రామీణ ప్రాంతాల్లో లేని వ్యవసాయ పనులు, దేశంలో పెరిగిన నిరుద్యోగం!
ముంబై: ఉపాధికి జూన్ కలసి రాలేదు. ప్రధానంగా సాగు రంగంలో ఉపాధి నష్టంతో జూన్ మాసంలో నిరుద్యోగ రేటు 7.80 శాతానికి పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఈ గణాంకాలతో ఒక నివేదిక విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేమి మే నెలలో 6.62 శాతంగా ఉంటే, జూన్ నెలలో 8.03 శాతానికి పెరిగిపోయినట్టు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మే నెలలో 7.12 శాతంగా ఉంటే జూన్ నెలలో 7.30 శాతానికి చేరినట్టు తెలిపింది. ‘‘లాక్డౌన్లు లేని ఒక నెలలో ఉపాధి రేటు ఎక్కువగా పడిపోవడం అన్నది ఇదే. ఇది గ్రామీణ ప్రాంతంలోని రుతువుల వారీగా ఉండే ప్రభావం వల్లే. గ్రామీణ ప్రాంతాల్లో సాగు పనులు లేకపోవం వల్లే ఇలా జరిగింది. విత్తన సాగు మొదలవుతుంది కనుక జూలై నుంచి ఈ పరిస్థితి మారిపోతుంది’’అని సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ తెలిపారు. 30 లక్షల మందికి ఉపాధిలేవి... 1.3 కోట్ల మందికి గత నెలలో ఉపాధి నష్టం జరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. అయినప్పటికీ నికరంగా పెరిగిన నిరుద్యోగులు 30 లక్షల మందేనని వివరించింది. అసంఘటిత రంగంలో ఉపాధి నష్టం ఎక్కువగా జరిగినట్టు వ్యాస్ తెలిపారు. కార్మికుల వలసే ఇందుకు కారణమన్నారు. జూన్‌లో వేతన జీవుల్లో (సంఘటిత రంగం) 25 లక్షల మంది ఉపాధిని కోల్పోవడం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. అత్యధికంగా హర్యానా రాష్ట్రంలో 30.6% రాజస్థాన్‌లో 29.8%, అసోంలో 17.2%, జమ్మూ కశ్మీర్లో 17.2%, బిహార్‌లో 14% చొప్పున నిరుద్యోగం నమోదైంది. -
కార్మిక శక్తి సర్వే.. దేశంలో నిరుద్యోగం తగ్గిందట!?
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం (15 ఏళ్లు, అంతకుమించి) ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) 8.2 శాతానికి తగ్గింది. 2021 మొదటి మూడు నెలల్లో 9.3 శాతంగా ఉండడం గమనించాలి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన ‘14వ కార్మిక శక్తి సర్వే’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2021 మొదటి 3 నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కరోనా నియంత్రణ కోసం దీర్ఘకాలం పాటు విధించిన లాక్డౌన్ల ప్రభావం ఉంది. ఇక గతేడాది చివరి మూడు నెలల్లో (2021 అక్టోబర్–డిసెంబర్) నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. అంటే త్రైమాసికం వారీగా చూసినా ఉపాధిలేని వారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. ► మహిళల్లో నిరుద్యోగ రేటు 2022 జనవరి–మార్చి మధ్య 10.1 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.8 శాతం. 2021 చివరి త్రైమాసికంలో 10.5 శాతంగా ఉంది. ► పురుషుల్లో ఉపాధి లేకుండా ఉన్న వారి రేటు 2022 మొదటి త్రైమాసికంలో 7.7 శాతానికి తగ్గింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 8.3 శాతంగా ఉంది. ఇక ఏడాది క్రితం ఇదే కాలంలో 8.6 శాతంగా ఉండడం గమనించాలి. ► పట్టణాల్లో నిరుద్యోగ రేటు 47.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ ఇది 47.3 శాతంగా నమోదైంది. ► పట్టణ ప్రాంతాల్లో పురుష నిరుద్యోగులు 7.7 శాతంగా ఉన్నారు. ఏడాది క్రితం ఇది 8.6 శాతంగా ఉంటే, గతేడాది చివరి మూడు నెలల్లో 8.3 శాతంగా ఉంది. చదవండి: శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే! -
నిరుద్యోగిత తగ్గుతోంది
కోల్‌కతా: దేశంలో నిరుద్యోగితా రేటు తగ్గుతోందని, ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తోందని సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీస్ మంత్లీ టైమ్ సీరిస్) డేటా పేర్కొంది. ఫిబ్రవరిలో భారత నిరుద్యోగితా రేటు 8.10 శాతం ఉండగా, మార్చి నాటికి 7.6 శాతానికి దిగివచ్చిందని సంస్థ గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్2 నాటికి ఈ రేటు 7.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. దేశంలో అర్బన్ నిరుద్యోగిత 8.5 శాతం వద్ద, గ్రామీణ నిరుద్యోగిత 7.1 శాతం వద్ద ఉందని తెలిపింది. దేశంలో హర్యానా, రాజస్థాన్, జమ్ము, కాశ్మీర్, బీహార్, త్రిపుర, బెంగాల్లో నిరుద్యోగిత అధికంగా, కర్నాటక, గుజరాత్లో అల్పంగా ఉందని తెలిపింది. గతేడాది మేలో దేశ నిరుద్యోగిత 11.84 శాతంగా నమోదైంది. భారత్ లాంటి పేద దేశానికి 8 శాతం నిరుద్యోగిత కూడా ఎక్కువేనని, దీన్ని ఇంకా తగ్గించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
నిరుద్యోగ రేటు 12.6 శాతం
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ రేటు పట్టణ ప్రాంతాల్లో గతేడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో (2021–22లో క్యూ1) 12.6 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిరుద్యోగ రేటు కరోనా కారణంగా 20.8 శాతానికి పెరిగిపోవడంతో.. అక్కడి నుంచి తగ్గినట్టు కనిపిస్తోంది. ‘11వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ (పీఎల్ఎఫ్ఎస్) గణాంకాలను తాజాగా జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసింది. పనిచేయగలిగి ఉండి, ఉపాధి లేకుండా ఉన్న వారిని నిరుద్యోగ రేటు కింద పరిగణిస్తారు. 2020 ఏప్రిల్–జూన్ కాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో లాక్డౌన్లు అమలు చేయడం వల్ల అప్పుడు నిరుద్యోగ రేటు గణనీయంగా పెరగడం గమనార్హం. 15 ఏళ్లు అంతకుమించి వయసులోని వారిని ఈ గణాంకాల కిందకు ఎన్ఎస్వో పరిగణనలోకి తీసుకుంటోంది. గణాంకాలు వివరంగా.. ► పట్టణాల్లో మహిళల నిరుద్యోగ రేటు 2020 ఏప్రిల్ – జూన్ కాలంలో 21.1 శాతంగా ఉంటే, 2021 ఏప్రిల్–జూన్ కాలానికి 14.3 శాతానికి దిగొచ్చింది. కానీ అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే పెరిగింది. 2021 జనవరి–మార్చిలో ఇది 11.8 శాతంగా ఉంది. ► పురుషుల్లో ఈ రేటు 20.7 శాతం నుంచి 12.2 శాతానికి తగ్గింది. 2021 జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 9.6 శాతంగా ఉండడం గమనార్హం. ► కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 2021 ఏప్రిల్–జూన్ కాలానికి 46.8 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది ఉన్న 45.9 శాతంతో చూస్తే స్వల్పంగా పెరిగింది. అంటే ఈ మేరకు పనిచేసే మానవవనరులు పెరిగినట్టు అర్థం చేసుకోవాలి. కానీ 2021 జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 47.5 శాతంగా ఉంది. -
ఇది నిరుద్యోగ భారతం.. ఇంకా తగ్గని కరోనా ఎఫెక్ట్!
దేశ ప్రజల జీవితంపై కరోనా మహమ్మారి చూపిన దుష్ప్రభావం ఇప్పుడు గణాంకాల సాక్షిగా మరోసారి ఆవిష్కృతమైంది. కరోనా మొదలయ్యాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఇప్పుడు మరోసారి ప్రభుత్వ అధికారిక లెక్కలలోనే తేలింది. ఈ ఏడాది 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ‘నిరుద్యోగ రేటు’ 9.3 శాతానికి పెరిగింది. గత ఏడాది 2020లో ఇదే త్రైమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1 శాతమే. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్ఎఫ్ఎస్) చెప్పిన లెక్కలు. 15 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అక్టోబర్-డిసెంబర్ 2020 లో 10.3 శాతంగా ఉందని 9వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) తెలిపింది. పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో నిరుద్యోగ రేటు(వయస్సు -
తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం..7.4 నుంచి 4.2 శాతానికి..
సాక్షి, న్యూఢిల్లీ: రెండు తెలుగురాష్ట్రాల్లో నిరు ద్యోగం తగ్గుముఖం పడుతోంది. ఈ రాష్ట్రాల్లో నిరు ద్యోగిత జాతీయసగటు కంటే మెరుగ్గా ఉంది. ఈ వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అక్టో బర్ నాటికి జాతీయస్థాయి నిరుద్యోగరేటు 7.75% ఉండగా, తెలంగాణలో 4.2, ఆంధ్రప్రదేశ్‌లో 5.4 శాతం చొప్పున నమోదైందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా నిరుద్యోగరేటు క్రమేపీ తగ్గుతోందని నివేదిక పేర్కొంది. అగ్రస్థానంలో హరియాణా: నిరుద్యోగరేటులో హరియాణాదే అగ్రస్థానం. జాతీయసగటు కంటే ఎక్కువశాతం నమోదైన రాష్ట్రాల్లో హరియాణా (30.7 శాతం), రాజస్థాన్ (29.6 శాతం), జమ్మూ, కశ్మీర్ (22.2 శాతం), జార్ఖండ్(18.1 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (14.1 శాతం), బిహార్ (13.9 శాతం), గోవా (11.7 శాతం), పంజాబ్ (11.4 శాతం), ఢిల్లీ (11 శాతం), సిక్కిం (10 శాతం), త్రిపుర (9.9 శాతం)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగరేటు నమోదైంది. -
ఏపీలో నిరుద్యోగం తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో నిరుద్యోగం తగ్గుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే యువతకు ఉపాధిపై దృష్టి సారించారు. 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వైద్య రంగంలోనూ పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నారు. వివిధ పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక కూడా రాష్ట్రంలో నిరుద్యోగ రేటు బాగా తగ్గినట్లు స్పష్టం చేసింది. 2016వ సంవత్సరంలో ఈ రేటు 17.9 శాతం ఉండగా గత నెల (అక్టోబర్)కు 12 శాతానికి పైగా తగ్గి, 5.4 శాతంగా నమోదైంది. అందులోనూ ఈ ఏడాది ప్రతి నెలా నిరుద్యోగ రేటు తగ్గుదల గణనీయంగా ఉంది. గత నెలలో జాతీయ స్థాయి నిరుద్యోగ రేటు 7.75 శాతంగా ఉంది. అంటే జాతీయ స్థాయికంటే రాష్ట్రంలో 2.35 శాతం తక్కువగా ఉంది. తెలంగాణలో అక్టోబర్ నాటికి నిరుద్యోగ రేటు 4.2 శాతంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. తెలంగాణలో 2016 జనవరిలో నిరుద్యోగ రేటు 7.4 శాతంగా ఉందని తెలిపింది. అగ్రస్థానంలో హరియాణా నిరుద్యోగంలో హరియాణా అగ్రస్థానంలో నిలిచింది. నిరుద్యోగ రేటు ఎక్కువ శాతం నమోదైన రాష్ట్రాల్లో హరియాణా(30.7%), రాజస్థాన్(29.6%), జమ్మూకశ్మీర్ (22.2 %), ఝార్ఖండ్ (18.1%), హిమాచల్‌ప్రదేశ్ (14.1%), బిహార్ (13.9%), గోవా (11.7%), పంజాబ్ (11.4%), ఢిల్లీ (11 %), సిక్కిం (10%), త్రిపుర (9.9 %)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. -
ఆగస్టులో 16 లక్షల మంది ఉపాధి గల్లంతు
సాక్షి, న్యూఢిల్లీ: ఆగస్టులో దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో నిరుద్యోగిత రేటు 8.32 శాతంగా ఉందని వివరించింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.64 శాతం ఉండగా, పట్టణ నిరుద్యోగిత రేటు 9.78 శాతం ఉంది. జులైలో ఉపాధి పొందిన వారి సంఖ్య 399.38 మిలియన్లు ఉండగా.. ఆగస్టు నాటికి 397.78 మిలియన్లకు తగ్గింది. అంటే 16 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అత్యధికంగా హరియాణాలో 35.7 శాతం నిరుద్యోగిత రేటు నమోదైంది. తరువాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్ (26.7 శాతం), జార్ఖండ్ (16 శాతం), త్రిపుర (15.6 శాతం), బిహార్ (13.6 శాతం) నిలిచాయి. -
గణాంకాలు–వాస్తవాలు
బ్రిటిష్ మాజీ ప్రధాని బెంజమిన్ డిజ్రేలీ స్వయంగా నవలా రచయిత కూడా కనుక తన అనుభవాన్ని రంగరించి గణాంకాల గురించి ఓ చక్కని మాట చెప్పారు. గణాంకాలు చెప్పని వాస్తవాలేమిటో తెలుసుకున్నాకే వాటిని విశ్వసించాలన్నారు. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి విడుదల చేసిన జీడీపీ, జీవీఏ గణాంకాలను ఆ దృష్టితో చూడకతప్పదు. దేశవ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ అమలైన గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మైనస్ 24.4 శాతానికి పడిపోయిన వృద్ధి రేటు, ఈసారి అదే త్రైమాసికంనాటికి 20.1 శాతానికి ఎగబాకిందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. కరోనా రెండో దశ దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించి భారీగా కేసులు నమోదైన సమయంలో జీడీపీ ఇంతగా వృద్ధి చెందడం గమనించదగ్గదని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అంటున్నారు. నిరుడు తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థను అవస్థలపాలు చేసిన కరోనా, ఈ ఏడాది మరింత ఉగ్రరూపం దాల్చినా మనల్ని ఏమీ చేయలేకపోయిందని కూడా ఆయన చెప్పారు (చదవండి: ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?) ఈ ఏడాది ప్రపంచంలోనే వేగంగా వృద్ధి నమోదు చేస్తున్న దేశంగా భారత్‌ను పరిగణించవచ్చునని ఆయన లెక్కేశారు. ఆయనే కాదు...ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్ అండ్ పీ వగైరా సంస్థలు భారత వార్షిక వృద్ధి రేటు ఈసారి చైనాను అధిగమిస్తుందని జోస్యం చెప్పాయి. అయితే ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే జీడీపీ 16.9 శాతం కుంచించుకుపోయింది. అదే సమయంలో ప్రస్తుత వృద్ధి రేటు రిజర్వ్ బ్యాంకు, బ్లూమ్‌బర్గ్ అంచనాలకు దగ్గరగానే ఉంది. కరోనా మహమ్మారి కంటే చాలా ముందే మన ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో కూరుకుపోవడం మొదలైంది. 2017 ఆర్థిక సంవత్సరానికి ముందు 8 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2020 ఆర్థిక సంవత్సరానికి 4 శాతానికి పడిపోయింది. అనాలోచితమైన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, హడావుడిగా అమలుచేసిన జీఎస్టీ ఇందుకు కారణాలు. అయితే అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకూ భరోసానిస్తూ దేన్నయినా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకున్నదని, ఇది తిరిగి మరింత శక్తిమంతంగా పుంజుకుంటుందని చెప్పారు. కరోనా మహమ్మారి కాటేయకపోతే ఆయన ఆశలు నెరవేరేవేమో! కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. వేరే దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ చిగురుటాకులా వణికింది. తలసరి జీడీపీలో బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు కూడా మనల్ని అధిగమించాయి. అసలు జీడీపీ ఆధారంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేయడం సరికాదన్నది పలువురు ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో చేస్తున్న వాదన. నిర్దిష్ట కాలంలో వ్యవసాయం, ఉత్పాదక రంగం, సేవా రంగం తదితరాల్లో సాగిన లావాదేవీల మారకపు విలువ ఆధారంగా జీడీపీని లెక్కగడతారు. అయితే ఈ సంపదంతా ఏ రకంగా పంపిణీ అవుతున్నదన్న అంశమే ప్రధానం. కరోనాకు ముందే కుంగిపోవడం మొదలైన సామాన్యుల జీవితాలు ఆ మహమ్మారి కాటుతో మరింత దెబ్బతిన్నాయి. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండిటా ఉపాధి లేమి ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఫలితంగా ప్రజానీకం సగటు ఆదాయం గణనీయంగా క్షీణించింది. ప్రజారోగ్యం సరేసరి. కరోనా మహమ్మారి దాన్ని బాహాటంగా బయటపెట్టింది. తాజాగా భారతీయ ఆర్థిక వ్యవస్థ సమీక్షా కేంద్రం(సీఎంఐఈ) వెల్లడించిన గణాంకాలు బెంబేలెత్తిస్తున్నాయి. (చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..) గత నెలలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో 15 లక్షలమంది ఉపాధి కోల్పోయారని దాని సారాంశం. ఇందులో గ్రామీణ భారతం వాటాయే అధికమని ఆ సంస్థ అంచనా వేస్తోంది. అంతకుముందు జూలై నెలలో కొద్దో గొప్పో సాధించిన పురోగతి కాస్తా నెలరోజుల వ్యవధిలో తిరగబడిందని సీఎంఐఈ అంటున్నది. జూలై నెలలో నిరుద్యోగిత 6.95 శాతం ఉంటే ఆగస్టులో అది 8.32 శాతం. తరచి చూస్తే జూలై నెలలో పుంజుకున్నట్టు కనబడిన ఉపాధి అవకాశాలన్నీ సాగు రంగానికి సంబంధించినవేనని అర్థమవుతుంది. వానాకాలంలో వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు జోరందుకోవడం ఇందుకు ప్రధాన కారణం. జీడీపీ గణాంకాలు చూసి, స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్న తీరు చూసి మన ఆర్థిక వ్యవస్థ క్రమేపీ సాధారణ స్థితికి చేరుకుంటున్నదన్న అభిప్రాయం మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో కనబడుతోంది. కానీ జీడీపీని, స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు వేరే ఉంటాయి. వాటికి క్షేత్ర స్థాయి వాస్తవాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఉదాహరణకు సీఎంఐఈ ప్రకారం 2,546 కంపెనీల నికర అమ్మకాలు 2019 జూన్ త్రైమాసికం స్థాయికి చేరకపోయినా, వాటి నికర లాభాలు మాత్రం కరోనా మహమ్మారికి ముందునాటికన్నా బాగున్నాయి. వ్యయంలో భారీగా కోత వేయడం వల్లే ఇది సాధ్యమైందని నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. పెరిగిన ముడి సరుకుల వ్యయాన్ని తగ్గించుకోవడం ఎటూ సాధ్యం కాదు. ఏతా వాతా కోత పడేది ఉద్యోగాల్లోనే. అలాగే వడ్డీ రేట్ల పెంపుదల ఉండదని ఆర్బీఐ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు హుషారుగా ఉన్నాయి. మొత్తానికి గత ఏడాది ఇదే సమయంలో అట్టడుగుకు పడిపోయిన వృద్ధితో పోల్చడం వల్లే ఈసారి జీడీపీ మెరుగ్గా ఉన్నట్టు కనబడుతోంది. స్థూల ఆర్థిక వ్యవస్థ పుంజుకోనిదే ఉపాధి అవకాశాలుండవు. ప్రజల కొనుగోలు శక్తి పెరగదు. ఇవి సాధ్యం కావాలంటే కేంద్ర వ్యయం భారీగా పెరగాలి. పెట్రో ఉత్పత్తులపై పరోక్ష పన్నుల భారం తగ్గించాలి. ద్రవ్య లోటును అదుపు చేయడం ప్రధానమే. కానీ ఉపాధి అవకాశాలనూ, కొనుగోలు శక్తినీ పెంచకుండా కృత్రిమంగా పైకి ఎగబాకే వృద్ధి రేటును చూసి ఎన్నాళ్లు సంతృప్తి పడతాం? కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. (చదవండి: టీకాలకు లొంగని కోవిడ్ ఎంయూ వేరియంట్!)