Vikas Dubey
-
గ్యాంగ్‌స్టర్ దూబే ఎన్కౌంటర్: పోలీసులకు క్లీన్చిట్
లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌కు సంబంధించి యూపీ పోలీసులకు క్లీన్చిట్ లభించింది. ఎలాంటి ఆధారాలు లేనందున క్లీన్చిట్ ఇచ్చినట్లు బీఎస్ చౌహాన్ కమిషన్ చెప్పింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి బీఎస్ చౌహాన్ నేతృత్వంలో అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి, యూపీ మాజీ డీజీపీల కమిషన్ ఈ కేసును విచారించింది. గ్యాంగ్‌స్టర్ దూబే పోలీసులపై దాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. అయితే పోలీసులకు వ్యతిరేక సాక్ష్యాలు ఉంటే చూపించాల్సిందిగా మీడియాలో కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చింది. దూబే మరణానికి ముందు ఆయన్ను అరెస్టుచేసేందుకు 2020 జూలై 3న కాన్పూర్ వెళ్లిన 8 మంది పోలీసులు హత్యకు గురవ్వడంతో ఈ కేసు సంచలనంగా మారింది. కమిషన్ నివేదికను రాష్ట్రప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు అందించనుంది. చదవండి: ఆక్సిజన్ కొరత సంక్షోభం: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం -
గ్యాంగ్‌స్టర్ దూబే ఆత్మ : ప్రతీకారం తప్పదు!
కాన్పూర్ : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోలీసు కాల్పుల్లో హతమై రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఉత్తరప్రదేశ్, బిక్రూ గ్రామ ప్రజలు మాత్రం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఒంటరిగా సంచరించాలన్నా ..ఆకు కదిలినా దూబే ఆత్మ వచ్చినట్టు గజగజ వణికిపోతున్నారు. రాత్రి అయిదంటే ఇళ్లలోకి వెళ్లి, తాళాలు వేసుకుని మరీ బతుకుజీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. దూబే ఎన్కౌంటర్ తర్వాత బిక్రూ గ్రామ ప్రజలను తుపాకీ మోతల బీభత్సం ఇంకా వెంటాడుతోంది. వికాస్ భయ్యా దెయ్యమై తిరుగుతున్నాడని భ్రమపడుతున్నారు. దూబే ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమంటున్నారు. ఇప్పటికీ కూడా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇది అందరికీ తెలుసు కానీ దీని గురించి ఎవరూ మాట్లాడరు(ఆజ్ భీ గోలియోం కి ఆవాజ్ సునాయీ దేతి హై. సబ్ జాన్తే హై.. పర్ బోల్తా కోయి నహీ) అని గ్రామస్తులు ఆందోళనతో చెబుతున్నారు. కొంతమంది వికాస్ దెయ్యాన్ని కూడా చూశారంటూ పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక యువకుడు తెలిపాడు. భయ్యా ప్రభుత్వం కూల్చివేసిన ఇంటి శిథిలాల మీద కూర్చుని ఉండటం చూశామనీ మరొకరు తెలిపారు. అక్కడ కూర్చుని నవ్వుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తన మరణానికి అతడు(దూబే)ప్రతీకారం తీర్చుకుంటాడని తమకు ఖచ్చితంగా తెలుసని గ్రామానికి చెందిన మరో వృద్ధుడు చెప్పారు. అంతేకాదు అప్పుడప్పుడు ఆ ఇంటినుంచి మాటలు, మధ్య మధ్యలో నవ్వులు వినిపిస్తున్నాయని కూల్చివేసిన దూబే ఇంటి సమీపంలో నివసిస్తున్న మరో మహిళ పేర్కొంది. (‘ఇందులో ఓ పొలిటికల్ థ్రీల్లర్ పాయింట్ ఉంది’) మరోవైపు గ్రామస్తుల భయాలను, వాదనలను తోసిపుచ్చలేమని స్థానిక పూజారి చెప్పారు. అసహజ మరణాలు జరిగిన సందర్భాలలో, ఇటువంటి సంఘటనలు జరుగుతాయనీ, వికాస్ విషయంలో దహన సంస్కారాలు కూడా సక్రమంగా నిర్వహించలేదనీ ఆయన వాదిస్తున్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా సంబంధిత పూజలు చేయాలని స్థానిక పూజారిని కోరినప్పటికీ, పోలీసుల దృష్టిలో పడటం ఇష్టం లేక పూజారి దీనికి అంగీకరించలేదని గ్రామస్తులు తెలిపారు. అందుకే వికాస్ దూబే సహా, చనిపోయిన పోలీసుల ఆత్మశాంతి కోసం దసరా నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటున్నారు. అయితే ఎన్కౌంటర్ తర్వాత బిక్రూ గ్రామంలో విధుల్లో ఉన్న నలుగురు పోలీసులు (ఇద్దరు పురుషులు,ఇద్దరు మహిళలు) అలాంటివేమీ తాము వినలేదని, అంతా సవ్యంగానే ఉందని కొట్టి పారేశారు. కాగా గ్యాంగస్టర్, ఎనిమిది మంది పోలీసులను పొట్టన బెట్టుకున్న నేరస్థుడు వికాస్ దూబేను ఎన్కౌంటర్ లో యూపీ పోలీసులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
వికాస్ దూబే జీవితం ఆధారంగా వెబ్‌సిరీస్
ముంబై: ఇటీవలే ఉత్తర ప్రదేశ్ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే జీవితం ఆధారం ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. థ్రీల్లర్ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌కు బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నాడు. అత్యంత కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దూబే నిజ జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్నందున ఈ సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాత శైలేష్ ఆర్ సింగ్ అధికారిక అనుమతులు కూడా పొందినట్లు తెలుస్తోంది. (చదవండి: ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన దూబే?!) దీనిపై దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ... తాము తీయబోయే ఈ థ్రీల్లర్ వెబ్ సిరీస్ అంత్యంత ఆసక్తికరంగా ఉండబోతుందన్నారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఉదంతంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ పాయింట్ ఉందని, దానిని మేము ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పాడు. అది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు ఇది ప్రస్తుత సమాజాన్ని కూడా చూపిస్తుందన్నాడు. ఇటీవల యూపీ పోలీసుల చేతిలో హతమైన వికాస్ దూబే ఎన్కౌంటర్ వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన రోజుల వ్యవధిలోనే పోలీసుల తూటాకు వికాస్ దూబే బలయ్యాడు. (చదవండి: ‘జీపులో ఉన్న అందరిని చంపుతాను’) -
యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్ల ఏరివేత కార్యక్రమంలో కొనసాగుతోంది. ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను కాల్చి చంపిన పోలీసులు.. అండర్ గ్రౌండ్లో ఉన్న మరికొంతమంది క్రిమినల్స్ పనిపడుతున్నారు. యూపీ పోలీసులు మరో క్రిమినల్‌ను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి బారాబంకీ ప్రాంతంలో స్పెషల్ టాస్స్‌ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టింకూ కపాలా మరణించాడు. అయితే తొలుత తీవ్రంగా గాయపడ్డ అతను.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు స్థానిక ఎస్పీ అరవింద్ చతుర్వేది వివరాలను వెల్లడించారు. టింకూ తలమీద లక్ష రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆయన వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, 20 ఏళ్లుగా నిషేదిత కార్యక్రమాలను పాల్పడున్నాడని పేర్కొన్నారు. (22 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్, కానీ..) టింకూ టీంలోని మరికొంత మంది క్రిమినల్స్ కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మాఫియాను ప్రోత్సహిస్తున్న వారి జాబితాను తయారుచేసి వెంటాడుతోంది. కాగా మూడు వారాల క్రితమే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఎన్కౌంటర్లో యూపీ పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు ఓ కమిటీని సైతం నియమించింది. -
నేనే చంపేద్దామనుకున్నా..
లక్నో : ఉత్తర ప్రదేశ్ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే భార్య రిచా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది పోలీసులను చంపి వారి కుటుంబాల్లో విషాదం నింపిన తన భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే తన భర్తను చంపేద్దాం అనుకున్నానని, దుబే ఆకృత్యాలన్నీ తనకు తెలుసని తెలిపారు. దుబే ఎన్కౌంటర్ అనంతరం.. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఎనిమిది మంది పోలీసులను చంపి దుబే వారి కుటుంబాలను నాశనం చేశాడు. మేం సమాజంలో మా ముఖం చూపించుకోలేకపోతున్నాం. నేనే అతనిని షూట్ చేసి చంపేసే దాన్ని. జూలై 3 తేదీ అర్థరాత్రి రెండింటి సమయంలో దుబే తనని పిల్లల్ని తీసుకొని ఊరి నుంచి వెళ్లి పోవాలని చెప్పాడు. పోలీసులు పట్టుకోవడానికి వస్తున్నారని చెప్పి.. తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే దుబేను తిట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోమని పంపించాను. ఆ తరవాత పిల్లలతో కలిసి లక్నోలోని బంగ్లాలో తలదాచుకున్నాను’ అని పేర్కొన్నారు. (ఆయన మంచి భర్త, తండ్రి: దుబే భార్య) చనిపోవడానికి కొన్ని రోజుల ముందు దుబేకు యాక్సిడెంట్ అయ్యిందని, దాంతో మెదడులో ఒక బబూల్ వచ్చిందని రీచా చెప్పింది. దీంతో అతనికి కోపం బాగా పెరిగిందని, చనిపోవడానికి కొన్ని రోజుల ముందు దుబే వైద్యం ఆపేశాడని రీచా వివరించారు. దుబే ఏం పనిచేస్తాడు, ఎవరితో అతనికి సంబంధాలు ఉన్నాయో అన్నీ తనకు తెలిసిందని వెల్లడించింది. తన బాధ అంతా పిల్లల గురించే అని అత్తింటి వారు, పుట్టింటి వారు కానీ ఎవరు తమ పిల్లల్ని చూసుకోరని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా దుబేను జూలై 9 వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి, తప్పించుకోబోయాడు అనే కారణంతో జూలై 10వ తేదీన ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ( తీవ్ర రక్తస్రావం, షాక్‌తో దుబే మృతి..) -
‘జీపులో ఉన్న అందరిని చంపుతాను’
లక్నో: కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేని ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. చనిపోవడానికి ముందు తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై దాడి చేసి ఎనిమిది మందిని చంపేశాడు. దాంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తాజాగా వికాస్ దుబేకు, ఓ పోలీసు కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ ఫోన్ కాల్ వికాస్ దుబే, పోలీసులపై దాడి చేయడానికి ముందు రోజు జరిగినట్లు సమాచారం. వికాస్ దుబేకు, చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాజీవ్ చౌదరికి మధ్య ఈ సంభాషణ జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. (22 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్, కానీ..) దీనిలో దుబే, పోలీసు అధికారితో ‘నా మీద పెద్ద కుంభకోణాన్ని మోపబోతున్నారని తెలిసింది. అయితే నాతో చాలేంజ్ చేసిన ఆ వ్యక్తికి ఓ విషయం అర్థం అయ్యేలా చేయబోతున్నాను. జీపులో ఉన్న అందరిని హతమారుస్తాను. దీని కోసం జీవితాంతం జైలులో ఉండటానికి కూడా నేను సిద్ధమే. ఇప్పుడు అతడు వికాస్ దుబే టార్గెట్. అతడిని చంపేవరకు ఇంటికి తిరిగి వెళ్లను’ అన్నాడు. అయితే వికాస్ ఎవరి గురించి మాట్లాడాడు.. అనే విషయం గురించి స్పష్టత లేదు. -
ఆయన మంచి భర్త, తండ్రి: దుబే భార్య
లక్నో: ‘‘పోలీసులు ఆయనను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత నాశనం చేశారు. అయినప్పటికీ రాజ్యాంగం పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. కచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. నా భర్త చనిపోయాడు. కానీ నా ఆశలు మాత్రం సజీవంగా ఉన్నాయి. ఆయన నేరస్తుడే కావొచ్చు. అయితేనేం తనో మంచి భర్త, తండ్రి’’ అంటూ ఎన్కౌంటర్లో హతమైన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే భార్య రిచా దుబే ఉద్వేగానికి లోనయ్యారు. జూలై 2 రెండు రాత్రి బిక్రూలో ఏం జరిగిందో తనకు తెలియదని పేర్కొన్నారు. పోలీసులపై కాల్పుల ఘటన తర్వాత భర్త తనకు ఫోన్ చేశాడని, తనతో మాట్లాడటం అదే చివరిసారి అని చెప్పుకొచ్చారు. (ఇలాంటి చావుకు దుబే అర్హుడే: రిచా) కాగా ఎన్నో అరాచకాలకు పాల్పడి, ఎంతో మంది అమాయకులను, ఆఖరికి పోలీసులను సైతం పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబే జూలై 10న యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల చేతిలో ఎన్కౌంటరైన విషయం విదితమే. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని కోరుతూ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం విచారణ కమిటీ నియమించేందుకు సిద్ధమైంది.(ఒక్క ఫిర్యాదు.. పోలీసుల మరణం.. దుబే హతం!?) ఈ నేపథ్యంలో రిచా దుబే స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా భర్తతో తన అనుబంధం, తమ కుటుంబం గురించి చెప్పుకొచ్చారు.‘‘ నా సోదరుడు రాజు నిగమ్‌కు దుబే స్నేహితుడు. 1990లో తొలిసారి ఆయనను కలిశాను. మా అన్నయ్యే మా ఇద్దరికి పెళ్లి చేశాడు. బిక్రులో మా ఆయన మాటే ఫైనల్. దుబే కరుడుగట్టిన నేరస్తుడే అయినప్పటికీ భార్యాపిల్లలను ప్రేమించే వ్యక్తిత్వం ఆయనది. పిల్లలంటే ఆయనకు చాలా ప్రేమ. ప్రతినెలా ఖర్చుల కోసం రూ .40 వేలు పంపించేవారు. మా పెద్ద కొడుకు శంతను రష్యాలో మెడిసిన్ చదువుతున్నాడు. చిన్న కొడుకు ఆకాశ్ క్లాస్ 12 పరీక్షల్లో 90 శాతం మార్కులు సాధించాడు. స్థానిక రాజకీయాలు, సమస్యలు పిల్లలపై ప్రభావం చూపడకూడదనే ఉద్దేశంతో 2004లో లక్నోలో ఇళ్లు నిర్మించారు. వాళ్లిద్దరు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని ఆశించేవారు. తల్లిదండ్రులను కూడా అమితంగా గౌరవించేవాడు’’ అని పేర్కొన్నారు.(అందుకే దుబేకు సంకెళ్లు వేయలేదు!) అదే విధంగా.. ‘‘లాక్డౌన్ నేపథ్యంలో బిక్రూలో పోలీసులకు డిన్నర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే ఆరోజు రాత్రి బిక్రూలో ఏం జరిగిందో తెలియదు. జూలై 3 వేకువజామున 2 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు. లక్నోలోని ఇంటికి పారిపొమ్మని చెప్పాడు. నేను వెంటనే నా స్నేహితుల సాయంతో తప్పించుకున్నాను. ఆరోజే చివరిసారి ఆయనతో మాట్లాడటం. ఆ తర్వాత మీడియా ద్వారానే మిగతా వివరాలు తెలిశాయి’’అని తన భర్తతో జరిగిన చివరి సంభాషణ గురించి చెప్పుకొచ్చారు. -
22 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్, కానీ..
లక్నో: కరుడుగట్టిన నేరస్తుడు, పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన వికాస్ దుబే కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసు దళంపై వికాస్, అతని అనుచరులు ఈ నెల రెండో తేదీ రాత్రి కాల్పులకు దిగి పరారైన సంగతి తెలిసిందే. సరిగ్గా 22 ఏళ్ల క్రితం కూడా వికాస్ ఇదే తరహాలో తప్పించుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. అప్పుడు వికాస్ బిక్రూ గ్రామానికి సర్పంచ్‌గా ఉన్నాడు. హత్యాయత్నం అభియోగాలపై వికాస్‌ను అరెస్టు చేసేందుకు వెల్లిన పోలీసులను అతని కుటుంబ సభ్యులు, అనుచరులు రోడ్డు తవ్వేసి అడ్డుకున్నారు. మారణాయుధాలతో దాడికి దిగారు. అయితే, సంఖ్యా పరంగా కొద్దిమందే ఉండటంతో పోలీసులు వెనుదిరిగారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత జులై 2 వ తేదీ రాత్రి అలాంటి ఘటనే పునరావృతమైంది. కాకపోతే ఈసారి ఎనిమిది మంది పోలీసులు అమరులు కాగా, అదే వికాస్ చావుకు ముహూర్తం పెట్టింది. హత్యాయత్నం ఆరోపణలపై వికాస్ గ్యాంగ్‌ను అదుపులోకి పోలీసులు వెళ్లగా.. బుల్డోజర్లతో రోడ్డును ధ్వంసం చేసి అడ్డుకున్నారు. భవనంపైనుంచి పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దాంతో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత పోలీసుల ఎన్కౌంటర్లో వికాస్ హతమయ్యాడు. (చదవండి: నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్‌రెడ్డి) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అతను పట్టుబడగా.. పోలీసులు కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా వారి వాహనం బోల్తా పడింది. ఇదే అదనుగా వికాస్ తప్పించుకునే యత్నం చేశాడు. పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో బుల్లెట్ గాయాలతో నేరగాడు మృత్యువాతపడ్డాడు. దుబే అనుచురుల్లో మరో ఐదురుగు కూడా పోలీసుల కాల్పుల్లో హతమయ్యారు. ఇదిలాఉండగా.. వికాస్ అనుచరుడు జయ్కాంత్ వాజ్‌పేయి, అతని మిత్రుడు ప్రశాంత్ శుక్లాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. (దుబే ఎన్కౌంటర్ : తీవ్ర రక్తస్రావం, షాక్‌తో మృతి) -
తీవ్ర రక్తస్రావం, షాక్‌తో దుబే మృతి..
లక్నో : ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన ఘటనలో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు షాక్‌కు గురై మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈనెల 10న దుబే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పట్టుబడగా ప్రత్యేక వాహనంలో అతడిని కాన్పూర్‌కు తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ దుబే మరణించాడు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం మూడు బుల్లెట్లు దుబే శరీరంలోకి దూసుకెళ్లాయి. ఆయన శరీరంపై పది గాయాలయ్యాయని, తొలి బుల్లెట్ దుబే కుడి భుజానికి, రెండు బుల్లెట్లు ఛాతీ ఎడమవైపు చొచ్చుకువెళ్లాయని నివేదికలో వెల్లడైంది. దుబే తల, మోచేయి, కడుపు భాగంలోనూ గాయాలున్నట్టు నివేదిక పేర్కొంది. మహంకాళి దేవాలయంలో పూజలు చేసేందుకు ఉజ్జయిని వచ్చిన దుబేను ఈనెల 9న మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్‌కు సమీపంలోని బిక్రు గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను చంపిన కేసులో గ్యాంగ్‌స్టర్ దుబే ప్రధాన నిందితుడు. దుబే ఎన్‌కౌంటర్‌తో దశాబ్ధాల పాటు సాగిన అరాచకాలకు, నేరసామ్రాజ్యానికి తెరపడిందని ఆయన స్వగ్రామం బిక్రులో స్ధానికులు సంబరాలు చేసుకున్నారు. చదవండి : రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం -
అందుకే దుబేకు సంకెళ్లు వేయలేదు!
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేది నకిలీ ఎన్కౌంటర్ కాదని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. అదే విధంగా ఈ ఎన్‌కౌంటర్‌ను తెలంగాణ కేసు(దిశ నిందితుల ఎన్కౌంటర్)తో పోల్చవద్దని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, చట్ట ప్రకారమే తాము నడుచుకున్నామని.. యూపీ సర్కారు ఇప్పటికే ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీని నియమించిందని తెలిపారు. తమకు తగినంత సమయం ఇస్తే అన్ని ఆధారాలు న్యాయస్థానానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. కాగా జూలై 2న ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యప్రదేశ్‌లో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. (ఒక్క ఫిర్యాదు.. పోలీసుల మరణం.. దుబే హతం!?) ఈ క్రమంలో జూలై 10న అతడిని కాన్పూర్‌కు తరలిస్తుండగా.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లోని కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. దీంతో పోలీసుల తుపాకీ లాక్కొని తప్పించుకునేందుకు ప్రయత్నించిన దుబే తమపై కాల్పులకు తెగబడటంతో అతడిని ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే దుబే ఎన్‌కౌంటర్‌పై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో పోలీసుల మరణం, దుబే ఎన్కౌంటర్ కేసులను సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ దిశ అత్యాచారం, హత్య నిందితుల ఎన్కౌంటర్ కేసులో మాదిరి రిటైర్డు జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీ నియమించే యోచనలో ఉన్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.(దుబే హతం: తెలంగాణ మాదిరిగానే..) అందుకే సంకెళ్లు వేయలేదు ఈ నేపథ్యంలో శుక్రవారం యూపీ డీజీపీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కీలక అంశాలు ప్రస్తావించారు. ‘‘ వికాస్ దుబేది నకిలీ ఎన్కౌంటర్ కాదు. తెలంగాణ కేసుతో దీనిని పోల్చవద్దు. ఎందుకంటే అక్కడ తెలంగాణ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు ఆదేశించలేదు. కానీ యూపీ సర్కారు అలా చేయలేదు. చట్టం ప్రకారం, సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను అనుసరించే పోలీసులు నడుచుకున్నారు. మాకు మరికొంత సమయం ఇస్తే వాస్తవాలను మీ ముందుకు తీసుకువస్తాం. వికాస్ దుబే కరుడుగట్టిన నిందితుడు. అతడిపై 64 కేసులు ఉన్నాయి. తెలంగాణలో మాదిరి వికాస్ దుబేను క్రైంసీన్ దగ్గరకు తీసుకువెళ్లలేదు. అతడు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి మెటీరియల్ ఎవిడెన్స్ సమర్పిస్తాం. భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే అతడిని ఒక వాహనం నుంచి మరో వాహనంలోకి మార్చాం. మీడియా వాహనాలను కూడా మేం ఎక్కడా ఆపలేదు. 15 మంది పోలీసులం ఉన్నాం కాబట్టే దుబే చేతికి సంకెళ్లు వేయలేదు’’ అని పేర్కొన్నారు. కాగా దుబేను తీసుకువెళ్తున్న కాన్వాయ్‌ను అనుసరిస్తున్న తమను ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి కొద్ది దూరం ముందే ఆపేశారని మీడియా ప్రతినిధులు పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఒక్క ఫిర్యాదు.. పోలీసుల మరణం.. దుబే హతం!?
లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే తనను చంపేస్తాడనే భయంతోనే ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాహుల్ తివారీ వెల్లడించాడు. తన అత్తామామలకు చెందిన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోవద్దన్నందుకు అతడి మనుషులు తనపై దాడి చేశారని.. దీంతో తాను చౌబేపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నాడు. ఇంతకాలం ప్రాణ భయంతో రహస్య ప్రదేశంలో దాక్కొన్న తాను దుబే ఎన్కౌంటర్ విషయం తెలిసి బయటకు వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా తివారీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వికాస్ దుబేను అదుపులోకి తీసుకునేందుకు జూలై 2న పోలీసులు బిక్రూ గ్రామానికి వెళ్లగా.. అతడి గ్యాంగ్ వారిపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు నేలకొరిగారు. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం దుబే వారం రోజుల క్రితం పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. (వికాస్ దుబే నెల సంపాదనెంతో తెలుసా?) ఈ నేపథ్యంలో జూలై 2 నాటి ఘటన(ఎనిమిది మంది పోలీసుల మరణం)కు ముందు చోటుచేసుకున్న పరిణామాల గురించి తివారీ బుధవారం ఓ జాతీయ మీడియాకు వెల్లడించాడు. ‘‘మా అత్తింటి వారి ఆస్తి విషయంలో జోక్యం వద్దన్నందుకు వికాస్ దుబేకు కోపం వచ్చింది. దీంతో జూన్ 27న నేను బైక్‌పై వెళ్తున్న సమయంలో దుబే మనుషులు నాపై దాడిచేసి, బైక్, నా దగ్గర ఉన్న డబ్బు లాక్కెళ్లారు. ఈ విషయం గురించి నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. స్టేషన్ ఆఫీసర్ వినయ్ తివారీ ఈ కేసును దర్యాప్తు చేస్తానని చెప్పారు. జూలై 1న వినయ్ తివారీని.. నన్ను దుబే మనుషులు కొట్టిన చోటుకు తీసుకువెళ్లాను. వాళ్లు అక్కడే ఉన్నారు. పోలీసు అధికారి ముందే నన్ను మళ్లీ కొట్టి, ఆయనను బెదిరించారు. (ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన దూబే?!) దీంతో వినయ్ తివారీ చాలా భయపడ్డారు. దుబే మనుషులు తనను చంపేస్తారని భావించి.. తాను ధరించిన జంధ్యం చూపించి.. పండితులపై కరుణ చూపాలంటూ వేడుకున్నారు. ఇంతలో వికాస్ దుబే వచ్చి గంగా నది నీళ్లను మాకు ఇచ్చారు. అప్పుడు రాహుల్ తివారీని (అంటే నన్ను) చంపను అని తనకు మాట ఇవ్వాలని వినయ్ తివారీ దుబేను అడిగారు. ఆ తర్వాత మరుసటి రోజు నన్ను పిలిచి కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత దుబే నా బైక్ తిరిగి ఇచ్చేశాడు. కానీ నాకు మాత్రం భయం వేసింది. అతడు నన్ను చంపేస్తాడని అర్థమయింది. దీంతో నేను మరోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. దుబేపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు’’ అని తనకు ఎదురైన భయంకర అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. (వికాస్ దూబే ఎన్కౌంటర్: అనేక అనుమానాలు!) ఈ క్రమంలో జూలై 2 అర్ధరాత్రి కాన్పూర్‌లోని బిక్రూ గ్రామంలో దుబే ఇంటికి వెళ్లగా అతడి మనుషులు ఎనిమిది మంది పోలీసులను బలితీసుకున్నారని పేర్కొన్నాడు. ఆ ఘటన తనను భయభ్రాంతులకు గురిచేసిందని.. అప్పటి నుంచి తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్జాతంలోకి వెళ్లినట్లు తెలిపాడు. ఇక దుబే ఎన్కౌంటర్ తర్వాత ‘కెప్టెన్’ను కలవగా.. తనకు సెక్యూరిటీగా గన్‌మ్యాన్‌ను ఇచ్చారని, దాంతో తన ఇంటికి తిరిగి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా దుబే ఎన్కౌంటర్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బడా నాయకులు, పోలీసులకు సంబంధించిన రహస్యాలు బయటపెడతాడనే కారణంతోనే అతడిని హతమార్చారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబే ఎన్‌కౌంటర్‌పై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. -
దూబే ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని అనుచరుల ఎన్కౌంటర్లతో పాటు 8 మంది పోలీసుల హత్యపై విచారణ జరిపించడానికి కమిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చునని వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీం బెంచ్ ఎదుట మంగళవారం యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది జూలై 16లోగా స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు. దీనిపై స్పందించిన సుప్రీం బెంచ్.. తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలి గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుల ఎన్కౌంటర్ కేసుపై సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టుగానే ఈ కేసులో కూడా కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నాయని పేర్కొంది. కాగా, ఎన్కౌంటర్లో హతమైన వికాస్ దూబే నెల సంపాదన రూ.కోటి వరకు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వెల్లడించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. ‘దూబే సాదాసీదా జీవితాన్నే గడిపేవాడు. అతని బ్యాంకు అకౌంట్లలో పెద్ద మొత్తంలో సొమ్ము లేదు. మరి ఆ డబ్బంతా ఏం చేశాడో విచారిస్తున్నాం’అని ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు. -
దుబే హతం: తెలంగాణ మాదిరిగానే..
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ సహా అంతకుముందు అతడి గ్యాంగ్ చేతిలో ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసుల దర్యాప్తునకై రిటైర్డు జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీ నియమించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ రెండు ఘటనలపై కేంద్ర సంస్థల చేత దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను గురువారం లోగా అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. (దూబే ఎన్కౌంటర్: ఓ రోజు ముందుగానే పిటిషన్!) అదే విధంగా.. ‘‘తెలంగాణ కేసు మాదిరిగా ఈ కేసులో కూడా.. విచారణ జరిపించాలని యోచిస్తున్నాం. మీకు ఏ రకమైన కమిటీ కావాలో చెప్పండి’’ అని పిటిషనర్లను ఉద్దేశించి సీజేఐ ఎస్ఏ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు వెలికితీసి కోర్టుకు తెలియజేసేందుకు తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా.. దుబే ఎన్‌కౌంటర్‌పై విచారణకై యూపీ సర్కారు ఇప్పటికే ఏకసభ్య స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. (వికాస్ దూబే ఎన్కౌంటర్: అనేక అనుమానాలు!) కాగా ఉత్తరప్రదేశ్‌లో నేర సామ్రాజ్యం నిర్మించుకున్న వికాస్ దుబేను కాన్పూర్‌లోని బిక్రూ గ్రామంలో అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై.. జూలై 2 అర్ధరాత్రి అతడి గ్యాంగ్ విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన విషయం విదితమే. ఈ ఘటనలో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు నేలకొరిగారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన వికాస్ దుబే అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిలోని ప్రముఖ ఆలయంలో పోలీసుల చేతికి చిక్కాడు. అక్కడి నుంచి అతడిని కాన్పూర్‌కు తీసుకువచ్చే క్రమంలో జూలై 10న పోలీసుల వాహనం బోల్తా పడింది. ఈ నేపథ్యంలో పారిపోవడానికి ప్రయత్నించిన దుబే తమపై కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ చేసినట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది. అయితే అనేక మంది బడా నాయకులు, పోలీసులతో ఈ గ్యాంగ్‌స్టర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. తమ రహస్యాలు బయటపెడతాడనే భయంతోనే అతడిని హతమార్చారంటూ ప్రతిపక్షాలు సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దుబే ఎన్కౌంటర్ కంటే ముందే అతడి అనుచరులు ఐదుగురు ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన న్యాయవాది ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దుబే గ్యాంగ్ సభ్యుల మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థచేత విచారణ జరిపించాలని కోరారు. అంతేగాక దుబే కూడా ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉందని పిల్లో అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు.. అనూప్ ప్రకాశ్ అవస్థి అనే వ్యక్తి పోలీసులపై దుబే గ్యాంగ్ అరాచకంపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు.. విచారణ ఈ పిటిషన్లను విచారించిన కోర్టు.. తెలంగాణలో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసును ఈ సందర్భంగా గుర్తుచేసింది. రంగారెడ్డి జిల్లాలోని దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారని, అది బూటకపు ఎన్కౌంటర్ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిటైర్డు జడ్జి జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పుర్కర్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా ప్రకాశ్, సీబీఐ మాజీ చీఫ్ కార్తికేయన్ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఆరు నెలల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించగా కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఈ విషయంలో జాప్యం నెలకొంది. -
వికాస్ దూబే మరో సహచరుడు అరెస్టు!
లక్నో : గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే మరో అనుచరుడిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కన్పూర్లో పోలీసులపై దాడికి తెగబడ్డ కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దూబే సహాయకుడు శశికాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శశికాంత్‌తో సహా ఇప్పటి వరకు నలుగురిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై పోలీస్ అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ. ఈ కేసులో మొత్తం 21 మంది నిందితులు భాగస్వాయ్యం అయినట్లు వెల్లడించారు. వీరిలో నలుగురిని అరెస్టు చేయగా వికాస్ దూబేతో సహా ఆరుగురు నిందితులను వివిధ ఘటనల్లో పోలీసుల విచారణలో మరణించినట్లు పేర్కొన్నారు. మిగతా 11 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. (గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్) అలాగే కాన్పూర్ ఆకస్మిక దాడిలో యూపీ పోలీసుల నుంచి నేరస్తులు ఎత్తుకెళ్లిన రెండు రైఫిల్స్‌ను కూడా శశికాంత్ అరెస్ట్ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై దాడి ఘటన అనంతరం పోలీసుల నుంచి నేరస్తుల ముఠా దోచుకున్న అన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈనెల 3న వికాస్‌దూబే అనుచరులు కాల్పులు జరిపిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే. పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎనిమిది మంది మరణానికి కారణమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే గత శుక్రవారం పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. (రౌడీషీటర్ల కాల్పులు.. 8 మంది పోలీసుల మృతి) చదవండి : గ్యాంగ్‌స్టర్ దుబే హతం -
వికాస్ దుబే నెల సంపాదనెంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే కేసు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. దుబే, నెలకు కోటి రూపాయల వరకు సంపాదించేవాడని ఈడీ వర్గాలు తెలిపారు. అయితే ఆ డబ్బులు ఎలా ఖర్చు చేసేవాడు అనే విషయాల మీద ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దుబే కి తాగే అలవాటు కూడా లేదు. అంతే కాకుండా అతను చాలా సాధారణమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవాడు. ఆడంబరమైన దుస్తులను కూడా ధరించేవాడు కాదు. అంతే కాకుండా విదేశీ ప్రయాణాలు కూడా దుబే చేసేవాడు కాదు. ఇలా అన్ని రకాలుగా చూసిన దుబే అంత డబ్బును ఖర్చు చేయలేడు. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. చదవండి: వికాస్ దుబే వెనుకున్న వారెవరు? దుబే, బ్యాంక్ ఖాతాలో కూడా ఎక్కడ ఎక్కువ డబ్బు ఉన్నట్లు తెలియలేదు. దుబే బ్యాంక్ ఖాతాతో పాటు ఆయన సన్నిహితుల బ్యాంక్ ఖాతాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు దుబే ఆ డబ్బుతో ఏమైనా బిజినెస్ చేశారా అనే కోణంలో కూడా ఆయనకు సన్నిహితంగా ఉండే బిజినెస్‌మ్యాన్‌లను కూడా ఆరా తీస్తున్నారు. ప్రతి నెల 90 లక్షల నుంచి 1.2 కోట్ల వరకు సంపాదించే దుబే, ఆ డబ్బును ఏం చేస్తున్నారో తెలియాలంటే ఈడీ విచారణ పూర్తవ్వాల్సిందే. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్‌లు, మర్డర్ల కేసులో కూడా దుబే నిందితుడు. దుబేను జూలై 10వ తేదీన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం -
వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అరెస్ట్
సాక్షి, ముంబై : ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఎనిమిది మంది పోలీసు సిబ్బంది హత్య ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో హతమైన వికాస్ దుబే ముఖ్య అనుచరుడు, ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కాడు. అరవింద్ రామ్ విలాస్ త్రివేది (46), అలియాస్ గుద్దాన్ను ముంబై ఏటీఎస్ బృందం శనివారం అరెస్టు చేసింది. ఇతనితోపాటు, డ్రైవర్ సుశీల్‌కుమార్ సురేష్ తివారీ (30) అలియాస్ సోను కూడా థానేలోని కోల్షెట్ రోడ్ లో అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో పోలీసులు హత్య తరువాత త్రివేది తన డ్రైవర్‌తో పాటు రాష్ట్రం నుంచి పారిపోయినట్టుగా విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. 2001లో ఉత్తరప్రదేశ్ మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా దుబేతో పాటు త్రివేది అనేక కేసుల్లో నిందితుడని పేర్కొన్నారు. అలాగే త్రివేది అరెస్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలో బహుమతిని ప్రకటించిందని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీసు అధికారి దయా నాయక్ చెప్పారు. (ఇలాంటి చావుకు దుబే అర్హుడే: రిచా) కాగా పోలీసులపై దాడిచేసి డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిది మంది హత్యలకు కారణమైన కరుడగట్టిన నేరస్థుడు వికాస్ దూబేను ఎన్కౌంటర్లో యూపీపోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. (దుబే హతం) -
వికాస్ దుబే వెనుకున్న వారెవరు?
కాన్పూర్: ఎన్నో నేరాలకు పాల్పడటమే కాక ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేని శుక్రవారం ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పుడు కాస్తా ప్రశాంతంగా ఉందని తెలిపారు. వికాస్ దుబే చేతిలో హత్యకు గురయిన జితేందర్ పాల్ సింగ్ తండ్రి తీర్థ్ పాల్ మీడియాతో మాట్లాడారు. కొడుకు పోయిన బాధలో ఉన్న తనకు దూబే ఎన్కౌంటర్ వార్త కాస్తా ఊరటనిచ్చింది అన్నారు. ‘ఉత్తరప్రదేశ్ పోలీసులను చూస్తే.. చాలా గర్వంగా ఉంది. వారు చేసిన పనులు నాకు కాస్తా ఓదార్పునిచ్చాయి. యోగి ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు. (రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం) మరణించిన ఎస్సై నెబ్యులాల్ బింద్ తండ్రి కలికా ప్రసాద్ బింద్ మాట్లాడుతూ.. ‘వికాస్ దుబేని హతమార్చారనే వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. ఇకపోతే వికాస్ దుబేకి సాయం చేసిన డిపార్టుమెంట్ వ్యక్తులకు కూడా కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. మరణించిన సుల్తాన్ సింగ్ భార్య షర్మిలా వర్మ దుబే మృతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది. కానీ అతడి వెనక ఉన్న వారి గురించి మనకు ఎలా తెలుస్తుంది’ అన్నారు.(ఒక్కసారిగా కుప్పకూలిన నేర సామ్రాజ్యం!) ఉజ్జయిన్లో పోలీసుల చేతికి చిక్కిన వికాస్ దుబేను కాన్పూర్ తీసుకువస్తుండగా పోలీసుల వాహనం రోడ్డు మీద బోల్తా పడింది. ఇదే అదునుగా భావించి వికాస్ దుబే పోలీసులను గాయపర్చి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు అతడిని ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. -
దుబే ఛాతీ, భుజంలో బుల్లెట్ గాయాలు?!
లక్నో: ఎదురుగా వస్తున్న పశువుల మందను తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించిన క్రమంలో తమ వాహనం అదుపు తప్పి ప్రమాదం సంభవించిందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ శుక్రవారం వెల్లడించింది. వాహనం బోల్తా పడగానే వికాస్ దుబే పారిపోయేందుకు యత్నించచడం సహా తుపాకీ లాక్కొని తమపై కాల్పులు జరిపినట్లు తెలిపింది. పోలీసుల నుంచి 9ఎంఎం పిస్తోల్ లాక్కొన్న దుబే కాల్పులకు దిగాడని.. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు శివేంద్ర సింగ్ సెంగార్, విమల్ యాదవ్ తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. గ్యాంగ్‌స్టర్‌ను ప్రాణాలతో పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించామని.. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మ రక్షణ కోసం తాము సైతం కాల్పులకు దిగాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ క్రమంలో దుబే గాయపడగా... అతడిని కాన్పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వెల్లడించింది. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొంది. ఈ మేరకు వికాస్ దుబే ఎన్కౌంటర్ అనంతరం స్సెషల్ టాస్క్‌ఫోర్స్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా పోస్ట్‌మార్టం నివేదికలో దుబే భుజంపై ఒకటి, ఛాతీభాగంలో మూడు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. (ఇలాంటి చావుకు దుబే అర్హుడే: రిచా) ఇక వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ వెనుక ఉన్న బడా నాయకులు, పోలీసులను కాపాడేందుకే అతడిని హతమార్చారంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్టీఎఫ్ ప్రకటన వాస్తవ కథనాలకు దూరంగా ఉండటం మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎస్టీఎఫ్కు చెందిన పోలీసులు వెల్లడించిన ప్రకారం.. బోల్తా పడిన వాహనంలోనే దుబే ఉన్నాడు. అయితే అతడిని కాన్పూర్ నగర్ జిల్లాకు తరలిస్తున్న క్రమంలో ఓ టోల్‌ప్లాజా వద్ద వీడియో ప్రకారం అతడు వేరొక వాహనంలో ఉన్నాడు. అదే విధంగా ఎస్టీఎఫ్ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న మీడియా వాహనాలను సైతం ఎన్కౌంటర్ ఘటనాస్థలి కంటే దాదాపు రెండు కిలోమీటర్ల ముందే నిలిపివేశారు. పైగా దుబే చేతులకు సంకెళ్లు కూడా వేయకపోవడం గమనార్హం.(వికాస్ దుబే ఎన్కౌంటర్: అనేక అనుమానాలు!) STF issues press note in #VikasDubey encounter matter. "A herd of cattle had come in front of the vehicle due to which driver took sudden turn leading to accident...Police tried to go close to him to nab him alive but he continued to fire. Police retalitaed in self-defence..." pic.twitter.com/iOXaXv8vno — ANI UP (@ANINewsUP) July 10, 2020 -
రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం
లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై అతని భార్య రిచా దుబే స్పందించారు. పోలీసులపై మారణకాండకు పాల్పడ్డ వికాస్ ఇలాంటి చావుకు అర్హుడే అని ఆమె వ్యాఖ్యానించారు. కాన్పూర్‌లోని భైరోఘాట్‌లో వికాస్ దుబే అంత్యక్రియల్లో రిచా పాల్గొన్నారు. ఆమె వెంట కుమారుడు, తన తమ్ముడు దినేష్ తివారీ ఉన్నారు. దుబే మృతదేహానికి ఎలక్ట్రిక్ క్రిమేషన్ మెషీన్లో.. అతని బావమరిది దినేష్ తివారీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈక్రమంలో వికాస్ ఎన్కౌంటర్ కావడంపై స్పందించాలనే వార్తా రిపోర్టర్లపై ఆమె మండిపడ్డారు. వికాస్ చాలా పెద్ద తప్పు చేశాడని, అతనికి చావు ఇలా రాసి పెట్టి ఉందని రిచా చెప్పారు. మీవల్లే వికాస్‌కు ఈ గతి పట్టిందని, దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆమె రిపోర్టర్లకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అరెస్ట్) రూరల్ ఎస్పీ బ్రిజేష్ శ్రీవాత్సవ సమక్షంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ వికాస్ అంత్యక్రియలు జరిగాయి. కాగా, శుక్రవారం ఉదయం వికాస్ దుబే పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. అతన్ని ఉజ్జయినిలో పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసలు కాన్పూర్‌కు తరలిస్తుండగా వారి వాహనం బోల్తా పడింది. అదే అదనుగా భావించి దుబే తప్పిచుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో పోలీసులకు అతనికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కాల్పుల్లో ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది కూడా గాయపడ్డారని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. (ఒక్కసారిగా కుప్పకూలిన నేర సామ్రాజ్యం!) -
గ్యాంగ్‌స్టర్ దుబే హతం
-
గ్యాంగ్‌స్టర్ దుబే హతం
కాన్పూర్: పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, డీఎస్పీ సహా ఎనిమిది మంది మరణానికి కారణమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే శుక్రవారం పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్లో గురువారం అరెస్ట్ అయిన తరువాత, దుబేను అక్కడి నుంచి యూపీలోని కాన్పూర్‌కు తీసుకువస్తుండగా, శుక్రవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ శివార్లలోని భావుంటి వద్ద హైవేపై జనçపసంచారం లేని చోట దుబేను తీసుకువస్తున్న కారు బోల్తా పడింది. ఇదే అదనుగా ప్రమాదంలో గాయపడిన పోలీసు నుంచి పిస్టల్‌ను లాక్కొని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆ క్రమంలో తనను అడ్డుకున్న పోలీసులపై కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. కారు బోల్తాపడిన ఘటనలో, తదనంతర ఎదురుకాల్పుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు సహా 8 మంది పోలీసులు గాయపడ్డారని కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ‘ప్రమాదం అనంతరం ఒక పోలీసు నుంచి తుపాకీ లాక్కుని పారిపోయేందుకు దుబే ప్రయత్నించాడు. ఆయనను చుట్టుముట్టిన పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించారు. ఆ మాటలను వినకుండా, పోలీసులపై.. వారిని చంపే ఉద్దేశంతో దుబే కాల్పులు జరపడం ప్రారంభించాడు. దాంతో, స్వీయ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు’ అని వివరించారు. గాయపడిన దుబేను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లామని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు ఒక పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే దుబే చనిపోయాడని గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్బీ కమల్ మీడియాకు తెలపడం గమనార్హం. ఆయన మృతదేహంపై నాలుగు బుల్లెట్ గాయాలున్నాయని, మూడు ఛాతీ భాగంలో, ఒకటి చేతిపై ఉందని వివరించారు. పోలీసుల్లో ఒకరికి భుజంపై, మరొకరికి చేతిపై బుల్లెట్ గాయాలున్నాయన్నారు. దుబేకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా నెగెటివ్‌గా ఫలితం వచ్చిందని చెప్పారు. మొత్తం ఆరుగురి ఎన్కౌంటర్ 8 మంది పోలీసుల మృతికి కారణమైన కాన్పూర్ కాల్పుల ఘటనలో ఇప్పటివరకు ప్రధాన నిందితుడైన వికాస్ దుబే సహా మొత్తం ఆరుగురు వేర్వేరుగా జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లలోనే హతమవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ పట్టణం లోని మహాకాళేశ్వరుడి ఆలయానికి గురువారం దుబే వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను అక్కడే అరెస్ట్ చేసి అనంతరం, యూపీ పోలీసులకు అప్పగించారు. అక్కడి నంచి దుబేను కాన్పూర్‌కు తీసుకువస్తున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కొద్ది గంటల ముందే సుప్రీంలో కేసు వికాస్ దుబే ఎన్కౌంటర్ జరగడానికి కొన్ని గంటల ముందే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దు బేను ఎన్కౌంటర్లో హతమార్చే అవకాశముందని, అలా జరగకుండా అడ్డుకోవాలని కోరుతూ ఓ లాయర్ పిటిషన్ వేశారు. చాప్టర్ క్లోజ్ యూపీ సివిల్ డిఫెన్స్ ఐజీ అమితాబ్ ఠాకూర్ ఈ ఎన్‌కౌంటర్‌ను ముందే ఊహించారు. ‘వికాస్ దుబే లొంగిపోయాడు. రేపు ఉదయం ఆయన పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది.ఆ క్రమంలో పోలీసుల చేతిలో చనిపోయే అవకాశం కూడా ఉంది. దుబే చాప్టర్ క్లోజ్ అవుతుంది’ అని గురువారం ట్వీట్ చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలి గతవారం పోలీసు బృందంపై వికాస్ దుబే జరిపిన కాల్పుల ఘటన నుంచి నేటి దుబే ఎన్కౌంటర్ వరకు అన్ని ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరపాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. ‘నేరస్తులు చనిపోయారు. కానీ ఇన్నాళ్లు వారిని కాపాడిన వారినేం చేస్తారు?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్నించారు. మొత్తం ఘటనకు సంబంధించి వాస్తవాలు బయటకురావాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ డిమాండ్ చేశారు. 30 ఏళ్ల నేర చరిత్ర యూపీలో కరడు గట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే(56)కు 30 ఏళ్ల నేర చరిత్ర ఉంది. మొత్తం అతనిపై 62 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 5 హత్యలు, మరో ఎనిమిది హత్యాయత్నం కేసులు. వారం క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసుల్ని పొట్టన పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం అతని తలపై రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. 1990లో కాన్పూర్‌లో ఒకరిపై దాడి చేసిన కేసులో వికాస్ దుబే పేరు తొలిసారిగా వినిపించింది. ఆ తర్వాత రెండేళ్లకి కాన్పూర్ శివాలి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో దళిత యువకుడి హత్య కేసులో అతను నిందితుడు. ఈ ఘటన తర్వాత ఒక ముఠాను ఏర్పాటు చే సుకొని డాన్‌గా ఎదిగాడు. దోపిడీలు, దొంగతనాలు చేస్తూ రాజకీయాల్ని వాడుకున్నాడు. 1995–96లో బీఎస్పీలో చేరాడు. పోలీసు శాఖలో అతనికి సన్నిహితులు ఎక్కువ. ఎప్పుడైనా ప్రభుత్వం అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే వికాస్ దుబేకి ఉప్పందిపోయేది. అలా తన చుట్టూ పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బీజేపీ నేత శుక్లా హత్యతో సంచలనం 2001లో ఆనాటి యూపీ సర్కార్‌లో సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ నేత సంతోశ్ శుక్లాను పట్టపగలు అందరూ చూస్తుండగా పోలీస్‌స్టేషన్‌లోనే చంపడంతో వికాస్ దుబే పేరు వింటేనే అందరిలోనూ వణుకుపుట్టింది. ఆరు నెలల అనంతరం అతను లొంగిపోయాడు. కానీ, కేసు విచారణ సమయంలో పోలీసులే సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడంతో 2005లో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సన్నాహాలు వికాస్ సొంతూరు బిక్రులో గత 15 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. వికాస్ దుబే ఎవరి పేరు చెబితే అతనే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే కావాలని కలలుగన్నాడు. ఎలాగైనా చట్టసభల్లోకి వెళ్లడమే లక్ష్యమని పలుమార్లు సన్నిహితుల దగ్గర చెప్పుకున్నాడు. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున కాన్పూర్ జిల్లా రణియా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తూనే బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నించాడు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు అతని ప్రయత్నాలను సాగనీయలేదని తెలుస్తోంది. పోలీసుల అదుపులో భార్య, కుమారుడు వికాస్ దుబే తల్లిదండ్రులు రామ్‌కుమార్ దుబే, సరళాదేవి. తల్లి సరళాదేవి చాలా సంవత్సరాలుగా వికాస్ దుబేని దూరం పెట్టారు. తన చిన్న కుమారుడు దీపూతో కలిసి ఉంటున్నారు. వికాస్ పట్టుబడితే కాల్చి చంపేయమని బహిరంగంగానే చెప్పారు. వికాస్ దుబే భార్య రిచా స్థానిక రాజకీయాల్లో ఉన్నారు. ఘిమవూ పంచాయతీ సభ్యురాలిగా నెగ్గారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆకాశ్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. రెండో కుమారుడు షాను లక్నోలో తల్లితో కలిసి ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. వికాస్ భార్య, రెండో కొడుకు, వారింట్లో పనివాడిని పోలీసులు ఇప్పటికే నిర్బంధంలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది మంది పోలీసుల్ని చంపడానికి చేసిన కుట్రలో రిచా హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఈ ఎన్‌కౌంటర్‌పై పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఉజ్జయిన్లో అరెస్ట్ చేసే సమయంలో ఎలాంటి ప్రతిఘటన చూపని దుబే, ఆ తరువాత కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడని ప్రశ్నించారు. దుబేను తీసుకువెళ్తున్న పోలీస్ కాన్వాయ్‌ను ఫాలో అవుతున్న మీడియా వాహనాలను ఒక దగ్గర నిలిపేశారని, అక్కడికి కొద్ది దూరంలో, కాసేపటికే ఎన్కౌంటర్ జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఉజ్జయిన్ నుంచి బయల్దేరిన సమయంలో ప్రమాదం జరిగిన వాహనంలో కాకుండా, వేరే వాహనంలో దుబే కూర్చుని ఉన్న వీడియో క్లిప్పింగ్‌లు కూడా వైరల్ అయ్యాయి. ఈ అనుమానాలను యూపీ పోలీసులు కొట్టివేశారు. చెక్ చేయడం కోసమే మీడియాను ఆపి ఉండొచ్చని పేర్కొన్నారు. బిక్రు గ్రామంలో పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ఇప్పటివరకు 21 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, ఆరుగురు ఎన్కౌంటర్లలో చనిపోయారని ఏడీజీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. -
ఎన్కౌంటర్లో ఎన్నో చిక్కుముళ్లు
పోలీసులకు చిక్కి 24 గంటలు గడవకుండానే ఉత్తరప్రదేశ్ డాన్ వికాస్ దుబే శుక్రవారం ఎన్కౌంటర్లో మరణించాడు. అతన్ని మధ్యప్రదేశ్ నుంచి స్వస్థలానికి తరలిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగిందని, ఇదే అదునుగా అతను తమ దగ్గర నుంచి పిస్తోలు గుంజుకుని పరారయ్యేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలో ఎన్కౌంటర్ జరిగిందని యూపీ పోలీసుల కథనం. దుబే వంటి కరడుగట్టిన నేరగాడు అయిదు రాష్ట్రాలు దాటి, 1,500 కిలోమీటర్లు ప్రయాణించి సుదూరంగా వున్న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికొచ్చి అక్కడ ఎలాంటి ప్రతిఘటనా లేకుండా సులభంగా చిక్కాడంటేనే ఎవరూ నమ్మలేదు. దాన్నుంచి అందరూ తేరుకునేలోగానే అతని అంతం కూడా పూర్తయిపోయింది. అన్ని ఎన్కౌంటర్ కథల్లాగే దుబే ఎన్కౌంటర్ కూడా జవాబులేని ప్రశ్నలెన్నో మిగిల్చింది. దుబే ఇన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నవాడు కాదు. ఎప్పుడూ అజ్ఞా తంలో లేడు. అధికారంలో ఎవరున్నా దశాబ్దాలుగా తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నవాడు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రిని పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే కాల్చిచంపినా నిర్దోషిగా బయటికొచ్చినవాడు. ఆ తర్వాత కూడా తన నేరాల్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నవాడు. సరిగ్గా ఈ కారణాల వల్లనే వికాస్ దుబే అంతమైన తీరును అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్నవారికి అతనిపై సానుభూతి లేదు. ఇన్ని దశాబ్దాలుగా అతను ఎవరి అండదండలతో ఎదిగి ఈ స్థితికి చేరుకున్నాడో నిగ్గుతేలితే భవిష్యత్తులో ఇలాంటివారు తలెత్తకుండా అరికట్టడానికి అస్కారం వుంటుందన్నదే వారి వాదన. దుబే నోరు విప్పితే వివిధ పార్టీలకు చెందిన అనేకమంది రాజకీయ నాయకులతోపాటు పలువురు పోలీస్ అధికారుల జాతకాలు కూడా బయటపడతాయన్న భయం తోనే ఎన్కౌంటర్ పేరుతో అతని కథ ముగించారన్న సందేహం అనేకమందిలో వుంది. దుబే ఎన్కౌంటరైన తీరు నాలుగేళ్లక్రితం తెలంగాణలో ముగిసిపోయిన నయీముద్దీన్ అనే నేరగాడి ఉదంతాన్ని గుర్తుకుతెస్తుంది. ఈ ఎన్కౌంటర్ కథనంలో ఆద్యంతమూ ఎన్నో కంతలున్నాయి. ఉజ్జయినిలో అతన్ని అదుపు లోకి తీసుకున్నాక బయల్దేరిన వాహనం వేరు... ప్రమాద సమయంలో అతను ప్రయాణిస్తున్న వాహనం వేరు. ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రంలో పట్టుబడినవారిని ట్రాన్సిట్ రిమాండ్‌లోకి తీసుకున్నాక మాత్రమే తరలిస్తారు. దుబే విషయంలో అదేమీ పాటించలేదు. ఎనిమిదిమంది పోలీసులను ఉచ్చులోకి లాగి కాల్చిచంపిన నేరగాడు పట్టుబడితే అతనికి సంకెళ్లు వేయకుండా తరలించడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. కరడుగట్టిన నేరగాడు తమ వద్ద ఆయుధం గుంజుకుని, ఎదురుతిరిగే ప్రమాదం వుంటుందని పోలీసులకు తట్టలేదంటే నమ్మశక్యంగా తోచదు. అతన్ని తరలిస్తున్నవారు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు చెందిన పోలీసులు. వారికి ఈ మాత్రం కనీస పరిజ్ఞానం లేదంటే ఎవరూ నమ్మలేరు. అలాగే ఎన్కౌంటర్ జరగడానికి అరగంట ముందు ఆ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారని స్థానికులు చెబుతున్నారు. దుబే అనుచరులెవరైనా కారుపై దాడి చేసి అతన్ని విడిపించుకుపోయే ప్రయత్నం చేస్తారన్న శంక వుండటం వల్ల ఇలా చేశారనుకున్నా... మరి సంకెళ్లు వేయాలన్న ఆలోచన వారికి ఎందుకు రాలేదన్న సంశయం ఏర్పడుతుంది. అతన్ని తీసుకెళ్తున్న వాహనం బోల్తాపడటంలోనూ బోలెడు అనుమానాలున్నాయి. పోనీ అదే జరిగింద నుకున్నా... దాన్నుంచి దుబే వంటి స్థూలకాయుడు సులభంగా బయటకు రావడం, పోలీసులనుంచి పిస్తోలు గుంజుకుని తప్పించుకుపోవడానికి ప్రయత్నించడం సాధ్యమా అన్న సందేహం కలుగు తుంది. అలా పారిపోవాలన్న ఉద్దేశమే అతనికుంటే ఉజ్జయిని ఆలయంలో నిరాయుధంగా వున్న గార్డు తన ఉనికిని పోలీసులకు వెల్లడిస్తున్నప్పుడే ఆ పని చేసేవాడు. ఆ సమయంలో పోలీసులు వచ్చేవరకూ వేచిచూసి దొరికిపోయినవాడు మరికొన్ని గంటలకు అంతమంది సాయుధ పోలీసుల వలయం నుంచి పారిపోదామని ప్రయత్నించాడంటే నమ్మశక్యం కాదు. దుబే కాలుకి స్టీల్ రాడ్ వుండటం వల్ల పారిపోవడం సులభమేమీ కాదు. ఉజ్జయిని నుంచి దుబేను తీసుకెళ్లే వాహనాన్ని అనుసరిస్తున్న మీడియా ప్రతినిధుల వాహనాలను ఆపి, దూరంగా వుండాలని పోలీసులు కోరడం, ఆ తర్వాత అతన్ని వేరే వాహనంలోకి తరలించి తీసుకెళ్లడం... కొద్దిసేపటికే ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. తమ సహచరులను అత్యంత క్రూరంగా మట్టు బెట్టాడన్న ఆగ్రహం పోలీసుల్లో సహజంగానే వుంటుంది. కానీ సొంత చొరవతో, ఎవరి ఆదేశాలూ లేకుండా వారు దుబేను కాల్చిచంపివుంటారని నమ్మడం అసాధ్యం. అమానుషమైన నేరాలకు పాల్పడేవారి విషయంలో సాధారణ జనంలో సహజంగానే ఆగ్ర హావేశాలుంటాయి. దుబే ఉదంతం వెల్లడైనప్పటినుంచి అతన్ని ఎన్కౌంటర్ చేయాలన్నవారే అధికం. కానీ అందువల్ల ఒక నేరగాడు మరణిస్తాడు తప్ప, నేరం సమసిపోదు. దుబే ఎవరి ప్రాపకమూ, ప్రోద్బలమూ లేకుండా తన నేర సామ్రాజ్యాన్ని నడిపాడంటే విశ్వసించలేం. అతని చుట్టూ అల్లుకుని వున్న కీలక వ్యక్తులెవరో, అతన్ని ఇన్ని దశాబ్దాలుగా కాపాడే క్రమంలో అటువంటివారు వ్యవస్థల్ని ఎలా ధ్వంసం చేశారో, అందుకు వారిని పురిగొల్పిన అంశాలేమిటో బట్టబయలైతే రాజకీయ నాయకులుగా, పోలీసు అధికారులుగా చలామణి అవుతున్నవారెందరో జైలుపాలవుతారు. నేర సామ్రాజ్యాలు బద్దలై, ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రక్షాళన అవుతాయి. ప్రజా నీకం భద్రతకు గ్యారెంటీ ఏర్పడుతుంది. ఇప్పుడు దుబేను మట్టుబెట్టడంతో ఆ ప్రక్రియకు గండి పడింది. ఇన్నేళ్లూ దుబేను పెంచిపోషించినవారు మారతారునుకోవడానికి లేదు. వారు ఎప్పటిలాగే తమ చీకటి కార్యకలాపాలను దర్జాగా కొనసాగిస్తారు. అందుకు ఇతర నేరగాళ్లను వినియో గించుకుంటారు. ఇదే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. -
‘వికాస్ దూబే పోతే.. మరో 10 మంది వస్తారు’
లక్నో: ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వికాస్ దూబే చేతిలో హతమైన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా కుటుంబ సభ్యులు దీనిపై స్పందించారు. ‘వికాస్ దూబేను చంపేశారు.. మరి అతడికి సాయం చేసిన వారి సంగతి ఏంటి.. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు’ అని దేవేంద్ర మిశ్రా బందువు ఒకరు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను భావిస్తున్న ఏకైక న్యాయం ఏమిటంటే, ప్రస్తుతం దేవేంద్ర మిశ్రా హంతకుడు సజీవంగా లేడు అనే కారణంతో మా కుటుంబ సభ్యునికి నిర్వహించాల్సిన ఆచారాలను జరపొచ్చు. అయితే మన సమాజంలో ఒక జబ్బు ఉంది. అది ఎప్పటికి అలానే ఉంటుంది. అది ఏంటంటే వికాస్ దూబేకు సాయం చేసిన వారు బాగానే ఉన్నారు. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక వికాస్ దూబే పోతే.. అతడి స్థానంలోకి మరో పది మంది వస్తారు. దీనికి ముగింపు ఎప్పుడు’ అని ఆయన ప్రశ్నించారు.(దూబే హతం: ‘మాకు పండుగ రోజే’) అంతేకాక ‘వికాస్ దూబే కేసును ఇలా ముగించడం కరెక్ట్ కాదు. ఎన్నికల్లో అతడి సాయం తీసుకున్న రాజకీయ నాయకుల మాటేంటి. దూబే లాంటి ఒక నేరస్తుడు పోలీస్ స్టేషన్లోనే ఒకరిని చంపి.. బయటకు వెళ్లగల్గుతున్నాడంటే దానికి కారణం ఎవరు. దీని మూలలా వరకు వెళ్లి పరిశీలించాలి. దూబే బతికి ఉంటే.. కనీసం కొంతమంది వైట్ కాలర్ నేరస్తుల గురించి అయినా తెలిసేది. వికాస్ దూబే కేసుకు ఇది సరైన ముగింపు కాదని నా అభిప్రాయం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అన్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినలో గురువారం పట్టుబడ్డ వికాస్ దూబేను ఈ రోజు కాన్పూర్‌కు తరలిస్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనం రోడ్డు మీద అదుపు తప్పి బోల్తా పడింది. ఇదే అదునుగా భావించిన వికాస్ గుప్తా.. పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు అతడిని ఎన్కౌంటర్ చేశారు. -
ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన దూబే?!
న్యూఢిల్లీ: ‘నేను వికాస్ దూబే.. కాన్పూర్ వాలా’అంటూ గట్టిగా అరిచి మధ్యప్రదేశ్‌లోనూ తన ఉనికిని చాటుకోవాలనుకున్న ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ కథ నేటితో ముగిసింది. అక్రమ సంపాదన, ‘పెద్దల’ అండతో అతడు నిర్మించుకున్న నేర సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎంతో మంది అమాయక ప్రజలు సహా ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలను బలితీసుకున్న అతడు ఎట్టకేలకు శుక్రవారం ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వికాస్ దూబే మృతి పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు సహా పోలీసుల పాలిట శుభవార్తగా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (వికాస్ దూబే మృతి : విచారణకు మాయావతి డిమాండ్) మరోవైపు.. చాలా మంది నేర చరిత్ర గల ‘నాయకుల’ మాదిరిగానే దూబే కూడా తనను తాను రక్షించుకోవడానికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నాడని... అందుకు రంగం కూడా సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో ఈ మేరకు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాన్పూర్ రూరల్ జిల్లా బిక్రూ నివాసి అయిన వికాస్ దూబే 1990లో తన తండ్రితో గొడవ పెట్టుకున్న వాళ్లపై దాడి చేసి తొలిసారి అరెస్టయ్యాడు. అయితే అప్పటికే అనుచర వర్గాన్ని తయారు చేసుకున్న దూబేకు స్థానిక నాయకుల అండ దొరకడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే ఆ కేసు నుంచి బయటపడ్డాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు బిక్రూతో పాటు పరిసర గ్రామాల్లోనూ మార్మోగింది. ఆయనే నా రాజకీయ గురువు ఈ క్రమంలో ఆనాటి చౌబేపూర్ ఎమ్మెల్యే హరికిషన్ శ్రీవాస్తవ(జనతా దళ్)తో పరిచయం పెంచుకున్నాడు. ఆయనను తన రాజకీయ గురువుగా చెప్పుకొనేవాడు. ఆ తర్వాత శ్రీవాస్తవ బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనతో సంబంధాలు కొనసాగిస్తూనే దూబే అన్ని రకాలుగా తన బలాన్ని పెంచుకోసాగాడు. దీంతో రాజకీయ నాయకులకు కూడా దూబే అవసరం బాగా పెరిగింది. ఎన్నికల్లో గెలవాలంటే అతడి సాయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు ప్రతిగా చట్టం నుంచి వారు అతడిని కాపాడేవారు. అందుకే ఎప్పుడు అరెస్టైనా అనతికాలంలోనే బెయిల్‌పై తిరిగి వచ్చేవాడు. మళ్లీ యథేచ్చగా తన కార్యకలాపాలు సాగించేవాడు. అలా ఏకంగా పోలీస్ స్టేషన్లోనే రాష్ట్ర మంత్రిని చంపి నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అతడిపై దాదాపు 150 కేసులు నమోదైనట్లు భోగట్టా.(వికాస్ దూబే ఎన్కౌంటర్: అనేక అనుమానాలు!) తొలుత బీఎస్పీ.. ఆ తర్వాత అలా స్థానికంగా బలం పుంజుకున్న వికాస్ దూబే మాయావతి యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 90వ దశకంలో బహుజన్ సమాజ్ పార్టీ సభ్యుడిగా ఉండేవాడు. బిక్రూతో పాటు పరిసర గ్రామాల్లో పట్టు సాధించిన స్థానిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవాడు. పంచాయతీలో అతడు చెప్పిందే వేదం. ఎన్నికల్లో అతడు నిలబెట్టిన వారిదే గెలుపు. 20 ఏళ్లుగా ఇదే పరంపర అక్కడ కొనసాగుతోంది. ఈ క్రమంలో 2001లో బీజేపీ మంత్రి సంతోష్ శుక్లాను హత్యచేసిన సమయంలో అతడు ఘిమావు జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఉన్నాడు. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత ఘిమావు రిజర్వ్డ్గా మారడంతో తన మనుషులను అక్కడ నిలబెట్టాడు. పార్టీలతో సంబంధం లేకుండా 2015 వరకు వారిని గెలిపించుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలో తన భార్య రిచా దూబేను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెను గెలిపించుకున్నాడు. ఆ తర్వాత దూబే సమాజ్‌వాదీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతుండగా.. ఇటీవల అతడి తల్లి సరళాదేవి కూడా తన కొడుకు ఎస్పీలో ఉన్నట్లు చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమై.. హతమై ఈ నేపథ్యంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ నుంచి టికెట్ ఆశిస్తున్నాడని.. కుదరని పక్షంలో బీజేపీ లేదా మరే ఇతర పార్టీ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధపడ్డాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. పార్టీ ఏదైనా సరే ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందితే తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో తనకు పట్టున్న కాన్పూర్ దేహత్ జిల్లాలోని రానియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఎన్కౌంటర్లు పెరిగిన నేపథ్యంలో అతడు రాజకీయంగా పలుకుబడి మరింతగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిన తరుణంలో.. ఏకంగా ఎనిమిది పోలీసులను అది కూడా డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారులపై కాల్పులకు తెగబడి వారిని హతమార్చడంతో దూబేకు అన్ని మార్గాలు మూసుకుపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. దూబే ఈరోజు ఎన్కౌంటర్లో హతం కాకపోయి ఉంటే భవిష్యత్తులో ఏదో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందేవాడేనేమో! దేశంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న ‘బడా నాయకుల్లో’ ఒకడిగా ఎదిగేవాడేమో!! -
గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్ : మౌనం మాటున ప్రశ్నలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. దూబే ఎన్‌కౌంటర్‌పై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎంపీ చురకలు వేశారు. దూబే ఎన్కౌంటర్ సహా ఏ ఒక్కరినీ నేరుగా ప్రస్తావించకుండా ఈ వ్యవహారంలో యూపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ రాహుల్ ట్వీట్ చేశారు. ‘ఎన్నో సమాధానాలకు మౌనమే సమాధానం..మౌనం వెనుక ఎన్ని ప్రశ్నలను దాచారో తెలియద’ని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎన్కౌంటర్లో వికాస్ దూబేను హతమార్చడంపై విపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేశాయి. దూబే ఎన్‌కౌంటర్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అన్నారు. రాజకీయ నేతలతో గ్యాంగ్‌స్టర్ సంబంధాలు బయటపడతాయనే భయంతోనే ఆయనను ఎన్కౌంటర్ చేశారని పలువురు భావిస్తున్నారని చెప్పారు. గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. వికాస్ దూబేపై హత్య కేసులు సహా మొత్తం 60 క్రిమినల్ కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు.చదవండి : ‘ఎకానమీపై హెచ్చరిస్తే ఎద్దేవా చేశారు’