water Project
-
ఆస్తులు, అంతస్తులు ఏం అడగలేదు..
-
ఉద్దానానికి ఊపిరి
పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు.. దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఇక్కడెన్నో.. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు అడుగడుగునా కనిపిస్తారు. ఇక్కడ మనుషులకు కన్నీరు శాశ్వత నేస్తం. ఈ ఊళ్లకు ఉమ్మడి ఆస్తి కష్టం. ఈ కిడ్నీ వ్యాధి ఊళ్లకు ఊళ్లను తినేసింది. పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతాం, అప్పులు చేసి అనే వైరాగ్య పరిస్థితికి ఇక్కడి బాధితులు వెళ్లిపోయారు. నెలనెలా వేలకు వేలు ఖర్చుపెట్టి వైద్య పరీక్షలు, కిడ్నీ వైద్యం చేయించుకోలేక స్థానికంగా దొరికే మందు బిళ్లలో, ఆకులతోనో సరిపెట్టుకునేవారు. ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ చీకటి బతుకులకు సీఎం వైఎస్ జగన్ చరమగీతం పాడుతున్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు.. మూడు దశాబ్దాల సమస్యకు చెక్ చెబుతూ శాశ్వత పరిష్కారం చూపారు. రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, రూ.85 కోట్లతో 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఈ రెండింటినీ ప్రారంభించే మహోన్నత ఘట్టాన్ని గురువారం సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి/వజ్రపుకొత్తూరు రూరల్/వజ్రపుకొత్తూరు/మందస: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15వేల మంది చనిపోయినట్లు అంచనా. ఒక అంచనా ప్రకారం.. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతున్నాయి. సాధారణంగా రక్తంలో సీరం క్రియాటిన్ 1.2 మిల్లీగ్రామ్/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పనిచేయడంలేదని అర్థం. కానీ, ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటిన్ లెవెల్స్ చాలామందిలో 25 మిల్లీగ్రామ్/డెసీలీటర్ మేరకు ఉంది. క్రియాటినిన్ 5 దాటితే డయాలసిస్ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. వీరంతా విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. వారానికి రెండుసార్లు కూడా వెళ్లేవారున్నారు. ఇలా రోజుకు 500కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రవాణా, వైద్య ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ఎంతోమంది డబ్బుల్లేక, వైద్యం చేసుకోలేక ప్రాణాలను కోల్పోయేవారు. మరోవైపు.. ఈ మహమ్మారిని పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. ఇలాంటి ఆపత్కాలంలో ప్రతిపక్షనేత హోదాలో జగన్ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చే కబురు చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆపన్నహస్తం అందిస్తున్నారు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు నెలనెలా చేతిలో రూ.10వేలు పెడుతున్నారు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానానికి తీసుకొచ్చారు. తగ్గిపోతున్న ఉద్దానం ఆయష్షు రేఖకు ఊపిరిలూదుతున్నారు. అంతేకాదు.. రూ. వందల కోట్లతో మంచినీటి ప్రాజెక్టును.. కిడ్నీ పరిశోధనా ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. గతమంతా పరిశోధనలకే పరిమితం.. నిజానికి.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలో కన్పించాయి. కానీ, 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ కవిటి ప్రాంతంలో కిడ్నీవ్యా««ధి కేసులను గుర్తించారు. 2002 నుంచి వారే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. ♦ 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేజీహెచ్ హెచ్ఓడీ డాక్టర్ రవిరాజ్‌తో కవిటి ప్రాంతంలో పరిశోధన వైద్య శిబిరాలు ప్రారంభించారు. ♦ 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి ఉద్దానంలో పర్యటించారు. అదే ఏడాది నాటి రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ఇక్కడ నీటి నమూనాలను తీసుకెళ్లింది. ♦ 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఈ ప్రాంతంలో పర్యటించి రోగుల ఆహార అలవాట్లు, నీరు, రక్తం తదితర నమూనాలను పరిశోధనకు తీసుకెళ్లారు. ♦ 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ అనే నెఫ్రాలజీ నిపుణుల బృందం ఉద్దానం ఎండోమిక్ నెఫ్రోపతి (యూఈఎన్) పేరిట ఓ అధ్యయనం చేసింది. ♦ 2011లో న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ అనూప్ గంగూలీ, డాక్టర్ నీల్ ఓలిక్‌ల నేతృత్వంలో ఓ బృందం వివిధ గ్రామాల ఆహారపు అలవాట్లు తెలుసుకుని రక్త, మూత్ర నమూనాలు తీసుకెళ్లింది. ♦ 2011లో హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత ఈ ప్రాంతంలో నీటిని తీసుకెళ్లి దాని ద్వారా ఏఏ మార్పులు వస్తున్నాయో పరిశీలించారు. ♦ ఆ తర్వాత 2012లో జపాన్ బృందం, అమెరికన్ల బృందం పర్యటించింది. ♦ 2012 అక్టోబరు 1న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం పరిశీలించింది. 2013లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోతురాజు అనే రీసెర్చ్ స్కాలర్ పరిశోధన చేశారు. ♦ 2017 నుంచి భారతీయ వైద్య పరిశోధనా మండలి డాక్టర్ వివేక్ ఝా నేతృత్వంలో ప్రస్తుతం పరిశోధన సాగుతోంది. ♦ అయితే, ఇప్పటివరకు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇక్కడి కిడ్నీ వ్యాధులకు కచ్చితమైన మూలకారణాన్ని గుర్తించలేకపోయారు. ♦ కొన్ని అధ్యయనాలు ఈ వ్యాధి నీటిలో అధిక సెలీనియం లేదా సీసం కారణంగా ఉండవచ్చని అనుమానించాయి. మరికొందరు దీనికి నేల స్వభావమే కారణమై ఉండొచ్చని నివేదించారు. ఉష్ణోగ్రత, తక్కువ నీటి వినియోగం, అధిక పెయిన్ కిల్లర్స్ వాడకం, జన్యుపరమైన లోపాలు కూడా వ్యాధికి కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కానీ, ఈ అధ్యయనాలు ఏవీ సరైన స్పష్టత ఇవ్వలేకపోయాయి. ♦ మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టీఆర్ఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో 2019లో సంయుక్తంగా సమగ్ర పరిశోధనలు నిర్వహించి వ్యాధిని గుర్తించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. కిడ్నీ బాధితులపై ఆగ్రహంతోఊగిపోయిన బాబు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించి పట్టించుకోలేదు. తిత్లీ తుపాను సమయంలో మొక్కుబడిగా పర్యటించినప్పటికీ వారికెలాంటి భరోసా ఇవ్వలేదు సరికదా.. తుపానుతో సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు వస్తే ఆగ్రహంతో ఊగిపోయారు.‘నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది.. నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కేస్తా.. తొక్కతీస్తా.. తోలు తీస్తా’ అని వ్యాఖ్యానించారు. కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. డ్రామాలకే పవన్ పరిమితం.. ఇక పవన్‌కళ్యాణ్ అయితే 2017లో దీక్ష పేరుతో పెద్ద డ్రామా ఆడారు. టీడీపీతో కలిసి ఐదేళ్లు చెట్టాపట్టాలు వేసుకున్నా దానికొక పరిష్కారం చూపలేదు. ఎవరైనా అడిగితే.. అంతా తానే చేశానని, కిడ్నీ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని హడావుడి చేయడం తప్ప నిజానికి ఆయన చేసిందేమీ లేదు. కిడ్నీ బాధితులకు ఇది పెద్ద ఊరట ఉద్దానంలో కిడ్నీ బాధితులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెద్ద ఊరట కలిగిస్తుంది. వీరికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుచేయడంతోపాటు వంశధార నది నుంచి మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టడం, అది కూడా హామీ ఇ చ్చిన ఐదేళ్లలో పనులు పూర్తిచేయడం చరిత్రాత్మకం. ఆస్పత్రి పరంగా మూలాల శోధనకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశోధనతోనే కిడ్నీ ఇబ్బందులకు పరిష్కారం దొరుకుతుంది. – డాక్టర్ ప్రధాన శివాజీ, రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు, సోంపేట వైఎస్ జగన్ సీఎం అయ్యాక తీసుకున్న చర్యలు వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు. అప్పటివరకు రూ.3,500 ఉన్న పింఛన్‌ను రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తున్నారు. 5కు పైబడి సీరం క్రియాటిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.10వేలు చొప్పున 792 మందికి.. రూ.5 వేలు చొప్పున 451 మందికి పింఛన్లు ఇస్తున్నారు. అవసరమైతే ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦ ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. ♦ సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లో 13 పడకలుండేవి. వాటిని 21కి పెంచారు. ♦ కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లో 10 పడకలు ఉండగా, 19కి పెంచారు. ♦ హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేశారు. రెండు కంటైన్డ్ బేస్డ్ సర్విసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటుచేశారు. ♦ ఇవికాక.. కొత్తగా గోవిందపురం, కంచిలి, అక్కుపల్లి, బెలగాంలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ♦ ఇచ్ఛాపురం సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్సీలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి చ్చింది. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ♦ కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. ♦ కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా మరణాలను నియంత్రించేందుకు నిరంతర స్క్రీనింగ్‌ను ప్రభుత్వం చేపడుతోంది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇప్పటివరకూ ఉద్దానం ప్రాంతంలోని 2.32లక్షల మందిని స్క్రీన్ చేయగా 19,532 మందిలో సీరమ్ క్రియాటిన్ 1.5 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ వైద్య సాయం అందించారు. ♦ టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్‌లోనెఫ్రాలజీ విభాగం ఏర్పాటుచేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ♦ కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం రూ.85 కోట్ల అంచనాలతో పలాసాలో రీసెర్చ్ సెంటర్‌తోపాటు 200 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో రూ.60 కోట్లు ఆస్పత్రి నిర్మాణానికి, రూ.25 కోట్లు అధునాతన వైద్య పరికరాలు, ఇతర వనరుల కల్పనకు కేటాయించారు. రూ.742కోట్లతో భారీ రక్షిత మంచినీటి పథకం ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో నిపుణుల సూచనల మేరకు వంశధార నదీ జలాలను భూ ఉపరితల తాగునీరుగా అందించేందుకు రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ మంజూరు చేశారు. దీనికింద ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 807 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఈ మంచినీటి పథకానికి 2019 సెపె్టంబరు 6న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో ఒక్కొక్కరికి రోజుకు వందలీటర్ల చొప్పున అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లోని 170 గ్రామాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా అదనంగా తాగునీరు అందించే వీలుగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. నిజానికి.. ఉద్దానం సమీపంలో ఉన్న బాహుదా, మహేంద్రతనయ నదుల నుంచి తక్కువ ఖర్చుతోనే రక్షితనీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతే ఇక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదన్న భావనతో జగన్ సర్కార్ ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కనపెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా ఈ ప్రాంతానికి 104 కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు పూనుకుంది. ఈ ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. హిరమండలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం స్థాయిలోను 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి మూడు భారీ మోటార్ల ద్వారా 32 కిలోమీటర్ల దూరంలోని మెలియాపుట్టి మండల కేంద్రం వద్దకు చేరుతుంది. అక్కడ నీటిని శుద్ధిచేసి ఉద్దానానికి సరఫరా చేస్తారు. ఇదీ కిడ్నీ పరిశోధనా కేంద్రం స్వరూపం.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ♦ ఇందులో.. మొదటి అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఓపీ విభాగం, రీనల్ ల్యాబ్, పాలనా విభాగం, మీటింగ్ హాల్, మెడిసిన్ స్టోర్సు ఉన్నాయి. ♦ రెండో అంతస్తులో నెఫ్రాలజీ విభాగం, పేమెంట్ రూములు, కీలకమైన డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ♦ మూడో అంతస్తులో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, సీఎస్ఎస్ డి, అదనపు వసతులతో ఉన్న పే రూములు, ప్రీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసోలేషన్ గది, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి ♦ నాలుగో అంతస్తులో యూరాలజీ వార్డు, పే రూములు, రీసెర్చ్ లేబొరేటరీలు ఏర్పాటుచేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు.. ఈ కేంద్రంలో అందించే వైద్యసేవల్ని పరిశీలిస్తే యూరాలజీ, రేడియాలజీ, ఎనస్తీషియా, నెఫ్రాలజీ, వ్యాస్కులర్ సర్జన్, పల్మనాలజీ, కార్డియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ లాంటి సూపర్ స్పెషాలిటీస్ సేవలు.. జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ సేవలు అందిస్తారు. ఈ ఆస్పత్రిలో 41 మంది సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు కలిపి 154 పోస్టులను కొత్తగా మంజూరు చేసి భర్తీ చేపట్టారు. మరోవైపు.. ఇందులో ప్రపంచస్థాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంచేసింది. గత 20 రోజులుగా వీటితో ఇప్పటికే రోగులకు చికిత్స చేస్తున్నారు. ఎక్స్‌రే (300ఎంఎ), సిటీస్కాన్, అల్ట్రా సౌండ్ మెషిన్, ఆటోమెటిక్ టిష్యూ ప్రాసెసర్, క్రయోస్టాట్, ఆటోమేటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సి–ఆర్మ్ మిషన్, ఈఎస్డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్ ఓటి టేబుల్స్, –80 నుంచి –40 సెంటీగ్రేడ్ల డీప్ ఫ్రీజర్లు, వెంటిలేటర్లు ఇప్పటికే సిద్ధంచేశారు. జీవితంపై ఆశ కలిగింది.. కూలీ పనిచేసే నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారినపడ్డాను. అప్పట్లో సరైన వైద్యం అందక డయాలసిస్ కోసం మరొకరి సాయంతో విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. బోలెడంత డబ్బు ఖర్చేయ్యేది. ఇక్కడ సరైన వైద్య సదుపాయాల్లేక మా కళ్ల ముందే మా స్నేహితులు, బంధువులు ఎందరో మృత్యువాత పడ్డారు. ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన దయవల్ల ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ అందుకుంటున్నాను. విశాఖకు వెళ్లే పని తప్పింది. పలాసలోనే డయాలసిస్, మందులు అందుతున్నాయి. పెద్ద ఆసుపత్రిని కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు జీవితంపై ఆశ కలుగుతోంది. సీఎంకు ఉద్దానం వాసులంతా రుణపడి ఉంటారు. – గేదెల కోదండరావు, చినడోకులపాడు గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వం మాలాంటి వారికి ప్రాణం పోస్తోంది చికిత్స కోసం నాకు లక్షల రూపాయలు ఖర్చేయ్యేవి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. 108 అంబులెన్స్‌లో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి, డయాలసిస్ అయ్యాక మళ్లీ ఇంటి వద్ద దిగబెడుతున్నారు. రూ.10వేలు పింఛను కూడా అందుతోంది. పౌష్టికాహారం, పండ్లు, మందులు కొనడానికి ప్రభుత్వం సహకరిస్తోంది. నాలాంటి ఎంతోమందికి జగన్ ప్రభుత్వం ప్రాణం పోస్తోంది. – నర్తు సీతారాం, లోహరిబంద, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ఇంటింటికీ కుళాయి ఇచ్చారు..జగనన్న చల్లగా ఉండాలి మా ప్రాంత వాసుల కష్టాల తీర్చేందుకు.. కిడ్నీ మహమ్మారి బారినపడిన ఉద్దానం వాసుల్ని రక్షించేందుకు జగనన్న మంజూరు చేసిన వైఎస్సార్ సుజలధార ప్రారంభానికి సిద్ధమయ్యిందనే విషయం తెలియగానే చాలా ఆనందం అనిపించింది. రోజూ కిడ్నీ వ్యాధులకు భయపడి 20 లీటర్ల క్యాన్లను కొనుగోలు చేస్తున్నాం. జగనన్న దయవల్ల ఇంటింటికీ కుళాయిలను ఇప్పటికే అమర్చారు. మా ప్రాంత వాసుల కష్టాలు తీరుస్తున్న జగనన్న చల్లగా ఉండాలి. – కర్ని సుహాసిని, గృహిణి, అమలపాడు, వజ్రపుకొత్తూరు మండలం -
ఎర్రకాలువ జలాశయానికి మహర్దశ
జంగారెడ్డిగూడెం: సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటూ వారికి పెద్ద పీట వేస్తోంది. రైతుకు కావాల్సిన అన్ని రకాల సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడమే కాకుండా పాత ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టింది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆధునికీకరణ పనులు అటుంచి కనీసం అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఎర్రకాలువ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 4.28 టీఎంసీలుగా నిర్ధేశించారు. ప్రాజెక్టు ఆక్రమణలకు గురికావడంతో 3.5 టీఎంసీలకు మించి నిల్వ చేయలేకపోతున్నారు. ఆధునికీకరణ పనుల మరమ్మతులకు తాజాగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ. 75.80 కోట్లతో ప్రతిపాదనలు కేకేఎం ఎర్రకాలువ ప్రాజెక్టు ఆధునికీకరణ, మరమ్మతులకు జలవనరుల శాఖాధికారులు రూ.75.80 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వీటిలో 2018లో తుఫాన్ వల్ల కొట్టుకుపోయిన ప్రధాన కాలువ రిటైనింగ్ వాల్, జనరేటర్లు, ఎర్త్‌డ్యామ్ పటిష్టం, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎర్త్ డ్యామ్ రోడ్ ఏర్పాటు, భవనాల ఆధునికీకరణకు ప్రతిపాదించారు. ప్రతిపాదనలు ♦ ఎర్త్‌డ్యామ్, స్పిల్‌వే బలోపేతం చేయడానికి రూ.60 కోట్లతో ప్రతిపాదించారు. ♦ ప్రాజెక్టు గేట్లు, సాంకేతిక పరికరాలు, మరమ్మతు పనులు, పునరుద్ధరణకు రూ. 43.20 లక్షలు ♦ 2018లో వరద తాకిడికి కొట్టుకుపోయిన ప్రధాన కాలువ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 4.50 కోట్లు ♦ ప్రాజెక్టు ఎర్త్డ్యామ్కు లోపలి భాగంలో కాంక్రీట్ వేసేందుకు రూ. 4.21 కోట్లు ♦ ఎర్త్ డ్యామ్ మరమ్మతులకు రూ.1.39 కోట్లు ♦ప్రాజెక్టుకు వరదల సమయంలో వరద ఉధృతిని ఎప్పటికప్పుడు తెలిపేందుకు రిమోట్ వాటర్ లెవల్ సెన్సార్లు అమర్చేందుకు రూ.50 లక్షలతో ప్రతిపాదించారు. ♦ డ్యామ్ చుట్టూ జంగిల్ క్లియరెన్స్, గ్రావెల్ ఫిల్లింగ్ తదితర పనులకు రూ. 27లక్షలు, డ్యామ్‌కు యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సీసీ రోడ్డు నిరి్మంచేందుకు రూ.3 కోట్లు ♦ ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఉన్న భవనాల మరమ్మతులు, ఆధునీకరణకు రూ.5 లక్షలతో ప్రతిపాదనలు ♦ప్రాజెక్టు వద్ద కంట్రోల్‌రూమ్ నిర్మాణానికి రూ.20 లక్షలు, ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.30 లక్షలు డ్యామ్ పరిసర ప్రాంతంలో విద్యుదీకరణకు రూ.5 లక్షలు ♦ప్రస్తుతం ఉన్న జనరేటర్‌కు అదనంగా స్టాండ్‌బైగా మరో 70 కేవీఏ జనరేటర్ ఏర్పాటుకు రూ.20 లక్షలు కేటాయించారు. అలాగే ఎర్రకాలువ ప్రాజెక్టు ఫోర్‌షోర్ ఏరియా ఆక్రమణలకు గురికావడంతో రీసర్వే చేసి ఆక్రమణలు తొలగించేందుకు రూ. 20 లక్షలతో అంచనా వేశారు. -
కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే!
పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు ఏ నాయకుడి కంటా పడలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు, మనుషులు లేక వారి జ్ఞాపకాలుగా మిగిలిన ఇళ్లు.. ఏవీ ప్రజా ప్రతినిధుల కరకు గుండెలను కరిగించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. అలాంటి ఆపత్కాలంలో వచ్చాడొక నాయకుడు. వైద్యం కోసం విశాఖ వెళ్లే రోగుల చెంతకు డయాలసిస్ యూనిట్లు రప్పించాడు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు చేతిలో నెలకు రూ.10 వేలు పెడుతున్నాడు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానంకు తీసుకువస్తున్నాడు. అతడే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రి, ఉద్దానం ప్రాజెక్టు ఆయన చిత్తశుద్ధికి సజీవ సాక్ష్యాలు. సాక్షి, శ్రీకాకుళం: ఉద్దానం ఊపిరి పీల్చుకుంటోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండడంతో మృత్యుకౌగిట నుంచి విడుదలవుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మిస్తోంది. మరోవైపు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యంతో పాటు డయాలసిస్, ఉచిత మందులను పూర్తిస్థాయిలో అందిస్తోంది. ఇంకోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరై ఉండొచ్చన్న నిపుణుల సూచనల మేరకు రూ.700 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది. ఇవి త్వరలోనే పూర్తి కానున్నాయి. పాదయాత్రలో చూసి.. పాదయాత్రలో కిడ్నీ వ్యాధి బాధితుల బాధలను వైఎస్ జగన్ దగ్గరుండి చూశారు. ప్రతిపక్ష నేత హోదాలో కవిటి మండలం జగతిలో కిడ్నీ బాధితుల భరోసా యాత్ర పేరిట పర్యటించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి.. తన కార్యాచరణను అప్పుడే స్పష్టంగా ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ఉపరితల తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. బాబుదంతా బడాయే.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన భాగస్వామి పవన్ కల్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదు. తిత్లీ సమయంలో గోడు చెప్పుకుందామని వెళ్లిన వారిపై చంద్రబాబు మండిపడ్డారు కూడా. 2019 ఎన్నికల ప్రచారానికి సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు ఒక్క కిడ్నీ వ్యాధి బాధితుడికి కూడా భరోసా ఇవ్వలేకపోయారు. మరోవైపు పవన్ కల్యాణ్ పెద్ద ఎత్తున ఉద్దానం సమస్య పరిష్కరించేశానని ప్రచారం చేసుకున్నారు తప్ప.. చేసిన పని ఒక్కటీ లేదు. తన మిత్రపక్షం అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు. కిడ్నీ రీసెర్చ్‌సెంటర్ పరిశీలనలో మ్యాప్ చూస్తున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు బతుకుతా అనుకోలేదు.. అంతా జగనన్న దయే! నా పేరు సుగ్గు లక్ష్మీ. ఇచ్ఛాపురం మండలం మారుమూల ప్రాంతం సన్యాసిపుట్టుగ గ్రామం మాది. నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ లక్షల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రికే ధారబోశాను. అప్పట్లో కనీసం ఒక్క డాక్టర్ గానీ, మందులు ఇచ్చేవారు గానీ మా గ్రామానికి వచ్చేవారు కాదు. రెండున్నరేళ్ల నుంచి రూ.10వేలు పింఛన్ వస్తోంది. అంతే కాదు నన్ను డయాలసిస్ కేంద్రానికి తీసుకువెళ్లడానికి 108 బండి వస్తోంది. కలలో కూడా అనుకోలేదు నేను ఇప్పటి వరకు బతుకుతానని, అంతా జగనన్న దయే! వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. ►కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పింఛన్‌ను రూ.3500 నుంచి రూ.10వేలకు పెంచారు. 5పైబడి సీరం క్రియేటినిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు. ►ఉపరితల తాగునీరు అందించేందుకు రూ.700 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో గల 827 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ►వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రీసెర్చ్ సెంటర్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా మంజూరు చేశారు. మార్చిలో వీటిని ప్రారంభించనున్నారు. ►టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషీన్లతో 68పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. సోంపేట, కవిటిలో పడకలు పెంచారు. హరిపురంలో పది పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ►ఇవి కాకుండా ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో 10పడకలు, బారువ సీహెచ్‌సీలో 10పడకలతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కొత్తగా ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్ బేస్డ్ సరీ్వసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అవి జిల్లాకొచ్చాయి. కవిటి, సోంపేట సీహెచ్‌సీల్లో వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో యూనిట్లో ఏడేసి పడకలు ఉంటాయి. ►టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు. ►కిడ్నీ రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. పాతవి పాడైతే ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ►టీడీపీ హయాంలో జిల్లాలో నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి అక్కడి రోగులకు వైద్యం అందిస్తున్నారు. రూ. 10వేలు పింఛన్ అందుకుంటున్నాం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10వేలు పింఛన్ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో డయాలసిస్ చేసుకోవడానికి స్థానికంగా సరిపోయిన బెడ్స్ లేక ఇబ్బంది పడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కాం. డయాలసిస్ కూడా సకాలంలో చేసుకుంటున్నాం. – మర్రిపాటి తులసీదాస్, డయాలసిస్ రోగి, పెద్దశ్రీరాంపురం, కంచిలి మండలం ఆదుకున్న జగనన్న ప్రభుత్వం పూర్తిగా చితికిపోయిన కిడ్నీ బాధితుల్ని జగనన్న ప్రభు త్వం వచ్చాక ఆదుకుంది. ఉద్దానం పర్యటన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా మా సమస్యల మీద దృష్టిపెట్టారు. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. – లండ శంకరరావు, కిడ్నీ డయాలసిస్ రోగి, పెద్దశ్రీరాంపురం గ్రామం, కంచిలి మండలం ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు.. డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ రోగులకు అవసరమైన అన్ని మందులను, ఇంజెక్షన్లను ఉచితంగానే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నం లాంటి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండానే డయాలసిస్ చేయించుకుంటున్నాం. – అందాల రత్నాలు, డయాలసిస్ రోగి, లోహరిబంద గ్రామం, -
గాజులదిన్నెకు జీవం పోస్తున్న సీఎం జగన్
-
కరువు నేలపై పచ్చని సంతకం..
కృష్ణమ్మ పరవళ్లు చూసి కరువు సీమ పులకించిపోయింది. తెలుగుగంగ వేగాన్ని చూసి బీడువారిన భూమితల్లికి జీవమొచ్చింది. కేసీ జలకళతో ఆయకట్టు పచ్చదనం సింగారించుకుంది. ఎగువ నుంచి వస్తున్న నీళ్లు.. దిగువ సగిలేటిలో జల సవ్వడులు.. వెరసి నలుదిక్కులా నీళ్లే కనిపిస్తున్నాయి. వరిమళ్లు.. కేపీ ఉల్లి పంటలతో పొలమంతా నిండిపోయింది. రైతు మనసంతా ఆనందంతో ఉప్పొంగిపోతోంది. కరువు రాతను మార్చేందుకు వైఎస్సార్ చేసిన ‘జలయజ్ఞం’ .. వైఎస్ జగన్ పాలనలో పుడమి తల్లి నుదుటన పచ్చని సంతకమై నిలిచింది. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో కరువును పారదోలే లక్ష్యంతో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం నేడు రైతుల పాలిట వరంగా మారింది. మహానేత స్ఫూర్తితో.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్ జిల్లా లోని ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేయడంతోపాటు కొత్త సాగునీటి వనరులను నెలకొల్పి కావాల్సినంత నీటిని అందించారు. జిల్లాను సస్యశ్యామలం చేశారు. వైఎస్ జగన్ పాలన మొదలైన మూడవ ఏడు వరుసగా ప్రాజెక్టులను కృష్ణా జలాలతో నింపడంతో కేసీ కెనాల్, తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్ పరిధిలో లక్షలాది ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. భూగర్భ జలాలు పెరిగి ఒట్టిపోయిన బోరు బావులకు నీళ్లు రావడంతో మెట్ట ప్రాంతాల్లో సైతం పసుపు, ఉల్లి, మిరప, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, శనగ తదితర పంటలు సాగవుతున్నాయి. గండికోటలో రికార్డు స్థాయిలో నీరు: వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువుదీరాక గండికోట ప్రాజెక్టులో గతేడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 26.85 టీఎంసీల సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టారు. వరుసగా రెండవ ఏడు గండికోటలో ఇంతే స్థాయిలో నీటిని నిల్వ పెడుతున్నారు. అవుకు నుంచి గండికోటకు ఇటీవలే నీటిని విడుదల చేశారు. బుధవారం నాటికి అవుకు నుంచి∙7000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా గురువారం నాటికి దీనిని 9000 క్యూసెక్కులకు పెంచనున్నారు. జీఎన్ఎస్ఎస్ పరిధిలోని ఆరు ప్రాజెక్టుల పరిధిలో పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 54.297 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 42.846 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో కొనసాగితే వారం రోజుల్లోపే అన్ని ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది. ఇదే జరిగితే 2.76 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. తెలుగుగంగ పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు: తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో 1.58 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ ఏడాది సుమారు లక్షా 19 వేల ఎకరాల్లో ఆయకట్టుకు నీళ్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆగస్టు 8న తెలుగుగంగకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఇప్పటికే బ్రహ్మంసాగర్ నుంచి బద్వేలు నియోజకవర్గంలోని ఎడమ, కుడికాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గ పరిధిలోని 173 చెరువులను అధికారులు నీటితో నింపారు. దిగువ సగిలేరు ప్రాజెక్టుకు తెలుగుగంగ నీటిని తరలించి బి.కోడూరు, బద్వేలు మండలాల్లో 27 చెరువులను నీటితో నింపారు. తద్వారా 13 వేల ఎకరాల ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. మరోవైపు బద్వేలు, పోరుమామిళ్ల పెద్ద చెరువులతోపాటు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలు చేరడంతో రైతులు వరితోపాటు ఉల్లి, పత్తి, మిరప పంటలను సాగు చేస్తున్నారు. కేసీ కెనాల్ పరిధిలో ఇప్పటికే 30 శాతం వరినాట్లు కేసీ కెనాల్ పరిధిలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆగస్టు 1న శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ప్రస్తుతం కేసీ ఆయకట్టుకు రాజోలి వద్ద 700 క్యూసెక్కులు, ఆదినిమ్మాయపల్లె వద్ద 150 క్యూసెక్కులు, చాపాడు ఛానల్‌కు 150 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 30 శాతం ఆయకట్టులో వరినాట్లు వేశారు. -
ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడం, పూర్తి ఆయకట్టుకు నీరివ్వకపోవడం పై గుర్రుగా ఉన్న కేంద్రం ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తెలంగాణకు సంబంధించి 8 ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, పనుల పురోగతిపై ఈ నెల 31న సమీక్ష నిర్వహించనుంది. 8 ప్రాజెక్టులు.. 8 నెలలు... రాష్ట్రంలో ఏఐబీపీ కింద కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులు 11 ఉండగా అందులో గొల్లవాగు, రాలివాగు, మత్తడి వాగు పనులు పూర్తయ్యాయి. సుద్దవాగు, పాలెంవాగు, జగన్నా«థ్పూర్, భీమా, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల, ఎస్సారెస్పీ–2, కొమురం భీం ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టులకు రూ.19,500 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.2వేల కోట్లు మేర నిధుల అవసరాలున్నాయి. ఇందులో కేంద్రం సాయం రూ.4,500 కోట్లకుగాను ఇంకా రూ.175 కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎస్సారెస్పీ స్టేజ్–2కి రూ.9 కోట్లు, దేవాదులకి రూ.145 కోట్లు, జగన్నాథ్‌పూర్‌కు రూ.6.50 కోట్లు, భీమాకు రూ.29 కోట్ల మేర నిధులు ఇవ్వాలి. ఈ నిధులను గత ఆర్థిక ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉన్నా కేంద్రం నయాపైసా ఇవ్వలేదు. ఈ ఏడాది ఆ నిధుల విడుదలకు సానుకూలంగా ఉంది. ఏఐబీపీ కింద ఉన్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం వెనకాముందూ చేస్తోంది. దీనికి తోడు దేవాదుల పరిధిలోనే 2,400 ఎకరాలు, వరద కాల్వ కింద మరో 6వేల ఎకరాలు, ఎస్సారెస్పీ–2 కింద 700 ఎకరాలు మేర భూసేకరణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ సేకరణను వేగవంతం చేసి పనులు ముగించి ఈ వానాకాలానికే 11 ప్రాజెక్టుల కింద నిర్ణయించిన 6.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేంద్రం ఆదేశించినా అది జరగలేదు. 4 లక్షల ఎకరాల్లో మాత్రమే నీరందించగలిగారు. అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని కేంద్రం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి అనుగుణంగా నిధుల విడుదల చేసే అవకాశాలున్నాయి. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి ఈ నెల 31న రాష్ట్ర అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు. పనుల పూర్తికి రాష్ట్రం తీసుకున్న చర్యలు, నిధుల వ్యయం, అవరోధాలు తదితరాలపై సమగ్ర నివేదికలతో సిద్ధం కావాలని జల శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ ఏకే ఘా రాష్ట్రానికి లేఖ రాశారు. -
వెలిగల్లు ప్రాజెక్టులో గల్లంతై నలుగురు మృతి
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలోని గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టులో గల్లంతై నలుగురు విద్యార్థులు మృతి చెందారు. శనివారం చిత్తూరు జిల్లా వాయల్పాడు, బెంగళూరు ప్రాంతాల నుంచి విద్యార్థి బృందాలు పర్యటనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ప్రాజెక్టులో ఈత కొడుతుండగా వారిలో నలుగురు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురి కోసం స్ధానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను వెలికి తీశారు. -
మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంటే, అవమానిస్తారా
సాక్షి, హైదరాబాద్: సహజ న్యాయసూత్రాల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణకే నదీ జలాల్లో ఎక్కువ వాటా దక్కాల్సి ఉందని.. కానీ అన్యాయం జరిగిందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై న్యాయ పోరాటం చేస్తామని.. అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు. కేంద్రం కూడా ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకుని న్యాయం చేయాలన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ‘‘ఆంధ్రా ప్రాంత నాయకులు మమ్మల్ని అవమానపరుస్తూ, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నా కూడా కడుపులో పెట్టుకుని నిశ్శబ్దంగా ఉంటున్నాం. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు సెటిలర్స్ కాదు. ఈ గడ్డ మీద ఉన్న వాళ్లందరూ మా వాళ్లే. అభివృద్ధిలో పోటీపడుతూ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నది మా అభిమతం. ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నది ఏపీ నేతలే’ అని ఆరోపించారు. కొత్త కేటాయింపులు జరిగాకే ప్రాజెక్టులు కడతామని చెప్పిన ఏపీ.. ఇప్పుడు మాట మార్చడం పై తమకు అభ్యం తరాలు ఉన్నాయన్నారు. ట్రిబ్యునల్ తీర్పులకు అనుగుణంగా ప్రాజెక్టుల పనులు చేపట్టాలని పేర్కొన్నారు. అక్రమ ప్రాజెక్టుల నుంచి దృష్టి మరల్చేందుకే.. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నుంచి దృష్టి మరల్చేందుకే కేంద్ర బలగాల మోహరింపు, కేంద్రం చేతికి అధికారాలు వంటి అంశాలను తెర మీదకు తెస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కొత్తగా నీటి కేటాయింపులు జరగకున్నా ఏపీ ప్రాజెక్టులు కడుతోందని పేర్కొన్నారు. ఏపీ అనుమతులు తీసుకుని నిర్మించే ప్రాజెక్టులకు అవసరమైతే నిధులతోపాటు తమ ఇంజినీర్ల ద్వారా సాంకేతిక సాయం అందిస్తామన్నారు. ఏపీ ప్రాజెక్టుల విషయంగా తెలంగాణలోని ఇతర పార్టీల చేసే వ్యాఖ్యలపై స్పందించబోమని చెప్పారు. చదవండి: ఏపీకి ఏకపక్ష ధోరణి సరి కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి -
సముద్రం నీరూ తాగొచ్చు!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని నగరంలో రోజురోజుకు జటిలమవుతున్న తాగునీటి సమస్య, ఏప్రిల్, మేలో అమలు చేస్తున్న నీటికోతను నివారించేందుకు సముద్రపు ఉప్పు నీటిని తాగేందుకు వీలుగా తియ్యగా మార్చే ప్రక్రియ ప్రాజెక్టు నెలకొల్పాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన సలహాదారుల కమిటీని నియమించే ప్రతిపాదనకు సోమవారం స్థాయి సమితిలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. నగరానికి సమీపంలో ఉన్న మనోరీ ప్రాంతంలో కీలకమైన ఈ ప్రాజెక్టు నెలకొల్పనున్నారు. అందుకు అవసరమైన 12 హెక్టార్ల స్థలం ఎంటీడీసీ బీఎంసీకి అందజేయనుంది. సుమారు రూ.1,600 కోట్లతో నిర్మాణం అయ్యే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ప్రతీరోజు 200–400 మిలియన్ లీటర్ల సముద్రపు ఉప్పు నీటిని మంచినీరుగా మార్చి తాగేందుకు వీలుగా మారనుంది.కాగా సంబంధిత ప్రాజెక్టు ప్రతిపాదనను రూపొందించడానికి మెసర్స్ ఐడీఇ వాటర్ టెక్నాలాజీ అనే ఇజ్రాయిల్ కంపెనీకి చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఈ కంపెనీ గత 50 ఏళ్లుగా ప్రపంచ స్ధాయిలో ఇదే రంగంలో ఉందని బీఎంసీకి చెందిన ఓ అధికారి తెలిపారు. జనావాసాలు పెరగడంతో.. మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ త్రీవ్రత ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో ముంబైకి వచ్చే వలసలు మళ్లీ పెరిగిపోయాయి. గతంలో మాదిరిగా జనాభా పెరిగిపోసాగింది. ఫలితంగా నీటి వినియోగం కూడా పెరిగిపోనుంది. ఇప్పటికే ఉప నగరాలలో, శివార్లలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలవల్ల ముంబై విస్తీర్ణం రోజురోజుకు పెరగసాగింది. ముంబైలో కూడా అనేక బహుళ అంతస్తుల టవర్లు, భవనాలు నిర్మిస్తున్నారు. ఒకప్పుడు 50 ఇళ్లు ఉన్న చోట టవర్లు, ఎతైన భవనాలవల్ల వందల ఇళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఏప్రిల్, మే, జూన్‌లో 10–15 శాతం నీటి కోత విధిస్తున్నారు. మరో ఐదు శాతం అప్రకటిత నీటి కోత అమలులో ఉంటుంది. అందరి దాహార్తి తీర్చడం బీఎంసీకి కష్టతరంగా మారింది. భవిష్యత్తులో పెరిగే వలసల కారణంగా నీటి డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది. దీంతో బీఎంసీ మనోరీ ప్రాంతంలో ఉప్పు నీటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రాజెక్టు నెలకొల్పాలని సంకల్పించింది. రోజుకు 200 మిలియన్ లీటర్ల నీరు శుద్ధి చేస్తుంది. ఆ తరువాత 400 మిలియన్ లీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంటుంది. ఉప్పు నీటిని తాగేందుకు వీలుగా తియ్యగా మార్చే ప్రాజెక్టు నెలకొల్పేందుకు సుమారు రూ.1,600 కోట్లు ఖర్చవుతుండవచ్చని అంచనా వేశారు. అలాగే 20 ఏళ్లలో నీటి సరఫరాకు, నిర్వహణ, పరిశీలన పనులకు సుమారు రూ.1,920 కోట్లు ఇలా మొత్తం రూ.3,520 కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. -
అనూహ్యం తుంగభద్రలో 4.94 టీఎంసీల పెరుగుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలుగా తేలింది. 2008లో ఇది 100.85 టీఎంసీలు కాగా.. గడచిన పుష్కర కాలంలో వరద ప్రవాహం వల్ల డ్యామ్‌లో పూడిక తొలగడంతో నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగింది. తుంగభద్ర బోర్డు ఇటీవల డ్యామ్‌లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు చేయించిన టోపోగ్రాఫిక్ (స్థలాకృతి), బ్యాథిమెట్రిక్ (నీటి లోతు) సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ దృష్ట్యా వచ్చే బోర్డు సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని ఖరారు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో తాజా నీటి నిల్వ సామర్థ్యం మేరకు.. మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేయాలని తుంగభద్ర బోర్డును ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోరింది. తొలినాళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలు 1944లో బ్రిటిష్ సర్కార్ పాలనలో మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కర్ణాటకలో హోస్పేట్ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో డ్యామ్ నిర్మాణం చేపట్టారు. 1953 నాటికి నిర్మాణం పూర్తికాగా.. అప్పట్లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ పూర్తి సామర్థ్యం132.47 టీఎంసీలని తేలింది. డ్యామ్ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), తెలంగాణకు 6.51 చొప్పున మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేస్తూ వస్తోంది. ఏటా 0.57 టీఎంసీల తగ్గుదల ఏటా ప్రవాహంతో కలిసి డ్యామ్‌లోకి మట్టి చేరుతూ వస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు డ్యామ్‌లో నీటి నిల్వ ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు తొలిసారిగా 1963లో తుంగభద్ర బోర్డు సర్వే చేయించింది. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని అప్పట్లో బోర్డు తేల్చింది. పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం, అతివృష్టి, అనావృష్టి సమయాల్లో నదిలో వరద రోజులు తగ్గడంతో డ్యామ్ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని గుర్తించిన బోర్డు నీరు లభించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2008లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. అంటే 1953 నుంచి 2008 వరకూ 55 ఏళ్లలో 21.62 టీఎంసీల మేర తగ్గింది. 1953 నుంచి 2008 వరకూ వివిధ సందర్భాల్లో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఏటా 0.57 టీఎంసీల మేర తగ్గుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలావుంటే.. 2008 తర్వాత వివిధ సందర్భాల్లో డ్యామ్‌కు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరగా.. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేశారు. ఆ వరద ప్రవాహంలో డ్యామ్‌లోని పూడిక కొంతమేర తొలగిపోయినట్టు తాజా సర్వేల్లో వెల్లడైంది. దాంతో నీటి నిల్వ సామర్థ్యం 2008లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజాగా 4.94 టీఎంసీల మేర పెరిగినట్టు తేలింది. వచ్చే సమావేశంలో మూడు రాష్ట్రాల అధికారులతో తుంగభద్ర బోర్డు చర్చించి నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించనుంది. -
ఉద్దానంలో ఉషోదయం.. చకాచకా పనులు
సాక్షి, శ్రీకాకుళం: అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోతున్న బతుకులు వారివి. అనారోగ్యం కుదుట పడేందుకు ఏదైనా పనిచేయకపోతే మందులు కూడా కొనుగోలు చేసుకోలేని దుస్థితి. పనికి వెళ్లేందుకు శరీరం సహకరించని పరిస్థితి. వ్యాధి తెలుసుకునేలోపే మంచం పట్టడం.. వైద్యం చేసుకునేలోపే తనువు చాలించడం ఇక్కడ పరిపాటి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ మహమ్మారితో నిత్యం చావులు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 15వేల మంది కిడ్నీ బారిన మృతి చెందిననట్టుగా నివేదికలు చెబుతున్నాయి. అనేక ప్రభుత్వాలు మారినా ఇక్కడి పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ముందుకొచ్చారు. ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ రోగులకు పింఛన్లను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచారు. పలాసలో 200పడకలతో కిడ్నీ రోగులకు సూపర్ స్పెషాలటీ ఆస్పత్రితో పాటు రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ. 530.81కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇప్పుడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద నీలావతి వద్ద చేపడుతున్న 10లక్షల లీటర్ల సామర్థ్యం గల సంప్ పనులు అనేక పరిశోధనలు.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 90వ దశకంలో కన్పించాయి. 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాటీ కవిటి ప్రాంతంలో కిడ్నీవ్యాధి కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో నాటి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే నరేష్కుమార్అగర్వాలా(లల్లూ) చొరవ తీసుకుని కేజీహెచ్ హెచ్ఓడీ డాక్టర్ రవిరాజ్ చేత 2005లో కవిటీ ప్రాంతంలో పరిశోధన వైద్యశిబిరాలు ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది దేశ విదేశాలకు చెందిన బృందాలు పరిశోధనలు కొనసాగించాయి. దాదాపు 20ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు, పరిశీలనలు చాలా వరకు మంచినీరే సమస్య కావొచ్చని సూచన ప్రాయంగా చెబుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 112 గ్రామాలు కిడ్నీ వ్యాధుల బారిన పడి బాధపడుతున్నాయి. ఉద్దాన జలమాలకు శ్రీకారం ఉద్దానం బాధితులను గత పాలకులు గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దానంపైనే దృష్టి పెట్టారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు నీరే ప్రధాన కారణమై ఉండొచ్చని భావిస్తూ ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలకు ఇంటింటికీ మంచినీటిని కుళాయిల ద్వారా నిరంతరం అందించేలా రూ.700 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. అన్నీ బేరీజు వేసుకుని చివరికీ రూ. 530.81కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చకాచకా ఉద్దానం పనులు ఉద్ధానం మెగా మంచినీటి ప్రాజెక్టు పనులు టెండర్ల ద్వారా మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ దక్కింది. రెండేళ్లలో పూర్తి చేసేలా పనులు కూడా ప్రారంభించింది. హిరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటిని పైపులైన్ల ద్వారా తీసుకెళ్లి 2051 అంచనాల ప్రకారం 7లక్షల 82 వేల 707మందికి చెరో 100లీటర్ల చొప్పున 22 గంటల పాటు రక్షిత మంచినీరు సరఫరా చేసేలా పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని 807 గ్రామాలకు నీటి సరఫరా చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా పనులు ఉద్దానం మంచినీటి పథకం పనులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నిర్ణీత గడువులోగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మెగా సంస్థ పనులు త్వరితగతిన చేపడుతోంది. అధికారుల పర్యవేక్షణలో పనులు చకచకా జరగనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఉద్దానం తాగునీటి సమస్య తీరనుంది. కిడ్నీ వ్యాధి నియంత్రించడానికి దోహదపడే అవకాశం ఉంది. – జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం -
‘గండికోట’ ఫుల్
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతోపాటు దూరదృష్టితో వ్యవహరిస్తుండటంతో సామాజిక ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయి. నిర్వాసితులకు పునరావాసం పనులను వేగంగా పూర్తి చేసి వరద నీటిని ఒడిసిపట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరుగుతోంది. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టులను గరిష్ట స్థాయిలో నింపడం ద్వారా ఆ ఫలాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం మొత్తానికి అందుతున్నాయి. తక్కువ లోతులోనే నీరు సమృద్ధిగా లభిస్తుండటంతో తాగు, సాగునీటి అవసరాలకు ఎక్కడా ఇబ్బందులు ఎదురు కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడం, భూగర్భ జలాలు పెరగడంతో వాతావరణ మార్పులు భారీ స్థాయిలో లేకుండా ఉష్ణోగ్రతలు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది. ఆయకట్టుకు పుష్కలంగా నీరందిస్తూ పొలాలను సస్యశ్యామలం చేయడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పునరావాస కల్పనలో గత సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో ఏటా వందల టీఎంసీల వరద జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి. గండికోట జలాశయంలో 26.85 టీఎంసీలు నిల్వ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన గండికోట జలాశయంలో తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను మంగళవారం నిల్వ చేశారు. జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదే కాకుండా గాలేరు–నగరిలో అంతర్భాగమైన పైడిపాళెం, సర్వారాయసాగర్, వామికొండసాగర్ ప్రాజెక్టుల్లోనూ ఈ ఏడాదే గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లో పూర్తి సామర్థం మేరకు పది టీఎంసీలు నిల్వ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పులిచింతల ప్రాజెక్టు, సోమశిల రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ చేయడం తెలిసిందే. గతంలో 3 టీఎంసీలే నిల్వ.. గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా 2012 నుంచి 2019 వరకు గరిష్టంగా మూడు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల నీటిని నిల్వ చేయలేకపోయారు. 2014 నుంచి 2019 వరకు గండికోట నిర్వాసితుల పునరావాసం కోసం ఐదేళ్లలో రూ.146.29 కోట్లను మాత్రమే టీడీపీ సర్కార్ ఖర్చు చేయడం గమనార్హం. చిత్రావతి, వామికొండ, పైడిపాళెం, పులిచింతల, సోమశిల, కండలేరు నిర్వాసితుల పునరావాసానికి కూడా గత సర్కార్ పైసా వ్యయం చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితుల పునరావాసానికి రూ.522.85 కోట్లను జూన్ 24న విడుదల చేసింది. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, భూసేకరణకు రూ.403.2 కోట్లను మంజూరు చేసింది. వెరసి రూ.926.05 కోట్లను వ్యయం చేసి 17,809 మంది నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించింది. దీంతో గండికోటలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగారు. ఇక గాలేరు–నగరిలో అంతర్భాగమైన వామికొండసాగర్లో 1.60, సర్వారాయసాగర్‌లో 3.06, పైడిపాళెంలో ఆరు టీఎంసీలకుగానూ 5.84 టీఎంసీలను నిల్వ చేశారు. రూ.240.53 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో జలాశయం పూర్తయిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే పూర్తి సామర్థ్యం మేరకు పది టీఎంసీలను నిల్వ చేశారు. పులిచింతలతో శ్రీకారం.. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ సర్కార్‌తో చర్చించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరావాసం నిధులను విడుదల చేసి పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత తొలిసారిగా గతేడాది 45.77 టీఎంసీలు నిల్వ చేశారు. ఈ ఏడాదీ అదే రీతిలో నీటిని నిల్వ చేశారు. దీనివల్ల కృష్ణా డెల్టాలో పంటల సాగుకు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటికి ఇబ్బందులు తొలిగాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా దశాబ్దాల క్రితం పూర్తయిన సోమశిల రిజర్వాయర్‌లో గతేడాది పూర్తి సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు నిల్వ చేశారు. ఈ ఏడాదీ అదే రీతిలో నిల్వ చేశారు. దీంతో పెన్నా డెల్టా, తెలుగుగంగ ఆయకట్టులో పంటల సాగుకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయి. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములకు నీళ్లందించడం ద్వారా కరువును తరిమికొట్టేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయఙ్ఞం చేపట్టారు. 84 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టి పలు ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లోనూ నీటిని నింపలేని దుస్థితి నెలకొంది. కమీషన్లు రాకపోవడంతో గత సర్కారు పునరావాసం పనులను నిర్లక్ష్యం చేసింది. దీంతో గతంలో ఏటా వందలాది టీఎంసీల వరద జలాలు సముద్రంలో వృథాగా కలిశాయి. కండలేరులో గరిష్టంగా నిల్వ చేసేలా.. కండలేరు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. కండలేరు నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా 60 టీఎంసీలను నిల్వ చేసింది. వచ్చే సీజన్ నాటికి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా 68.03 టీఎంసీలను నిల్వ చేసే దిశగా అడుగులు వేస్తోంది. -
ముందడుగు
-
‘కేసీఆర్ వల్లే వారికి కరోనా సోకింది’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాజెక్టులు ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కట్టలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మంచి చేయడం కంటే ఆయన తొట్టి గ్యాంగ్ మంత్రులకు మంచి చేసేందుకే ఎక్కవ ఆసక్తి చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతలు పగటి వేళగాళ్ల లాగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని, తన అవినీతి బయట పెట్టి జైలుకు పంపిస్తారేమో అన్న భయం పట్టుకుందని విమర్శించారు. (‘సీఎం కేసీఆర్ కరోనా తెచ్చుకోరు.. తెప్పిస్తారు’) కేసీఆర్ అవినీతి లెక్కలు తేల్చి అతన్ని జైలుకు పంపే వరకు బీజేపీ నేతలు, కార్యకర్తలు నిద్రపోరని బండి సంజయ్ మండిపడ్డారు. తన వల్ల ఎవరికి కరోనా రాలేదని, కేసీఆర్ వల్లనే ఆధికారులకు.. ప్రగతి భవన్ సిబ్బందికి కరోనా సోకిందని అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ సచివాలయం కూల్చివేత కార్యక్రమం పెట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మ పరిరక్షణ కోసం కచ్చితంగా రాజకీయాలు చేస్తామని అన్నారు. మత రాజకీయాలు చేసేది బీజేపీ కాదని, కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ చేస్తోందని దుయ్యబట్టారు. పేద ప్రజలు, కులవృత్తులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. ఉగ్రవాదులకు వత్తాసు పలికే పార్టీకి తొత్తులుగా పని చేసే వారిని నమ్ముతారా, లేక తమ కోసం పనిచేసే వారిని నమ్ముతారో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని సంజయ్ సూచించారు. (కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్న్) -
వైఎస్.. ఒయాసిస్సై..దాహం తీర్చారు
సాక్షి, అమలాపురం టౌన్ / అల్లవరం: ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి ప్రజారంజక పాలన అందించినప్పుడు అమలాపురం నియోజకవర్గం కూడా అనూహ్యమైన అభివృద్ధిని సాధించింది. 2004 నుంచి 2009 వరకూ సాగిన డాక్టర్ వైఎస్ పాలన ఈ నియోజకవర్గంలో కొన్ని శాశ్వతమైన ప్రజా ప్రయోజనాలతో జరిగిన నిర్మాణాలు నేటికీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వాస్తవానికి 2004 అసెంబ్లీ ఎన్నికల నాటి నియోజకవర్గానికి 2009లో జరిగిన పునర్విభజనలో గతంలోని అల్లవరం నియోజకవర్గం దాదాపు 80 శాతం అమలాపురంలో చేరింది. దీంతో వైఎస్ హయాంలో ఆ రెండు నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి అంతా పునర్విభజన తర్వాత ఏర్పడ్డ అమలాపురం నియోజకవర్గంలోకి రావడంతో రెండు నియోజకవర్గాల అభివృద్ధిని మూట కట్టుకున్నట్లయింది. 2004 ఎన్నికల్లో వైఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చాక అప్పటి అమలాపురం, అల్లవరం ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, గొల్లపల్లి సూర్యారావులు తమ తమ నియోజకవర్గాలకు అభివృద్ధిపరంగా నిధులను అడిగిందే తడవుగా ముఖ్యమంత్రిగా వైఎస్ నిధుల మంజూరు చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్ మళ్లీ సీఎం కావడంతో, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పినిపే విశ్వరూప్‌ను తాగునీటి సరఫరా మంత్రిని చేయడంతో తాగునీటి పథకాలకు కొదవ లేకుండా చేశారు. అమలాపురం నియోజకవర్గం మీదుగా ఉన్న 216 జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గోదావరిపై వైఎస్ వారధి నిర్మించి అటు రాజోలు దీవిని అనుసంధానం చేయడంతో అమలాపురంతో కలిపారు. నియోజకవర్గంలో వైఎస్ అభివృద్ధి జాడలు నిత్యం కనిపిస్తూనే ఉంటోంది. ఆయన ముద్ర నియోజకవర్గంపై శాశ్వతమై ఉంది. ఆ మహానేత హయాంలో జరిగిన అభివృద్ధి పనుల వారీగా ఓ సారి పరిశీలిస్తే అవి నేడు నియోజకవర్గ ప్రజలకు ఎంతలా ఉపయోగపడుతున్నా యో... ఎంతటి సేవలు అందిస్తున్నాయో అర్థమవుతుంది. వారధి నిర్మించి చిరకాల వాంఛ తీర్చారు. అది 2000 సంవత్సరం.. అప్పటి లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కోనసీమ మీదుగా జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకూ దాదాపు 235 కిలో మీటర్ల రహదారికి జాతీయ రహదారి హోదా కల్పించారు. అయితే ఈ జాతీయ రహదారిలో కాకినాడ వైపు నుంచి కోనసీమ ముఖద్వారమైన యానాం–ఎదుర్లంక మధ్య ఉన్న గౌతమీ నదిపై వారిధి నిర్మించారు. తర్వాత ఇదే జాతీయ రహదారిలో కోనసీమలో ఉన్న దిండి–చించినాడ మధ్య గల వశిష్ట నదిపై వారధి కూడా నిర్మితమైంది. అయితే కోనసీమలో ఇదే జాతీయ రహదారిపై అమలాపురం– పి.గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య ఉన్న వైనతేయ నదిపై వారధి నిర్మించలేదు. దీంతో జాతీయ రహదారి అనుసంధానం కాకపోవడంతో అమలాపురం ప్రాంతమే జాతీయ జీవన స్రవంతితో కలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నదిపై వారధి నిర్మించాలన్న ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను డాక్టర్ వైఎస్సార్ గుర్తించారు. 2005లో ఈ వారిధికి రూ.76 కోట్లు విడుదల చేసి వైఎస్సే దాని నిర్మాణానికి పునాది రాయి వేశారు. 2009 నాటికి వారధి పూర్తయ్యి జాతీయ రహదారుల సేవలో అనుసంధానమైంది. పట్టణ ప్రజలకు భారీ సమ్మర్ స్టోరేజీ అమలాపురం పట్టణంలో వైఎస్ ప్రభుత్వం రాక ముందు, వాటర్ వర్క్స్ వద్ద రెండు తాగునీటి చెరువులు (రిజర్వాయర్లు), మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండేవి. వీటితోనే పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీరాయి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక పట్టణ శివారులో 44 ఎకరాల్లో నిర్మించిన భారీ సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2005లో వైఎస్సే ఈ భారీ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. గోదావరి జలాలు ప్రవహించే పంట కాల్వల నుంచి ఈ సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్‌కు నీటిని ముడి నీటిగా మళ్లించి పట్టణ ప్రజలకు 70 రోజుల పాటు నీటి నిల్వలు ఉండే సామర్థ్యంతో అందుబాటులోకి తెచ్చారు. ఈ రోజు పట్టణంలో పైపులైన్ల మరమ్మతులు, శివార్లు విస్తరించి జనాభా పెరిగిపోయి సరైన పర్యవేక్షణ లేక తాగునీటి చౌర్యం, వృధాను అరకట్టలేక పలు చోట్ల తాగునీటి సమస్యలు అనివార్యం చేశారు. అయితే తాగునీటి వనరుల పరంగా నాటి భారీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే సామర్ధ్యం ఉన్నా పర్యవేక్షణ లోపంతో, అధికారుల వైఫల్యంతో నిరుపయోగంగా మారాయి. అప్పట్లో దాదాపు రూ.5 కోట్లతో ఆ తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. 3 మండలాలు...4 భారీ తాగునీటి ప్రాజెక్టులు.. డాక్టర్ వైఎస్ 2009లో మళ్లీ సీఎం అయ్యాక ఆయన మంత్రివర్గంలో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి అయ్యారు. దీంతో నియోజకవర్గంలోని మండలాలకు దాదాపు 60 కోట్ల వ్యయంతో భీమనపల్లి, కూనవరం, చిందాడగరువు, బోడసకుర్రు గ్రామాల్లో నాలుగు ప్రాజెక్ట్‌లు ఏకకాలంలో నిర్మించారు. నియోజకవర్గంలోని 60 గ్రామాల్లో మూడొంతుల గ్రామాలు నదీ పరీవాహకం, సముద్ర తీరం వెంబడి ఉన్నాయి. దీంతో ఇక్కడ భూగర్భ జలాల్లో ఉప్పు నీటి శాతం ఉండడంతో అవి దాహార్తి తీర్చవు. ఈ కారణంతోనే అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే, సంబంధిత మంత్రి విశ్వరూప్ సీఎం వైఎస్‌తో చర్చించి మూడు మండలాలకు నాలుగు తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదముద్ర వేశారు. ఫలితంగా ఆ రోజు పట్టణంలోని 54 వేల మంది జనాభా, 60 గ్రామాల్లోని 2.30 లక్షల జనాభా దాహార్తి తీరుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి వారధిగా నామకరణం చేయాలి జాతీయ రహదారిలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలను కలుపుతూ నిర్మించిన బోడసకుర్రు వారధి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే వచ్చింది. అందుకే ఆ వారధికి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వల్ల అమలాపురం ప్రాంతానికి, రాజోలు దీవికి మధ్య దూరాభారం కూడా తగ్గింది. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే వారధి నిర్మాణం జరిగింది. – దొమ్మేటి శివస్వామి, బోడసకుర్రు, అల్లవరం మండలం స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం ఉప్పలగుప్తం మండలంలో రోజూ స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం. గతంలో కలుషిత నీరును కాచుకుని తాగేవాళ్లం. భీమనపల్లి, కూనవరం గ్రామాల్లో నిర్మించిన తాగునీటి స్కీముల వల్ల ఇప్పుడు తాగునీటి సమస్యలే లేవు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి మా మండలానికి మంజూరు చేసిన రెండు తాగునీటి స్కీముల వల్లే ఈ రోజు మేమంతా మంచి నీరు తాగుతున్నాం. అప్పట్లో మా ఎమ్మెల్యే, మంత్రి విశ్వరూప్ ఈ స్కీములు మంజూరు చేసి మా ఇబ్బందులు తొలగించారు. – సూదా ఉమాపార్వతి, గృహిణి,వాడపర్రు, ఉప్పలగుప్తం మండలం బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదిపై నిర్మించిన వారధి -
మహామహులను విస్మరించారు
రాజ్‌గఢ్ (మధ్యప్రదేశ్): జాతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన మహామహులను విస్మరించి.. కేవలం ఒక్క కుటుంబాన్నే గొప్పగా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, గందరగోళం, నిరాశావాదాన్ని ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో మోహన్పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం.. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘ఒక్క కుటుంబాన్ని గొప్పగా చూపించేందుకు దురదృష్టవశాత్తూ మిగిలిన మహామహులు చేసిన ప్రయత్నాలను చిన్నవిచేసి చూపించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. దేశాన్ని ఎక్కువరోజులు పాలించిన పార్టీ.. ప్రజలను, వారి కష్టాన్ని ఎన్నడూ విశ్వసించలేదు’ అని పరోక్షంగా కాంగ్రెస్‌ను మోదీ విమర్శించారు. మోహన్‌పుర ప్రాజెక్టు క్రెడిట్.. దీని నిర్మాణంలో అహోరాత్రులు శ్రమించిన కార్మికులకే దక్కాలన్నారు. ప్రాజెక్టు కోసం కష్టపడిన వారందరినీ అభినందించారు. రూ.3,866 కోట్లతో నెవాజ్ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 727 గ్రామాలకు తాగునీరు, 3లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందనుంది. 80 లక్షల ఎకరాలు సాగు లక్ష్యంతో.. బీజేపీ మధ్యప్రదేశ్‌లో అధికారంలో వచ్చేనాటికి రాష్ట్రంలో 7.5 లక్షల హెక్టార్లకే సాగునీరు అందేదని.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పగ్గాలు చేపట్టాక 40 లక్షల హెక్టార్లు సస్యశ్యామలం అయ్యాయన్నారు. 2024 వరకు దీన్ని 80 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ వ్యవసాయాభివృద్ధి రేటు ఐదేళ్లుగా 18 శాతంగా ఉందని.. అన్ని రాష్ట్రాలకన్నా ఇదే అధికమని మోదీ తెలిపారు. ‘కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ ఉన్నప్పుడు బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను అనారోగ్య రాష్ట్రాలుగా పరిగణించేవారు) జాబితాలో ఉండేది. కాంగ్రెస్ దీన్ని ప్రజలను అవమానించినట్లుగా భావించలేదు. మేం అధికారంలోకి వచ్చాక కష్టపడి ఈ ట్యాగ్ లేకుండా చేశాం. మధ్యప్రదేశ్‌లో 13 ఏళ్లుగా, కేంద్రంలో నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ బీజేపీ.. పేదలు, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలకు సాధికారత కల్పించింది. గత నాలుగేళ్లలో మేం నిరాశ, భయం గురించి మేం మాట్లాడలేదు. ప్రజలు మమ్మల్ని నమ్మారు. వారి సంక్షేమంకోసం మేం విశ్వాసంతో ముందుకెళ్తూనే ఉన్నాం’ అని ప్రధాని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకోలేక కొందరు అవాస్తవాలను, గందరగోళాన్ని, నిరాశావాదాన్ని ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. శ్యామాప్రసాద్ స్ఫూర్తితో.. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు తమకు స్ఫూర్తినిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ‘దేశ తొలి పారిశ్రామిక విధానాన్ని ముఖర్జీ రూపొందించారు. గొప్ప దూరదృష్టి ఉన్న నాయకుడు. ఆర్థిక, విద్య, వైద్య, మహిళాసాధికారత, అణువిధానం, దేశ భద్రత తదితర రంగాల్లో ఆయన ఆలోచనలు నేటికీ సందర్భోచితమే. యువత నైపుణ్యాన్ని పెంచుకోవడం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన విశ్వసించారు. ఆ దిశగా పనిచేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు నేటికీ మా ప్రభుత్వానికి స్ఫూర్తిదాయకమే. ఆయన ఆలోచనలను మేం అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాం’ అని మోదీ తెలిపారు. అనంతరం ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. స్వచ్ఛతలో దేశానికి ఇండోర్ స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రధాని ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యం కారణంగానే వరుసగా రెండో ఏడాదీ దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన నగరంగా ఇండోర్ నిలిచిందని మోదీ అభినందించారు. -
ఎండుతున్న మంజీరా
నారాయణఖేడ్ (మెదక్): మంజీరా నది ఎండుతోంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే నదిపై ఆధారపడి ఉన్న మంచినీటి పథకాల ద్వారా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే సకాలంలో వర్షాలు కురవని పక్షంలో మంజీరా నదిపై ఆధారపడి ఉన్న గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. గత ఏడాది వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో మంజీరా నది పూర్తిగా నిండి కళకళలాడింది. నది నుంచి భారీగా నీటిని వదలడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది. మంజీరా నదిపై నారాయణఖేడ్ నియోజకవర్గంతోపాటు జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు చెందిన తాగునీటి పథకాలు ఉన్నాయి. వర్షాలు ఏమాత్రం ముఖం చాటేసినా నీటి పథకాలు వట్టిపోనున్నాయి. ఇప్పటికే నీటిపథకాల నిర్వహణ కష్టతరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నాగల్గిద్ద మండలం గౌడ్గాం జనవ్వాడ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న మంజీరా నది నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అత్యధిక ప్రాంతంలో పారే నది ఖేడ్ నియోజకవర్గంలోనే. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. నదిలో సమృద్ధిగా వరద నీరు వచ్చి చేరింది. కాగా ఏడాది ప్రారంభంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు ఘన్పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు విడతల వారీగా సింగూరు నుంచి నీటిని వదిలారు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 10 టీసీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీల వరకు నీరు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ అంతకంటే తక్కువ టీఎంసీల నీరు మాత్రమే ఉందని ప్రతిపక్షాలు, నది సమీప గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో 4 టీఎంసీల నీటి నిల్వ తగ్గే స్థాయిలో పూడిక మట్టి ఉంది. నది నుంచి భారీగా నీరు వదలడంతో ఘన్పూర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు వేసవి చివరిలోనూ నిండుకుండలా నీటితో కళకళలాడుతున్నాయి. మంజీరా నది మాత్రం ఎండిపోతోంది. నీటి పథకాలకు గడ్డుకాలం.. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలకు మంజీరా నది నుంచే తాగునీరు వెళ్తుంది. బోరంచ ఎన్ఏపీ పథకం ఫేజ్ 1కింద 18 గ్రామాలకు గాను 12 గ్రామాలకు తాగునీరు వెళ్తుంది. ఫేజ్ 2 కింద 75 గ్రామాలకు గాను 66 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 40గ్రామాలకు గాను 20గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గూడూరు నాబార్డు పథకం ద్వారా నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లోని 66గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్‌టెక్‌వెల్‌లు అన్నీ మంజీరా నదిపైనే ఉన్నాయి. ఇప్పటికే గూడూరు పథకం ద్వారా రోజు విడిచి రోజు, రెండు రోజులకు ఓ మారు నీటి సరఫరా జరుగుతోంది. శాపూర్, బోరంచ ఇన్‌టెక్ వెల్ వద్ద కూడా నీరు తగ్గింది. ముందు ముందు ఎండల పరిస్థితి ఇలాగే ఉంటే తాగునీటి పథకాలు వట్టిపోతాయి. నదిలో నీరు తగ్గడంతో సమీప గ్రామాలతోపాటు నారాయణఖేడ్ పట్టణంలోని పలు బోర్లు కూడా గ్యాప్ ఇస్తున్నాయి. జహీరాబాద్, ఆందోలు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా జరిగే ఇన్‌టెక్ వెల్లు కూడా మంజీరా నదిపైనే ఉన్నాయి. వీటివద్ద కూడా నీళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంజీరా నది ప్రారంభం మొదలుకొని గోదావరిలో కలిసే వరకు పూర్తి ప్రవాహంలో రాయిపల్లి వంతెన వద్ద ఉన్నంత ఉద్ధృతి ఎక్కడా కన్పించదు. ఈ వంతెన సమీపంలో కనుచూపు మేర పూర్తిగా నీటితోనే నది కన్పిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిలా తయారైంది. నదిలోంచి పశువులు, జనాలు ఇవతలి వైపు నుంచి అవతలి వైపు నడిచి వెళుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నదిలో అక్కడక్కడా గోతుల్లో ఉన్న నీటిలో పశువులు ఈదుతున్నాయి. నది ఎండడంతో రబీ సీజన్‌కు సంబంధించి జొన్న, శనగ తదితర పంటలను నది ముంపు భూముల్లో రైతులు సాగుచేసి పంటలను సైతం తీసుకున్నారు. నది పరిస్థితి చూసి జనాలు తల్లడిల్లుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే వరుణుడు కరుణిస్తేనే మూడు నియోజకవర్గాల్లోని ప్రజలునీటి ఎద్దడి నుండి బయట పడగలరు. -
అన్నదాతల ఆశలు మీపైనే..
సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: ‘కరువుతో అల్లాడిన తెలంగాణ రైతులు.. మీరు చేసే పనులు త్వరగా పూర్తయితే సాగుజలాలు తమ పొలాల్లోకి వస్తాయని ఆశగా చూస్తున్నారు. అన్నదాత ఆశలను త్వరగా తీర్చేందుకు మీరు పనుల్లో వేగం పెంచాలి’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులు, రంగనాయకసాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్, టన్నెల్, విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడ పనిచేసే కార్మికులు, అ«ధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. 90 కిలోమీటర్ల దూరం నుంచి టన్నెల్ పనులు వేగంగా చేస్తున్నారని, చివరగా ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. రిజర్వాయర్ కట్ట పనుల్లో వేగం పెంచాలని, రాతి కట్టడం పనుల్లో జాప్యం జరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సబ్‌స్టేషన్ పనులు పరిశీలించారు. ప్రభుత్వ పనితీరుకు మార్కెట్లే నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రంలో ఉన్న మార్కెట్లు, వాటి పనితీరు, ఉత్పత్తుల కొనుగోళ్లే నిదర్శనమని మంత్రి అన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు ఐఎస్ఓ–9001 అవార్డు రావడంపై మంత్రి విలేకరులతో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నూతన గోదాంలు నిర్మించామని, దీంతో రైతుల ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు, మద్దతు ధరకు అమ్ముకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనామ్ పద్ధతిని అమలు చేయడంలో దేశంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు వరుసలో ఉండటం తెలంగాణకే గర్వకారణమన్నారు. కాంగ్రెసోళ్లు ఉంటే ఇన్ని పనులు జరిగేవా? ‘ఇన్నేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు.. ఏ ఒక్క రోజు కూడా రైతుల గురించి ఆలోచించలే. ఇయ్యాల కేసీఆర్ అన్నదాతల కోసం నిరంతరం పరితపిస్తూ సాహసోపేతంగా ‘రైతుబంధు’పేరిట పెట్టుబడి సాయం పథకం తీసుకొచ్చిండు. ఈ పథకం చూసి దేశమంతా ముక్కున వేలేసుకుంటోంది’అంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ‘రైతు బంధు’అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కరెంటు, నీళ్ల కోసం రైతులు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయన్నారు. 70 ఏళ్లలో జరగని పనులెన్నో ఈ మూడేళ్లలో చేసి చూపించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మే 10 నుంచి 17 వరకు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రబీ లక్ష్యం 25 లక్షల ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ముందస్తు రబీ ప్రణాళికకు నీటి పారుదల శాఖ శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుల కింద నీటి లభ్యత పెరుగుతున్న దృష్ట్యా రబీలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద మొత్తంగా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు వేస్తోంది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నిల్వలు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ(శివమ్) మూడు నాలుగు రోజుల్లో సమావేశమై రబీ ముందస్తు ప్రణాళిక, నీటి లభ్యత, వినియోగం అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆశించిన స్థాయిలో నీరు చేరక..: రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్నతరహా సాగు నీటి ప్రాజెక్టుల కింద కలిపి మొత్తంగా 48.95 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఇందులో ఎనిమిదేళ్ల సగటును పరిశీలిస్తే.. 23.35 లక్షల ఎకరాల మేర సాగు జరుగుతోంది. ప్రాజెక్టుల నుంచి ఈ ఎనిమిదేళ్లలో 2013–14లో అత్యధికంగా 28.15 లక్షల ఎకరాలకు నీరందింది. అత్యల్పంగా 2014–15లో 9.74 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2015–16లో 21.57 లక్షల ఎకరాలకు, 2016–17లో 28 లక్షల ఎకరాలకు నీరందింది. అయితే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేక ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాలేదు. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, నిజాంసాగర్ల కింద ఒక్క ఎకరాకు కూడా నీరందకపోగా.. శ్రీరాంసాగర్ కింద మాత్రం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన ఇప్పటివరకు 10 టీఎంసీల వరకు నీటిని కాల్వల ద్వారా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి ప్రాజెక్టులకు వస్తున్న ప్రవాహాలు రబీకి సాగునీరు అందడంపై ఆశలు పెంచుతున్నాయి. -
మా వాటా పూర్తయ్యాక చూద్దాం..
సాగర్, శ్రీశైలంలో కనీస మట్టాల దిగువకు వెళ్లడంపై ఏపీ ఇంకా 17 టీఎంసీలు రావాల్సి ఉందంటూ డ్రాఫ్ట్ నోట్ సిద్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్, శ్రీశైలంలో నిర్ణయించిన కనీస మట్టాలకన్నా దిగువకు వెళ్లేందుకు అనుమతించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అడ్డుపడేలా ఉంది. రెండు ప్రాజెక్టుల పరిధిలో నిర్ణయించిన నీటి మట్టాల్లో ప్రస్తుతం ఉన్న నీరంతా తమకే దక్కుతుందంటున్న ఏపీ.. ఆ వినియోగం పూర్తయ్యాకే మరింత దిగువకు వెళ్లే అంశంపై చర్చిద్దామనే ధోరణి ప్రదర్శిస్తోంది. ఈ విషయమై కృష్ణాబోర్డుకు లేఖ రాసేందుకు ఏపీ జల వనరుల శాఖ అధికారులు డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేశారని.. నేడో, రేపో పంపించే అవకా శం ఉందని బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. నిజానికి శ్రీశైలంలో 785, సాగర్‌లో 503 అడు గుల కనీస మట్టాల వరకు నీరు తీసుకోవాలని తొలుత నిర్ణయం జరిగింది. ప్రస్తుతం ఆ నీటిమట్టాల వద్ద 17 టీఎంసీల మేర నీరుంది. ఆ నీరంతా తమకే దక్కుతుందని ఏపీ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే తమ కోటా పూర్తయినందున ప్రస్తుత ఎండకాలంలో జంట నగరాలు, నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల అవసరం ఉంటుందంటూ వారం కింద బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు సాగర్‌లో 500, శ్రీశైలంలో 765 అడుగుల దిగువకు వెళ్లి నీరు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దీనిపై బోర్డు ఏపీ అభిప్రాయాన్ని కోరగా, ఆ రాష్ట్ర అధికారులు డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేసి అధికారుల పరిశీలనకు పంపారు. ముందు మా వాటా విడుదల చేయాలి తమకు ఇంకా 17 టీఎంసీలు రావాల్సి ఉందని, తొలుత సాగర్ నుంచి తమ వాటా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డ్రాఫ్ట్ నోట్లో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం సాగర్‌లో 507 అడుగుల వద్ద నీటి మట్టాలున్నాయని, అందులో మొదటగా నిర్ణయించిన మేరకు 503 అడుగుల వరకు తమకు విడుదల చేయాలని ఏపీ స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. తమ వాటా వినియోగం పూర్తయిన తర్వాతే మరింత దిగువకు వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకుం టామని నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. బోర్డుకు మంగళవారమే అభిప్రాయం తెలపాల్సి ఉన్నా అధికారుల ఆమోదం తీసుకున్నాక పంపాలన్న నిర్ణయంతో వాయిదా వేశారు. డ్రాఫ్ట్‌ను బుధ లేక గురు వారం బోర్డుకు పంపే అవకాశముందని ఏపీ అధికార వర్గాల ద్వారా తెలిసింది. -
రూ.400 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు
వాకాడు : నియోకవర్గంలోని అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరు అందజేందుకు సుమారు రూ.400 కోట్లతో కండలేరు వద్ద తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటుచేయనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగజ్యోతి తెలిపారు. గురువారం ఆమె వాకాడు స్వర్ణముఖినది ఒడ్డున ఉన్న పైలెట్ ప్రాజెక్టు వాటర్ స్కీంను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఐదు మండలాల్లోని అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరా అయ్యేందుకు పలుచోట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లు ఏర్పటుచేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నమూనాలను, అంచనాలను రెండు, మూడువారాల్లో తయారుచేస్తామన్నారు. గత అక్టోబర్, నవంబర్‌ల్లో వచ్చిన వరదలకు గూడూరు డివిజన్లో పలు చోట్ల తాగునీటి పథకాలు మరమ్మతులకు గురైనట్లు చెప్పారు. దీంతో 272 పనులకు రూ.4.40 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వాకాడు మండలంలో దెబ్బతిన్న 13 మంచినీటి పథకాలకు రూ. 22.40 లక్షలు ఇచ్చామన్నారు. ఆమె వెంట డీఈ విశ్వనాథరెడ్డి, ఏఈ హేమంత్ ఉన్నారు. -
జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఖమ్మం జిల్లాలో బుధవారం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు.. వంకలు ప్రవహిస్తున్నాయి. పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 25 క్రషర్ గేట్లలో 10 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 16.2 అడుగుల నీటి మట్టం కలిగిన బయ్యారం చెరువు కూడా అలుగు పోస్తోంది. కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ఖమ్మంలోని మున్నేరు వాగు, కొత్తగూడెం మున్నేరు వాగు లో కూడా నీరు ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షంతో జిల్లాలో 21.7 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా లింగంపేట్‌లో 45.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షం ఎండుముఖం పడుతున్న పంటలకు జీవం పోసింది. నల్లగొండలో భారీ వర్షం : నల్లగొండ జిల్లాలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటలకు వరకు జిల్లా వ్యాప్తంగా 41 మండలాల్లో వర్షం కురిసింది. 12.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చండూరు మండలంలో 70.8 మి.మీ వర్షపాతం నమోదుకాగా... అత్యల్పంగా బొమ్మలరామారం మండలంలో 0.2 మి.మీ నమోదైంది. ఐదు రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 337 చెరువులు జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి అక్కడి నుంచి ప్రవహిస్తున వరద నీరంతా మూసీలోకి వచ్చి చేరుతోంది. మూసీ రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. పూర్తి స్తాయి నీటి మట్టం 645 అడుగులు కాగా.. గురువారం సాయంత్రం వరకు 638 అడుగులకు చేరింది. గురువారం పై నుంచి ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ముంపు గ్రామాలైన నెమలిపురి, చింతిర్యాల, వెల్లటూరువాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
మానేరు ‘ఫలహారం’ ఖరీదు అక్షరాలా 500 కోట్లు
- మిడ్‌మానేరు ప్రాజెక్టులో భారీ ఎత్తున పరిహారం స్వాహాకు స్కెచ్! - పరిహారం మదింపులో ఇష్టారాజ్యం అధికారుల నుంచి నేతల వరకు కుమ్మక్కు - రెండు గ్రామాల్లోనే రూ. 27 కోట్ల అక్రమాలను నిగ్గుతేల్చిన విజిలెన్స్ విభాగం - రూ. 29 వేల విలువ చేసే రేకుల షెడ్డుకు రూ. 15.86 లక్షలతో అంచనా - ఎక్కడికక్కడ అంచనా విలువల తారుమారు అధికారుల సంతకాలూ ఫోర్జరీ - 10 ముంపు గ్రామాలకుగాను 8 గ్రామాల్లో ఇవే సిత్రాలు.. ఒక్క చింతల్ఠాణాలోనే - రూ. 19 కోట్లు కొట్టేసే కుట్ర సాక్షి, హైదరాబాద్: అడ్డగోలు అంచనాలు.. ఇష్టారీతిన పరిహారం మదింపు.. అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు అంతా కుమ్మక్కు.. వెరసి కోట్లు కొట్టేసేందుకు పక్కాస్కెచ్! రూ. 29 వేలు కూడా విలువ చేయని రేకుల షెడ్డుకు రూ. 16 లక్షలు.. మంచం కూడా పట్టని ఇంటికి రూ.20 లక్షల అంచనా! మొత్తంగా రూ.500 కోట్లు స్వాహా చేసేందుకు భారీ కుట్ర. కొన్నిచోట్ల అంచనా విలువలనే ట్యాంపరింగ్ చేయగా, మరికొన్ని చోట్ల పత్రాలను మార్చేశారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల్లో జరిగిన అక్రమాల భాగోతమిదీ! ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 12 ముంపు గ్రామాలకు గానూ కేవలం 2 గ్రామాల్లో జరిపిన విచారణలో రూ.27.65 కోట్ల మేర అక్రమాలు బయటపడ్డాయి. భారీగా అక్రమాలు కరీంనగర్ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో మిడ్ మానేరు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2006లో రూ.2,466 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ప్రాజెక్టు కింద మొత్తంగా 13 గ్రామాలు ముంపు ప్రాంతాలుగా తేలగా, ఇందులో 10 గ్రామాల్లోని గృహాలు శాశ్వతంగా ముంపుకు గురవుతున్నాయి. ఇందులో అనుపురం, సంకెపల్లి మినహాయిస్తే సిరిసిల్ల మండల పరిధిలోని చింతల్ఠానా, చీర్లవంచ, బోయిన్పల్లి మండలంలో కొదురుపాక, నీలోజిపల్లి, వర్దవెల్లి, శాబాశ్పల్లి, వేములవాడ మండలంలోని రుద్రారం, కొడిముంజ గ్రామాలున్నాయి. ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాలని నిర్ణయించి, ఇందులో 2013 వరకు 3,451 గృహాలకు పరిహారంగా రూ.311 కోట్లు చెల్లించారు. ఈ ఏడాదిలో 1,413 గృహాలకు మరో రూ.225.78 కోట్ల మేర చెల్లించారు. మరో 1,965 గృహాలకు రూ.250 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. పరిహారం చెల్లింపుల్లో అవకతవకలకుసంబంధించి 2009 చివర్లో ఫిర్యాదులు రాగా.. త్రిసభ్య కమిటీని నియమించినా అదేమీ తేల్చలేదు. తాజాగా గృహ నిర్మాణాల అంచనాలను పునఃపరిశీలన జరిపారు. ఇదే సమయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సైతం విచారణ జరిపింది. పునఃపరిశీలన సందర్భంగా భారీస్థాయిలో అక్రమాలను గుర్తించారు. 29 వేల రేకుల షెడ్‌కు 15.86 లక్షలు! 2013 వరకు చేసిన చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకున్నా.. ఆ తర్వాత చెల్లించాల్సిన పరిహారాల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. తాజాగా చెల్లించిన పరిహారంపై ఫిర్యాదుల నేపథ్యంలో కొడిముంజ, శాబాష్‌పల్లిలో విజిలెన్స్ విచారణ జరిపింది. ఇందులో కొడిముంజలో గృహ నిర్మాణ పరిహారాన్ని రూ.6.10 కోట్లతో అంచనా వేయగా... దాన్ని తర్వాత రూ.18.58 కోట్లకు పెంచినట్లు గుర్తించారు. శాబాష్‌పల్లిలో రూ.5.32 కోట్ల పరిహారాన్ని లెక్కిస్తే దాన్ని రూ.20.49 కోట్లకు పెంచారు. రెండు గ్రామాల్లోనే మొత్తంగా 27.65 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. కొడిముంజలో మేకల కొమురవ్వకు చెందిన రేకుల షెడ్‌కు రూ.29,742గా లెక్కగట్టగా దాన్ని అనంతరం ఏకంగా రూ.15.86 లక్షలకు పెంచారు. మరోచోట మంచం సైజున్న ఓ చిన్న ఇళ్లు విలువను రూ.20 లక్షలుగా లెక్కలేశారు. ఇలా అన్ని గృహాల నిర్మాణాల్లో అంచనాలను పెంచేశారు. మొత్తంగా 8 గ్రామాల పరిధిలో రూ.150 కోట్ల మేర అక్రమంగా నొక్కేసేందుకు ప్లాన్ చేశారు. అదే పరిహారాన్ని ఇప్పటి భూసేకరణ చట్టం నిర్దేశించిన రేట్ల ప్రకారం చెల్లించాల్సి వస్తే అక్రమాల విలువ ఏకంగా రూ.500 కోట్లు ఉంటుందని ప్రభుత్వ వర్గాలే వెల్లడిస్తున్నాయి. అంచనాలన్నీ తారుమారు చాలాచోట్ల అంచనాలన్నీ తారుమారు చేశారు. ‘1’గా ఉన్న అంకెను ‘2’గా మార్చేశారు. అలా రూ.10 లక్షల విలువను రూ.20 లక్షలుగా మార్చేశారు. టేకు కలప క్వాంటిటీ ‘8’ మీటర్ల మేర ఉంటే దాని ముందు ‘2’ను చేర్చి 28 మీటర్లుగా మార్చారు. ఇలా అంకెలను మార్చడంతో రూ.10 లక్షల పరిహారం కాస్త రూ.40 లక్షలకు చేరింది. కొన్నిచోట్ల వాస్తవ పత్రాలను చింపేశారు. మరికొన్ని చోట్ల ఈఈల సంతకాలను ఫోర్జరీ చేశారు. సాధారణ కలపను టేకు కలపగా గుర్తించి లెక్కలు గట్టారు. గృహ నిర్మాణ వయసు నిర్ధారించడ ంలోనూ అవకతవకలు జరిగాయి. అంచనాల పెంపులో స్థానిక ప్రజాప్రతినిధులు మొదలు, అధికారుల ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ గుర్తించింది. మొత్తంగా 24 మంది అధికారుల పాత్రను తేల్చింది. ఇందులో 16 మంది ఆర్అండ్బీ, 8 మంది ఇరిగేషన్, ఇద్దరు ఎస్డీసీలు ఉన్నారు. వీరిపై చర్యలకు సంబంధించిన ఫైలు నీటిపారుదల శాఖకు చేరింది. వీరిపై త్వరలోనే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ వాస్తవ లెక్కల మేరకే పరిహారం ఇచ్చి గ్రామాలను ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. దళారులు అడ్డుపడుతున్నారు. ట్యాంపరింగ్ చేసిన విలువల మేరకే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏం చేయాలన్నది నీటి పారుదల శాఖకు తలనొప్పిగా మారింది.