‘ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్న ఇజ్రాయిల్’
ఖమ్మంమయూరిసెంటర్: పాలస్తీనాపై ఏడాదిగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్ తీరుతో ప్రపంచ శాంతికి భంగం వాటిల్లుతోందని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. యుద్ధంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారని వారు తెలిపారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ సోమవారం వామపక్షాల ఆధ్వర్యాన ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించి జెడ్పీసెంటర్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద ముసుగులో ఇజ్రాయిల్ యుద్ధకాండ కొనసాగిస్తోందని, గాజాపై జరిపిన దాడుల్లో 50 వేల మంది మరణిస్తే 75 శాతం వృద్ధులు, పిల్లలే ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా దాడులను ఇజ్రాయిల్ ఆపకపోవడం గర్హణీయమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అలీన విధానానికి తిలోదకాలు ఇచ్చి సామ్రాజ్యవాద దేశాలకు పరోక్ష మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఎన్డీ నాయకులు రాజేంద్రప్రసాద్ తదితరులు మాట్లాడా ఆయా పార్టీల నాయకులు యర్రా శ్రీకాంత్, జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, గాదె లక్ష్మీనారాయణ, ఏనుగు గాంధీ, నూనె శశిధర్, బోడా వీరన్న, రవి, రామకృష్ణ, వై.విక్రమ్, పొన్నం వెంకటేశ్వరరావు, యర్ర శ్రీను, కళ్యాణం వెంకటేశ్వరరావు, రవీంద్ర నాయక్, మాదినేని రమేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment