నృత్య పోటీల కోలాహలం
పాల్వంచ: పట్టణంలోని కేటీపీఎస్ ‘ఏ’ కాలనీ సీతారామ కల్యాణ మండపంలో సంతోషిని నాట్యనిలయం వ్యవస్థాపకురాలు రమాదేవి రామ్ ఆధ్వర్యంలో ఆదివారం భద్రశైల జాతీయ నృత్య పోటీలు ఘనంగా జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి విద్యార్థులు, వారి వెంట తల్లిదండ్రులు తరలివచ్చారు. దీంతో కల్యాణ మండప ప్రాంగణం కళకళలాడింది. జూనియర్, సబ్ జూనియర్, సీనియర్, గ్రూప్ విభాగాల్లో విద్యార్థుల శాసీ్త్రయ, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. పోటీల్లో 90 మంది విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. వైఎస్సార్ కడప, అనంతపురం, గుంటూరు, విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, సత్తుపల్లి, భద్రాచలంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. పోటీలకు వచ్చిన విద్యార్థినులు, తల్లిదండ్రులకు నిర్వాహకులు అన్ని సౌకర్యాలు కల్పించారు. జాతీయ స్థాయిలో ఈ పోటీలను ఇక్కడ నిర్వహించడం ఇదే ప్రథమం.
తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు
పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది
జాతీయ స్థాయి పోటీలకు హాజరు కావడం సంతోషంగా ఉంది. ప్రదర్శనలతో అనేక కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. వివిధ ప్రాంతాల వారితో పరిచయాలు పెరుగుతాయి. మనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలుసుకోవడంతో పాటు ప్రతిభను మరింతగా పెంచుకునే అవకాశం కలుగుతుంది.
– పి.భాగ్య, సీనియర్స్ విభాగం, హైదరాబాద్
ఏర్పాట్లు బాగున్నాయి
పోటీల నిర్వహణలో ఏర్పాట్లు బాగున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి విద్యార్ధులు తరలి వచ్చారు. కళలను ప్రొత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు.
– డి.హారిక, జూనియర్స్ విభాగం, భద్రాచలం
Comments
Please login to add a commentAdd a comment