నేటి నుంచి జోనల్ స్థాయి క్రీడా పోటీలు
వైరా: వైరాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో సోమవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు నిర్వహించే ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీలను ప్రారంభించనున్నారు. ఆయా గురుకులాల నుంచి పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఇప్పటికే వైరాకు చేరున్నారు. 4వ జోన్‌లోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన 14 బాలికల గురుకులాల నుంచి 1,190 మంది విద్యార్థినులు వివిధ క్రీడాంశాల్లో పాల్గొనున్నారు. విద్యార్థినుల సౌకర్యార్థం వసతి, భోజన ఏర్పాట్లను జోనల్ ఆఫీసర్ కొప్పుల స్వరూప రాణి ఆదివారం పర్యవేక్షించారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ డాక్టర్ సమత ఆధ్వర్యంలో గురుకులంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సి న సదుపాయాల కల్పనపై జోనల్ అధికారులు చర్చించారు. క్రీడల విజయవంతానికి ఏర్పాటు చేసిన కమిటీలకు పలు సూచనలు చేశారు. ఈ జోనల్ క్రీడలకు ఇన్‌చార్జ్‌గా కె. శ్రీలత వ్యవహరించనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో డీసీఓ రాజ్యలక్ష్మి, మీసాల సునీత, జోనల్ సూపరింటెండెంట్ సంజీవరెడ్డి, రామ్ మోహన్‌రెడ్డి, టి.సాయికిరణ్, పాషా, రాజేశ్వరరావు, మారోజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment