ఫుట్‌బాల్ విజేత ఉమ్మడి ఖమ్మం..
ముగిసిన రాష్ట్రస్థాయి అండర్–17 ఫుట్‌బాల్ పోటీలు
కొత్తగూడెంటౌన్: మూడు రోజులుగా హోరాహోరీగా సాగుతున్న రాష్ట్రస్థాయి అండర్–17 ఫుట్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు ప్రథమస్థానంలో, నల్లగొండ రెండో స్థానంలో, రంగారెడ్డి జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచాయి. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో క్రీడాకారులు పోరాట పటిమ చూపారు. ముగింపు కార్యక్రమంలో విజేతలకు రాష్ట్ర ఫుట్‌బాల్ పరిశీలకుడు వడ్డెన్న బహుమతులను అందజేశారు. ఈ మేరకు ఎస్జీఎఫ్ నిర్వాహక కార్యదర్శి వాసిరెడ్డి నరేష్కుమార్ వివరాలు వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ చూపిన 22 మందిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశామని, ఈ జట్టును నవంబర్‌లో జార్ఖండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు.
హోరాహోరీగా ఫైనల్స్
ఖమ్మం, నల్లగొండ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో నల్లగొండపై ఖమ్మం 1–0 గోల్స్ తేడాతో విజయం సాధించి ట్రోఫీ దక్కించుకుంది. నల్లగొండ ద్వితీయస్థానంలో నిలిచింది. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు బట్టు ప్రేమ్‌కుమార్, వేణుగోపాల్, యుగంధర్, శ్రీనివాస్, మంజీలాల్, సీతా దేవి, సుజాత, విద్యాసాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment