![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/16/15nlm61-370061_mr_0.jpg.webp?itok=9o-0YlM0)
భోగాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతాంగానికి పెద్దపీట వేస్తూ, రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. స్థానిక పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారని చెప్పారు. కార్యక్రమంలో సుందర హరీష్, కొయ్య బంగార్రాజు, ఊడికల గురువులు, బి.మాధవరావు, మండల వ్యవసాయాధికారి హరికృష్ణ, ఎంపీడీఓ అప్పలనాయుడు, ఉప తహసీల్దార్ ఎస్. శ్రీనివాసరావు, డీటీ మురళీ, రైతులు పాల్గొన్నారు.
దళారీ వ్యవస్థ నిర్మూలనకే ..
పూసపాటిరేగ: దళారీ వ్యవస్థ నిర్మూలనకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎంపీపీ మహంతి కల్యాణి అన్నారు. మండలంలోని లంకలపల్లిపాలెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్రాలలో అత్యంత పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. గోనెలు, హమాలీ చార్జీలు, కొనుగోలు కేంద్రం సిబ్బంది వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పి. అప్పలనాయుడు, మండల వ్యవసాయాధికారి కె.నీలిమ, జేసీఎస్ కన్వీనర్ మహంతి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు రౌతు సాయికుమార్, పి. మహేష్, తదితరులు పాల్గొన్నారు.
![1](https://www.sakshi.com/gallery_images/2023/12/16/15nlm42-370034_mr.jpg)
Comments
Please login to add a commentAdd a comment