పైలట్ ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి
ఇంద్రవెల్లి: పైలట్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పైలట్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పలు సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చిన్నచిన్న తప్పిదాల కారణంగా అర్హులకు అందడంలేదని, మండల కేంద్రాల్లో నెలకు రెండుసార్లు పైలట్ ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి అర్హులైన ప్రతీఒక్కరికి పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. భూసమస్య, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పూర్తి వివరాలు సేకరించి గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ అభిఘ్యాన్ మాల్వియా, డీఆర్‌డీవో పీడీ రవీందర్, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, ప్రజామిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కుమ్ర విఠల్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్న పత్రాలను విశ్లేషించుకుని చదవాలి
ఆదిలాబాద్‌రూరల్: గత పరీక్షలలో వచ్చిన ప్రశ్న పత్రాలను విశ్లేషించుకుని చదవాలని కలెక్టర్ రాజర్షిషా విద్యార్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్‌లో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్ వసతిగృహ పదోతరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ వి ద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివితే ఉత్తమ ఫలి తాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, జిల్లా దళితాభివృద్ధి శాఖ అధికారి సునిత కుమారి, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సొనాలలో మండల పాలన ప్రారంభం
బోథ్: నూతనంగా ఏర్పడిన సొనాల మండల కేంద్రం నుండి పాలన ప్రారంభమైంది. గురువారం కలెక్టర్ రాజర్షిషా తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను ప్రారంభించారు. తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో రాజేశ్వర్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన సొనాల మండలం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాజర్షిషా
Comments
Please login to add a commentAdd a comment