![కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06bod79-340094_mr-1738872485-0.jpg.webp?itok=Wx0Crx2T)
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
నేరడిగొండ: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బీజేపీ జిల్లా నాయకుడు, బోథ్ ఏఎంసీ మాజీ చైర్మన్ తిత్రే నారాయణసింగ్‌తో పాటు జిల్లా నాయకులు రాథోడ్ కమల్ సింగ్, కేవల్ సింగ్, కై లాష్, బీఆర్‌ఎస్ మండల మైనార్టీ నాయకులు మునీర్ అహ్మద్, అఖ్తర్ పాషా, గౌస్‌లతో పాటు ఆయా పార్టీలకు చెందిన పలువురికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. పాత, కొత్త నాయకులు కలిసి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అన్నారు. కులగణన అనేది వివిధ వర్గాల అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, పార్లమెంట్ ఇన్‌చార్జి సత్తు మల్లేశ్, బోథ్ ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడె వసంత్‌రావు, ఎస్టీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ జలైజాకు, నాయకులు ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, ఆడె జనార్దన్, రాథోడ్ సుభాష్, చట్ల ఉమేష్, గాజుల పోతన్న, సద్దాం, అజీమ్, నాయిడి రవి, పాల శంకర్, అనుపట్ల సంజీవ్ కుమార్, ఎరడ్ల చంద్రశేఖర్, జాదవ్ కపిల్‌దేవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment