రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
తాంసి/తలమడుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి అన్నారు. తలమడుగు, తాంసి మండలాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పొన్నారి, ఖోడద్, హస్నాపూర్, సుంకిడి గ్రామాల్లోని మూలమలుపులను ఆర్‌అండ్‌బీ డీఈ రమేశ్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి డీఈతో చర్చించారు. ఆయా గ్రామాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మూలమలుపు వద్ద ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖోడద్ గ్రామంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఆక్రమణలు తొలగించేలా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment