![స్టాంపుల సేకరణ అలవాటు చేసుకోవాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06adi60-340043_mr-1738872485-0.jpg.webp?itok=Iiw7gf8e)
స్టాంపుల సేకరణ అలవాటు చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ స్టాంపుల సేకరణ అలవాటు చేసుకోవాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ దేవిరెడ్డి సిద్దార్థ అన్నారు. ఆదిలాబాద్ డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు ఫిలాటికల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాంపుల సేకరణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందడంతో పాటు మానసిక ఉల్లాసం, మంచి అలవాట్లు అలవడుతాయన్నారు. అనంతరం పురాతన కాలం నుంచి ఇప్పటివరకు ఉన్న ఉత్తరాలు, నాణేలు, స్టాంపులను ప్రదర్శించారు. గతేడాది మే 29న జిల్లా స్థాయిలో నిర్వహించిన దీన్‌దయాల్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్ పరీక్షలో ఎంపికై న 58 మంది విద్యార్థులకు మెమొంటోలు, ఎనిమిది పాఠశాలల నుంచి ఎంపికై న 14 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున స్కాలర్‌షిప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ దేవేందర్ పటాస్కర్, పోస్టల్ ఏఎస్పీ లవకుశ్ పార్టే, ఐపీ కిరణ్‌జాదవ్, అధికారులు గోలి గంగాధర్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment