ఓటు నమోదుకు దూరం
● ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై పట్టభద్రుల నిరాసక్తత ● ఆసక్తి చూపని టీచర్లు ● నవంబర్ 6తో ముగియనున్న గడువు
కై లాస్‌నగర్: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ప్రక్రియ ప్రారంభమై మంగళవారం నాటికి నెల రోజులవుతున్నా ఓటరుగా నమోదుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. నవంబర్ 6వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందుకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటి వరకు ఆసక్తి చూపని ఓటర్లు ఏడు రోజుల వ్యవఽధిలో ఎంతమంది నమోదు చేసుకుంటారనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్సీగా పోటీ పడే అశావాహులు ప్రత్యేక పోస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికి ఆశించిన ఫలితం కన్పించడం లేదు. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఓటుపై అంతగా ఆసక్తి చూపడం లేదు.
ప్రత్యేక కేంద్రాలకు స్పందన కరువు
ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్లుగా నమోదు కోసం జిల్లాలోని ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కేంద్రాలను ఏర్పా టు చేసింది. ప్రత్యేక ఉద్యోగులను నియమించి దరఖాస్తులను అందుబాటులో ఉంచినప్పటికీ స్పందన మాత్రం కన్పించడం లేదు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ దరఖాస్తులు కూడా నామమాత్రంగానే ఉంటున్నాయి. అటు పట్టభద్రులు, ఇటు టీచర్లు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఓటరు నమోదుకు జిల్లాలో స్పందన కరువవుతోంది.
పట్టించుకోని టీచర్లు
ఓటరు నమోదును జిల్లాలోని ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోవడం లేదు. ఇందుకు ఇప్పటి వరకు అందిన దరఖాస్తులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలోని 18 మండలాల పరిఽ దిలో సుమారు 15 వేలమంది పట్టభద్రులు ఉంటారని అంచనా వేస్తుండగా ఇప్పటి వరకు 6,66 2 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్క న చూస్తే వీరి నమోదు సైతం తక్కువగానే కన్పి స్తోంది. టీచర్లతో పోల్చితే కాస్తా పర్వాలేదనిపిస్తోంది. ఉపాధ్యాయ ఓటర్ల నమోదు మాత్రం న త్తనడకన కొనసాగుతోంది. పోటీలో నిలిచే అ భ్యర్థులు ఇది వరకే జిల్లాలో పర్యటించి ఉపాధ్యా య సంఘాలు, పట్టభద్రులతో ప్రత్యేకంగా స మావేశాలు నిర్వహించి మద్దతు అందించాలని కోరారు. జిల్లాలో 2,700 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లుగా విద్యాశాఖ గణంకాలు చెబుతున్నా యి. ఇందులో ఇప్పటి వరకు కేవలం 380 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికతో తమకు ఒరిగేదేముందనే భావనతోనే నమోదుకు ముందుకు రానట్లుగా తెలుస్తోంది.
మావల భేష్ ...
ఓటర్ల నమోదులో చిన్న మండలమైన మావల ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం మూడే గ్రామ పంచాయతీలు ఉన్న ఈ మండలంలో ఇప్పటి వరకు 672 మంది పట్టభద్రులుగా, టీచర్లు సైతం 85 మంది ఓటరుగా నమోదు చేసుకుని భేష్ అనిపించారు. ఇతర మండలాలను పరిశీలిస్తే జిల్లాలోని ఏడు మండలాల్లో రెండంకెల సంఖ్య కూడా దాటని పరిస్థితి ఉండటం గమనార్హం. పట్టణ ప్రాంతమైన ఆదిలాబాద్ అర్బన్ ఓటర్ల నమోదులో అగ్రస్థానంలో నిలువగా గిరిజన మండలమైన గాదిగూడ అట్టడుగు స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ పట్టభద్రులు 19 మంది నమోదు చేసుకుంటే టీచర్లు ఒక్కరుకూడా తమపేరును ఎన్‌రోల్ చేసుకోకపోవడం జిల్లాలో సాగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ తీరుకు అద్దం పడుతోంది.
జిల్లాలో ఓటరు నమోదు వివరాలు
మండలం పట్టభద్రులు టీచర్లు
మావల 672 85
నేరడిగొండ 325 18
నార్నూర్ 185 16
జైనథ్ 345 08
ఆదిలాబాద్‌రూరల్ 469 24
గుడిహత్నూర్ 153 04
ఇచ్చోడ 334 18 బేల 246 06
గాదిగూడ 19 –
బోథ్ 538 20
ఉట్నూర్ 475 29
ఆదిలాబాద్‌అర్బన్ 1825 118
బజార్‌హత్నూర్ 230 11
ఇంద్రవెల్లి 149 04
తలమడుగు 349 08
భీంపూర్ 144 02
తాంసి 152 03
సిరికొండ 62 06
నమోదు చేసుకోవడం ఇలా...
పట్టభద్రులు ఓటరుగా నమోదు కోసం ఫారం–18తో దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి. టీచర్లు, అధ్యాపకులైతే 2018 నవంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మూడు సంవత్సరాలకు తగ్గకుండా ఉన్నత పాఠశాల, కళాశాల స్థాయిలో బోధించి ఉండాలి. ఇలాంటి వారు ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గెజిటెడ్ అధికారి ధృవీకరించిన డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్, ఓటరు ఐడీ పత్రాలతో పాటు ఫొటోతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో www.c-Šobèlte a nfa na. nic.i n లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment