● దిగుబడి పాయే.. ధర లేదాయే ● ప్రైవేట్ వ్యాపారులు నడ్డీ
సాక్షి,ఆదిలాబాద్: మొదటి రోజు మార్కెట్‌కు వ చ్చిన పత్తి వాహనాలకు సంబంధించి ప్రైవేట్ వ్యా పారులు క్వింటాలుకు రూ.6,840 చొప్పున ధర చె ల్లించారు. ఆ తర్వాత రోజు నుంచి తేమ ఆధారంగా కోత పెడుతూ రైతులను మార్కెట్లో వ్యాపారులు న డ్డి విరుస్తున్నారు. సీసీఐ 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో అంతకంటే ఎక్కువ తేమ వస్తే ఆ రైతునే అసలు ప రిగణలోకి తీసుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్దకే వెళ్లాల్సి వస్తోంది. అయితే ఇక్కడే నిలువుదోపిడి జరుగుతోంది. ప్రభు త్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.7,521గా నిర్ణయించింది. ఇక్కడ 8 శాతం తేమ ఉంటేనే సీసీఐ మాత్రం ఈ ధర చెల్లిస్తుంది. ఇంతే తేమ ఉన్నప్పటికీ ప్రైవేట్‌లో మాత్రం రూ.7,120 మాత్రమే ఇస్తున్నారు. ఈ రకంగా పత్తి రైతును వ్యాపారులు ఎంత దోపిడి చేస్తున్నారనేది తేటతెల్లం అవుతోంది.
పత్తి రైతు దుస్థితి..
జిల్లాలో ఈనెల 25న పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పత్తి ధర విషయంలో రైతులు ఆందోళన చేయడంతో ఆరోజు కొనుగోలే మొదలు కాలేదు. మరుసటి రోజు ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.6,840 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. ఆ తర్వాత రోజు నుంచి ఆ ధర కూడా ఇవ్వడం లేదు. తేమ ఆధారంగా మరింత కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. ఇప్పటివరకు పత్తి విక్రయించిన రైతుల్లో కనిష్టంగా ఓ రైతుకు 23 శాతం తేమతో క్వింటాలుకు రూ.6,052 చొప్పున కొనుగోలు చేశారు. ఈ లెక్కన మద్దతు ధరకు పత్తి రైతు ఎంత దూరంలో నిలిచాడో తేటతెల్లమవుతోంది.
ఈ రైతు పేరు ఉత్తం చౌహాన్. తలమడుగు మండలం తలాయిగూడకు చెందినవాడు. ఈ వానకాలంలో తనకున్న 23 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మొదటి తీతలో కేవలం 19 క్వింటాళ్లు మాత్రమే చేతికందింది. ఈ పత్తికై నా మార్కెట్లో మంచి ధర లభిస్తుందని ఆశించాడు. అయితే ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.6,840 చొప్పున కొనుగోలు చేయడంతో రూ.లక్ష 30వేల వరకు చేతికందాయి. ఈ డబ్బులు ఆయన ప్రణాళిక ఖర్చులకు ఎటూ సరిపోని పరిస్థితి ఉంది. వచ్చే వేసవి వరకు తన చెల్లెలి వివాహం చేసేందుకు డబ్బులను కూడబెడదామనుకున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో అనేక మంది పత్తి రైతుల పరిస్థితి ఇలాంటిదే.
Comments
Please login to add a commentAdd a comment