ప్రతీరోజు బడులు తనిఖీ చేయాలి
● పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి
ఆదిలాబాద్టౌన్: మండల విద్యాధికారులు ప్రతీరో జు రెండు పాఠశాలలను తప్పనిసరిగా తనిఖీ చే యాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లో ఎంఈ వోలతో జిల్లాలోని ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్ల కొరత తీరిందని, విద్యార్థులకు నాణ్యమైన బోధన చేసేలా చూడాలన్నారు. డిసెంబర్లో 3,6,9 తరగతులకు న్యాస్ పరీక్ష ఉంటుందని, విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, ఎస్సీఈ ఆర్టీ ప్రొఫెసర్లు, ఎంఈవోలు ఉదయ్రావు, సరోజ, కంటె నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment