బాస్కెట్‌బాల్‌ పోటీలకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌ పోటీలకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఎంపిక

Published Thu, Oct 31 2024 2:45 AM | Last Updated on Thu, Oct 31 2024 2:45 AM

బాస్క

బాస్కెట్‌బాల్‌ పోటీలకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఎంపిక

భైంసా: సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపికై న విద్యార్థులను ట్రిపుల్‌ఐటీ వీసీ గోవర్ధన్‌ అభినందించారు. బుధవారం ఎంపికై న విద్యార్థులతో కలిసి మాట్లాడారు. బాసర క్యాంపస్‌లో క్రీడారంగాని కి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. క్యాంపస్‌స్థాయిలో ఎంపికై న విద్యార్థులు బెంగుళూర్‌లో జరిగే సౌత్‌జోన్‌ పోటీల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో స్పో ర్ట్స్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌రావు, శ్యాంబా బు, వసంత, విజయ, రవి, కిరణ్‌, రఘువీర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో

రైల్వే జేఈ మృతి

బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌ ఏరియా పరిధిలోని రైల్వే కాలనీలో విద్యుదాఘాతానికి గురై రైల్వే జూనియర్‌ ఇంజినీర్‌ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. టూటౌన్‌ ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం దీపావళి పండుగ నేపథ్యంలో సాయి హిమాన్ష్‌ (29) తాను నివాసం ఉంటున్న క్వార్టర్‌లో విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో ఆకస్మికంగా విద్యుత్‌ సరఫరా జరగడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త సాయి హిమాన్ష్‌ కళ్లముందే కానరాని లోకాలకు వెళ్లడంతో భార్య అనూష కన్నీరుమున్నీరైంది. వారి స్వస్థలం వరంగల్‌ జిల్లాలోని రాంపేట గ్రామం. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడికి మూడేళ్ల కుమారుడు సాయిరాం ఉన్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పరస్పరదాడిలో

పలువురిపై కేసు నమోదు

బెల్లంపల్లిరూరల్‌: కుటుంబ కలహాలతో పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. తాళ్లగురిజాల ఎస్సై చుంచు రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం... బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన కచ్చు మనీషా అదే గ్రామానికి చెందిన కచ్చు రాజ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో మనీషా తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటి పక్కనే ఆడుకుంటున్న కూతురు సహన్షితో రాజ్‌కుమార్‌ మాట్లాడుతుండగా భార్య మనీషా, అత్త రాజేశ్వరి దుర్భాషలాడడంతో పాటు రాజ్‌కుమార్‌, అతని తల్లి వజ్రమ్మలపై దాడికి పాల్పడ్డారు. రాజ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనీషా, రాజేశ్వరిలపై కేసు నమోదైంది. కాగా మనీషా భర్త రాజ్‌కుమార్‌, మామ భూమయ్య, అత్త వజ్రమ్మ, మరుదులు మహేశ్‌, రాజశేఖర్‌లు అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు తనపై, తన తల్లి రాజేశ్వరిలపై దాడి చేసి గాయపర్చారని ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బాస్కెట్‌బాల్‌ పోటీలకు  ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఎంపిక1
1/1

బాస్కెట్‌బాల్‌ పోటీలకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఎంపిక

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement