తేమ శాతం మినహాయించాలి
ఎదులాపురం: పత్తిలో తేమశాతం పూర్తిగా మినహా యించి మద్దతు ధర అందించాలని అఖిల పక్ష రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో సోమవారం రౌండ్ టే బుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు పూర్తిస్థాయిలో పంట మద్దతు ధర అందడం లేదన్నారు. సీసీఐ, మార్కెట్ అధికారులు, ప్రైవేటు వ్యాపారులు కుమ్మకై ్క రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభమై ఎనిమిది రోజులవుతున్నా మద్ద తు ధర ఇప్పించడంలో అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలం అయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో అఖిల పక్ష నాయకులు రోకండ్ల రమేశ్, కొండా రమేశ్, లోకారి పోశెట్టి, లక్ష్మణ్, లంకా రాఘవులు, వెంకట్ నారాయణ, జగన్, సురేష్, పూసం సచిన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment