పెరిగిన డైట్, కాస్మెటిక్ చార్జీలు
● నవంబర్ 1నుంచి అమలులోకి ● జిల్లాలో 7వేల మంది విద్యార్థులకు ప్రయోజనం
ఆదిలాబాద్‌రూరల్: వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే కాస్మెటిక్ చార్జీలు సైతం 40శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చాయి.
జిల్లాలో 7వేల మందికి..
రాష్ట్రప్రభుత్వం ఇటీవల పెంచిన డైట్, కాస్మెటిక్ చార్జీలతో జిల్లాలోని ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న సుమారు 7వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధి లో 54 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో సుమారు 15వేల మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రీ మెట్రిక్ ఏడు, పోస్ట్ మెట్రిక్ ఏడు వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1,209 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక దళిత అభివృద్ధి శాఖ పరిధిలో 18 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 1,500 మంది, మూడు పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో 300 మంది విద్యార్థులున్నారు. మైనార్టీ వెల్ఫేర్‌శాఖ పరిధిలో ఆరు గురుకుల పాఠశాల, కళాశాలలు ఉండగా 2,400 మంది విద్యార్థులున్నారు.
డైట్ చార్జీల పెంపు ఇలా..(రూ.లలో)
తరగతి పాత చార్జీ పెరిగిన చార్జీ
3 నుంచి 7వ తరగతి 950 1,330
8వ తరగతి నుంచి 10వ తరగతి 1,100 1,540
ఇంటర్ నుంచి పీజీ వరకు 1,500 2,100
కాస్మెటిక్ చార్జీల పెంపు ఇలా..
3 నుంచి 7వ తరగతి బాలికలు 55 175
8 నుంచి 10వ తరగతి బాలికలు 75 275
3 నుంచి 7వ తరగతి బాలురు 62 150
8 నుంచి 10వ తరగతి బాలురు 62 200
Comments
Please login to add a commentAdd a comment