అంగన్వాడీల ఆందోళన
కైలాస్నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచ ర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, అంగన్వాడీ మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించినప్పటికీ ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. అంగన్వాడీలతో సమానంగా సేవలు అందిస్తున్నప్పటికీ పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment