కరాటే శిక్షకుల బాహాబాహి
● అధికారుల ముందే పరస్పర దాడులు ● సర్టిఫికెట్ల పరిశీలనలోగందరగోళం ● వెనక్కి వెళ్లిన అధికారులు
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ ఇవ్వాల్సిన శిక్షకులు అధికారుల ముందే కుస్తీ పడ్డారు.. కాలర్లు పట్టుకుంటూ తన్నుకున్నా రు.. ఆడ, మగ తేడా లేకుండా మూడు కరాటే శిక్షణ సంస్థల వారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.. తమ అసోసియేషన్ వారి సర్టిఫికెట్లే సరైనవి.. ఎదు టి వారివి నకిలీవంటూ ఒకరిని ఒకరు బూతు పురా ణం తిట్టుకున్నారు.. ఇప్పటికే పలుమార్లు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టగా, ప్రక్రియను ముందుకు సాగనివ్వకుండా ఈ అసోసియేషన్ సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇదివరకు రెండుసార్లు ఈ ప్రక్రియ సాగగా, ముచ్చటగా మూడోసారి సైతం గొడవలు చోటు చేసుకోవడం గమనార్హం. సర్టిఫికెట్లను పరిశీలించేందుకు అధికారులు సోమవారం సాయంత్రం శిక్షకులను డైట్ కళాశాలకు పిలిపించారు. ఒకరిని ఒకరు నెట్టుకోవడం, తిట్టుకోవడంతో అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినకుండా గొడవకు దిగారు. దీంతో చేసేదేమి లేక అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. మంగళవారం ఈ ప్రక్రియను చేపడతామని ప్రకటించారు.
క్రమశిక్షణ మరిచి.. రియల్ ఫైట్
విద్యార్థినులకు క్రమశిక్షణతో కూడిన కరాటే విద్య అందించేందుకు ప్రభుత్వం రాణిలక్ష్మిబాయి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది. మూడు నెలల పాటు పాఠశాలలు, కేజీబీవీల్లో శిక్షణ కల్పించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సా యంత్రం డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన ప్ర క్రియ చేపట్టారు. బుడోఖాన్, తైక్వాండో, జూడో అసోసియేషన్ల కరాటే మాస్టర్లు అక్కడికి వచ్చారు. రెండు అసోసియేషన్లు ఒకవైపు ఉండగా, మరో అసోసియేషన్ వారు ఒకవైపు ఉండడంతో గొడవకు దారి తీసింది. తమ అసోసియేషన్ వారినే ఎంపిక చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎదుటి వారి సర్టిఫికెట్లు సరైనవి కావని, వారికి అర్హత లేదంటూ తిట్టుకున్నారు. డీఈవో ప్రణీత, క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, కేజీబీవీ సెక్టోరియల్ అధికారి ఉదయ్‌శ్రీ సర్టిఫికెట్ల పరిశీలన చేసేందుకు డైట్‌కు చేరుకున్నారు. వారు నచ్చజెప్పినా వినకుండా ఆందోళనకు దిగడంతో అధికారులు వెనుదిరిగారు. మంగళవారం మళ్లీ సర్టిఫికెట్ల పరిశీ లన ప్రక్రియ చేపడతామని శిక్షకులకు తెలి పారు. అధికారులు వెళ్లిపోయిన తర్వాత డైట్ కళా శాలలో ఆడ, మగ తేడా లేకుండా కరాటే శిక్షకులు పరస్పర దాడులకు దిగారు. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇరువురిని స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా విద్యార్థినులకు క్రమశిక్షణతో కూడిన కరాటే విద్యను అందించాల్సిన శిక్షకులే ఇలా తన్నుకోవడం ఏమిటని పలువురు ఆశ్చర్యపోయారు. జిల్లాలోని 163 పాఠశాలల్లో కరాటే శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే 56 మంది శిక్షకులు మా త్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరికి మూడేసి పాఠశాలల చొప్పున శిక్షణ కల్పించే అవకాశం ఉండగా, ఓ అసోసియేషన్ వారు తమ వద్ద శిక్షణ పొందిన వారి కే అవకాశం కల్పించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment