రైతులను మోసం చేస్తే లైసెన్స్ రద్దు
నార్నూర్: పత్తి కొనుగోలు విషయంలో రైతుల ను మోసం చేస్తే దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని వ్యా పారులను జి ల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ హెచ్చరించారు. మండల కేంద్రంతో పాటు తాడిహత్నూర్‌లో గల పలు పత్తి విక్రయ దుకా ణాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. తాడిహత్నూర్‌లో మదన్, శంకర్, బాలాజీ, సాజిత్, మండలకేంద్రంలోని సంతోష్, బబ్లు తదితర పత్తి విక్రయ దుకా ణా లను తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ కాంటాలకు స్టాంపింగ్ లేకపోవడంతో సీజ్ చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే పత్తి కొనుగోలు చేయాలన్నారు. కొలతలు, ఇతర విషయాల్లో రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయ న వెంట సిబ్బంది తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment