గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ నిధులు కేటాయించేలా చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వారంరోజులుగా నిర్వహిస్తున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ పురోగతిలో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పా రు. ప్రస్తుతం నిధులు లేక గ్రంథాలయాల్లో సమస్యలు పేరుకుపోయాయని తెలిపారు. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మరింత మెరుగుపరిచేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ శ్రీనివాస్, నాయకులు అంకత్ రమేశ్, సుభాష్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment