రథోత్సవం.. వైభవోపేతం
జైనథ్‌లో కొలువుదీరిన లక్ష్మీనారాయణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. డప్పు చప్పుళ్లు, భజన సంకీర్తనలు, కత్తిసాము విన్యాసాలు, కోలాటాల మధ్య రథాన్ని పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు దారి పొడవునా గోవిందనామస్మరణ చేస్తూ రథం వెంట నడిచారు. ఇళ్ల పైనుంచి భక్తులు రథంపై పూలవర్షం కురిపించారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, జైనథ్ ఏఎంసీ చైర్మన్ అల్లూరి అశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ విలాస్, డైరెక్టర్లు, ఆలయ కమిటీ చైర్మన్ రాకేశ్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
– ఆదిలాబాద్‌టౌన్(జైనథ్)
Comments
Please login to add a commentAdd a comment