● యథేచ్ఛగా పంటల కొనుగోళ్లు ● దుకాణాలు తెరిచి దోపిడీకి త
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ప్రస్తుతం పంటల కొనుగోళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో సందెట్లో సడేమియాలా ప్రైవేట్ వ్యాపారులు, దళారులు రంగంలోకి దిగారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ, సోయాబీన్‌ను మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మద్దతు ధర పొందే అవకాశముంది. కానీ.. వ్యవసాయ కూలీలకు డబ్బులు చెల్లించాల్సి ఉండటం, ఇంటి ఖర్చులకు చేతిలో పై సలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనధికారిక కొనుగోలు కేంద్రాల్లో కొంత పంట అమ్మితే తక్షణం డబ్బులు చేతికందుతాయనే భావనతో పంటలను విక్రయిస్తుండగా దళారులు నిలువునా ముంచుతున్నారు.
రైతులను లూటీ చేసేదిలా..
పత్తికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521, సోయాబీన్‌కు రూ.4,892 ఉంది. పత్తిని సీసీఐకి విక్రయించిన ఎనిమిది రోజుల తర్వాత రైతుకు డబ్బులు అందే పరిస్థితి ఉండగా, సోయాబీన్ విక్రయించిన తర్వాత చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో దళారులు క్వింటాల్ పత్తికి రూ.6వేల లోపే, సోయాబీన్‌కు రూ.4,400 వరకే చెల్లిస్తున్నారు. ఆ తర్వాత వారు తమకు తెలిసిన రైతుల పేరిట పట్టాపాస్‌బుక్, ఆధార్‌కార్డులు చూపించి, బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చి ప్రభుత్వరంగ సంస్థల్లో మద్దతు ధరకు విక్రయించి ప్రయోజనం పొందుతున్నారు. ఈ దందాను అధికారులు అడ్డుకోకపోతే చిన్న, సన్నకార రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment