ఇంద్రవెల్లి: మండలకేంద్రంలో వ్యాపారులు నిర్వహిస్తున్న పత్తి, సోయా కొనుగోలు కేంద్రాలను ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ బుధవారం పరిశీలించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి, సోయా ఎక్కడ విక్రయిస్తున్నారని ఆరా తీశారు. మళ్లీ తనిఖీకి వచ్చినపుడు పూర్తి వివరాలు రికార్డుల్లో పొందుపరిచి ఉండాలని సూచించారు. ధర, తూకం విషయంలో రైతులను మోసం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, సబ్‌కలెక్టర్ వస్తున్నట్లు ముందుగా తెలుసుకున్న కొందరు వ్యాపారులు కాంటాలను దాచిపెట్టడంతో పాటు కేంద్రాలను మూసి ఉంచడం గమన్హారం. సబ్‌కలెక్టర్ వెంట ఆర్‌ఐ లక్ష్మణ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment