వందశాతం ఉత్తీర్ణతకు చొరవచూపాలి
కైలాస్‌నగర్: పది, ఇంటర్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పరీక్షల సన్నద్ధతపై బుధవారం కలెక్టరేట్ నుంచి ఇంటర్మీడియట్, విద్యాశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రతీ ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకుని వారి సామర్థ్యాలకు అనుగుణంగా ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించి వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. డీఈవో ప్రణీత, ఆర్ఐవో రవీందర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జిల్లా అధికారులు సునీత, రాజలింగు, దిలీప్‌కుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment