మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు
● ఎస్పీ గౌస్ ఆలం
ఆదిలాబాద్‌టౌన్: అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా రూపుమాపడంతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్‌లో గల సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సైబర్‌క్రైమ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేరస్తులకు కోర్టులో శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో యువత మత్తు పదార్థాల కు దూరంగా ఉండేలా చూడాలన్నారు. సైబర్ మో సాలకు గురైన బాధితులు వెంటనే ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలని అన్నా రు. ఈ ఏడాది జైనథ్ మండలంలో 15, బేల మండలంలో 9 ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు వాటిని తిరిగి అప్పగించినట్లు తెలిపారు. కోర్టులో నేరస్తులకు శిక్ష పడేలా చేసిన 16 మంది ఉత్తమ కోర్టు డ్యూటీ అధికారులకు ప్రశంసాపత్రాలతో పాటు నగదు అందజేశారు. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, నాగేందర్, బి.సురేందర్ రెడ్డి, సీఐలు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment