అసంపూర్తి పనులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. | - | Sakshi
Sakshi News home page

అసంపూర్తి పనులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా..

Published Wed, Nov 20 2024 12:44 AM | Last Updated on Wed, Nov 20 2024 12:44 AM

అసంపూర్తి పనులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా..

అసంపూర్తి పనులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా..

● ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

కై లాస్‌నగర్‌: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. పట్టణంలోని న్యూహౌసింగ్‌బోర్డు కాలనీలో రూ.69 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనంను ఎంపీ నగేశ్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి గడువులోపు నాణ్యతతో పూర్తిచేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధుల కేటాయింపులో జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కలెక్టరేట్‌ పనులు ప్రారంభమై ఏడాది దాటినా 25 శాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హమన్నారు. వారి వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, ఏఈ ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement