వాతావరణం
చలి తీవ్రత క్రమంగా పెరగుతుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. గాలిలో తేమశాతం పెరిగే అవకాశం ఉంది.
ఆరోగ్యంగా ఉంటేనే
లక్ష్యసాధన సులువు●
● కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): విద్యార్థులు ఆరో గ్యంగా ఉన్నప్పుడే లక్ష్యాలను సులువుగా సా ధించవచ్చని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆరో గ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా జైనథ్ మండలం మేడిగూడ(ఆర్) జెడ్పీఎస్‌ఎస్‌లో మంగళవారం న్యూట్రీషియన్ డే నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యతో పాటు ఆరోగ్యం ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదిగినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలి పారు. పోషక విలువలతో పాటు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని సూ చించారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, డీఈవో ప్రణీత, మలేరియా నివారణ అధికారి శ్రీధర్, ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయులు, ఐసీ డీఎస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలి
కైలాస్‌నగర్: వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి డిసెంబర్ 10వరకు ‘మన మరుగుదొడ్డి – మన ఆత్మగౌరవం’ పేరి ట ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో పాటు దాన్ని వినియోగించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఇందులో జెడ్పీ సీఈవోజితేందర్ రెడ్డి, డీఆర్డీవో సాయన్న, డీడబ్ల్యూవో సబిత, మిషన్ భగీరథ ఎస్‌ఈ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి
బేల: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భా గంగా ఎన్యుమరేటర్లు పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అ న్నా రు. మండలంలోని తోయగూడ గ్రామంలో చేపడుతున్న సర్వేను మంగళవారం ఆ యన పరిశీలించారు. గడుపులోపు సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. ఎంపీడీవో మహేందర్‌కుమార్‌ను అడిగి సర్వే తీరుపై ఆరా తీశారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి మనోహర్‌రావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment