కొత్త వారికి ప్రోత్సాహకంగా.. | - | Sakshi
Sakshi News home page

కొత్త వారికి ప్రోత్సాహకంగా..

Published Wed, Nov 20 2024 12:44 AM | Last Updated on Wed, Nov 20 2024 12:44 AM

కొత్త

కొత్త వారికి ప్రోత్సాహకంగా..

ప్రస్తుతం కంపెనీలో కోడింగ్‌, ప్రాజెక్ట్స్‌, అప్లికేషన్‌, శాప్‌ వంటి సేవలను ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా అందిస్తున్నాం. ఆదిలాబాద్‌ వంటి టైర్‌–2 పట్టణాల్లో సైతం ఐటీ సేవలు అందించడం వలన స్థానిక యువతకు ఉపాధి లభ్యమవుతుంది. విశాలమైన భవనం ఉండి, అన్ని సౌకర్యాలు ఉంటే మరింత విస్తృతంగా సేవలు

అందించవచ్చు. –మానస, హెచ్‌ఆర్‌, ఎన్టీటీ

కుటుంబాలకు దగ్గరగా..

ఐటీ కంపెనీలో ఇంజినీరింగ్‌ చేసిన వరకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇక్కడ సాధారణ డిగ్రీ పూర్తి చేసినా, అభ్యర్థికి టెక్నాలజీపై పట్టు ఉంటే వారిని నియమించుకొని శిక్షణ అందజేసి ఉద్యోగాన్ని అందిస్తుండడం మంచి విషయం. దూర ప్రదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడం కంటే ఇక్కడే కుటుంబానికి దగ్గరగా ఉంటూ పని చేసుకోవడం మాలాంటి యువతకు ఎంతో ప్రోత్సహకారంగా

ఉంటుంది. – రచన శ్రీరామోజీ,

ఐటీ ఉద్యోగి, ఆదిలాబాద్‌

స్థానికులకు ప్రాధాన్యం..

నేను గతంలో హైదరాబాద్‌లో ఆరేళ్లపాటు ఐటీ సెక్టర్‌లో పనిచేశాను. అయితే జిల్లా కేంద్రంలో కంపెనీ ఏర్పడడంతో ఇక్కడే ఉద్యోగిగా చేరాను. ప్రస్తుతమున్న కంపెనీలు సైతం స్థానికులకే ఎక్కువగా ప్రా ధాన్యమిస్తున్నాయి. హైదరాబాదులో లభించే వేతనంతో ఇక్కడే కొలువు సాధించడం సంతోషంగా ఉంది. మరిన్ని కంపెనీలు ఏర్పడితే స్థానికంగా ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఎంతోమందికి మేలు చేకూరుతుంది.

– అనురాగ్‌, ఐటీ ఉద్యోగి, ఆదిలాబాద్‌

శుభ పరిణామం..

ఐటీ రంగంలో యువతులు సైతం రాణిస్తున్నారు. అయితే దూర ప్రాంతా లకు వారిని పంపించేందు కు పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి యువతులు, గృహిణులకు స్థానికంగా ఐటీ కంపెనీ ఏర్పడడం శుభపరిణామంగా చెప్పవచ్చు. గృహిణులు కూడా ప్రస్తుతం ఆదిలా బాద్‌ కంపెనీల్లో ఎలాంటి సమస్య లేకుండా ఉద్యోగాలు చేస్తుండడం మహిళా సాధికారత దిశగా ముందడుగుగా భావించవచ్చు.

– శ్రీ విద్యారెడ్డి, మేనేజర్‌, బీడీఎన్టీ

No comments yet. Be the first to comment!
Add a comment
కొత్త వారికి ప్రోత్సాహకంగా..
1
1/3

కొత్త వారికి ప్రోత్సాహకంగా..

కొత్త వారికి ప్రోత్సాహకంగా..
2
2/3

కొత్త వారికి ప్రోత్సాహకంగా..

కొత్త వారికి ప్రోత్సాహకంగా..
3
3/3

కొత్త వారికి ప్రోత్సాహకంగా..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement