రక్తదానం ప్రాణదానంతో సమానం
● కలెక్టర్ రాజర్షి షా
నార్నూర్: రక్తదానం ప్రాణదానంతో సమానమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గాదిగూడ మండలకేంద్రంలోని ఝరి పీహెచ్‌సీలో గోండ్వానా పంచా యతీ రాయిసెంటర్, అభిమన్యు వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి కలెక్టర్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆదివాసీ గ్రామాల్లో వందలాదిగా యువత, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉ న్నారని, వారికి అత్యవసర సమయంలో రక్తం ఎంతగానో దోహదపడుతుందన్నారు. నార్నూర్ సీహెచ్‌సీలో బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు, ఝరి పీహెచ్‌సీని 24 గంటల ఆసుపత్రిగా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కలెక్టర్ స్వ యంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. శిబి రంలో మొత్తం 215 మంది రక్తదానం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో సమగ్ర సర్వేను పరిశీలించారు. అక్కడే కుండి గ్రామస్తులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రహదారి సౌకర్యం మెరుగుపరిచేందు కు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, తహసీల్దార్ విజయనందం, రాయిసెంటర్ జిల్లా సార్‌మేడి మెస్రం దుర్గు పటేల్, ఆదివాసీ జేఏసీ చైర్మన్ మెస్రం రూప్‌దేవ్, తుడందెబ్బ డివి జన్ అధ్యక్షుడు ప్రభాకర్, శిబిరం నిర్వహకులు శేఖర్‌బాబు, జాకు, సోము, చంద్రహరి, దేవురావు, యునస్‌అక్బానీ, దాదిరావు, సంతోష్, వైద్యులు సంజీవ్, ప్రవీణ్‌కూమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment