కైలాస్‌నగర్: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మార్చి 2025 వరకు పూర్తి చేయాల్సిన పనుల ప్రణాళికపై కలెక్టర్ రాజర్షిషా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. పొలంబాట ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు గ్రావెల్ రోడ్లు, జలనిధి ద్వారా చెక్‌డ్యాంలు, వ్యవసాయ చెరువులు, రూప్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, బోర్‌వెల్ రీచార్జి నిర్మాణాలు, ఓపెన్‌బావులు, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ, జీపీ భవన నిర్మాణాల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మండలానికి మూడు చొప్పున అంగన్‌వాడీ భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీలత, డీడబ్ల్యూవో సబితా, పశుసంవర్ధక శాఖ అధికారి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment