ఆదిలాబాద్‌టౌన్: వయోవృద్ధుల సంక్షేమానికి ప్ర భుత్వం కృషి చేస్తుందని ఆర్డీవో వినోద్‌కుమార్ పే ర్కొన్నారు. గురువారం సీనియర్ సిటిజన్ కార్యాలయంలో హెల్పేజ్ ఇండియా ఆధ్వర్యంలో డిజిటల్ గురుకుల్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వయోవృద్ధులు సివిల్ కోర్టులో ఇబ్బందులు పడుతున్నారని గమనించి ప్రభుత్వం వారికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆర్డీవోను చైర్మన్‌గా నియమిస్తూ సివిల్ కోర్టు అధికారాలు ఇచ్చిందని తెలిపారు. వయోవృద్ధులు, తల్లిదండ్రులు తమపిల్లల నుంచి వేధింపులకు గురైతే ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు దేవిదాస్ దేశ్‌పాండే, కార్యదర్శి రామ్‌కులకర్ణి, విశ్రాంత సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, వామన్‌రావు, సుధాకర్, హన్మంత్‌రెడ్డి, నీల కిషన్, ఆర్.కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment