ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లో పారామెడికల్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల చేసినట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. డిప్లొమా అప్తాల్మిక్ అసిస్టెంట్‌కు 30 సీట్లు, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో 30 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. జాబితాలో పొరపాట్లు ఉంటే ఈనెల 22లోగా అభ్యంతరాలు తెలుపాలని సూచించారు. 23న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. 25 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ధర్నా
కైలాస్‌నగర్: సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగుల ఆత్మీయ సమితి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని దివ్యాంగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు చందావార్ రాకేశ్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. గతేడాది నిలిచిన ఆసరా కొత్త పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు వికలాంగుల సంక్షేమశాఖను ఐసీడీఎస్ నుంచి వేరు చేయాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.10లక్షల రుణాలు మంజూరు చేయాలని, ప్రత్యేక కాలనీని ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు.
వినియోగదారులకు నాణ్యమైన సేవలు
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జేఆర్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులకు మరింత నాణ్యతతో సేవలందించేందుకు ట్రాన్స్‌ఫా ర్మర్లపై టోల్‌ఫ్రీ నంబర్ 1912ను ముద్రించినట్లు తెలిపారు. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా, బిల్లుల్లో హెచ్చుతగ్గులు, ఫ్యూజ్‌ఆఫ్ కాల్, మీటర్ల మార్పు తదితర సేవలకు టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఎస్‌ఈ సూచించారు.
నేడు జిల్లాస్థాయి
అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సబ్ జూ నియర్ బాలబాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భో జారెడ్డి, పీ రాజేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9గంటలకు స్టేడియంలో అసోసియేషన్ బాధ్యులకు రిపోర్ట్ చేయాలని, పూర్తి వివరాలకు 9492136510 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment