రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు
శ్రీరాంపూర్: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు పతకాలు సాధించినట్లు అసోసియేషన్ జిల్లా చైర్మన్ నిట్టూరి మైసూర్, అధ్యక్షుడు పాదం రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో జరిగిన సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ పోటీల్లో గుడిపేటలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలకు చెందిన ఈ.తిరుపతి, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థిని జీ శాన్వీ సిల్వర్ మెడల్స్ సాధించినట్లు వారు పేర్కొన్నారు. గుడిపేట స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్, పీడీ సురేశ్ విద్యార్థులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment